నిజం..నిర్భయం

Wednesday 4 May 2011

ఆ పాదాలకు వందనాలు!

మనసుని కాసేపు ఉల్లాసపరుద్దామని! 

గంగమ్మ ఉప్పొంగెనే! 


ఉత్తమ సంగీత సాహిత్యాల మేళవింపుగా గుభాళింపులు వెదజల్లే పాటల సౌరభాలు ఎన్నదగినవి ఎన్నింటినో తెలుగు చలనచిత్ర రంగానికి ఎందరో మహానుభావులు వన్నెతగ్గని వారసత్వంగా మనకు అందించారు. అయితే ఉత్తమ సంగీత సాహిత్యాలతో పాటు సాహిత్యానికి అనుగుణంగా నర్తించే నృత్య ప్రధానమైన పాటలు  బహుకొద్దిగా ఉంటాయి. అలాంటి పాటల్లోనూ నర్తకీమణి యొక్క అందమైన ముఖవర్చస్సు, లయలు, హొయలు, విరుపులు అగ్రతాంబూలాన్ని  అందుకుంటాయి.

అయితే శాస్త్రీయ నృత్యానికి ఆయువుపట్టు లాంటి “పాదం” యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ కేవలం పాదాల్ని మాత్రమే చూపిస్తూ సాగే పాటలు చాలా తక్కువ అని నా అభిప్రాయం. బహుశా ఇలాంటి పాటలు ప్రేక్షకులని అంతగా అలరించవని సదరు దర్శక నిర్మాతల అభిప్రాయం కాబోలు!.    

సరే ఉపోద్ఘాత౦ పక్కన బెట్టి అసలు విషయంలోకి వస్తా. ఉత్తమ సంగీత సాహిత్యాలతో పాటు అర్థవంతమైన నృత్య౦ ప్రధానంగా సాగి ముందు చెప్పినట్లు ఆయువుపట్టు లాంటి ఆ "పాదానికి" అగ్రతాంబూలాన్ని అందించిన ఒక పాటను  ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం.

“ఈ పాదం ఇలలోన నాట్య వేదం” అంటూ పాదానికి వందనాలు చెబుతూ సాగే ఈ పాట 1985లో విడుదలయ్యి తెలుగునాట స్ఫూర్తి నింపడంలో అఖండ ఘనవిజయాన్ని సాధించిన వాస్తవకధానిర్మిత “మయూరి”  చిత్రంలోనిది. ఇందులో కధానాయికగా నటించడమే కాక, తన వాస్తవ జీవితాన్ని ఆవిష్కరించి ఎందరికో స్పూర్తి ప్రధాత అయిన సుధాచంద్రన్ గారు “మయూరి” సుధాచంద్రన్ గా తెలుగువారికి చిరపరిచితమైన దివ్య సంవత్సరం. మరో విశేషం ఏమిటంటే, ఈ పాట చిత్రంలో భాగంగా కాకుండా చిత్ర ప్రారభంలో కనిపిస్తూ చిత్రం యొక్క  పరమార్ధాన్ని వివరిస్తూ తీసుకున్న నిర్ణయం కళాత్మక హృదయానికి తార్కాణంగా నిలవడం.  


ఉత్తమ సాహిత్యం, దానికి అనుగుణంగా నృత్యం, అందులోనే ఒదిగిన సంగీతపు సృష్టి వివరాలు:


చిత్రం           -  మయూరి
రాసిన వారు    -  శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు
పాడిన వారు    -  శ్రీపతి పండితారాధ్యుల (SP) శైలజ గారు
సంగీతం         -  శ్రీపతి పండితారాధ్యుల (SP) బాలసుబ్రహ్మణ్యం గారు
నర్తించిన వారు  - "మయూరి" సుధాచంద్రన్ గారు


లేలేత పదాల సాహిత్యం:

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం ||
ఈ పాదం


ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆనాటి బలికి అంతం
తనలోనే గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనే ఆ గౌతమే పొంగగా
పాత పాటలో తను చరణమైన వేళా
కావ్యగీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసిన 
||ఈ పాదం


ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ భక్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీ గంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర స్వర నారదా మునులు జనులు కొలిచిన 
||ఈ పాదం
 

తెలుగు దృశ్యసంగీత గొలుసు:(www.youtube.com/watch?v=_L8ScMJqm5s)


నృత్యంలో గమినించదగినవి, నన్ను మంత్రముగ్దుణ్ని చేసిన పాదముద్రలు :

౧) చిత్ర నిడివి 00:05 వద్ద “ఇల”ను చూపించే వైవిధ్యం

౨) చిత్ర నిడివి 00:44 నుండి 00:58 వరకు మిన్నాగుని, బలిని  మరియు గంగా ప్రవాహాన్ని ఆవిష్కరించే ఆద్భుతం.

౩) చిత్ర నిడివి 01:18 వద్ద లయలను, హోయలని చూపించడం

౪) చిత్ర నిడివి 01:57 వద్ద సప్తగిరి శిఖరాల అలవోక 

౫) ఇక పాట ఆద్యంతమూ అద్భుతమనిపించే  మయూర ఉల్లాసపు నడకలు, నటరాజ పాదపద్మాలు

ఇదే చిత్రాన్ని హిందీలో తీసారు “నాఛే మయూరి” అనే పేరుతో. అయితే ఇక్కడ పాటని S.జానకమ్మ గారు పాడారు.  పోలిక అని కాదు గానీ తెలుగులో ఈ పాటకి కావాల్సిన (మయూర) ఉల్లాసాన్ని పంచుతూ, పెంచుతూ శైలజ గారి గళపు జీర/మార్థవం మకరంద మత్తుని అందిస్తే జానకమ్మ గారి తియ్యదనపు గళం ఆ(పాట) ఉల్లాసాన్ని తగ్గించనట్లుంది :).  ఒకరకంగా శైలజగారి గళం వల్ల కూడా ఈ పాట అధ్బుతంగా వచ్చిందని నా భావన.


ఇంతటి అద్భుతమైన పాటని అందించిన ఆ మహానుభావులని పేరుపేరునా తలుచుకుంటూ వారి ::పాదాలకు వందనాలు::

హిందీ దృశ్యసంగీత గొలుసు:(http://www.youtube.com/watch?v=o6L-e_LvcWs)

మయూరి తెలుగు చలనచిత్రపు తొలిభాగపు గొలుసు:(http://www.youtube.com/watch?v=k-RBBR9wLYY)



24 comments:

Sravya V said...

రాజేష్ గారు బాగా రాసారు ! ముఖ్యం గా ఆ వీడియో లో మీకు నచ్చిన అంశాలని వివరించటం . మీరు మరన్ని పోస్టులు ఇలాంటివి అంటే క్లాసికల్ మ్యూజిక్ వాటి పైన రాయాలని ఆశిస్తున్నాను !

KumarN said...

గుడ్ పోస్ట్. well written.
Unfortunately I did not watch this movie, although I know this song all too well.

Indian Minerva said...

పాట బాగుంది. Very apt song for the movie. Isn't it?

Indian Minerva said...

నాకు తెలుగు పాటే నచ్చింది.

Anonymous said...

రాజేష్ గారు,

నిజంగానే మయూరం పురివిప్పి ఆడుతున్నట్లుండే పాటను నాకు మీరు మళ్ళీ గుర్తుచేశారు. వీడియోని మీరు పరిశీలించి రాసిన విధానం నాకు బాగా నచ్చింది. నేను ఈ పాటని కొద్దిసార్లు మాత్రమే చూసినా సంగీతానికి, శైలజమ్మ గళానికి ప్రాముఖ్యతనిచ్చానే గానీ మీరు వివరించిన పాదముద్రల వైపు నా ఆసక్తి ఎప్పుడూ పోలేదు. ఇప్పుడు వాటిని గమనిస్తుంటే అబ్బురమనిపిస్తుంది. ముఖ్యంగా "తనలోనే గంగమ్మ ఉప్పొంగగా" అన్న చరణాన్ని ప్రదర్శి౦చిన తీరు అద్వితీయం.

రాజేష్ గారు,

నిజంగానే మయూరం పురివిప్పి ఆడుతున్నట్లుండే పాటను నాకు మీరు మళ్ళీ గుర్తుచేశారు. వీడియోని మీరు పరిశీలించి రాసిన విధానం నాకు బాగా నచ్చింది. నేను ఈ పాటని కొద్దిసార్లు మాత్రమే చూసినా సంగీతానికి, శైలజమ్మ గళానికి ప్రాముఖ్యతనిచ్చానే గానీ మీరు వివరించిన పాదముద్రల వైపు నా ఆసక్తి ఎప్పుడూ పోలేదు. ఇప్పుడు వాటిని గమనిస్తుంటే అబ్బురమనిపిస్తుంది. ముఖ్యంగా "తనలోనే గంగమ్మ ఉప్పొంగగా" అన్న చరణాన్ని ప్రదర్శి౦చిన తీరు అద్వితీయం.

నాకూ ఈ పాట తెలుగులోనే బావుంది. శైలజమ్మ గారు మరిన్ని పాటలు పాడి ఉంటే బాగుండేది.

ఇప్పుడే సినిమా చూడ్డం మొదలు పెట్టా :)

రాధిక

Anonymous said...

రాజేష్

చాలా రోజుల తర్వాత ఒక మంచి పాటను వి౦టూ నీవు చెప్పినవి రియలైజ్ అవుతూ చూస్తుంటే చాలా ఆనందంగా, నీవు అన్నట్లు మనసుకు ఉల్లాసంగా ఉంది :)

Thanks
Rajeev Reddy

రాజేష్ జి said...

$Rajeev Reddy Ji

Thank you.

I sent a mail to you yesterday evening which needs pretty damn quick response. Looking forward for your prompt reply!

పద్మవల్లి said...

రాజేష్,
మంచిపాటని, చాల బాగా పరిచయం చేసారు. పాదముద్రల లయలు గమనించిన తీరు కూడా బాగుంది. నేను హిందీలో చూడలేదు, వినలేదు ఇంతకుముందు. కాని తెలుగులోనే నచ్చింది.

Unknown said...

dance music and literature.. these three things refreshes our soul.. :)

pada mudralu gurinchi particular gaa cheppina way chaala bavundi.. !!!

రాజేష్ జి said...

$శ్రావ్య గారు
ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

#మీరు మరన్ని పోస్టులు..
ఖచ్చితంగా.. సంగీతానికంటూ ఓ బ్లాగు పెట్టినప్పుడు లేదా మరెవరైనా తమ సంగీతప్రపంచపు బ్లాగులో రాయాడానికి నాకూ ఇంత చోటు ఇచ్చినప్పుడు.

మీ అభిమానానికి ధన్యవాదాలు :)

రాజేష్ జి said...

$కుమార్ ఎన్ గారు

ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

మరైతే చూసేయండి మరి ఓ వారాంతం వీలు చూసుకుని :). మంచి చలనచిత్రం.. స్పూర్తిదాయకమైనది కూడా.

రాజేష్ జి said...

$భారత బృహస్పతి* గారు

బ్లాగుకి స్వాగతం.

#Very apt...movie. Isn't it?

అవునండి.. ఆ చిత్రానికి ఈ పాట సందర్భోచితంగా ఖచ్చితంగా సరిపోయింది. అందులో కించిత్ సందేహ౦ కూడా లేదు..వలదు :)

#..తెలుగు పాటే..
అయితే మీరూ నా వైపే :)


మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

*మీ ఇండియన్ మినర్వ్ పేరును తెలుగులోకి అనువదించా :) సమస్య లేదనుకుంటా!

రాజేష్ జి said...

$రాధిక గారు

ముందుగా మీ అమూల్యమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు.

# "తనలోనే గంగమ్మ ఉప్పొంగగా" అన్న చరణాన్ని ప్రదర్శి౦చిన తీరు అద్వితీయం.

అవును. నాకైతే ఆ ముద్రని వర్ణించి చెప్పడానికి మాటలేలేవు.. అ౦తగా మనసుకు హత్తుకుంది మరి :)

#..పాట తెలుగులోనే బావుంది..

:) అవును తెలుగులోనే బావుంది. హిందీలో కూడా శైలజగారు పాడితే ఎలా ఉండేదో!

#శైలజమ్మ గారు మరిన్ని పాటలు..

నిజమే.. బావుండేది. మరి ఎందుకనో ఎక్కువపాడలేదు.. అయితే పాడినవన్నీ ఉల్లాసంగా ఉంటాయి.

రాజేష్ జి said...

$పద్మవల్లి గారు

ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి :)

#తెలుగులోనే నచ్చింది..
:)) ఎందువల్లంటారు? శైలజగారి గళం వల్లనా లేక సాహిత్యం వల్లనా? నాకు హిందీ అర్హ్డం కాదుగదా.. మీరే చెప్పాలి :). టపాలో చెప్పినట్లు మయూర ఉల్లాసానికి శైలజగారి గళం మరింత తోడయిందని నా భావన :)

రాజేష్ జి said...

$నిఖిత/నిక్కి గారు

బ్లాగుకి స్వాగతం :)

$dance music and literature.. these three things refreshes our soul.

సంగీతసారాన్ని ఒక్కముక్కలో చెప్పెసారుగా :)

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

Anonymous said...

$భారత బృహస్పతి* గారు

బృహస్పతి ఒకరేకదా ప్రపంచానికి? ఇలా ఎవరికి వారు స్వయంగా ప్రకటించుకునే ఈ దేశం ఇలా వుంది. తోక వున్న ప్రతిఒక్కరినీ హనుమంతుడే అనేస్తే ఎలా?

నాగస్వరం said...

రాజేశ్ గారూ!
మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు.
సంగీతమంటే మీకెంత ఇష్టమో చెప్పారు.
మీ బ్లాగ్ చూశాను.
అనంతమైన విషయాలున్నాయి.
కనీసం ఓ నాలుగు రోజులు కేటాయించాలి. అప్పుడు గాని review చేయలేం.
సాపాటు సమగతులు అని పేరు పేట్టారు కదా!
ఇక్కడ సాపాటు అంటే ఏమిటి? వివరించండి.
ఇక మీ బ్లాగ్ కు సంబంధించని సంగతులు ప్రస్తావిస్తున్నాను. ఏమనుకోకండి.
అవి ఏంటంటే
భారతీయ సంగీతం గురించి, వాగ్గేయకారుల గురించి, నా దగ్గర information ఉంది.
నాకు విపరీతంగా నచ్చిన పాటలను మీలా ఎలా promote చెయ్యాలో ,
ఆ సాంకేతికాంశాలు తెలియవు.
మీరు తెలియచెప్పగలరా?
కొన్ని కృతులున్నాయి నా దగ్గర.
mp3, బ్లాగ్ లో ఎలా post చేయాలి?
కొంచెం వివరించండి.
ఈ లోపు మీ బ్లాగ్ చదువుతాను ఆమూలాగ్రం.
ఇంకో విషయం గూగుల్ తెలుగు బ్లాగర్ల గ్రూప్ లో ఎలా చేరాలి?
సమాధానాలు ఇస్తారు కదూ!

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

#ఇలా ఎవరికి వారు స్వయంగా ప్రకటించుకునే ఈ దేశం ఇలా వుంది.

మీ బాధను అర్థం చేసుకోగలను. నేను కేవలం అతని ఆంగ్ల పేరుని తెలుగులోకి అనువదిస్తూ రాసాను. అది పోలిక అనుకోండి.. మనం అంటాం కదా "ఆ అబ్బాయి బుద్దిలో బృహస్పతి" అని.. ఆవిధంగా:). మీ మనసు నొప్పించి ఉంటే క్షమించగలరు.

రాజేష్ జి said...

$nswar/నాగస్వరం గారు

బ్లాగుకి స్వాగతం. పిలవగానే ఎలాంటి భేషజం లేకుండా వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపినందులకు ధన్యవాదాలు.

మీ ప్రశ్నలకి సమాధానాలిచ్చేముందు ఒక విన్నపం: నన్ను రాజేష్ అని పిలవండి :)

#ఇక్కడ సాపాటు అంటే ఏమిటి?

రెండు అర్థాలు వచ్చేట్లు పెట్టాను.. నే 'సాపాటు' కోసం చేసే పని 'సాఫ్ట్'[వేర్] ని కొద్దిగా సాగదీసి సాపాటు చేసా :). వెరసి ఈ సాపాటు కోసం పడ్డ/పడే సుఖసంతోషాలకు సంబంధించిన సమకాలీన సంగతులు రాయాలని అలా పేరుపెట్టా :)

#సంగతులు ప్రస్తావిస్తున్నాను. ఏమనుకోకండి.

భలేవారే.. నిరభ్యంతరంగా ప్రస్తావి౦చవచ్చు ఎప్పుడైనా

#..ఎలా promote చెయ్యాలో..సాంకేతికాంశాలు..
#mp3, బ్లాగ్ లో ఎలా post చేయాలి?

మీరంతగా అడగాలా..ఖచ్చితంగా మీకు సాయం చేస్తాను.. మీ దగ్గరవున్న శ్రవణామృతాన్ని నాలాంటి సంగీతాభిమానులకోసం పంచడానికి.

మీరు ఒకసారి నాకు ఉత్తరం(మెయిల్) పంపించగలరు దీనిమీద తతిమ్మావిషయాలు మాట్లాడుకోవడానికి.

rajeshgottimukkala@gmail.com

#ఇంకో విషయం గూగుల్ తెలుగు బ్లాగర్ల గ్రూప్ లో ఎలా చేరాలి?

చేరడం సులువే.. కానీ నాకు గూగుల్ తెలుగు సముదాయాలు ఏవో తెలీవండి. కనుక్కుని చెబుతాను.

మీ అభిమానానికి కృతజ్ఞతలు.

మాలతి said...

నే 'సాపాటు' కోసం చేసే పని 'సాఫ్ట్'[వేర్] ని కొద్దిగా సాగదీసి సాపాటు చేసా - హా. నేను సావేరి అంటుంటా సాఫ్టువేరు ఇంజినీర్లని. మీ పదహేలే బాగుంది. అభినందనలు. - మాలతి

రాజేష్ జి said...

$మాలతి గారు

#నేను సావేరి అంటుంటా..

:) మీరు రెండు పదాలు కలిపేసి భలే ముద్దుగా అన్నారే. నాకు మీ పదహేల చాలానచ్చింది.. "సావేరి" :) ఎంత తియ్యాగా ఉంది.

హ్మ్.. ఇంతకీ టపాలో పాట గురించి మీ అభిప్రాయం చెప్పనేలేదు :)

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

మాలతి said...

రాజేష్ గారూ, పాట తరవాత విన్నాను. తరవాత వ్యాఖ్య కూడా పెట్టబోతే, మీ బ్లాగు ఒల్లనంటే ఒల్లనంది :p. పాట చాలా బాగుందండీ. పదవిన్యాసం కూడా చాలా చక్కగా అమిరింది.

మాలా కుమార్ said...

రాజేష్ గారు ,
పాటను వివరించటము బాగుంది .

Unknown said...

Rajesh garu mee blog bavundi. mottam chadivaka appudu malli comment chestanu. santi kapotam kavita chala nachindi. esp ending lines...all the best.Nenu gamaninchindi entante ur expression is very straight with good selection of words. sariayina bhavanni sariayina padalato vyaktam chesaru ani na abhiprayam. buzz lo allari chestaru ani telusu kani inta chakkaga rastaru ani telidandi.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers