నిజం..నిర్భయం

Sunday 24 April 2011

ఓ బాబా! నీవు నడిచి చూపిన దారిలో.. ఓ భక్తురాలి నివేదన

@సాక్షి 


ఓ సనాతనసారధి, సామాజికసేవకుని  నిర్యాణం..మహాభినిష్ర్కమణ.

ఉదయంలేవగానే ఓ విషాదవార్త.. ‘నా జీవితమే నా సందేశం’ అని ప్రపంచ మానవపశుపక్ష్యాదులకి శాంతిసందేశాన్ని అందించిన శ్రీ సత్యసాయిబాబా వారి నిర్యాణం..మహాభినిష్ర్కమణ. మా గతటపా చదివి మాతో అనుబంధం పెంచుకున్న వారి భక్తులు పంచుకున్న బాధాతృప్త హృదయా౦తరంగ౦ నుంచి వెలువడ్డ శతోధిక నివేదనా ఉత్తరాలతో నా ఉత్తరపెట్టె(ఇన్బాక్స్) నిండిపోయింది. వీటిలో అందరూ బాబాగారు తమకు పంచిన ప్రేమాభిమానాలు గురించిన ప్రస్తావనే తప్ప మేతావులు చెప్పే మాజిక్కులు-మాయలు లేకపోవడం గమనించదగినది. వారిలో కొందరు బాబాగారికి విన్నవించుకున్న నివేదన ఇక్కడ..



ఓ బాబా! నీవు నడిచి చూపిన దారిలో...

ప్రేమ, సేవా,కరుణా మార్గాలు పంచిన పూజ్యనీయమైన వ్యక్తిగా పపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హృదయాలలో కొలువై, తటస్తుల అభిమానాన్ని సైతం చూరగొన్న ఓ సత్యసాయి బాబా, నీ నిర్యాణం మానవలోకానికి తీరనిలోటు. బాబా, ఇక నీవు లేవు అన్న చేదు నిజాన్ని మా ఇంటిల్లిపాది జీర్ణించుకోలేకపోతున్నా౦. అయితే అదేసమయంలో నీ బోధనలు ఆచరించడమే నీకు సరైన నివాళిగా భావించే మేము నీవు భౌతికంగా మమ్ము వదిలివెళ్లినప్పటికీ నీవు పంచిచూపిన ప్రేమ, కరుణ, సేవా మార్గాలను మేము వదలకుండా ఆచరించినంతవరకు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావన్నది వర్తమాన వాస్తవం. నీతివంత౦, అర్ధవంత౦, ప్రేమమయమైన జీవితాన్ని ఎలాగడపాలో మా కళ్ళముందు ఆచరించిచూపిన చూపిన మార్గదర్శకుడివి, మానవత్వం మూర్తీభవించిన మహానుభావుడివి. మమ్మల్నదరినీ ప్రేమ స్వరూపులుగా మీరు భావించడం, మేము తోటిమానవులని ఏవిధంగా ప్రేమించాలో చెప్పటానికి దార్శనికం. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అని నీ ఆప్యాయతా ప్రవచనాలతో మాకు ఈ జీవిత పరమార్థాన్ని బోధించిన ప్రత్యక్ష దైవం నీవు. ఈ సందర్భంగా నీవు చెప్పిన సూర్తిమంతంపు ప్రేమైక ప్రవచనాలు..ఉద్బోదనలు కొన్ని..


౧. మానవపశుపక్ష్యాదులకి ప్రేమను పంచి, అవసరమైనవారికి సేవచేయడమే నీ జీవితపరమార్థం. 
౨. ప్రేమే దైవం- దైవమే ప్రేమ. ప్రేమలోనే జీవించు.
౩. నేను దేవుడిని, నువ్వు దేవుడివే. నాలో దైవత్వాన్ని గుర్తించాను నీలో దేవుణ్ని నీవు మేలుకోల్పలేకపోతున్నావు. 
౪. భగవంతుడు సుఖాలే అందిస్తుంటాడని, కష్టాలు మనం కొనితెచ్చుకున్నవి. 
౫. కష్టమనేది అనేది లేకుండా సుఖం రాదు. 
౬. దేహంలో సంచరించే జీవత్వమే దైవత్వం 
౭ .హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించడమే నిజమైన తపస్సు


ఆ విధమైన మృదుమధుర ఆధ్మాతిక బోధనలు, ప్రేమ సందేశాలు, శాంతి వచనాలతో ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన నీవు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటావు. కేవలం ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాక,  ఆర్త, దీనజనోద్దరణకు శ్రీకారం చుట్టి సమత, మమత, మానవత పంచి అవే సమత-మమత-మానవతా భావనలను మాలో పెంచిన మహానీయుడవు.

ఓ బాబా... నీవు చూపిన దారిలో మేమూ నడుస్తున్నాం. ఈ నడక నీవులేవని ఆపము. నీవు మాకు పంచిన ప్రేమను, జీవితపు ప్రశాంతతని తోటిమానవులకి పంచడానికి మరింత కృతనిశ్చయంతో ఉద్యుక్తులమవుతున్నాము. మమ్ము నీ ప్రేమ,శాంతి వచనాలతో ఆశీర్వదించు.

శ్రీమతి లక్ష్మి లాభాని పతివాడ గారు, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, అమెరికా.

-----------------------------------------------------------------

ఓ బాబా, నేను నీ భక్తుడిని కాకపోయినా నీవు చూపిన ప్రేమమార్గంలో నడిచేవారిలో ఒకడిని. అసంఖ్యాక విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా సత్యం, ప్రేమ, కరుణలను సుమారు ఐదు దశాబ్దలపాటు మీరు ప్రజల సేవకు అంకితమైన మీ నిర్యాణం కడు బాధాకరం. మంచిచేసిన వారినీ తప్పుపడుతూ జీవించే మాలాంటి తుచ్చమైన మానవుల కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తివి నీవు. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అంటూ నీవు చూపిన మార్గ౦ నభూతో నభవిష్యతి. గుక్కెడు నీటికోసం అలమటించే మా కరవుసీమ దాహార్తిని తీర్చి అపరభగీరధుడవయ్యావు. మానవసేవే మాధవసేవ అన్న దైవసూత్రాన్ని ఇలలో మా కళ్ళముందు త్రికరణసూత్రంగా ఆచరించి చూపిన మహానుభావుడివి నీవు. నీవు చూపించిన సామాజికసేవలోనే ఇకనూ నడుస్తానని చెపుతూ.....!

శ్రీ రాజీవ్ రెడ్డి గారు, హైదరాబాదు.

సాయి మాట!

5 comments:

KumarN said...

తస్లీమా మేడం గారు, వారికి కూడా అర్ధం అయ్యింది, ఆవిడ దేశంలో ఈ వాగుడు వాగితే, రాళ్ళతో కొట్టి బయటకు పంపిస్తారని, ఇక్కడయితే ఏం వాగినా ఏం పర్లేదని.

ఏ ముస్లిం స్పిరిట్యువల్ లీడర్ నో, ఆయన మృతి తర్వాత, ఆయన గురించి, హిందూ రచయిత ఎవరయినా ఇలా ట్వీట్స్ చేస్తే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా

http://timesofindia.indiatimes.com/india/Taslima-advises-Sachin-not-to-pray-for-Sai-Baba/articleshow/8073838.cms



Taslima Nasreen, the controversial writer of Bangladeshi origin, has advised the cricketing world's god, Sachin Tendulkar, not to pray for Sathya Sai Baba, who passed away on Sunday morning. Sunday, April 24, was Tendulkar's birthday, but the cricketer, who is an ardent devotee of Sai Baba, had said on Saturday that he was cancelling his birthday celebrations and praying for Baba.

Nasreen, who is known more for the controversies chasing her than her literary skills, has been retweeting comments poking fun at Sai Baba. She retweeted a comment: "why shud somebody be sad abt his death.he was 86,shud b allowed to die.i was so dissappointd with sachin praying.crazy!"

Earlier in the day, Nasreen tweeted a cheeky remark: "Satya Saibaba died. He said he would die in 2022. But he died too early."

"Hope no one will try to conceal small pellets of ashes at the base of their fingers. Then use their fists to powder the pellets and produce the flow of ash," went her next tweet.

Many of the retweets were attacks on Sai Baba, calling him a cheat and trick master. There were some that poked fun at godmen in general. Some of the comments Taslima retweeted were:

"Rasogollas and pumkins did not come from the fists."

"There is another baba in the making. the kid is just 5 to 6 years old his training will take some time."

"One godman gone but a thousands others will surface what a pity the bhakti business is quite lucrative."

One tweet reacted to her comment and took a potshot at her, saying good players are not necessarily "free thinkers".

Nasreen became famous when she started getting death threats from Islamic fundamentalists in her homeland, Bangladesh, when she criticized Islam in her books. She fled Bangladesh in 1994 and has since lived in many countries.

రాజేష్ జి said...

అజ్ఞాత, నీవు ఇక్కడ పెట్టిన లేకివ్యాఖ్య ఇలా ఉండాలి.

నకిలీ కణిక వ్యవస్థ తాము ఉచ్చనీచాలు మరిచి పరాన్నభక్కుల్లాగా బతకడానికి ఆధారమైన ఒక మహానీయుడిని కోల్పోయింది. ఇటువంటి పరిస్థుతులలో అ పరాన్నభక్కుల మాదాకవలాలు నింపడానికి
మరొక మహనీయుడు అవతరించడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకూ ఇంగ్లాడు "జోళీ"(లె) పట్టుకుని అడుక్కోండి.

రాజేష్ జి said...

$కుమార్ గారు

ప్చ్.. ఆమె అలా మాట్లాడుతుందనీ... అదే ఈ సమయంలో.. నేను అస్సలు అనుకోలేదు. తాడేపల్లి గారు చెప్పినట్లు రాబందులు ఎంత ఎత్తులో ఎగురుతున్నా వాటి దృష్టి అంతా నేలమీద ఉన్న పీనుగుల మీదే ఉంటింది. ఈమె కూడా తానూ ఆ రాబందుల సంతలో ఇక ఇంతినని చెప్పుకునే తహ.. తహ..బావుంది.

....
లేకి వ్యాఖ్యలు చేసిన/చేయబోయే వారికి హెచ్చరిక.

ఈ టపా కేవలం బాబా వారి భక్తులు లేదా వారి అభిమానుల బాధాతృప్త హృదయాలని అనునయి౦చడానికి ఉద్దేశించినది మాత్రమే. మీ లేకి వ్యాఖ్యలు ఇక్కడ ప్రచురింపబడవు..మీకు సమయం వృధా!

రాజేష్ జి said...

Rajesh

Thanks for publishing my nivedana, that just shed from depth of my heart!

My deepest condolences to everyone, whosoever feeling pain at this time. May god bless you all.


Rajeev Reddy

రాజేష్ జి said...

రాజేవ్ రెడ్డి గారు మెయిల్లో పంపిన వారి అభిప్రాయాలను ఇక్కడ ప్రచురించడమైనది.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers