నిజం..నిర్భయం

Sunday 20 February 2011

లేవండి, మేల్కొనండి(కి)...పెళ్లి రోజు శుభాకాంక్షలు (చెప్పండి)

పురాణేతిహాసాలపై శోధన కన్నా తమంతట తాముగా శోధించలేని తమ అసమర్థతని కప్పెడుతూ అసంగతంగా ప్రశ్నించడమే ఆనవాయితీగా పెట్టుక్కుని అదే అర్హతగా, హక్కుగా భావించే నేటి అత్యధికశాతపు యువతలో అతనో ఆణిముత్యం.

ఒకపక్క ఉన్నతచదువును సాగిస్తూ తగినంత సమయం లేకపోయినా వేదాలు మరియు ఉపనిషత్తులలో ఉన్న విజ్ఞాన సారాన్ని మధి౦చి వాటిని నేటి యువతకు అర్థమయ్యే వైజ్ఞానికరీతిలో చెప్పడమే గాక తర్వాత వచ్చే పిల్లకాకుల పెసినలకి తనదైన నొప్పించక...తానొప్పక శైలిలో స.ధా లు ఇస్తూ సదా సాగిపోయే అతను నిజంగానే అభినందనీయుడు.

అద్వైతంలో ద్వైతా, విశిష్టాద్వైతాలు ఎలా కలిసిపోతాయో గణిత౦ ప్రకార౦ బహుచక్కగా వివరించినా, సమాధి స్థితి, శృంగారం, గాఢనిద్ర ల మధ్య ఉన్న సారూప్యతను ముచ్చటగా చెప్పినా, ఏ విషయమైనా సమగ్రంగా నేర్చుకోవడానికి వేదాలు చెప్పిన పద్దతి గురించి సుళువుగా వివరించినా, ప్రాచీన భారత ఋషులు ఆఫర్లు అంటూ జ్ఞాననివేదన చేసినా, మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) విధానాన్ని విదేశీయుల కళ్ళజోళ్ళతో ఎందుకు చూడాలి? అంటూ తీపివాతల మాటున విజ్ఞానవాస్తవాన్ని అందించినా, ఆత్మహత్యలు చేసుకోవడం అవసరమా? అంటూ తనజీవితపు చేదుసంఘటనలు కలిపి ప్రశ్ని౦చినా, గురువుకు ఏమైనా కొమ్ములు మొలిచాయా? అన్నదాన్ని హాస్యంతో మేళవించి మరీ పంచుకున్నా. బ్లాగుల్లో వేడి అంశాలకు స.ధా గా వేది టపాలుగా రాసినా అది విజ్ఞాన వారసత్వ పరంపరను నిస్వార్థంతో అందించడమే పరమావధిగా పెట్టుకున్న మంచివ్యక్తి.

మరి ఇతనికి అన్నీ అమరి తీరిగ్గా కూర్చుని అవన్నీ రాస్తున్నాడంటే పప్పులో కాలేసినట్లే! అతనిమాటల్లోనే...

నావద్ద సొంతంగా కంప్యూటర్ కాని,laptop గాని లేవండి. నా స్నేహితుడి కంప్యూటర్ లో notepad పై టైపు చేసుకొని ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లి బ్లాగు పోస్టు చేయడం గాని లేకుంటే నా సెల్ నుండి మా స్నేహితుడి కంప్యూటర్ కు నెట్ కనెక్ట్ చేసి బ్లాగు వ్రాస్తుంటాను
(పై నాలుగుముక్కలు ఇతరులకి ఆదర్శంప్రాయం అవ్వాలని మాత్రమే పెట్టానని గమనించ మనవి!)

తను నేర్చుకున్న విజ్ఞానాన్ని నలుగురితో అది ఎంత కష్టమైనా పంచుకోవాలనే జిజ్ఞాసని చూడండి. ఆచరణీయం.అమోఘం.


ఇప్పటికే ఈ వ్యక్తి ఎవరో మీకు అర్థం అయిఉండాలి :). వారే లేవండి, మేల్కొనండి.. అంటూ మనల్ని టపాలతో తట్టి మరీ జ్ఞానా౦ధకారం నుంచి సదా మేలుకొలుపులు పాడే శ్రీ సురేష్ బాబు గారు.

శ్రీ సురేష్ బాబు గారి పెళ్లి రోజు నేడు. astrojoyd గారు అన్నట్లు పూర్ణపురుషుడై, ఇక నుంచి మంచానికి ఒక పక్కనుంచి దిగే అలవాటు మొదలయ్యే రోజు :).




ప్రియ బ్లాగమిత్రుడు, విజ్ఞానశీలి శ్రీ సురేష్ బాబు గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. వారి వైవాహిక జీవితం ఆనందోత్సాహాలతో కలకాలం సాగాలని కోరుకుందాం.

సురేష్ బాబు గారికి చిన్న మనవి :
నూతన జీవితపు సంసారంలో పడి మమ్మల్ని మేలుకొలపడం మటుకు మరిచిపోవద్దన్ని మనవి :)

21 comments:

శ్రీవాసుకి said...

సురేష్ గారికి

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే మాకోసం మీ విలువైన పోస్ట్లు మర్చిపోకండీ

విజయలక్ష్మి దేహారం said...

సురేష్ గారికి
పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీ సంసారం సుఖమయమై ఆనందోత్సాహాలతో వెల్లివిరియాలని కోరుకుంటున్నా!

astrojoyd said...

వివాహంతో స్త్రీ మాత్రుమూర్తి అయితే పురుషుడు శక్తీ వంతుడు అవుతున్నాడు అన్నారు మనువు.పురుషుడు తనలోని శుక్ర మేలితమైన కామ శక్తిని,అంటే అగ్ని శక్తిని స్త్రీకు ఇచ్చి తనలోని మోక్ష శక్తిని మేలుకోలుపుకుంటాడు.ఇంతటి మహోన్నాత సాయం చేస్త్తున్న స్త్రీను మన సంస్కృతి దైవంతో సమానంగా పూజించే స్త్తానాన్నిన్ని ఇచ్చి తనను తాను గౌరవిన్చుకుంది.అటువంటి దేవతను సురేష్ ఈ రోజున తన సొంతం చేసుకుంటున్నారు.సురేష్ ఈ కొత్త శక్తితో మరిన్ని ప్రయోజనకరమైన పోస్టులు తప్పక రాస్త్తారు అలా రాయకుట్ అయన అర్దాన్గే అయన చేత రాయిస్త్తుంది.సురేష్కు ఈ పెళ్ళితో సర్వ అభీష్టాలు కలగాలని మన బ్లాగర్ల అందరితరపునా నేను ఆసీర్వదిస్త్తున్నాను.శుభంభుయాత్.

Anonymous said...

Mr. Suresh Babu

Happy Married Life. Wish you all the best. May god bless you!


Rajeev Reddy

రాజేష్ జి said...

ప్రియమిత్రుడు, మితభాషి, విజ్ఞానశీలి సురేష్ బాబు గారికి వివాహసుమహోత్సవ శుభాకాంక్షలు.
astrojoyd గారు చెప్పినట్లు మీరు మీ శైలి కొనసాగించాలని సదా భావిస్తున్నా!

Anonymous said...

ప్చ్.. పాపం, పెళ్ళైపోయిందా! :((

Anonymous said...

రాజేసా

ఆడ మావోయిజం ఈడ పెళ్లి సర్లే గానీ మాలికలో ఈ బ్లాగులో పెట్టిన కామెంట్లు కనిపించట్లా! ఆ రాజకీయమేందో ముందు చూసుకో. శరతన్నా ఇక్కడ మరో గొర్రె సిద్దం నీలాగే :)

చిలమకూరు విజయమోహన్ said...

శ్రీ సురేష్ బాబు గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.

Sreekanth Chowdary said...

@సురేష్ బాబు గారికి

మీరు, మీ బ్లాగు ఇంతకుముందు తెలీకపోయినా టపాలో రాసిన దాన్ని బట్టి మీ బ్లాగు మొత్తం ఏకబిగిన చదవాల్సిందే అని అనిపిస్తుంది. Shall go!

మీకు మొదటిరాత్రి శుభాకాంక్షలు. "మొదటిరాత్రి" అని చెప్పక తప్పదు మరి నేనొచ్చేసరికి మీరు పెళ్లిచేసేసుకున్నారుగా :)

రాజేష్ జి said...

$Anon Ji

#కామెంట్లు కనిపించట్లా
Isn't it? I didn't observe and ofcourse, we dint get any mail on that though! Let us check. Anyhow, Thanks for sharing!

$Sreekanth Ji
Who knows there would be firstnight immediately after marriage? :))

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

Happy married life Suresh garu.

Anonymous said...

రాజేషా

నే చెప్పిన దానిమీద ఏవైనా పీకుతున్నావా? అదే నీ బ్లాగు కామెంట్లు మాలికలో గత్తరు గత్తరు. ఒక్కడిగా పీకే సత్తా లేకపోతే మా ప్రమోదవనంలో జాయిన్ అవ్వు. ఆళ్ళ అంతు చూద్దాం.

ఇప్పుడే అందిన చీలిక వార్త:
సాపాటు బ్లాగులో కమ్మకులానికి వ్యతిరేకంగా కామెంట్లు వచ్చాయనే కోప౦తో ఆ కులపోళ్ళు ఒక్కటై ఆడుతున్న కెలుకులాట ఇది. Shame shame, Don't you?

Put a mail to us If you need more news.

సాపాటు సమగతులు said...

Hey Anon,

Thanks indeed for informing us. We keenly observed and confirmed what you said was true. However, They are providing free service whilst we are not here meant for pulling or begging them for the reason behind. But..But If the reason is what you said, Then yes..yes we are really shameful. Let them enjoy their "C" legacy!

Rajesh,
We don't need to entertain Anon, but with all due respect! :)

Anonymous said...

OMG! Another crap-shit eating by kelukudu batch :).

This is Utterly nonsense. Adding my support to this blog.

Anonymous said...

Alas! Another victim.

My support too..!!!!!!!

రాజేష్ జి said...

పిల్లకాకి కృష్ణ ఇలా వ్యాఖ్యానించారు.

@ సాపాటు
చానా మంది హిందు మతొద్ధారకులు కంటే సురేష్ గారు అణిగి మణిగిన విస్తరాకు. ఆయనకు నా hearty happy married life wishes. ఎటొచ్చి పిల్ల కాకులకి కూడా తిన్నగా సమాధానాలు ఇవ్వలేని ,below the belt సమాధానలు ఇచ్చే [ఎడిటెడ్] చెడ్డ చిరాకు. [ఎడిటెడ్] తెచ్చుకోండి [ఎడిటెడ్]

రాజేష్ జి said...

$పిల్లకాకి కృష్ణ

మీ వ్యాఖ్య సురేష్ గారీకి శుభాకాంక్షలు చెబుతూ ఉంది కాబట్టి అనవరమైన చెత్త తీసేసి ప్రచురించా.

ప్రశ్న వేయడం చాలా సులభ౦, అప్పుడే పుట్టిన పిల్లోడు కూడా వేస్తాడు. వేసే ప్రశ్నలో తర్కం ఎంతఉందో అలోచి౦చుకుని వేయాలి.. ఏదో ఇక మన గ్నానాన్ని ప్రదర్సి౦చుకోవాలి అన్నట్లు కాకుండా. గొల్లపూడి గారు మొన్న అన్నట్లు "నమ్మకం మొదలైనచోట తర్కానికి తద్దినమే!"

ఇక్కడ మీ ప్రశ్నలకి స.ధాలు ఇస్తూ తీరిగా ఎవరూ కూర్చోలేదు. ఎందుకంటే అవి మీకు మీరుగా శోదించుకుంటే చక్కగా జవాబులు తెలిసే ప్రశ్నలు. అయితే అది మీరు చేయరు.. మరి మీ గ్నానం మాకు తెలియాలి కదా!


సరే, మీదాకా వస్తే మీరెంత చెక్కగా స.ధా ఇస్తారో SNKR గోరికిచ్చిన బదులు వ్యాఖ్యలో చూసా. ఒక్కసారి మీ టపాకి వెళ్లి రెండు వ్యాఖ్యలు చదువుకో. మంచిగా అడిగిన వ్యాఖ్యకే మీరు అణిగిమణిగి ఉండలేకపోయారు మరి...లేక ఈ అణి..మణి.. కొందరే ఉండాలంటారా? మీరు తెచ్చుకోండి "**" అని పైన వ్యాఖ్యలో చెప్పారే.. ఆ "**" ఎవరు తెచ్చుకోవాలో నిర్ణయించుకోండి ఇకనైనా!

krishna said...

@ రాజేష్,
చూడు సామీ, సురేష్ గారినే కాదు, శర్మ గారిని, రాజశేఖరుల విజయ్ గారిని చాలా గౌరవిస్తాను. వారు విజ్ఞులు. తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. నా లాంటి తెలియని వాళ్లు నేర్చుకునేది నేర్చుకుంటారు. అవసరం లేని దగ్గర కూడా నా ప్రసక్తి తెచ్చే నిన్నేమి అనాలి ? అది సభ్యతేనా? ఈ టపాలో నా ప్రసక్తి ఎవరు తెచ్చారు ? ప్రతి దగ్గర అనవసర ప్రసంగాలు ఎందుకు?
ఇక శంకర్ ని ఎప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకున్నాను. కావాలంటే శర్మ గారి బ్లాగులు, నా ముందరి బ్లాగులు జూడు. కాని ఆ పెద్ద మనిషి నా బ్లాగులో రాసిన అసహ్యకరమైన , అనవసరమైన కామెంటుకి నేను ఇచ్చిన జవాబు తక్కువే! అభిప్రాయ భేదాలు వున్నా సభ్యతగా విరోధించు .. లేదంటే మీ స్థాయికి నేను దిగి రాగలను. అది గుర్తు ఉంచుకుంటే మనిద్దరికి మంచిది.

మంచు said...

సురేష్ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు !!

రాజేష్ జి said...

$పిల్లకాకి krishna

చూడుము పిల్లకాకి

#..గారిని చాలా గౌరవిస్తాను. వారు విజ్ఞులు...

వారు మీ దృష్టిలో విజ్ఞులు అవ్వింది కేవలం మీ ప్రశ్నలని సహనంతో భరిస్తూ స.ధా ఇవ్వడం వల్ల.. అంతే కానీ వారి విజ్ఞానంతో కాదు గదా.. ఆహా.. చెప్పులే.. అంతే కదా!.. అంటే నిన్ను లేదా నీ ప్రశ్నను విమర్శిస్తే అజ్ఞులు. మరీ ఇంత హీనస్వార్థం ఎందుకబ్బా?

#..టపాలో నా ప్రసక్తి ఎవరు తెచ్చారు..

ఎవరు మరి? ఓహో.. పిల్లకాకి పెసిన అనా..! అదో జాతీయం అయ్యా.. ఎవరైనా పనికిమాలన, తర్కవిహీన పెసినల్తో వేధిస్తే "ఎహే.. వీడే౦ట్రా.. పిచ్చిప్రశ్నలతో పిల్లకాకిలా పోడుస్తున్నాడు అనడం కద్దు"! మరి మీరు స్వయంగా ఆ పేరు పెట్టుకోవడం కాకతాళీయమో లేక మీ స్వభావాన్ని తెలిపేందుకు పెట్టుకున్నారో నా కనవసరం. మీరు డానికి భుజాలు తడుముకోవద్దని మనవి :)

#..నా బ్లాగులో రాసిన అసహ్యకరమైన ,..
నువ్వు ముందు నీ బ్లాగు టైటిల్ చూడు.. నాకు అది చాలా అసహ్యంగా ఉంది మరీ.. ఏం చేద్దా౦? నాకు SNKR గోరు రాసిన వ్యాఖ్యలో ఈసమెత్తు కూడా తప్పు కనిపించలేదు. ఒక విధంగా ఆయన మీకు ఇచ్చిన జవాబు తక్కువే. ఇవ్వన్నీ పక్కన బెట్టినా...ఇలా స.ధా ఇవ్వాలి.. అలా చెప్పాలి.. అని ఓ ఉపన్యాసాలు దంచే మీరు చివరికి ఏం ఎరగబెట్టారు?
ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్స్
౧.మీకు వారి వ్యాఖ్య ఇష్టం లేకపోతే ప్రచురించకపోవడం
౨.ప్రచురిస్తే తగురీతిలో మర్యాదగా స.ధా ఇవ్వడం
౩.అమర్యాదగా మనసులో ఉన్నదంతా కక్కుతూ ఏదో మన గ్నానాన్ని ప్రదర్శి౦చుకోవడానికి బదులిస్తే మటుకు ఇంకోమారు వ్యక్తిగత గౌరవం.. తొక్కా.తోలు.. అని సెనక్కాయ కబుర్లు చెప్పమాక!

#అభిప్రాయ భేదాలు వున్నా సభ్యతగా విరోధించు ..

పై సూత్రం మాకేనా లేకు మీక్కూడా వర్తిస్తుందా? కిసుక్క్కుకిమతోయమా!

#మీ స్థాయికి నేను దిగి....మనిద్దరికి మంచిది..

పర్లేదు..లిఫ్ట్ వేసుకునీ మరీ దిగిరా కానీ...ముందు నీ స్థాయి, స్థానం ఏంటో ఓ టపాగా రాసిపెట్టుకో ఎందుకైనా మంచిది.

Anonymous said...

/లేదంటే మీ స్థాయికి నేను దిగి రాగలను./

హ్వా హ్వా హ్వా

కొండొక కోతి కొనకొమ్మలనుండగ
కింద గండభేరుండ మధేభ ..చేరి భాస్కరా

కోతే కాదు, అంతకన్నా నీచమైన కాకి కూడా కొమ్మలమీదే ఎంగిలిమెతుకులో/మరేంటో కోసం చూస్తూ వుంటుంది, మరి స్థాయి స్థాయే.. ఒప్పుకొన్నాం. 'దిగీ రావలసిందే మరి. :)

Leave it, Rajesh.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers