నిజం..నిర్భయం

Saturday 26 March 2011

భారతీయం: మనకీ క్రీడానిర్వహణ ఆతిధ్యపు తలంటు అవసరమా?


ఒక పక్క ముప్పైశాతం(30%) పైగా భారతీయులు దారిద్ర్యరేఖకి దిగువన బ్రతుకుతూ అన్నమో రామచంద్రా అంటుంటే మనకీ క్రీడానిర్వహణ ఆతిధ్యపు తలంటు అవసరమా


స్వగతం: నేను క్రికెట్ చూడ్డంపట్టించుకోవడం మానేసి చాలా సంవత్సరాలయింది దేశమైనా తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్న౦తవరకే నలుగురిలోఆత్మగౌరవం అని గట్టిగా నమ్మే నేనుక్రికెట్ విషయంలో మాత్రం ఎందుకనో దాన్ని  ఆపాదించలేకపోయాక్రికెట్కి వీరాభిమానినయ్యాక్రికెట్ మన వారసత్వపు ఆట కాకపోయినా యావత్భారాతావనిని ఒకే గాట కట్టివేసే అట అని చిలకపలుకులు పలికే భారతీయ ప్రచారమాధ్యమాల మిధ్యామహిమేమో నా మీద బాగా పనిచేసింది

అంతేకానీ అసలు "యావత్భారాతావనిని ఒకే గాట కట్టివేసేఆటవల్ల భారతీయులకి నిజంగా లాభం ఉందాఒకపక్క అర్ధశతాబ్దంపైన ఇంకా పేదదేశంఏంటి? లేక ఇది కొంతమంది పెట్టుబడిదారుల సయ్యాటాఅని ఆలోచించే వయసు కాదు అప్పుడు నాదిఅసలీ ఆలోచనలకి ఆస్కారం కలిగించేపరిస్థితులేలేవుపిల్లలకి మంచీ,చెడూ చెప్పాల్సిన పెద్దవారు బయట సమానత్వం-సొంటికొమ్ము మాటలు చెప్పి లోన పెట్టుబడిదారుల సయ్యాట చూడ్డానికి అర్రులుచాచే ఘనమైన వారసత్వాన్ని తమ పిల్లలికి ఇవ్వడానికి సిద్దమవుతున్న తరం పరిస్థితి అది

 తర్వాత క్రికెట్ ఆటను ధనమదంతో ముందే నియంత్రి౦చే (మాచ్ఫిక్సింగ్దళారీ వ్యవస్థతోఆపై అవినీతి ఆరోపణలతో సతమతమవుతూ దానికి బాధ్యతగా ఒక వెనుకబడ్డబలహీన దేశాన్ని బలిపశువును చేసిన పెట్టుబడిదారులుసామ్రాజ్యవాదుల నిజరూపం మరోసారి బయటపడిన వికృత సంవత్సరం నుంచి ఏహ్యభావనతో చిన్నచిన్నగా చూడ్డం మానేసా!.


అసలు విషయం: నిన్న మా ఉద్యోగశాల(ఆఫీసు)లో భారత్ఆస్ట్రేలియా సహోద్యోగుల గోల ఒహటేమనిఏంట్రా అని చూస్తే ప్రపంచపాత్ర(వరల్డ్ కప్) సందర్భంగా ఇరుదేశాల అభిమానులు(సహోద్యోగులు) తీవ్రమైన వత్తిడిలో చేసే రణగొణధ్వణి. ఇహ ఇతర దేశపు సహోద్యోగుల్లో క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్ళు అటేపు, ఇటేపు చేరి వత్తిడిపెంచుకోనడంలో తమవంతు  పాత్ర పోషిస్తున్నారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా రక్తపోటు(బీ.పీ), తలకాయనొప్పి తదితర మాత్రల డబ్బాలతో సిద్దంగా ఉన్నారు. సరే ఈ కోరి తెచ్చుకుటున్న లేదా పెంచుకుంటున్న వ్యాధు(దూ)ల ని గురించిన ఆలోచనల్ని కాసేపు పక్కనబెట్టి అసలీ ప్ర.పా నిర్వహణ ఎవరిదీ అని నా సహోద్యోగిని అడిగా. దానికి మా సహోద్యోగి చెప్పిన జవాబు ఇని కాసేపు అవాక్కయ్యా.. ఆ తర్వాత రక్తపోటులు పెరగడాలు, బుర్రతిరగడాలు నా వంతు. 


అసలు విషయానికి వస్తే ఈ ప్ర.పా కి నిర్వహించేది/ఆతిధ్యమిచ్చేది ప్రపంచంలో మొదటి పాతిక పేదదేశాలలో ముందు వరసలో నిల్చుండే భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్. ఈ పేదదేశాల వరుసలోనే ఉండే పాకిస్తాన్ కొన్ని అనివార్య సంఘటనలవల్ల ప్ర.పా ఆతిధిసేవకు దూరమయింది. ఈ దేశాలన్నీ పేదరికం, మత/సరిహద్దు అంతర్యుద్ధాలతో దశాబ్దాల కొద్దీ సతమతవున్నవే. సరే పక్కి౦టి గురించి మాట్లాడేముందు మనిల్లు చక్కబెట్టుకోవాలి అన్న ప్రాధమిక సామాన్య సూత్రాన్ని గట్టిగా నమ్మే నేను ఇక్కడ భారతదేశం గురించీ ప్రస్తావిస్తా.


భారతదేశంలో ముప్పై(30%) శాతం మంది దారిద్రరేఖకు దిగువన బ్రతుకుతూ ఒక్క పూట కూడా తిండికి నోచుకోలేని హీనస్థితిలో ఉన్నారు. అందరు ప్రజలూ, అన్ని రంగాలూ అభివృద్ధి చెందిన దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుందని తెలుసుకోలేక అర్ధశతాబ్దపు పైగా అజ్ఞానంతో బ్రతుకుతూ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. అభివృద్ధి మాట అటుంచి ఈ పైపై మెరుగుల క్రీడల నిర్వహణ తలంటుతో దేశాన్ని, దేశప్రజలని అప్పుల ఊబిలో నెట్టుకున్న కొన్ని పశ్చిమదేశాల జాబితాలోకి చేరాలని ఆరాటపడుతున్నట్లుంది. 


మొన్నటికి మొన్న ఆంగ్లేయుల రాచరికంలో మగ్గిన దేశాలు వాటి(మగ్గిన) గత స్మృతులు మరిచిపోకు౦డా ఉండడానికి పెట్టుకున్న కామన్వెల్త్ దేశాల క్రీ(నీ)డలకు ఆతిధ్యమిచ్చి ఆనక ప్రపంచదేశాల దృష్టిలో పలురకాల(అటు ఆతిధ్యనిర్వహణా లోపాట్లు ఇటు కల్మాడీల అవినీతి కుతంత్రాలు...రాణి ఎలిజిబెత్ ఈ క్రీడలకి హాజరవడానికి తనకి సమయం లేదని కుంటి సాకు చెప్పి ఈ క్రీడలని గడ్డిపోచ సమానంగా తృణీకరించడం) అవమానాలకు గురైన మరక సంఘటనలు మదిలో మరవకముందే ఇప్పుడు ప్ర.పా ఆతిధ్యం. కోట్లాను కోట్లు ఖర్చు....పేదవాడిని మరింత ఆగర్భదరిద్రుడిగా మార్చే ఒకరకమైన మయాజాలపు నిలువుదోపిడీ. 
   


అయితే ఇప్పుడే౦టయ్యా? పేదవాళ్ళు ఉన్న౦తమాత్రాన క్రీడలు నిర్వహించకూడదా? క్రీడలు నిర్వహిస్తే దేశానికి పేరు, ఆదాయం వస్తాయి కదా! ఏ౦? అవి కనిపించడం లేదా? అని మీరు అడగొచ్చు. అక్కడికే వస్తున్నా. 


నిన్న సాయంత్రం ట్యూబ్(లోకల్ రైల్) లో ప్రయాణిస్తున్నప్పుడు ఇక్కడి ప్రముఖ పత్రిక "ది ఎకనమిస్ట్" ప్రాయోజితం చేసిన ఒక ప్రకటన నన్ను అట్టే ఆకర్షించింది. ఈ ప్రకటన 2012 లో జరగబోయే ఒలింపిక్ క్రీడలకు ఆతిధ్యమివ్వడానికి రంగ౦ సిద్డం చేసుకుంటున్న లండన్ నగరం గురించి.


    


2012 ఒలింపిక్ క్రీడలుకి ఆతిధ్యమిస్తున్న లండన్ నగరానికి ఈ ఆతిధ్యం అంత అవసరమా? ఇది అనవసరపు ఖర్చా కాదా? నీవు దేనివైపు మొగ్గు చూపుతావు అని స్థూలంగా ఆ ప్రకటన సారాంశం. ఎంత మంచి ప్రశ్న! ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన నగరాల్లో ఒకటిగా పేరుగాంచి, నిత్యం కోట్లాను కోట్లు వర్తకమారకం జరిగే లండన్ ఒలింపిక్ ఆతిధ్యం గురించి అలోచి౦చడమా? ఇది ప్రభుత్వానికి ఎంత సిగ్గు చేటు? అని పైపై మెరుగుల కోసం ఆరాటపడకుండా ఒక ప్రచార/వార్తా మాధ్యమం వాస్తవాలను కళ్ళముందు చూపి అడిగిన ప్రశ్నలకి ఇక్కడి మేధావుల నుంచి అధ్బుతమైన స్పందన వచ్చింది. ఆతిధ్యమిస్తామని ఒప్పుకున్నాక ఎలాగు ఇవ్వకతప్పదు, కానీ ఇలాంటి వార్తా మాధ్యమాల తోడ్పాడు ఉండటంవల్ల కనీసం ఆతిధ్య౦లొ ఎక్కడా వృధా ఖర్చు కానివ్వకుండా, ఇంకొన్ని కల్మాడీలు పుట్టకుండా చూస్తూ, అవసరమైనప్పుడు  ప్రభుత్వాన్ని నిలదీసే  ఆలోచనాసరళిని సగటు పౌరుడికి కలిగిస్తుంది.       


అదే విధంగా గత౦లొ ఒలి౦పిక్స్ కి  ఆతిధ్యమిచ్చిన ఏథెన్స్(గ్రీస్), మాంట్రియల్ (కెనడా) నగరాలు పేరు గొప్ప- ఆదాయం దిబ్బ(వైట్ ఎలిఫెంట్) అన్న చందాన అప్పుల్లో కూరుకుపోయిన వాస్తవాన్ని ప్రజల ముందుంచి భవిష్యత్తుని గుర్తుచేసింది. అధ్బుతమైన దూరాలోచన.       


మరి ఇప్పుడిప్పుడే ఆర్ధికాభివృద్ధిలో పడుతూలేస్తున్న భారతదేశానికి ఇలా క్రీడలకి ఆతిధ్యమిచ్చే విషయాల్లో ఎంత జాగరూకత ఉండాలి? మరి మన ప్రచారమాధ్యమాలు పౌరులని ఆ రకంగా జాగృతం చేస్తున్నాయా? ఎంత మాత్రమూ లేదు. పైపెచ్చు భారతీయ మాధ్యమాలు క్రీడాతిధ్యంతో  తమకు వివిధ రూపాల్లో(ప్రకటనలు...) వచ్చే ఆదాయం కోసం కక్కుర్తిపడి ఈ క్రీ(నీ)డ లకి తమ అండదండలందిస్తున్నవి. క్రికెట్కి పుట్టినిల్లయిన ఆంగ్లేయ దేశపు వార్తా మాధ్యమాలు క్రికెట్ వార్తలకి అల్ప ప్రాధాన్యం ఇస్తుంటే  భావదాస్యాన్ని వదులుకోలేని భారతీయమాధ్యామలు మటుకు తమ పత్రికల్లో అధికభాగం ప్రాధాన్యత క్రికెట్ వార్తలకి ఇస్తున్నాయి. ఇహ.. సామాన్యుడి స్థానమెక్కడ?


సరే ఎప్పుడూ ఉండేదే కదా ఈ మిధ్యమాల గోల. వీటిని ఎన్ని అన్నా ప్రయోజన౦ శూన్యం, ఎవడి వ్యాపారం వారిది. మరి చదువుకున్న మేధావుల మాటేమిటి? అందులోనూ మధ్యలో ఉక్కిరిబిక్కిరయ్యే మధ్యతరగతి జీవుల మాటేమిటి? మతమూ-మూఢనమ్మకాలు అంటూ గగ్గోలు పెట్టేవారు తమను కబోదుల్నిచేస్తూ కళ్ళముందు  జరిగే వ్యాపార సయ్యాటకి మూఢ౦గా తలలూపే నవీన మూఢనమ్మకాలు కనపడడం లేదా? దేశప్రజలందరినీ (చదువు)ఉన్నవారు, (చదువు)లేనివారు అనే తేడాలేకుండా గొర్రెలుగా కట్టిపడేస్తున్న క్రీ(నీ)డ యావత్భారతావనిని ఒకే గాట కట్టేస్తుంది, అట్లే ఈ ఆతిధ్యాలు దేశానికి పేరు,డబ్బు తీసుకువస్తాయి అని గుడ్డిగా నమ్మడం నవీన మూఢనమ్మకాలు కావా?                
         
ఇహ చివరిగా, క్రీడాతిధ్యపు తలంటు పేరుతో జరిగే కళ్లుచెదిరే వ్యాపారం:(లాభాలు ఎవరి జేబులోకి?)

  1. IPL-2 Total Cost – $100 Million
  2. World Cup 2011 Total Cost – $40-50 Million
  3. Television Rights revenue of IPL-2 – $1.63 Billion, $1.75 Billion with Sony, etc
  4. Television Rights revenue of Cricket World Cup 2011 – $1.1 Billion with ESPN
  5. Sponsorship of IPL – $1 Billion,
  6. Sponsorship of Cricket World Cup – $500 Million

8 comments:

యశోదకృష్ణ said...

cricket chusi enjoy cheyyadame kaani daani gurunchi intha teliyadu, teliya cheppinanduku thanks.

Maruthi said...

keep it up and spread the news to all indians. Bagundi. and post some more real information about india politics also.

Anonymous said...

Excellent. Thanks for sharing pro and con side of the shameful business via a wealthiest game by a POOR country. pitiful :(

KumarN said...

నాకు మీలో నచ్చిన విషయమేంటంటే, You take them head on, never mince words.
That being said, let me also say this. No two people agree on everything :-)
I agree with some, and probably differ on others.

ప్రభుత్వాలు కాకుండా కార్పోరేట్స్ చాలా దేశాల్ని గవర్న్ చేస్తున్నాయి అని ఎవరైనా అంటే, గబుక్కున ఖండించలేని పరిస్థితి నెలకొని ఉంది.
ఈ కార్పోరేట్ కల్చర్ వల్ల జరిగిన మంచి చెడులు అనేవి డిబేటబుల్. నాకున్న కంప్లయింట్ ఏంటంటే, ఈ కార్పోరేట్స్ మనల్నందరినీ ఓ మూస పద్దతులకీ, ఆలోచనలకీ, అలవాటు చేస్తున్నాయి అని. వీళ్ళే చెపుతారు మనకి, మనం ఎలాంటి పర్సనాలిటీని కలిగి ఉండాలో, ఎలాంటి ఆటల్ని ఇష్టపడాలో, ఏ సెలబ్రిటీని అభిమానించాలో, ఎవర్ని రోల్ మోడల్ని చేసుకోవాలో, అసలు విజయం అంటే ఏంటో కూడా వీళ్ళే నిర్వచించుతుంటారు. ఇలా వీళ్ళు గీచే లైన్లని చేరుకోవటానికీ, రెండు వేళ్ళెత్తి మన వాళ్ళకి విజయసంకేతమివ్వటానికీ, ఓ కంప్లీట్ మాన్, ఓ అకంప్లిష్డ్ సూపర్ వుమన్ అనే ఎండమావుల్ని చేరుకోవటానికి మనం చేసే ప్రయత్నాలు గత ముప్పై,నలభై ఏళ్ళల్లో మన సమాజం లో బానే కనపడుతున్నాయి. అందరం ఏదో ఒక దాంట్లో, ఏదో కొద్ది దూరం లో ఆగిపోతాం, మనుషులం కదా!!.
ఇంకోటి కూడా ఏకీభవిస్తాను. ఏ దేశం అయినా వాళ్ళ సంస్కృతి ని గౌరవించుకోకపోతే, బయట వాడెవ్వడూ కూడా గౌరవించడు. అదే సమయంలో ఈ సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు జడ పదార్థాల్లాగా కాకుండా, బయట సంస్కృతులు వచ్చి వాటిల్లో కలుస్తూంటాయి అని కూడా నేను నమ్ముతాను. అది రెండు పక్కలా జరిగే విషయం. కొన్ని సార్లు మంచి నీరొస్తుంది, మరి కొన్ని సార్లు చెడు.

మరి క్రికెట్ మంచి నీరా, చెడు నీరా, అసలిది కొత్త నీరేనా అనేది డిబేటబుల్ అనుకుంటా. అసలిది ఎప్పుడు మొదలయ్యిందో, అసలు కార్పోరేట్స్ వల్లే ఈ ఆట మనుషులకి ఇంతగా ఎక్కిందా అంటే కూడా నాకు ఆన్సర్ తెలీదు, ఎందుకంటే. ఈ క్రికెట్ పిచ్చి నాకెక్కించింది మా నాన్న. మా ఊర్లో ఒక్క టివి కూడా లేని ఆ రోజుల్లో, రేడియో చెవ్వి దగ్గర, భుజం మీద పెట్టుకొని బాత్ రూం లోకి కూడా వెళ్ళేవాళ్ళాయన, ఆ కొద్దిసేపు కూడా మిస్ అవ్వలేక. నాకు కేవలం ఏడేళ్ళ వయసులో నాకు క్రికెట్ లో ఉండే ప్రతి పొజీషన్ నిద్రలో కూడా చెప్పేంతగా వచ్చిందంటే అది ఆయన చలవే. నాకు హిందీలో నెంబర్స్ రావటానికీ ఆ రేడియొ కామెంటరీయే కారణం. క్రికెట్ బాట్స్ విరిగిపోతూంటే, ప్రతి సారీ కొత్తది కొనలేక, ఆయనే దగ్గరుండి ఓ పెద్ద కట్టె లోంచి, బాట్ తయారు చేసి కేవలం మేమిద్దరం ఆడుకోవటం నాకు బాగా గుర్తుండే విషయం(మా అమ్మ తిట్ల మద్య). సో, ఈ క్రికెట్ పిచ్చి ఏదో ఆయన తరం కన్నా ముందే మొదలయ్యింది.

All that I know is Cricket is a great "national escape". I firmly believe that people/nations need "escapes". I know cricket is relatively better "escape" than most of bad "escapes" out there.

ఇహ ఖర్చు అంటారా, I am not on top of business side of these events, but ఇవన్నీ కూడా ప్రైవేట్లీ హెల్డ్ కాంపిటీషన్స్/ఈవెంట్స్ అని నేను అనుకుంటున్నాను. కరక్టు కాకపోతే సరిచేయండి. టాక్స్ పేయర్ మనీ ఏదీ వీటిల్లోకి వెళ్తుందని నేను అనుకోవట్లేదు. అలా క్కాకుండా వెళ్తూంటే మాత్రం, క్వశ్చన్ చేయాల్సిందే. ఏదైమైనా, నేను క్రికెట్ గురించి నిష్పక్షపాతంగా ఎప్పటికీ అభిప్రాయం చెప్పలేను. ఒకప్పుడు మా యూనివర్సిటీ తరపున ఆడినవాణ్ణి, ఇంకా ముందుకెళ్ళాలనుకున్నవాణ్ణి..ఆ పాషన్ ఇప్పటికీ నాలో ఉండిపోయింది. భవసాగరం వల్ల ప్రయారిటీస్ లిస్టులో కొంచెం వెనకపోయిందంతే. (ఇహ నా పర్సనల్ ఎస్కేప్ గురించి, 2003 లో పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు, నేను ఫీల్ అయ్యిన ఆనందం, నాకిప్పటికీ మదిలో ఫ్రెష్ గా, గుర్తు రాగానే పెదవుల మీదకి నవ్వొచ్చేంతగా, మనసంతా ప్లెజంట్ అయ్యేంత బలంగా ఉండిపోయింది. There are certain happy moments in my life, and that was certainly one of them. I was goign through tough tiems personally back then, this one gave me so much of personal exhilaration, although it lived only for a day).

పోతే, మీరు రెయిజ్ చేసిన ఒలింపిక్స్ విషయం కూడా మంచి డిబేటబుల్ ఇష్హ్యూ. Look at China, their Beijing Olympics' legacy and lasting efffects are still debated.

--
Kumar N

రాజేష్ జి said...

$గీత_యశస్వి గారూ
బ్లాగు కి స్వాగతం. మీ స్పందనకు ధన్యవాదాలు

$మారుతి
ఖచ్చితంగా మారు! :). నీ బ్లాగు కూడా మొదలుపెట్టు, లోక్సత్తా బొమ్మేట్టావు.. రాయి మరి :))

రాజేష్ జి said...

$మారు
అన్నట్లు నీ వ్యాఖకి నెసర్లు

$అజ్ఞాత గారూ
Yes, It is running by THE poor county. I second you and Thank you for commenting!

రాజేష్ జి said...

$KumarN గారు

మీ అమూల్యమైన, సవివరమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ వ్యాఖ్యకి రేపు బదులివ్వగలను.

Mauli said...

@టాక్స్ పేయర్ మనీ ఏదీ వీటిల్లోకి వెళ్తుందని నేను అనుకోవట్లేదు.


may be it looks all right. but if the people 'who pay or doesn't pay taxes ' also spending lot of their valuble time ...

and if public withdraw from watching/showing interest ??? who will be loosers and winners?

my view, public could save time, but they are used to act in their day to day life ..so they need some topic to maintain cardial relations with neighborhoods, colleagues even with family nd friends :)

and for corporates : only they need to discover/define another business :)

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers