నిజం..నిర్భయం

Thursday 31 March 2011

భారతీయం: జాతీయవాదం - దేశాభిమానం

అసలు దేశాభిమానమంటే?






ఉదయం పదకొండుగంటల ప్రాంతం 
వేర్వేరు దేశాల ఉద్యోగులతో  పాటు వివిధ భారతీయ సంస్థల నుంచి వచ్చిన ఉద్యోగులు  మా  ఉద్యోగశాల(ఆఫీస్)లో పనిచేస్తూ ఉ౦టారు. వివిధ భారతీయ సంస్థల ఉద్యోగులు పోటీ తత్వం కారణంగా ఎప్పుడూ సంస్థలు లేదా భాషల వారిగా గుంపులు గుంపులుగా ఉంటూ మిగలిన భారతీయ సహోద్యోగులతో అంటీఅంటనట్టు౦డేవారు కానీ ఈ రోజు అందరూ కలిసి గుంపుగా ఉత్సాహంగా కనిపించారు. ఎందుకో మీకిప్పటికే అరదం అయ్యుంటుంది :).   అదే క్రికెట్ సమ్మోహానాస్త్రం.  అందరిదీ ఓకే మాట.. భారత్ గెలవాలి. బావుంది, ఒక ఆట ఇక్కడి భారతీయ సహోద్యోగులందరినీ కట్టిపడేసి అందరిచేత ఒకే మాట అనిపిస్తింది. ఇదే కదా దేశాభిమానం అంటే! ఎంతైనా క్రికెట్ ఆట గొప్పదే అనుకున్నా!


సాయంకాలం ఆరుగంటల ప్రాంతం 
నా లీడ్ శ్రీలంకేయుడు. నిన్నటి రోజంతా సెలవు పెట్టి మరీ వారి దేశాన్ని ఆటలో చివరి అంక౦కి తీసుకువెళ్ళిన మాంచి ఉత్సాహం లో ఉన్నాడు. రేపు శనివార౦ జరిగబోయే భారత్ మరియు శ్రీలంకల మధ్య చివరి అంకపు ఆట ఫలిత౦ బాగాలేక(శ్రీలంక ఓడిపోతే) మనస్థాపం చెందితే ఒదార్చుకోవడానికి ఆదివారమంతా ఉంది. అలా కాకుండా ఆదివారం ఆట జరిగి శ్రీలంక ఓడిపోతే సోమవారం పనిచేయడం తనవల్ల కాదని తన  పి.యమ్ కి చెప్పాడు. ఈ పి.యమ్ అమెరికోడు. లీడ్ సోమవారం చేయాల్సిన  అత్యవసరపని ఉంది. అది గుర్తుకు వచ్చిన పి.యమ్ తన కింది  భారత ఉద్యోగి సోమవారం చేయాల్సిన పని ఎంత అవసరమా అని మనసులో కంప్యూటర్కన్నా వేగంగా మననం చేసుకుని, పైకి భా.ఉ కన్నా తనకి శ్రీలంకేయుడితోనే పని ఎక్కువుందని తను కూడా  శ్రీల౦కే గెలవాలని కోరుకుంటున్నట్లు పి.యమ్ అమెరికోడు చెప్పాడు. నేను కొద్దిగా గుర్రుగా చూసేసరికి పరిస్థితి అర్ధమయ్యి  కొద్దిగా సకిలించి ఇకిలించాడు. ఇక్కడ శ్రీల౦క గెలవాలని బలపరిచిన  మరి ఈ అమెరికోడిది కూడా దేశాభిమానమే! అని అనుకున్నా.


సాయంకాలం ఏడుగంటల ప్రాంతం
ఇంటికి వచ్చేప్పుడు కొద్దిగా ఫలహారం తీసుకుందామని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారు నడిపే శాఖాహారశాలలో కి దూరా. ఇక్కడా ఇస్కాన్ భక్తుల కోలాహలం, భారత్ గెలిచినందుకు. నాతో ఆనందాన్ని పంచుకున్నభక్తులలో ఆంగ్లేయులు, ఫ్రెంచీయులు, ఇంకా ఇతర దేశభక్తులు.. అందులో బంగ్లాదేశీ హిందువులు కూడా ఉన్నారు.  అందరి కళ్ళలో భారతదేశం గెలిచిందనే ఆనందం, అయితే అందులో డెబ్బై శాతం మందిది భారతదేశం కాదు. మరిక్కడ వీరిని అంతలా కట్టిపడేసిన దేశాభిమానం ఏమిటి? కేవలం క్రికెట్ ఆట అనుకుంటే అది ఒక దేశానికి చెందినా వారితోనే ఆగిపోయేది కదా! అందువల్ల ఇక్కడి బహుళజాతీయులనో ఏదో జాతీయవాదం కట్టిపడేసి తమదేశం భారతదేశం అని అనుకునేట్టు చేసింది. అంత మహత్తు ఉందా జాతీయవాదంలో? 


స్వస్థి: 
పైన చెప్పిన మూడు వేర్వేరు సంఘటనలు తీసుకుని వాటిలోని దేశాభిమానం ఎంతవరకు ఒక దేశప్రజలను సంఘటితం చేయగలదనేది భేరీజువేద్దాం. 


మొదటిది క్రికెట్, దాని ఉద్రేకం మీన వచ్చిన తాత్కాలిక దేశాభిమానం. ఇది ఆట ముగిసేవరకు, లేదా ఆరోజుటివరకు మాత్రమే. ఆ తర్వాతా అంతా మామూలే, రేపటికి రెండో రోజు అన్న చందాన. 
రెండవది కేవలం తన పని పబ్బం గడుపుకోవడానికి వచ్చిన పనికిరాని దేశాభిమానం. ఇది పని ముగిసేవరకు ఉంటుంది.
మూడవది స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా ఒకదేశం కోసం అందరినీ ఒకటిగా కట్టేసిన శాశ్వత దేశాభిమానం. ఇది అసలు సిసలు జాతీయవాదమనిపించింది. ఈ జాతీయవాదం మతం, ప్రాంత౦, దేశమనే ఎల్లలు ఎరుగదు. ఈ జాతీయవాద దేశాభిమానం కేవలం ఒక ఆటకు మాత్రమే  పరిమితమవ్వదు, దేశకాలమాన౦లో ఆపత్కర  పరిస్థితులు ఏర్పడ్డప్పుడు  అవసరమైన ఆలంబనని కలుగజేస్తుంది.  అలానే  ప్రచారమిధ్యామాల సృష్టిత ఉద్రేకపూరిత  వాతావరణానికి అసలు ఆస్కారం ఇవ్వదు. మరి ఇది కదా కావలిసింది!


చివరగా                     
సాయంత్రం ఏడున్నర ప్రాంత౦లో ట్యూబ్ నుంచి బయటకు వస్తుంటే మా పెద్దవీధిలో(హై స్ట్రీట్) ఒకటే కోలాహలం.. రచ్చరచ్చ. అన్నట్లు చెప్పలేదు కదూ.. మా ప్రాంతమంతా భారతీయులు, పాకిస్తానీయలు మరియు బంగ్లాదేశీయులతో నిండిఉంటుంది. భారత, పాకిస్తాన్ ఆట మరి! రోడ్డుకి అటు వైపు పాకీస్తానీయులు, ఇటు వైపు భారతీయులు.. నినాదాలతో దద్దరిల్లుతుంది. భారత్ గెలిచిన ఆనందంతో మనవారు, అందునా మా ప్రాంత౦లో ఎక్కువగా ఉండే తెలుగువారి అరుపులతో పెద్దవీధి హోరెత్తింది. ఓడినా కూడా పోటీగా పాకీలు కూడా అరుస్తున్నారు. భారత జెండా, భారత్ మాతాకి జై అన్న నినాదాలు వింటూ, అంటున్న వారిని చూడగానే  ఇహ నాకూ  ఉద్వేగం, ఉద్రేకం మరియు ఉత్తేజం ఒక్కసారిగా గుండెలోతుల్లోంచి పొంగిపొర్లి మనవారితో శృతికలిపి ఆ హోరులో జోరందుకున్నా! ఆ ఉద్వేగ౦ పూరిత వాతావరణాన్ని కొద్దిసేపు నా ఐఫోన్లో బంధించా.. ఒక్కసారి చూడండి..




అరుగో పాకీస్తానీయులు వారి జెండా పట్టుకుని 

భారతీయులు

అదిగో మువ్వన్నెల జెండా


ఆంగ్లేయుల పురవీధుల్లో షికారు చేస్తున్న త్రివర్ణపతాకం.






     
దారినపోయే నల్లనయ్య ఒకరు ఈ ఆనందోత్సాహాలగోలంతా చూసి బ్లడీ షిట్ ఎషియన్స్ అని తిట్టుకుంటూపోయాడు. మరి నల్లనయ్యకి కాలాట(ఫూట్బాల్) ఇష్టమాయే ;). 



23 comments:

Sravya V said...

బావుంది బాగా రాసారు !
దారినపోయే నల్లనయ్య ఒకరు ఈ ఆనందోత్సాహాలగోలంతా చూసి బ్లడీ షిట్ ఎషియన్స్ అని తిట్టుకుంటూపోయాడు. మరి నల్లనయ్యకి కాలాట(ఫూట్బాల్) ఇష్టమాయే ;).
--------------------------------------------------
హ హ , ఛాన్స్ దొరికినప్పుడు మనం కూడా తిట్టుకోవటమే , మనేమేమి తక్కువ :)

Anonymous said...

బగా చెప్పారు, సాపాటు.

దీన్ని బట్టి అర్థమయ్యిందేంటంటే ... మీ మొబైల్లో కెమెరా సరిగ్గా లేదు అని, బ్లర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్‌గా వస్తుంది అని! :) :P

Anonymous said...

awesome post sir...!!!

Anonymous said...

London lo e area ando miru undedi?

Mauli said...

hmm, good conclusions in only first and second incidents.

3rd one should be 'hindu/krishna' (+ hates pakistan? ) vaadam ..how can it be related to nation? may be you are connected to this, so you felt happy.

రాజేష్ జి said...

$శ్రావ్య గారు
మా బ్లాగుకి స్వాగతం!

ధన్యవాదాలు!

#ఛాన్స్ దొరికినప్పుడు
;) అంతే కదా మరి!.. అస్సలు వదలకూడదు. ఈ కాలాటలకి నల్లనయ్యలు చేసే గోల చూడాలి.. హబ్బో ఇల్లు పీకి పందిరే :)

రాజేష్ జి said...

$Snkr గోరు

ధన్యవాదాలు.

#దీన్ని బట్టి..మొబైల్లో కెమెరా..బ్లర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్‌గా

హ్మ్..నాకు కలిగిన భావోద్వేగమే మొబైల్లో కెమెరాకు కూడా వచ్చింది మరి.. అందుకే బ్లర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్‌గా ;)

రాజేష్ జి said...
This comment has been removed by the author.
రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

ధన్యవాదాలు మీకు నచ్చినందుకు :)

$అజ్ఞాత గారు
ఈస్ట్ లండన్ అండి

$మౌళి గారు
యధ్బావం తద్భవతి అన్నట్లు తప్పులేదు మీరు అలా అనుకోవడంలో తప్పులేదు.

మరి నేనక్కడ చూసింది స్వదేశీ, విదేశీ అన్న తేడా లేకుండా వారందరినీ కట్టేసి భారత్ ని తమ స్వదేశ౦గా భావించే వాదమే౦టా అని! అది మతమా లేక ఇంకొకటా అని కాదు. అదే భారతీయత. ఒక జేసుదాసుగారిని, బిస్మిల్లాఖాన్ గారిని, మోరంపూడి ఫాదర్ ని అడగండి అదేమిటో!

ఇక మీరు హిందూ లేదా కృష్ణా అనంగానే పాకిస్తాన్ ద్వేషి అనే ప్రచారమిధ్యపు నానుడిలో ఇంకా ఉంటే ఎలా చెప్పండి? ఒకవేళ ఏవైనా గట్టి ఆధారాలుంటే ఇవ్వండి ఇక్కడ. అంతేకానీ పేరు చెప్పగానే అభిప్రాయం మార్చుకున్నట్లు మాట్లాడితే ఎలా మనం కూడా :) ?

చక్కగా ఒకసారి ఆక్స్ఫర్డ్ సర్కస్లో ఇస్కాన్ కి వెళ్ళండి.. అక్కడి పాకిస్తానీయులని చూడండి.

కాసేపు దాయాదులు.. మరి కాసేపు దాగుడుమూతలు లాంటివి ఇక్కడ తెలీవు. మనమిప్పుడు వాటిని రుద్దాల్సిన అవసరం కూడా లేదు.. మంచి ఉంటే గుర్తించి తీసుకోవడం తప్ప.

31 March 2011 12:49

Mauli said...

@యధ్బావం తద్భవతి అన్నట్లు తప్పులేదు మీరు అలా అనుకోవడంలో తప్పులేదు.

Yep I said it (no offense pls )

But my only concern is on following your statement for people in first 2 cases:

@దేశకాలమాన౦లో ఆపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అవసరమైన ఆలంబనని కలుగజేస్తుంది

people you observed in first 2 cases also contributes in it.

overall it was an entertainment to all..and you got connected at 3rd case, its not wrong.

my 2 cents.

Mauli said...

@ Iscon

I have used 'hate' as failed to get right phrase so added '?'with it.and I guess many of our Indians has this hatred feelings @ pakistan for other reasons.

I am also big fan of Iscon socity and try to buy gifts in many occasions from them(that is the only contribution from my end to Iscan).

Somehow they are more connected to India than any other place as per my knowledge. I will check with my pakistani hindu friend 'how popular is Iscan @ Pakistan'

but the difference you made to individuals and 'people at Iscan' in this context is what I couldn't understand. in this story I find Iscan too as another individual who is emotionally connected to India to its presence in the country .So I complement both at same level.

పద్మవల్లి said...

<>

అచ్చమైన మేనేజింగ్ స్కిల్ల్స్ కదా! :-))
బావుంది రాజేష్, బాగా చెప్పావు. ఆ జాతీయవాదం అనే బంధం లేకపొతే, ఇంకా దారుణంగా ఉండేదేమో అని భయమేస్తుంది.
కాని అన్నిటికన్నా అవసరమైనపుడు జాతి, మతాలన్నిటికి అతీతంగా, అండగా నిలబడే ఆ మానవత్వం అనేది ఇంకా గొప్పది.సునామీలైతేనేం, 9/11 అయితేనేం.

KumarN said...

హ్మ్మ్..నా అనుభవం చెప్తా వినండి. ధోని అవుట్ అయిన వెంటనే, నన్ను నేను దాచేసుకున్నా ఈ ప్రపంచం నుంచీ ఎక్కడో మీటింగ్ రూంలో. కానీ నా దగ్గరికి మధ్య మధ్యలో వచ్చి ఆనందంతో అప్ డేట్ ఇచ్చి గుడ్ లక్ చెప్పిన వాళ్ళల్లో, ఇండియన్స్, బ్రిట్స్, సౌత్ ఆఫ్రికన్స్, అమెరికన్స్ ఉన్నారు. వీళ్ళల్లో మొదటి ముగూరికి మాత్రమే తెలుసు క్రికెట్టాటా, ఇండియా కి ఈ గేం లో ఉన్న స్టేక్స్. ఈ హడావిడి అంతా చూసి మా డైరక్టర్(పక్కా అమెరికన్) ఎందుకో అటు వెళ్తా నన్ను తొంగి చూసి, వచ్చి చెప్పాడు, ఇవ్వాళ నీకు బిగ్ డే అంట కదా, ఐ హావ్ నో ఐడియా హౌ ఇట్ ఈజ్ ప్లేడ్, బట్ ఐ విష్ యు గుడ్ లక్ అని.

గెలిచిన వెంటనే, నేను నా ఇండియన్ ఫ్రెండ్స్, ఓ ఇద్దరు ఇండియన్ కొలీగ్స్(అమ్మాయిలు:-), ఓ పాకిస్తానీ అతను, ఓ బ్రిట్, ఇద్దరు అమెరికన్స్ తో కఫెటీరియా లో లంచ్ కెళ్ళాను. పాకీస్తాన్ అతనితో నాకు కొంచెం పరిచయమే. తన టీం ఓడిపోయిందన్న చికాకు కాని, బాధ కానీ తన మాటల్లో ఎక్కడా కంపించలా. చాలా జోవియల్ గా సరదాగా ఉన్నాడు, అందరం డ్రాప్డ్ కాచెస్ మీద కొన్ని జోకులేసుకున్నాం. తనూ సచిన్ మీద కొన్ని జోకులేసాడు. వి ఆల్ హాడ్ అ గుడ్ లాఫ్.

ఇక దేశాభిమానం అంటారా..మన కుటుంబం లో కూడా మనం చూస్తాం కదా..కష్టమొచ్చినప్పుడు అందరూ ఒక్కదగ్గరికొస్తారు, కామన్ ఆబ్జక్టివ్ కోసం. ఇక్కడా ఆఫీస్ లో అంతే, నిన్న నాకు తెలీని ఇండియన్సు, ముఖ్యంగా నేనెప్పుడూ చూడని ఇండియన్ అమ్మాయిలు ఎంతమంధి వచ్చి షేక్ హాండ్ ఇచ్చేళ్ళారో. (ఓ అమ్మాయి కంప్లైంట్ చేసింది, నేను ఆ ఉద్వేగం లో అబ్బాయిలకిచ్చినట్లుగా గట్టిగా హాండ్ షేక్ ఇచ్చేసి చేయి ఊపినట్లున్నాను, తను అమ్మాయన్నది మర్చి పోయి.... ఆ పిల్ల అబ్బా అని భుజం పట్టుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత జాగ్రత్త పడ్డాలెండి).

KumarN said...

"హ్మ్..నాకు కలిగిన భావోద్వేగమే మొబైల్లో కెమెరాకు కూడా వచ్చింది మరి.. అందుకే బ్లర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్‌గా ;)""

Ha Ha Awesome!

రాజేష్ జి said...

$Mauli Ji

#no offense pls

truly!But depends on the way you grasp it!

#people..first 2 cases..contributes...

For your info! The post is not taking about individual but rather about a team which always brings fruitful results rather a single. Hence, Prominent point I was escalated and discussed thru post was the best route to keep up the team bonding FOREVER with no self-interest.

#..it was an entertainment..

Sorry.. again misinterpretation! Post was talking about the layer hyped by media about Nationalism thru cricket and I was just triggered truth side of that overhype.

#..got connected at 3rd case,..
Yes and obviously It is not wrong since that approach given me solid proof for forever bonding with no con!

రాజేష్ జి said...

#..'hate' as failed..so added '?..

Though agreed you had failed or postfixed that with ?, At first sight your statment always sends wrong indication and sometimes very poisonous too! We should be more cautious before making such statements since that is not our true intention! But as usual there is a trade off to that when you have solid proof.

#I am also big fan of Iscon socity..

But I am not :) also I am not running into to make a hunch that you are against ISKON! cheer up!

#Somehow they are more connected to India than any other place as per my knowledge.

That was very disgusting statement and never expected from you. Okay! Simple logic laid. They love god Krishna who born and brought up in india which is a host for long-lasting culture. Obviously, They need to connect to india more to understand Krishna, Vedas and eventually getting bonded with indian traditions. NO WONDER! Do you think someother country should be in place? ;)

#I will check with my pakistani hindu friend 'how popular is Iscan @ Pakistan'
First check whether ISCON is allowed to preach in Pakistan which will only cater popularity. ;) Also ask him how 15-20% of Pakistan hindu population @1947 come down to less than 2% of today (where in India muslim population is quite uprising!).

#but the difference you made to individuals and 'people at Iscan' in this context is what I couldn't understand.

Sorry.. again misinterpretation! Post wasn't takled about individuals. Please reread. The title itslef sufficed to mean what the post was about to say!

#find Iscan too as individual who is emotionally connected to India to its presence

First of all, ISKCON is an oranization and not an individual. Agreed It is emotionally whilst rationally connected to India since God Krishna born and brought up there, but not for its presence. India is not helping to ISKCON to grow up and all the ISKCON devotees are not indian-born.

#So I complement both at same level.
Sorry.. I didnt catch your point here!

రాజేష్ జి said...

$పద్మవల్లి గారు
మా బ్లాగుకి స్వాగతం :)

ధన్యవాదాలు! నిజమే అరకొరగా అవసరమైనప్పుడు వాడుకునేవిధంగా పుట్టుకువచ్చే దేశాభిమానం కనా జాతీయాభిమానం మిన్న!

#జాతి, మతాలన్నిటికి అతీతంగా..మానవత్వం..గొప్పది.

ఖచ్చితంగా! చూడండి.. చాలా వరకు ప్రతిఒక్కరికి అంతో ఇంతో సాయం చేయాలని ఉంటుంది, కొందరికి అసలుండదు. సాయంచేసే వారిని మరింతగా ప్రోత్సాహించటానికి, చేయనివారిని చేసేట్లుగా మార్చడానికి ఓక వ్యవస్థ లేదా సంస్థ ఉండాలి లేకపోతే గందరగోళం. ఆ మానవత్వాన్ని వ్యక్తిగతంగా కాక ఒక సామూహిక శక్తితో సాధిస్తే వచ్చే ఫలితాలు అధ్బుతం. ఆ సామూహిక శక్తిని సాధించడానికే నేను జాతీయవాదం అవసరం అని చెబుతున్నా :)

రాజేష్ జి said...

$కుమార్ న్ గారు

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు! మీ అనుభవం పసందుగా బావుంది ;))

#పాకీస్తాన్ అతనితో..టీం ఓడిపోయిందన్న చికాకు కాని, బాధ..జోవియల్ గా సరదాగా
అవును.. ఇక్కడా కూడా అంతే! భారత్లో ఆ రెచ్చగొట్టే ప్రచారమిధ్యమాల వల్లే ఆట తర్వాత రెండు వర్గాల మధ్య గొడవలు అని నా అభిప్రాయం.

#ఇక దేశాభిమానం అంటారా... నిన్న నాకు తెలీని ఇండియన్సు..ఎంతమంధి వచ్చి షేక్ హాండ్
అది దేశాభిమానమంటారా! మీ ఉదాహరణ సంతకెల్ల ;)

another buddy said...
This comment has been removed by the author.
KumarN said...

మీ ఉదాహరణ సంతకెల్ల ;)

అరెరే, అలా సంతకెల్లమంటే ఎలా అండీ బాబూ, ఆ ఉదాహరణానుభావాలు మళ్ళీ మళ్ళీ వస్తే బావుంటుంది కానీ ;-) అసలే ఫైనల్ మాచ్ వీకెండ్ లో, అమ్మాయిలెవ్వరూ ఉండరు చుట్టూ :-(

దేశాభిమానం గురించి ఇవ్వలా ఆ ఎగ్జాంపుల్, పైన మీర్రాసారు కదా, ఎప్పుడూ అంతగా పలకరించుకోని వేర్వేరు టీంస్లోని ఇండియన్స్, ఇవ్వాళ ఒకర్నొకరు అభినందించుకున్నారు అని. ఇక్కడా చేం టు చేం అని చెప్పడానికి పడ్డ తంటాలు.

Anonymous said...

ఎటెల్లిపోయావు బాబూ!

గుసగుస

‘నా జీవితం తెరిచిన పుస్తకం..’, ‘పారదర్శకత’ అంటూ తెగ డైలాగులు చెబుతుంటారు చాలా మంది నేతలు. వారిలో చాలా మంది పుస్తకాల్లో కనిపించని ‘నల్ల’ పేజీలు చాలానే ఉంటాయి. ఇటువంటి వారిలో అగ్రగణ్యుడు మన తెలుగు గడ్డపైనే ఉన్నారని కాంగ్రెస్ నేతలే కాదు.. తెలుగుదేశం నేతలూ చెవులు కొరికేసుకుంటున్నారు. అవినీతి గురించి తెగ నీతులు చెప్పే ఈ ‘తెలుగు’ నేత హఠాత్తుగా మాయమైపోతారని, విదేశాల్లో ‘వ్యవహారా’లను చక్కదిద్దుకున్నాక మళ్లీ ప్రత్యక్షమవుతుంటారని అంటుంటారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోరు. విదేశీ ‘వ్యవహారాలు’ చకచకా చక్కబెట్టుకొచ్చేస్తుంటారు. ఇటు అసెంబ్లీ సమావేశాలయ్యాయో లేదో.. ఆయన మాయం. అదీ ప్రధాన అనుచరులక్కూడా ముందుగా చెప్పకుండా. అవినీతిపై ఆయనసభలో చేసిన తెగావేశపూరిత ప్రసంగం ఇంకా కళ్ల ముందు చెదిరిపోలేదు. అంతలోనే ఎటెళ్లిపోయారు బాబూ!.. అని వారు బురల్రు గోకేసుకుంటున్నారు. ఆయన సింగపూరా.. కాదు కాదు దుబాయ్ .. అబ్బే మాల్దీవులకెళ్లుంటారని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెప్తున్నారు. ఏదో ఒక దేశం వెళ్తే వెళ్లాడు కానీ, ఇప్పుడే యమర్జంటుగా వెళ్లిపోయేంత పనేం ముంచుకొచ్చిందని..! అందులోనూ.. హవాలా వీరుడు హసన్ అలీ నల్లడబ్బుతో ‘తెలుగు నేతల’కున్న లింకులు బయటపెట్టిన ఈ సమయంలోనా ‘సీక్రెట్’ పర్యటనలు? అందరూ నిజమనేసుకోరూ?.. అని అనుచరగణం తెగ మథనపడిపోతోంది.

మాలతి said...

రాజేష్ గారూ, ఇదే తొలిసారి మీబ్లాగులో అడుగు పెట్టడం. చాలా బాగుంది మీ ఆలోచనాసరళి. నేను క్రికెట్ చూడలేదు కానీ టెనిస్ చూస్తూంటాను. ఎటొచ్చీ నాదేశాభిమానం మీరు చెప్పిన లెక్కల్లోకి రాదు. ఓడిపోతున్నవారు గెలిస్తే బాగుండంటూ కోరుకోడంతో సరిపోతుంది నాకు. ఎవరో ఒకరిద్దరున్నారులెండి. వాళ్ళు మాత్రం తప్పకుండా గెలిస్తే బాగుండనే ఉంటుంది. నిన్న జకోవిచ్ గెలిచినందుకు పరమానందపడిపోయేను.
మీరచనలు కూడా కొత్తసంవత్సరంలో ఇతోధికంగా సాగాలని ఆశిస్తూ. మాలతి

రాజేష్ జి said...

$మాలతి గారు
బ్లాగుకి స్వాగత౦! మీకు

:: శ్రీఖరనామ ఉగాది నూతనసంవత్సర శుభాకాంక్షలు. ::

మీ అభిమానానికి కృతజ్ఞతలు.

#..టెనిస్ చూస్తూంటాను..
నేను కూడా అండి, బాగా ఇష్టం!.

#..కొత్తసంవత్సరంలో ఇతోధికంగా సాగాలని ఆశిస్తూ.

విశేషమైన ఆశీస్సులు అందించిన మీకు కృతజ్ఞతలు. ఉగాదినాడు మీరిలా అడుగుపెట్టి ఆశీస్సులివ్వడం నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది :)

మీరు అప్పడప్పుడు ఈ బ్లాగుని సందర్శిస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేయమని కోరుకుంటూ!

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers