నిజం..నిర్భయం

Thursday 26 May 2011

ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను!

ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను
దీని రమ్యమైన అందాలతో పాటు - మూర్ఖత్వాన్నీ
దీని సమానత్వ సిద్ధాంతాలతో పాటు - చేతకానితనాన్నీ
అన్నింటినీ కలిపి ఈ దేశాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను
ఇది
గోల్డు మెడళ్ళను మెరిట్ సర్టిఫికేట్లను పక్కకు నెట్టీ
కుల ధ్రువీకరణ పత్రాలకు ప్రాముఖ్యం ఇచ్చినా సరే
దీన్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను


ఉద్యోగాల మీద కులాల పేర్లు చెక్కి
ఇది నా ప్రతిభను పాతాళానికి తొక్కి ఉండొచ్చుగాక
నా తొంభై శాతం మార్కులు పనికి రావని తేల్చి
క్వాలిఫై కొసనందుకోలేని మోడు మొదళ్ళకు
నౌకరీలు పంచేందుకు ఉత్తర్వులు జారీ చేసి ఉండొచ్చుగాక
STILL I LOVE MY COUNTRY

ఇది ప్రమాదపువలను పసిగట్టలేని అంధ కపోవతం
రిజెర్వేషన్ కాల పరిమితిని రెట్టింపు చేసుకుంటూ
నా జీవితాన్ని చింపిన విస్తరి చేసిన గ్రామసి౦హం
బతుకును వెలుగుగా మార్చుకోడానికి
ఫలానా కులం లోనే పుట్టాలని నిర్దేశించి
ఇది నా గొంతులో కపట ప్రేమను వడ్లగింజగా వేసింది
చదువులకీ ఉద్యోగాలకీ నాపై నిషేదం విధించి
కడుపులో ఆరని చిచ్చురేపింది
శాంతి మంత్రోచ్చారకుణ్ణి కదా !
నా బ్రతుకు అవమానాల అగ్నిగుండం చేసినా
దీన్ని సహనంతో తల్లిలా ప్రేమిస్తూనే ఉన్నాను


ఇది పతివ్రత వేషం వేసుకున్న పూతన
నాకు పలకా బలపం కొనివ్వలేని బీద పలుకులు పల్కి
కొందరికి ఉచిత భోజన వసతులతో హాస్టళ్ళు కట్టిస్తుంది
నా చదువుకు కాలేజీల్లొ సీట్లు లేవనిచెప్పి
కొందరికి కోటాలుగా వాటాలేసి పంచుతుంది
జీవితంలో పావు భాగం దాటగానే
నా వయస్సును ఉద్యోగానికి అనర్హతను చేసి
కొందరికి మాత్రం
వయోపరిమితికి సడలింపుమీద సడలింపులిస్తుంది
ఫిర్ భీ దిల్ హే హిందుస్తానీ

ఏ ప్రాంతమేగినా ఎందుకాలిడినా
తల్లి భారతిని పొగడటం మర్చిపోనివాణ్ణీ
నిండా మునిగినా నిండు గుండెతో
వందేమాతర గీతాన్నై ధ్వనించిన వాడ్ని
ఈ మట్టి పై మమకారం పెంచుకొని
తుపాకి ముందు గుండెను నిల్పిన వీరుడ్ని
ఇన్నీ అయినందుకు నా మొఖానికి ఏ రాయితీ ప్రకటించగ పోగా
నా మెడలో దారిద్రాన్ని మూర్చబిళ్ళగా వేలాడదీసింది
అయినా దీన్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను

కానీ
దీన్నిలా మరుగుదొడ్డిలా మార్చిన నాయకుల్ని ద్వేషిస్తున్నాను
మనుగడను ధ్వంసం చేసి పదవి నిలుపుకుంటున్న
నీతిమాలిన చర్యను నిరసిస్తున్నాను
ఇక - రాజ్యాంగం వొంకర నుదిటిపై సవరణ చట్టం తిలకమైన రోజున
జాతీయ గీతం పాడినంత ఉద్వేగంతో
మా నాయకులు నపుంసకులు కాదని
కొత్త ప్రకటన చేస్తాను!!!


-ఒక "సత్యం" చెప్పిన గుండెకోత సత్యం.

9 comments:

Anonymous said...

రిజర్వేషన్లో వచ్చేవాళ్ళతోనే నా మెరిట్ పటోటాపాలన్నీ,
డొనేషన్లు కట్టి ప్రతిభకు సమాధికట్టేవాళ్ళు నాకు కనబడరు.
ఎందుకంటే నా కళ్ళు మూసుకుపోయాయి :(

ఈ దేశాని ప్రేమించడమే నేను ఈ దేశానికి చేసే మహోపకారంగా నేను ఫీలవుతా,
మిగిలిన వాళ్ళనందరినీ ద్రోహులుగానీ చిత్రీకరిస్తా

ఇంత సిగ్గుమాలిన నేను ఈ దేశ సంపదతో తినిబలిసి,
అన్ని అవకాశాలూ దొబ్బితిని, పరాయి దేశాలకి ఊడిగం చేస్తా కేవలం కొన్ని కాసుల కోసం..
అయినా అందరికీ నీతులు చెబుతా సిగ్గు ఎగ్గు లేకుండా..
అదేమంటే, కొందరిమీద పడి ఏడుస్తా. కాదూ కూడదంటే రాజ్యంగం నన్ను శిక్షించిందంటా..:((((

Anonymous said...

దేశం మట్టిని, కొండలు, గుట్టలు, నదీనదాలు, సంస్కృతి, మతాలు,వారస్త్వ సంపద, జంతువులు, పక్షులు ... వీటిని ప్రేమించడం మంచిదే, కారణాలు అవసరంలేదు.
అల్పులు, నీచులూ ఐన దిగజారిన ఆత్మగౌరవంలేని మనుషులను ప్రేమించడానికి కారణాలు దొరకడం కష్టమే. :)

Anonymous said...

excellent composition.
We love this country inspite of ....

Unknown said...

చాల బావుంది.ప్రేమ అంటే బలహీనతలు ప్రేమించి వాటిని సరిదిద్ది సరిచేసుకోవడం. ఆ ప్రేమని దేశానికీ వర్తిన్పచేసి చక్కగా రాసారు.మీ కవితల్లో సమస్య తో పాటు సూచనా ,పరిష్కారం కూడా ఇస్తారు చివరిలో. అది నాకు బాగా నచ్చుతుంది.మీకు అభినందనలు.

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

మీ వ్యాఖ్య ఇబ్బందిగా ఉన్నాకూడా దానిద్వారా మరినలుగురికి స.ధా ఇవ్వచ్చు అన్న ఉద్దేశ్యంతో ప్రచురించా. మీరు అనుకుంటున్నట్లు ఈ టపా అనబడే గుండెకోత ఉచితఫలాలకి(రిజేర్వేషన్స్)వ్యతిరేకంగా కాదు. అలా వ్యతిరేకమైనవి నేను ప్రచురించను కూడా!. నాకు సమయ౦ మించిపోయినా కేవలం అపార్థాలకి తావువుండకూడదని మీకు వెంబడే స.ధా ఇస్తున్నా. రేపు మీకు వివరంగా సందేహనివృత్తి చేయగలను. అందాకా ఈ టపా చూడగలరు.
http://saapaatusamagatulu.blogspot.com/2011/03/blog-post.html

Anonymous said...

అలాంటి వ్యాఖ్యలవల్ల వచ్చిన ఇబ్బందేముంది రాజేష్? ఏదో వుక్రోషంతో వ్యాఖ్య చేసినా, తాము మెరిట్ లేకుండా అడ్డదారులు తొక్కుతున్నామని ఒప్పుకున్నారు. తమ ప్రతిభకే తగిన అవకాశం దొరికివుంటే డొనేషన్ కట్టి చదవాల్సిన అవసరం ఏర్పడేదే కాదు కదా? ఆ డొనేషన్ కడుతోంది ప్రైవేట్ చదువులకు, అవి కట్టి చదివే స్తోమతలేని మెరిట్ విద్యార్థుల మాటేమిటి? ఎపుడో తాతల కాలం నాటి సామాజిక పరిస్తితులను చూపించి 60ఏళ్ళుగా ప్రతిభను తొక్కిపట్టడం వల్లే, ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ కాలేజీల్లోనే డొనేషన్లు కట్టే తమ బ్రతుకు తెరువుకోసం విదేశాలకు వెళుతున్నారు. ఇక్కడ వెంగళప్పలు కనకపు సింహాసనాలు అధిష్టిస్తున్నారు.

Praveen Mandangi said...

నాకు ఆ కవిత ఏమీ నచ్చలేదు. రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం కాదు. కానీ రిజర్వేషన్ అవకాశం ఉపయోగించుకుని పైకి వచ్చిన తరువాత మన పిల్లలు కూడా పై స్థాయిలో ఉన్నా, ఓపెన్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నా రిజర్వేషన్ అవకాశాలని వాడుకోవాలనుకోవడం తప్పు.

confused said...

Rajesh,

కేక. మీరు చాలా మంది ఫీలింగ్స్ చెప్పారు.

అజ్ఞాత గారు,

పరాయి దేశాల కాసులుని కూడా నా దేశానికీ నేను పంపిస్తూ నా దేశం ని నేను ప్రేమిస్తునా

Apparao said...

అందుకే , అందుకే ,
ఈ రిజర్వేషన్ ల గోల భరించలేక , రిజర్వేషన్ ను అనుమతించని సదువు సదివా

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers