నిజం..నిర్భయం

Monday 18 April 2011

శ్రీ క.చ.రా(కె.సి.ఆర్) గారి మాటలను అర్థం చేసుకొనవలిసిన విధంబెట్టిదనిన..

సామ్రాజ్యవాదుల కంబంధహస్తాల నుంచి సామాన్యుల తెలంగాణ విముక్తి కోసం పోరాడుతున్న నాయకుడిగా చెప్పబడుతున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు(క.చ.రా) గారి మాటలకి ఉత్తరాంధ్ర బ్రాహ్మణులు ఆగ్రహిస్తూ వీధినపడ్డ వైనం చూసి కలిగిన బాధాభిప్రాయమిది.



"ఆంధ్రా బ్రాహ్మణులు అలంకారప్రియులు" అన్న క.చ.రా గారి మాటలని పట్టుకుని సామ్రాజ్యవాదులు తాపీగా ఆ మాటలో ఆపాదించిన చెందిన సామాజికవర్గాన్ని ఎగదోయడం మొదలుపెట్టారు. ఇక వీరి కనుసన్నల్లో ఉండే ప్రచారమిధ్యమాలు కొత్తగా బ్రాహ్మణులకి ఏదో అవమానం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నాయు. సరే దొరక్కదొరక్క దొరికిన మాదాకవళ౦లో చివరివరకు గీక్కోవడంలో ఎవరివంతు వారిది. మరి నా వంతుగా ఈ టపా :). క.చ.రా గారి అసలు ఉద్దేశ్య౦ గురించిన రంధ్రాన్వేషణ పక్కన బెట్టిన, ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్లు అర్థం చేసుకోనవలిసిన వాస్తవమేమనగా...

సమస్యలు/బాధలు వీధికెక్కి గగ్గోలు పెడితేగానీ పట్టించుకుని, పరిష్కారమార్గం చూపని కబోది ప్రభుత్వం మనది. అలాగే పక్కోడి సమస్య తన సమస్య అయ్యేవరకు గానీ స్పందించని అపురూప ప్రజానీక౦. మొత్తమ్మీద గోప్ప పెజాస్వామ్య దేశ౦. అంటే ఎవడి సమస్యను వాడే తనలాంటి సమస్యను అనుభవిస్తున్న లేదా దానికి అనుబంధ౦గా ఉన్నవారితో కలిసి రెడ్దేక్కి మరీ పరిష్కరించుకోవాలి అన్న సామాన్య సూత్రాన్ని బల్లగుద్ది మరీ నొక్కివక్కాణిస్తున్న కాలమిది. కర్మ సిద్దాంతం చెప్పిందీ అదే...అర్జునిడిని యుద్ధభూమిలో పోరాడమని!    

పైన చెప్పిన విధంగా చూస్తే నేను గత ఆరేళ్ళుగా భాగ్యనగర౦(హైదరాబాదు)లో ఉన్నప్పుడు పత్రికల ద్వారా పలుమార్లు గమని౦చినది: "తెల౦గాణా ఆర్చక బ్రాహ్మణులు తమకు సమస్య వచ్చినప్పుడల్లా వీధికెక్కి కబోది ప్రభుత్వానికి తమ సమస్యను తెలియజేయడం, తద్వారా కష్టపడి పరిష్కారం మార్గం సాధించుకోవడం".వీరు చేసిన పోరాటాల్ల్లో "అర్చకుల కనీస జీవనభృతి, కనీసం దీపధూపాలకు కూడా నోచుకోని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, తెలుగు చలనచిత్రాలలో తమపై ఉన్న అసహ్య,అసభ్యకరమైన దృశ్యాలు తొలగించండ౦ లాంటివి" ఎన్నతగినవి.

మరి అన్నీ పరిష్కార౦ అయ్యాయా అంటే కాదనే చెప్పాలి. కారణం, ప్రభుత్వాన్ని సత్వరమే స్పంది౦చేట్లుగా కదిలించే సామాజిక బలం లేకపోవడమే. ఆ "సామాజిక బలం" కోసం అయ్యా..రండి పోరాడుదాం అంటే .. ఆయ్ ..టాట్.. ఇదేదో కులసమస్య.. ఆదర్శవాదినైన నన్ను కులపోడిగా ముద్రవేస్తారు అనే రకాలు ఎక్కువ. మరి సమస్య ఉన్న కులంవాడే కాదుపో అన్నప్పుడు  పక్క కులపోడు(రెడ్డిగార్లు మినహా!) వచ్చి సాయం చేస్తాడా? సరే ఇది వేరే విషయ౦. మరోసారి చర్చించుకోవచ్చు. మరికొందరు ఇదే ఆదర్శ౦లో, ఇల్లు కాలింది జంగమయ్యా అంటే, నాజోలె  నాదగ్గరే ఉన్నాయిలే అన్నరీతిలో, ఇంకా ముందుకు పొయ్యి ఇంకా కులమేంటి, అందరం హిందువులం అన్న నాచు వాక్యాలు దొరికినదే తడవు అన్నట్లు వాస్తవానికి తల౦టి మరీ వల్లెవేస్తారు. నిజమే అందరం హిందువులమే, కులంవద్దు.. ఒప్పుకుంటా!. కానీ వాస్తవమలా లేదే. పైన చెప్పిన సమస్యలు ఒక కులసమస్యగానే సామాన్యప్రజానికం అనుకుంటుంది. మరి ఆ సమస్యలపై ఎవరు పోరాడాలి? స.ధా ఉందా మీ ఆదర్శవాదంలో అంటే...బెబ్బే..? అంతేకాక ఇక్కడేమీ పక్క కులపోడిని తోక్కడానికో లేక వాడి ఆస్తులని ఆక్రమి౦చుకోవడానికో కాదు కదా పోరాడేది.. మరి గాడిదకు గడ్డివేసి ఆవును పాలివ్వమన్నట్లు౦డే ఈ  అలివిమాలిన ఆదర్శానికి హేతువేంటి?    

పైన చెప్పిన రకాలలో మంచి ఉదాహరణ శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు. దాదాపు అయిదారేళ్ళ క్రిందట ఆంధ్రా బ్రాహ్మణ సంఘం వారు ఒక సభకి ఆహ్వానితులుగా తనపేరుని ప్రకటిస్తే, ఒక కులసభకి ఆహ్వానితుడిగా తనపేరు ప్రకటించడం తగదని తెగ హైరానా చేసి దాన్ని ఖండిస్తూ పత్రికాముఖంగా బహిరంగప్రకటన కూడా ఇచ్చారు. బావుంది. ఆనక ఏడాదీ/రెండేళ్ళకి మా.నా గారు అమెరికాలో కేవలం ఆరోపణ ఎదుర్కొడం, "అ౦దులో ఎంత నిజమో అబద్దమో తెలీ/తేలకుండానే ఇక్కడి ప్రచారమిధ్యమాలు, మహిళామండళ్ళు "శర్మా ఇదేం  ఖర్మ" అంటూ వీధికెక్కి పెట్టిన గగ్గోలు - అదే సమయలో ఒక నటుడు తన ఇంట్లోనే హత్యాయత్నం చేసి తీరిగ్గా రాజమార్గం ద్వారా తప్పించుకున్న బహిరంగరహస్యం మీద చూపిన శీతకన్నుని" స్వయంగా చూసి అనుభవించిన మా.నా గారికి అవి చాలవన్నట్లు శోభారాజు నాయుడుగారి భూఆక్రమణ ఆరోపణలు. అంతులేని ఐశ్వర్య౦, అంతకు మించి పేరుప్రఖ్యాతులు ఉన్న పెద్దాయన రెండేరెండు గంటల్లో రుజువుకాని ఆరోపణలతో తనని రోడ్డుకీడ్చిన వైనంచూసి.. మరి తెలుసుండాలి సామాజిక బలమంటే! ఇక్కడ మా.నా గారిని ఏమీ అనకుడదని నేను చెప్పడంలేదు..కానీ రుజువులేకుండానే ఇంతగా గగ్గోలు పెట్టిన మాదాకవళాలు రుజువులుండి సామాజిక బలుపు మీద తప్పించుకున్నదానిమీద పెట్టలేదే౦ ఆ చావుగగ్గోలు? ఇక్కడ ఏ బలం వాటి నోరు నొక్కింది?                          


అసలు విషయానికి వస్తే, సమస్యలను నడినెత్తిపై పెట్టుకుని కర్మసిద్దంతాన్ని చంకలో పెట్టుకుని చేతకానితనాన్ని ఆదర్శవాదంగా పైకి చెప్పుకుటూ తన తోటివారి సమస్యలకు స్పందించనివారు మరి అలంకారప్రియులే.. అంటే "వాస్తవాలను మరిచి అడంబరాలకు ప్రాధాన్యత...వీరు ఉన్నా లేనట్లే"! ఈ లెక్కన చూస్తే సదరు శ్రీ క.చ.రా గారు అన్నదాంట్లో తప్పులేదు.


అందుకని ఆంధ్రాబ్రాహ్మణ అయ్యలూ,
మొదలు నరికినచెట్టులా ఉపకులం, ఉపతెగ, శాఖ, గోత్రం తదితరాలతో ఊరికొకరు, పుట్టకొకరు ఉన్న మనకు మళ్ళీ ఈ ప్రాంతాలగొడవలతో మరింతగా విడిపోవడం వెన్నతో పెట్టిన విద్య. కానీ మీ ముందుతరాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కొద్దిగా ఆలోచించి సంఘటితంగా అసలు సమస్యలపై పోరాడమని మనవి. సదరు క.చ.రా గారు అన్నమాటలకి బాధ కలిగితే ఆ ప్రాంతపు బ్రాహ్మణపెద్దలతో మాట్లాడి వారిచేత క.చ.రా ని గట్టిగా అడిగించండి. అంతే కానీ ఎంతయ్యా ఇవ్వాళ బేరంలో లాభంమంటే, ఎఱిగినవాడు వెఱ్ఱివాడు రాలేదన్నాడన్నట్లుండే సామ్రాజ్యవాదుల ఉచ్చులో అసలేపడవద్దని, పడి వీధికెక్కద్దని సాష్టాంగనమస్కారం చేసి మరీ వేడుకుంటున్నా!!! ఎందుకంటే వీధినపడి పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యలు మన మెడచుట్టూ చాలా ఉన్నాయి మరి!

30 comments:

karthik said...

>>కానీ మీ ముందుతరాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కొద్దిగా ఆలోచించి సంఘటితంగా అసలు సమస్యలపై పోరాడమని మనవి.

శభాష్ సోదరా!!

Sravya V said...

హ్మ్ !

KumarN said...

నాకు ఈ సమస్య గురించి ఏమీ తెలీదు కాని, మీ పోస్ట్ ల రీడబిలిటీ పెరిగేలా మీరు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు అనే దానికి ఈ పోస్టు చక్కని ఉదాహరణ.

Anonymous said...

ఆ రోజుల్లొ ఒక ప్రముఖ పత్రిక మొదటి రోజు అమేరికాలో అతను ఇలా ప్రవర్తించాడు అని రాశాడు. పక్క రోజే ఆయన ప్రవర్తన సంగతి పక్కన బెట్టి ఆయనకి ఇన్ని భూములు ఇక్కడ ఉంది. సరస్వతి విద్యాపీఠానికి అన్ని భూములు అవసరమా? భుములనేవి బేజవాడా వారికి మాత్రం ఉండాలి. మేమైతే ఎదైనా ఫిల్మ్ స్టూడియోకడాతాము. అవధానం , తెలుగు సాహిత్యం నేర్పించే విద్యాపీఠాలకెందుకు అని తెగ బాధ పడిపోయాడనుకో. ఇక ఇమేజ్ఞి డామేజి చేసేదాంట్లొ ఆ పేపర్ పి. హెచ్. డి. చేసింది కదా . హైదారాబాద్లో నాగ పి శర్మ తెలిసినవారిని ఆయన గురించి ఎమీ అడగకుండా, స్వంత ఊరిలో ఆయన ఏమీ ఉద్దెరించ లేదు. ఆయన చిన్నపుడు పెరిగిన పల్లేలో గుడ్డలు ఇస్త్రి చేసెవాడు ఆయన గురించి ఏమన్నాడు? ఇంట్లొ పాలేరు పని చేసేవారు ఆయన గురించి ఏమన్నారు అని రాయటం మొదలుపెట్టాడు. తెలుగు పద్యాలు, సాహిత్యం చదువుకొన్నవారిలో ఉత్సాహం వున్న వారికి నచ్చుతాయి కాని. ఇస్త్రి చేసుకొనే వారు, పాలేరులు ఆయన గురించి ఎమీ చెప్పగలరు? ఎప్పుడో చిన్నపుడు చిల్లరలేక అర్థ రుపాయిని మళ్ళీ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆయనకి ఇప్పుడు ఇంత డబ్బు వచ్చింది కదా! నా అర్థ రూపాయ ఇవ్వాలా అక్కర్లేదా ? ఆయన నాకు ఇంకా ఇవ్వలేదు.కనుక నేను ఆయని మంచి వాడు అని ఎలఅంటాను అని వారేదో చెప్పటం. మన నకీలి కణికుడు (శ్రీ 420)వాటిని ప్రముఖంగా రాసి ప్రచూరించటం.

ఇంతకీ నాగ పి. శర్మ కేస్ ఎమైంది? ఆ తరువాత ఎక్కడా దాని గురించే వినలేదు. ఎవరైనా అమేరికా బ్రదరన్నలు దీనిపై కొంచెం వెలుగేయవలసినదిగా కొరుతున్నాను. ఈ గొడవ అవుడేటెడ్ అయిపోయిన మీరిచ్చే అప్ డేట్ వలన చాలా విషయాలు తెలుస్తాయి.

Jayaho

Anonymous said...

తెలుగు బ్రహ్మణులలో పట్టుమని ఒక పది మంది వ్యాపారం చేసేవారు కూడా లేరు. ఉద్యోగం చెస్తే వచ్చిన జీతం తప్ప అంతకు మించి వీరి దగ్గర వున్న ఆస్థిపాస్తులు అంటూ ఎమీ లేవు. వీటీ తో పాటుగా సమాజం లో చుట్టుపక్కల జరిగే వాటి గురించి కనీస జ్ణానం చదువుకున్న వారిలో 98% మందికి శూన్యం. పగలు రాత్రి ఉద్యోగాన్ని కష్టపడి పనిచేసి, అతి నిజాయితితో వాళ్ళ ఒళ్ళున్ను గుల్ల చేసుకొని పదవి విరమణ తరువాత రోగాలపాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూంటారు. అలాని మిగతావారు అంత కష్టపడరా అంటె వారు కూడా కష్ట్టపడతారు అది వారి స్వంత వ్యాపారమైతేనే, అందులో కొంత స్వంత లాభం ఉంటేనే.
ఇక తె.బ్రా. కి సమాజం లో మార్పులు ఇంట్లొ ఎవరికైనా జబ్బు చేసినపుడు అర్థం కావటం మొదలౌతుంది. ఇప్పుడంతా ప్రపంచం మారిపోయింది ఆసుపత్రి లో చిన్న జబ్బుకు లక్షల్లో గుంజుకొంట్టున్నారు అని వాపోతూంటారు. అంతవరకు వీరు సమాజం లో ఎవరితో పని లేకుండా పెద్ద నిజాయితి వాళ్ళమనుకొంట్టు జీవితం బావిలొ కప్పల గడిపేస్తూ ఉంటారు. వీరికి డబ్బుతో ఇంటరక్షన్ తక్కువ. వీరికి పేళ్ళిలప్పుడు ఎలాగు కట్నాల గొడవలు లేవు. ఆ పెళ్ళనేది ఐపొతే వీరికి మళ్ళి ఇంకొతరంవరకు (వారి కొడుకో/కూతురో పెళ్ళి ఈడు వచ్చేవరకు )సమాజం తో పనిలేదు. ఎదైనా ఒక తాతల తండృల కాలం నాటి ఇల్లు వుంటె ఒక చిన్న ఉద్యోగం చేసుకొంట్టు, పెద్ద పెద్ద కలలు లేకుండా ఎదో వంకాయని కుంపటి మీద కాల్చుకొని పెరుగు పచ్చడి ,చారు, ఆవు పులుసు చేసుకొని తిని తమ కలను నెరవేర్చుకొన్నాం అని తృప్తిగా జీవిస్తూంటారు. వీరి పాత ఇల్లకి ప్రస్తుత కాలం లో ఎదో ఒక మార్కేట్ రేట్ ఉనంట్టుంది అది చూసి ఇతర వర్గాల వారు అబ్బో వీరిదగ్గరా బాగానే డబ్బులు ఉన్నాయి వీరేమి పేదవారు కాదు అని అనుకొంట్టూ ఉంటారు.
--------------------------------
ఈ రోజు పేపర్లో పోటోలు చూసి నాకు వీరిదగ్గర కొట్టుకోవటానికి కూడా ఇంకా శక్తి ఉందా అని ఆశ్చర్యమేసింది! అందరు వేల , లక్షల కోట్లు భోజనం చేసి ఎక్కడివారు అక్కడ గప్ చుప్ గా ఉంటె, వీరు హైదరాబాద్ నగరపుర వీధులో నాలుగు కూడళ్ల మధ్యా చేరి వెయ్యి రూపాయలు తీసుకొని మేము చేసిన పూజను ఆక్షేపిస్తావా? అని బాహా బాహి కొట్టున్నారంటే వీరికి "సున్నా" లోక జ్ణానం చూసి కళ్ళ లోనుంచి ఆశ్రువులు, ఆనంద భాష్పాలు రెండూ ఒకేసమయంలో వచ్చాయి.

Srinivas

karthik said...

http://www.eenadu.net/story.asp?qry1=21&reccount=28

Anonymous said...

/ఈ లెక్కన చూస్తే సదరు శ్రీ క.చ.రా గారు అన్నదాంట్లో తప్పులేదు./

ఇది నాకు నచ్చలేదు.
ఆ మొరిగింది, ఆదిశేషునిడాగో, మెంటల్లె చాలెంజ్డ్ గ్రామసిహమో తెలుసుకోకుండా ఈదృష్టిలో/ఆదృష్టిలో అని అనేసుకోవడమే?! అలాంటి నీతిహీన రాజకీయనాయకులు ఏ సామాజిక వర్గాన్ని ప్రాంతీయ దృష్టితో విడదీయాలని ప్రయత్నించినా అది గర్హనీయం. ఇక్కడ చట్టాం కళ్ళులేని కబోదేకాదు, మూగది, చెవిటిది, అవిటిది, స్పర్శజ్ఞానం కూడాలేని జీవచ్చవం కూడా. లేదంటే ఇలా బజారుమనుషులు(ప్రజాషేవలో వున్న వారు), నడి బజారులో కారు కూతలు కూస్తున్నా 8వ చాప్టర్లో ఏముందో అత్యుత్సాహంగా తొంగి చూసి, మూతులు వాయింపచేసుకున్న జ్యుడిషియల్ ఆక్టివిజం, సుమోటోగా ఇలాంటి కేసులు ఎందుకు తీసుకోదో!
---

మీకు నచ్చనివి ఎడిట్/డిలీట్ చేసుకోండి, అభ్యంతరం లేదు. అసలే, తోచిన నిజాలు అంటే, 'అన్నారో' అనేడ్చే ఏడుపుగొట్టు బ్లాగర్లు( డిస్‌క్లైమరు: నేను తెలగాన్లను అనడం లేదు), ప్రొఫైలేని కామెంట్లు ప్రచురించబడవు అనే చాదస్తపు బ్లాగర్లు(డిస్‌క్లైమరు: టోపీలు వున్న వాళ్ళు, పిట్ట బొమ్మ పెట్టుకున్న వారు కాదు)ఎక్కువౌతున్నారీమధ్య! :)))) :P

అందుకే, నాకు 'దమ్ము' లేక,నా ఐడి కూడా వాడటం లేదు, ఎనీ ప్రాబ్లం? ఎనీ పైన్?

cheekati said...

Good Post.

'కచరా' - పేరు బాగుంది. :)

రాజేష్ జి said...

ముందుగా టపాకి స్పందించినవారందరికీ ధన్యవాదాలు.
నిన్న, ఈరోజు దూరప్రాంతంలో శిక్షణాతరగతులు జరుగుతుండడం వల్ల సకాల౦లో బదులు స్పందిచలేకపోయాను. అలాగే పిచ్చివ్యాఖ్యలు రాకుండా వ్యాఖ్యప్రచురణనియత్రణ పెట్టాల్సివచ్చింది. మీకు దీనివలన ఏవైనా అసౌకర్యం కలిగిన క్షంతవ్యుడను :)

మీరు చర్చించుకోవడానికి ఇబ్బంది లేకుండా వ్యాఖ్యప్రచురణ నియత్రణ ఇప్పుడు తీసివేసా! దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.

ఇప్పుడు మీ వ్యాఖ్యలకి బదులు లేదా నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటా :).

రాజేష్ జి said...

$karthik గారు

బ్లాగుకి స్వాగతం :).

సమస్యను అర్ధం చేసుకుని సావధానంగా స్పందించినందులకు కృతజ్ఞతలు.

మీరు ఇచ్చిన గొలుసు మధ్యాహ్నం శిక్షణాతరగతిలో ఉండగా చూసా..ఆహ్.హ్మ్..కొద్దిగా బాధ..అనుకున్నదంతా జరిగిపోయింది. ఇద౦తా చూస్తుంటే ఆవుపై న్యాయస్థానానికి ఎక్కిన వాది కొమ్ములు, ప్రతివాది తోకను పట్టుకుంటే మధ్య వకీలు పొదుగు పిండుకున్నట్లుగా ఉంది. ఈ వకీలు పాత్ర పోషించడానికి వందిమాధిగలు(ఆ గొలుసుయాజమాని తరహా!) అప్పుడే సిద్దమైపోయారు. నమ్మొద్దు అయ్యలూ, దయచేసి!.

రాజేష్ జి said...

$Sravya Vattikuti గారు

హ్మ్.. మీరు "హ్మ్!" అన్నారు అంటే మీదీ నా బాధే అనుకుంటున్నా మరి :). అర్థం ఏవైనప్పటికీ వచ్చి స్పంది౦చిన౦దులకు ధన్యవాదాలు :)

$KumarN గారు

#..సమస్య..తెలీదు

హ్మ్.. మీకు ఇప్పటికే సమస్య అరదం అయ్యివుటు౦దని అనుకుంటున్నా. మరింత సమాచారం కోసం కార్తీక్ గారిచ్చిన గొలుసు చూడగలరు.

#..పోస్ట్ ల రీడబిలిటీ..
అరమరికలులేని స్వచ్చమైన మీ అభిమానానికి బహుధా కృతజ్ఞతలు. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ...

***
పైన కార్తీక్ గారీకి బదులిచ్చిన వ్యాఖ్యలో "వందిమాధిగలు" అన్నది "వందిమాగధులు" అని చదువుకోవలిసిందని మనవి. ముద్రణారాక్షసానికి మన్నించగలరు. :)

రాజేష్ జి said...

$Jayaho గారు

యధాప్రకారం మీరు సమస్యను అర్థం చేసుకుని చాలా అర్థవంతమైన వ్యాఖ్య రాశారు. అందుకు బహుధా ధన్యవాదాలు.

#..ప్రముఖ పత్రిక మొదటి రోజు..పక్క రోజే..ప్రవర్తన సంగతి ..భూములు..సరస్వతి విద్యాపీఠానికి అన్ని భూములు అవసరమా?

నేనూ చూసాను. జరిగిన విషయానికి అవసరమైనదానికంటే ఎక్కువగా స్పందించి, ప్రవర్తించి తమ చిత్తం అనైతికం అని మరోమారు చాటుకున్నారు సదరు పత్రికవారు.

#భుములనేవి బేజవాడా ..ఫిల్మ్ స్టూడియోకడాతాము. అవధానం , తెలుగు సాహిత్యం నేర్పించే విద్యాపీఠాలకెందుకు అని తెగ బాధ పడిపోయాడనుకో.

చక్కగా చెప్పారు. నిజమే, ఫిలిం స్టూడియోలు అప్పనంగా వచ్చిన వందల ఎకరాల్లో కట్టి శృ౦గారయాత్రల పేరుతో సామాజికసేవ చేస్తున్నారు కదా, బాధపడాల్సిందే మరి భూములు పక్కోడికి వెళితే :)

#..ఇమేజ్ఞి డామేజి..పేపర్ పి. హెచ్. డి....
అవునవును.. ఖచ్చితంగా క్షుద్రశాలనుంచి అనైతికతలో పి.హెచ్.డి చేసి ఉంటారు.

#..తెలిసినవారిని..అడగకుండా..గుడ్డలు ఇస్త్రి..పాలేరు..ఏమన్నారు

కోళ్ళను తింటావా అనడిగితే లేదు బొచ్చును పారేస్తాను అన్నరీతిలో విలువలు,వలువలు లేకుండా చిత్తమైన రీతిలో సంపాదకీయాలు, వార్తలు రాసేవారు తమ ఊరికోసం ఏం పాటుపడ్డాడటా? ఆ.. "తనవారి" కోసం అయితే కష్టపడ్డాడు.. ఒప్పుకోవాల్సిందే ;). తనకు కావలసిన సమాధానం రాబట్టం కోసం ఎవరినైనా ఉంటే అడుగుతాడు లేకపోతే సృష్టిస్తాడు.

#..చిల్లరలేక అర్థ రుపాయిని..డబ్బు వచ్చింది..అర్థ రూపాయ ..నకీలి కణికుడు (శ్రీ 420)...

:)) బాగా చెప్పారు... అయినా గాడిదలతో సేద్యం చేస్తూ దాని కాలి తన్నులకు దడిస్తే ఎలా అన్నట్లు అప్పట్లో ఆంధ్రప్రజలు ఇంకో దారిలేక పత్రికపెత్తనమిచ్చి, గుడ్డిగానమ్మి అనుభవించారు.

శర్మ గారి సంఘటన రోజున మాదాకవళాల గగ్గోలు మీకు చాలా బాగా గుర్తుంది. నేనూ ఆ రోజు గమనించా గానీ టపా రాసేప్పుడు ఎందుకో గుర్తుకు రాలేదు. ఏవైనా కొందరికి తొత్తులుగా వ్యవహరించే ఈ ప్రచారమిధ్యమాల కబోదితత్వం మరోసారి బయటపెట్టే వ్యాఖ్యలు చేసినందుకు ధన్యవాదాలు.


#ఇంతకీ..శర్మ కేస్..అమేరికా బ్రదరన్నలు..వెలుగే..ఈ గొడవ అవుడేటెడ్ అయిపోయిన మీరిచ్చే అప్ డేట్ వలన చాలా విషయాలు తెలుస్తాయి.

మంచిగా అడిగారు.. ఆ తర్వాత ఏవైంది అన్న సమాచారం నా దగ్గర కూడా లేదు. శర్మ గారేమో అది చవితి-చంద్రుడు ప్రభావం అని కర్మ సిద్దాంతం చెబుతూ గట్టిగా పోరాడలేదు. అక్కడి వారెవరైనా సమాచారం ఉంటే పంచుకోగలరు.

రాజేష్ జి said...

$Srinivas గారు

#..మంది వ్యాపారం ..ఉద్యోగం..కనీస జ్ణానం..98%..శూన్యం...

వినడానికి కొద్దిగా కటువుగా ఉన్నా ఆలోచనాత్మక వాస్తవాన్ని కళ్ళముందుంచారు. ప్రస్తుత పరిస్థితులలో కూడా వాస్తవాన్ని చూడలేని/గ్రహించలేని వారు ఖచ్చితంగా కబోదులే!. అయినా గొప్పకోసమో డంబం కోసమో దాచుకోవడానికి ఇవేమైనా తరతారాలనుంచి సంక్రమించిన అపూర్వనిధులా? సామాజికస్పృహ లేకుండా ఎంత సంపాదించినా ఊగిఊగి ఉయ్యాల ఉన్నచోటికే వచ్చినట్లు తమ అవివేకంతో తమ ముందుతరాల భవిష్యత్తుని ఎదుగుబొదుగు లేకుండా చేస్తున్నారు. కనీస౦ ఈతరం, ముందు తరాలు సామాజిక సంఘటిత అవసరాన్ని గ్రహి౦చి చదువుతో పాటు సమాజ పరిస్థితులను అధ్యయనం చేసుకుంటూపోతే అదే పదివేలు.

#..వీరిదగ్గర కొట్టుకోవటానికి..శక్తి ఉందా.. వేల , లక్షల కోట్లు..గప్ చుప్ గా..వెయ్యి రూపాయలు..బాహా బాహి.. "సున్నా" లోక జ్ణానం..ఆశ్రువులు, ఆనంద భాష్పాలు..
హ్మ్.. మీకు వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది. ఏంటో నాకు ఈ పరిస్థితిలో ఏ౦ రాయాలో అర్థం కావట్లేదు... నాకు అశ్రువులే...! పెద్దవారే ఇలా చేస్తే....!!!

యువతకు వాస్తవాన్ని తెలుపుతూ వారి భవిష్యత్తుకు మార్గదర్శకమయ్యే విధంగా వ్యాఖ్యానించినందులకు శతధాకృతజ్ఞతలు.

రాజేష్ జి said...
This comment has been removed by the author.
రాజేష్ జి said...
This comment has been removed by the author.
రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

మీ వ్యాఖ్య చూసి మీరెవరో ఊహించగలను. సరే దమ్ము, దస్క౦ అంటున్నారు.. నే బయట పెట్టోచ్చో లేదో తెలియదు..అట్లే నా ఊహ సరి కాకపొతే :) అందుకే నాకో మెయిల్ అయినా పెట్తోచ్చుకదా మరి :)

#ఇది నాకు నచ్చలేదు.
హ్మ్.. సదరు క.చ.రా గారు అన్నది సరి అనలేదు. అయితే దానిని నేటి పరిస్థితులకి అనుగుణంగా ఉన్న వాస్తవాన్ని వివరిస్తూ టపాను రాసా. అలాగే చివరల్లో క.చ.రా గారిని ఈ విషయ౦ మీద ఏ విధంగా నిలదీయాలో కూడా చెప్పా.

#ఆ మొరిగింది, ఆదిశేషునిడాగో, మెంటల్లె చాలెంజ్డ్ గ్రామసిహమో తెలుసుకోకుండా ఈదృష్టిలో/ఆదృష్టిలో అని అనేసుకోవడమే?!
హ్మ్..పైన ఇచ్చిన స.ధా మీకు సంతృప్తికలిగిస్తు౦దని భావిస్తా. :)

#..ఏ సామాజిక వర్గాన్ని ప్రాంతీయ దృష్టితో విడదీయాలని..చట్టాం ..స్పర్శజ్ఞానం కూడాలేని జీవచ్చవం..బజారుమనుషులు(ప్రజాషేవలో వున్న వారు), నడి బజారులో కారు కూతలు కూస్తున్నా 8వ చాప్టర్లో ఏముందో అత్యుత్సాహంగా తొంగి చూసి, మూతులు వాయింపచేసుకున్న జ్యుడిషియల్ ఆక్టివిజం, సుమోటోగా ఇలాంటి కేసులు ఎందుకు తీసుకోదో!

చక్కగా అడిగారు.. కడిగారు. అమ్మైనా అడిగితే గానీ అన్నం పెట్టదు అన్న నానుడి ఇక్కడ సుమోటోకి అడ్డువచ్చిందేమో మరి లేక సుమోటో కూడా కొందరిళ్ళ చుట్టమై కూర్చుందో!

#..నచ్చనివి ఎడిట్/డిలీట్ చేసుకోండి...తోచిన నిజాలు అంటే, 'అన్నారో' అనేడ్చే..ప్రొఫైలేని కామెంట్లు..చాదస్తపు బ్లాగర్లు..

;) మీ వ్యాఖ్యలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలానే మీరు ఉదాహరించినా బ్లాగర్ల బాపతూ కాదు. వ్యాఖ్యలో తర్కం ఉన్నంతవరకూ వ్యాఖ్య చేసింది ఎవరైనా ఈ బ్లాగు ప్రచురిస్తుంది. అందువల్ల నిరభ్యరంతంగా మీ పేరుతో వ్యాఖ్య రాయండి. దానివల్ల మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం కలిగించిన వారవుతారు.

#..ఎనీ ప్రాబ్లం? ఎనీ పైన్?..
అస్సలు ఏమీ లేదు. :)) చక్కగా మీ అభిప్రాయ౦ తెలియజేస్తూఉండండి.

రాజేష్ జి said...

$cheekati గారు

బ్లాగుకి స్వాగతం.

హ్మ్.. మీకు ఏమి నచ్చిందో తెలీదు :). సరే, ఏవైనా వచ్చి వ్యాఖ్యానించినందులకు ధన్యవాదాలు.

Anonymous said...

మంచి టపా రాజేష్.

అటు సమైక్యవాదులు ఇటు వేర్పాటువాదుల చలిమంటలకు బ్రాహ్మణులు తాటాకుల్లా మారడం బాధాకర౦!


సుదర్శన్ రెడ్డి

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

రాజేష్,

పైన సుదర్శన్ గారు వ్యాఖ్యానించినట్లు ఈ టపా ఒక నెగటివ్ మాటని పాజిటివ్ గా సరికొత్త కోణంలో వివరిస్తూ ఇలాంటి అవసరమైన సమయంలో కావాల్సిన ఆశావహదృక్పథం, వాస్తవికదృక్కోణం మరియు అత్యవసర పోరాట ఆవశ్యకతను సూటిగా చెప్పింది.

పైన చలిమంటల వ్యాఖ్యకి, పైన జయహోగారు మరియు శ్రీనివాస్ గార్ల వ్యాఖ్యలకి నా సంపూర్ణ మద్దతు.

అలాగే నీకు ధన్యవాదాలు. ఈ ధన్యవాదాలు ఎందుకో నీకు అర్థం అయ్యుంటుందని అనుకుంటున్నా :P.


Rajeev Reddy

Anonymous said...

/మీ వ్యాఖ్య చూసి మీరెవరో ఊహించగలను./

అయ్య బాబోయ్! కనిపెట్టేశారేటి? నేను అదే అనుకున్నా, కాని కచరాలు పన్నిన పన్నాగమేమో అనిపిస్తోందండి, ఆయ్!
----------

నాకు కచరా స్టేట్మెంట్లో నచ్చిందేమంటే... ఈడికి యజ్ఞఫలం ఎక్కడ దక్కుతుందో అని నాకు తెలిసినా, ఏదో ఓ మూల నసగా వుండింది. అంతా విష్ణుమాయ! అటు యజ్ఞంఛేసి లేచాడో లేదో, చేయించినోళ్ళని వీడి కంపునోటితో బూతులు తిట్టేలా వీణి నోటిమీద రాశాడు, ఆ బెమ్మదేవుడు.

పైగా, ఆయనకు తత్కాల్ స్కీములో ఫ్రీగా, యాగం చేసినరోజే పిండ ప్రదానం ఫలంగా దక్కించుకున్నాడట! వారెవ్వా! :D

'తపము ఫలించిన శుభవేళా..' అని అప్రయత్నంగా హమ్ము కున్నా.. :)))))

Rao S Lakkaraju said...

ప్రభుత్వాన్ని సత్వరమే స్పంది౦చేట్లుగా కదిలించే సామాజిక బలం లేకపోవడమే.
-------
అది వచ్చేదాకా ప్రయత్నించాలి. కానీ ఎలా? అగ్రకులాలు అని ముద్రించి వదిలేసారు. అప్పటిదాకా వారికి వారు సహాయం చేసికోవటమే. బ్రాహ్మణసంఘం అంటే మళ్ళా కులతత్వం అంటారు వెయ్యేళ్ళ క్రిందట మమ్మల్ని అణిచారు అంటారు. దీనికేమన్నా పరిష్కారం ఉందా రాజేష్?

Anonymous said...

లక్కరాజు గారు

మంచి ప్రశ్న వేసారు. అయితే ఇలాంటి ఇంచుమించు ప్రశ్నకు సమాధానంగా నేను "బ్రాహ్మణ విద్వేషం ఎందుకు?" అనే టపాలో పదేపదే వివరించా. ఆ రోజు నేను వాస్తవాలని వివరిస్తు౦టే మధ్యలో కృష్ణ అనే ఆయన లాజిక్ లేకుండా వితండవాదంతో వ్యాఖ్యానిస్తుంటే రాజేష్ మరియు మీరు మాత్రమే నాకు మద్దతు ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు మీరు నన్ను అడగకపోయినా నాకున్న సామాజిక పరిజ్ఞానంతో రిప్లయ్ ఇస్తున్నాను.

ఆరోజు కానీ, ఈ రోజు కానీ పనిగట్టుకు వచ్చి మరీ వ్యాఖ్యానించాల్సిన అవసరం కానీ, లాభ౦కానీ నాకు లేదు. కేవలం ఇది మీ శ్రేయోభిలాషిగా, మీ మంచి కోసం మాత్రమే చెబుతున్నా.

మీరు అడిగిన పరిష్కారానికి ఒకే ఒక్క సమాధానం ఎవరెన్ని అన్నా, ఎన్ని కుక్కలు మొరిగినా మీరంతా ముందు సంఘటితం అవ్వడమే. మీ భావితరాలకి మంచిభవిష్యత్తు ఇవ్వాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు..కాలానుగుణంగా మారుతూ సామాజిక స్పృహ ప్రకారం వెడెంట్ ళ్ళు నేర్పు కూడా కావాలి.


ఈ మధ్య పత్రికలలో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ గురించి ప్రస్తావించి నేను చెప్పాలనుకుంది సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తా.

గురజాడ, కందుకూరి, చలం తదితర నవయుగవైతాళికులు, సంఘసంస్కర్తలకి కులం అంటగట్టి వారు సమాజానికి చేసిందేమీ లేదు.. ఏదైనా చేసింది అంటే వాళ్ళ కులానికే(బ్రాహ్మణ) అని ఆ మహానుభావులు రాసిన రచనలకి ఈకలు పీకుతున్నారు అనడం కనా స్వర్గస్తులైనవారిని ఏకుతున్నారు అని అనడం సబబు. ఈ పోకడలు నన్నయ్య..కవిత్రయాన్ని విమర్సిన్చండంతో మొదలై ప్రస్తుతానికి ఇక్కడ ఆగింది..ఈ చీడపట్టిన వాదాన్ని ఇంక ఎవరికి అంటిస్తారో. మీరు మరోవైపు చూస్తే కేవలం తన కుల అభ్యున్నతి కోసం మరొక కులాన్ని హీనంగా నీచపురాతలు రాసి మరీ అణగదొక్కిన త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు, సంఘసంస్కర్త, హేతువాది ఎలా అయ్యాడు? ట్యాంక్బండ్ ఇతరమహానీయులతో సమానంగా విగ్రహం పెట్టడానికి సమాజానికి ఏం మంచి చేసాడు? మొన్న తెనాలిలో ఆయన విగ్రహాన్ని హేతువాదులు ప్రతిష్టించారు. అంటే తనకులంకోసం పోరాడినా పర్లేదు..మతాన్ని విమర్శిస్తే చాలు.. హేతువాది అవుతారా?

పైన చెప్పిన రెండు సంఘటనలు చూడండి. మంచి చేసినవారు మట్టికొట్టుకు పోతుంటే ఆంద్రనాట కులగజ్జిని రగిల్చినాయనకి రాజసం ఇస్తున్నారు. మరి మీరు చెప్పినట్లు కులతత్వం అని అరిచేవారికి త్రిపురనేని, ఆయనకి మద్దతుఇచ్చేవారిలో కులతత్వభావనలు కనపడలేదా? కనపడినా ఏమీ పీకలేకపోయారా?

ఎందుకు పీకలేకపోయారో, అక్కడ ఏ బలం ఈ పీకేవారిని ఆపిందో సునిశితంగా ఒక్కసారి ఆలోచించండి.
అగ్రముద్రలు, కుక్కల మొరుగుడు, నక్కల ఊళలు, తమ పొట్ట నిండిన తర్వాత చెప్పే ఆదర్శాలు ఎప్పుడూ ఉండేవే. ఈ అరుపులకి వీసుమంత విలువ కూడా ఇవ్వకుండా మీ భవిష్యత్తు కార్యాచరణకు నడుం కట్టండి..సంఘటితం అవ్వండి..కనీసం మీ తర్వాతి తరాలకోసమైనా. ఒక్కసారి సంఘటితమంటూ జరిగితే ఆ వెయ్యేళ్ళ అణుచుడు విమర్శకులు నోరుమూసుకుంటారు లేదా వాస్తవం తెలుసుకుని అభిమానంగా మెలుగుతారు. అంతవరకూ మీరు ఎన్ని చెప్పినా వారు(దళితులు)వినరు. పైన రాజేష్ చెప్పిన ఆవు సామెత ప్రకారం మీరు, వారు ఆవుకు చెరోవైపున ఉండి తిట్టుకుంటూ ఉంటే దాన్ని మరింత రాజేసి పొదుగు పితుక్కునే వంచక వకీల్లు పెక్కుమంది.

ఏదో నాకు ఉన్న సామాజిక స్పృహతో కొద్దిగా లెంగ్త్ ఎక్కువైనా జరుగుతున్న వాస్తవాల్ని నా అభిప్రాయంగా పంచుకున్నా. మీకు సరైన పరిష్కారమార్గం చూపించా అని అనుకుంటున్నా.. మీ అభిప్రాయం ఇక్కడైనా లేక మెయిలుకు గానీ తెలియజేయగలరు.


Rajeev Reddy

Anonymous said...

లక్కరాజు గారు

నా మెయిల్ ఐడి ఇక్కడ

reddyrajeev@yahoo.com

ధన్యవాదాలు.

Rajeev Reddy

Rao S Lakkaraju said...

Rajeev we will do something.

రాజేష్ జి said...

$సుదర్శన్ గారు

బ్లాగుకి స్వాగతం.

హ్మ్.. ధన్యవాదాలు బాధని పంచుకున్నందుకు.

రాజేష్ జి said...

$Snkr గోరు

#...కనిపెట్టేశారేటి?..ఆయ్..

:) ఏదో కొంచెం కొంచెంగా కనిపెట్టా! అవినా రాసేది నాలుగు ముక్కలు అయినా పదపదంలో వాస్తావాన్ని, నిర్మొహమాట అభిప్రాయాన్ని అంతే మోతాదులో చమత్కారాన్ని అవసరమైతే తల౦టునీ జోడించే మీ వ్యాఖ్యని నే గుర్తుపట్టకపోవడమా :)

#...తత్కాల్ స్కీములో ఫ్రీగా..తపము ఫలించిన శుభవేళా..

ఏ౦త బాగా వ్యాఖ్యానిస్తారండీ మీరు. మీనుంచి నేర్చుకోవాలి :)

రాజేష్ జి said...

$Rajeev Reddy గారు

ముందుగా ధన్యవాదాలు సవివరమైన వ్యాఖ్యానం చేసినందులకు. మీ వ్యాఖ్యల గురించి నే మాట్లాడబోయేముందు.. కుశల ప్రశ్నలు :)

ఎన్నిరోజులకి ...ఎన్నిరోజులకి..మళ్ళీ కనిపించారు :) ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికైనా విహారయాత్రలకి వెళ్ళారా? :)

#.. నెగటివ్..ఆశావహదృక్పథం, వాస్తవికదృక్కోణం ..అత్యవసర పోరాట ఆవశ్యకతను సూటిగా చెప్పింది

హ్మ్.. తప్పదు కదండీ! కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు :(

మీ ధన్యవాదాలు ఎందుకో అర్థం అయ్యాయి..అది కృతజ్ఞత చూపించే సమయం.. అందుకని మీకు ప్రతిగా శతధన్యవాదాలు.. అలాగే మీ నిస్వార్థ మద్దతుకి ప్రణామాలు.

రాజేష్ జి said...

$Rao S Lakkaraju గారు

ముందుగా ధన్యవాదాలు వచ్చి, చదివి వ్యాఖ్యానించినందులకు!

#..దీనికేమన్నా పరిష్కారం ఉందా..

మీ ప్రశ్నకి పైన సూటిగా జవాబు ఇచ్చిన రాజీవ్ గారి సమాధానంతో ఏమాత్రం ఆలోచించకుండా నేనూ ఏకీభావిస్తాను. వారి సమాధానానికి వెనువెంబడే వచ్చిన మీ స్పందన చూసి మీరూ ఏకీభవించారని భావిస్తున్నాను. సంఘంలో సంఘటితంగా ఉండడమే సమస్యలకి పరిష్కారం అనేది సామాన్య ప్రాధమిక సూత్రం మరి :)

రాజేష్ జి said...

$Rajeev Reddy గారు

సమకాలీన వాస్తవాలను విశ్లేషిస్తూ, విమర్శనాత్మక ధోరణిలో ఆలోచనాసరళి మారాలంటూ సూటిగా చేసిన మీ వ్యాఖ్య నాకు ఏంతో విలువైనది, వెలకట్టలేనిది. మీ విలువైన సమయాన్ని కేటాయించి సవివిరమైన వ్యాఖ్య రాసిన మీకు మరోమారు శతధా ధన్యవాదాలు.

మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా మీరు మా శ్రేయాభిలాషి అని నేను గట్టిగా నమ్ముతా. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

మీ వ్యాఖ్యలో నాకు బాగా నచ్చిన బంగారు తునకలు

#మీ భావితరాలకి మంచిభవిష్యత్తు ఇవ్వాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు..కాలానుగుణంగా మారుతూ సామాజిక స్పృహ ప్రకారం వెడెంట్ ళ్ళు నేర్పు కూడా కావాలి.

చక్కగా చెప్పారు. చివరలో "వెడెంట్ ళ్ళు" అరదం కాలేదు :)..అయితే ముందు వ్యాఖ్యను బట్టి "..మారేగుణం, నేర్పు కూడా.." అని అన్వయిన్చుకున్నా. మీ ఉద్దేశ్యం వేరేదయితే తెలియజేయగలరు.

#అగ్రముద్రలు, కుక్కల మొరుగుడు, నక్కల ఊళలు, తమ పొట్ట నిండిన తర్వాత చెప్పే ఆదర్శాలు ఎప్పుడూ ఉండేవే... (ఈ)వీసుమంత విలువ కూడా ఇవ్వకుండా...

ఫటాఫట్.. ధనాధన్ అన్నవిధంగా చెప్పారు. నెసర్లు :)

మీకు ఉన్న సామాజిక స్పృహ, విజ్ఞానం అపారం. మీరు మున్ముందు కూడా మీ అనుభవసారాన్ని ఇదేవిధంగా ఇక్కడ పంచుకోగలరని ఆశిస్తున్నా. :)

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers