![]() |
@సాక్షి |
ఓ సనాతనసారధి, సామాజికసేవకుని నిర్యాణం..మహాభినిష్ర్కమణ.
ఓ బాబా! నీవు నడిచి చూపిన దారిలో...
ప్రేమ, సేవా,కరుణా మార్గాలు పంచిన పూజ్యనీయమైన వ్యక్తిగా పపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హృదయాలలో కొలువై, తటస్తుల అభిమానాన్ని సైతం చూరగొన్న ఓ సత్యసాయి బాబా, నీ నిర్యాణం మానవలోకానికి తీరనిలోటు. బాబా, ఇక నీవు లేవు అన్న చేదు నిజాన్ని మా ఇంటిల్లిపాది జీర్ణించుకోలేకపోతున్నా౦. అయితే అదేసమయంలో నీ బోధనలు ఆచరించడమే నీకు సరైన నివాళిగా భావించే మేము నీవు భౌతికంగా మమ్ము వదిలివెళ్లినప్పటికీ నీవు పంచిచూపిన ప్రేమ, కరుణ, సేవా మార్గాలను మేము వదలకుండా ఆచరించినంతవరకు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావన్నది వర్తమాన వాస్తవం. నీతివంత౦, అర్ధవంత౦, ప్రేమమయమైన జీవితాన్ని ఎలాగడపాలో మా కళ్ళముందు ఆచరించిచూపిన చూపిన మార్గదర్శకుడివి, మానవత్వం మూర్తీభవించిన మహానుభావుడివి. మమ్మల్నదరినీ ప్రేమ స్వరూపులుగా మీరు భావించడం, మేము తోటిమానవులని ఏవిధంగా ప్రేమించాలో చెప్పటానికి దార్శనికం. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అని నీ ఆప్యాయతా ప్రవచనాలతో మాకు ఈ జీవిత పరమార్థాన్ని బోధించిన ప్రత్యక్ష దైవం నీవు. ఈ సందర్భంగా నీవు చెప్పిన సూర్తిమంతంపు ప్రేమైక ప్రవచనాలు..ఉద్బోదనలు కొన్ని..
౧. మానవపశుపక్ష్యాదులకి ప్రేమను పంచి, అవసరమైనవారికి సేవచేయడమే నీ జీవితపరమార్థం.
౨. ప్రేమే దైవం- దైవమే ప్రేమ. ప్రేమలోనే జీవించు.
౩. నేను దేవుడిని, నువ్వు దేవుడివే. నాలో దైవత్వాన్ని గుర్తించాను నీలో దేవుణ్ని నీవు మేలుకోల్పలేకపోతున్నావు.
౪. భగవంతుడు సుఖాలే అందిస్తుంటాడని, కష్టాలు మనం కొనితెచ్చుకున్నవి.
౫. కష్టమనేది అనేది లేకుండా సుఖం రాదు.
౬. దేహంలో సంచరించే జీవత్వమే దైవత్వం
౭ .హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించడమే నిజమైన తపస్సు
ఆ విధమైన మృదుమధుర ఆధ్మాతిక బోధనలు, ప్రేమ సందేశాలు, శాంతి వచనాలతో ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన నీవు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటావు. కేవలం ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాక, ఆర్త, దీనజనోద్దరణకు శ్రీకారం చుట్టి సమత, మమత, మానవత పంచి అవే సమత-మమత-మానవతా భావనలను మాలో పెంచిన మహానీయుడవు.
ఓ బాబా... నీవు చూపిన దారిలో మేమూ నడుస్తున్నాం. ఈ నడక నీవులేవని ఆపము. నీవు మాకు పంచిన ప్రేమను, జీవితపు ప్రశాంతతని తోటిమానవులకి పంచడానికి మరింత కృతనిశ్చయంతో ఉద్యుక్తులమవుతున్నాము. మమ్ము నీ ప్రేమ,శాంతి వచనాలతో ఆశీర్వదించు.
శ్రీమతి లక్ష్మి లాభాని పతివాడ గారు, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, అమెరికా.
-----------------------------------------------------------------
ఓ బాబా, నేను నీ భక్తుడిని కాకపోయినా నీవు చూపిన ప్రేమమార్గంలో నడిచేవారిలో ఒకడిని. అసంఖ్యాక విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా సత్యం, ప్రేమ, కరుణలను సుమారు ఐదు దశాబ్దలపాటు మీరు ప్రజల సేవకు అంకితమైన మీ నిర్యాణం కడు బాధాకరం. మంచిచేసిన వారినీ తప్పుపడుతూ జీవించే మాలాంటి తుచ్చమైన మానవుల కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తివి నీవు. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అంటూ నీవు చూపిన మార్గ౦ నభూతో నభవిష్యతి. గుక్కెడు నీటికోసం అలమటించే మా కరవుసీమ దాహార్తిని తీర్చి అపరభగీరధుడవయ్యావు. మానవసేవే మాధవసేవ అన్న దైవసూత్రాన్ని ఇలలో మా కళ్ళముందు త్రికరణసూత్రంగా ఆచరించి చూపిన మహానుభావుడివి నీవు. నీవు చూపించిన సామాజికసేవలోనే ఇకనూ నడుస్తానని చెపుతూ.....!
శ్రీ రాజీవ్ రెడ్డి గారు, హైదరాబాదు.
![]() |
సాయి మాట! |