నిజం..నిర్భయం

Friday, 4 March 2011

భారతీయలు పేదవారు, కానీ భారతదేశం...



భారతీయులు పేదవారు, కానీ భారతదేశం పేదదేశం కాదని స్విస్ బాంక్ అధిపతుల్లో ఒకరు వాఖ్యానించారు. 

అతని లెక్కల ప్రకారం సుమారు 280 లక్షలకోట్ల (280,00,000,000,0000) భారతీయుల (నల్ల)ధనం  స్విస్ బాంకుల్లో మూలుగుతుంది.

ఈ ధనాన్ని స్విస్ నుంచి తెప్పించి భారతీయ ప్రజాశ్రేయస్సు కొరకు కనుక ఉపయోగిస్తే, కళ్ళు చెదిరే ఫలితాలు!


౧) దాదాపు ముప్పయి సంవత్సరాల పాటు పన్నులుకుండా బడ్జెట్.

౨) భారతీయులకి అరవై(60) కోట్ల ఉద్యోగాల్ని

౩) గల్లీ నుంచి డిల్ల్హీ వరకు నాలుగు లేన్ల రహదారులు

౪) అయిదువందల(500) పైన ప్రజాశ్రేయస్సు పధకాలకి ఉచిత విద్యుత్తు జీవితకాలం పాటు

౬) ప్రతి భారతీయుడికి నెలకి రెండువేల రూపాయల(2000/-) వంతున అరవై(60) సంవత్సరాలపాటు ఉచితంగా

౭) ప్రపంచ బాంకు మరియు IMF రుణాలుఅక్కర్లేదు.

ఇంకా ఎన్న్నో పనులు భారతదేశ అభివృద్ధి కొరకు................! ఇంకో అరవై సంవత్సరాల తరువాత కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకు౦దామా?        

ఒక్కసారి ఆలోచించండి.. మన ధనమంతా ధనబలిసిన రాజకీయనాయకుల చేతుల్లో ఉంది. వారికి వ్యతిరేకంగా పోరాడే సర్వహక్కులూ మనకున్నాయి!

ఒక వైపు కామన్వెల్త్  ఆటల కుంభకోణం (CWGames)

మరో వైపు ఆదర్శ భవనాల కుంభకోణం (Adarsh building)

అన్నిటికిమించి అతిపెద్ద తిమింగలం 2g స్పెక్ట్రం కుంభకోణం

ఇంకా కిరోసిన్ కుంభకోణం, సుక్నా స్థల కుంభకోణం, భోపాల్ IAS............

స్విస్ ప్రభుత్వం తమ బాంకుల్లో డబ్బులు దాచుకున్న అవినీతి పారిశ్రామికవేత్తలు, తోలుమందపు రాజకీయనాయకులు, నీతీబాహ్య IAS, IRS, IPS అధికారుల సమాచారాన్ని సంబంధిత ప్రభుత్వం అడిగితే ఇవ్వడానికి సిద్దం అని ప్రకటించినా ప్రస్తుత భారతప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేయలేకపోతుంది. ఎందుకని? ఇంటిదొంగలకి భయపడా లేక తామే బయటపడతామనా?

మరి మనమికమైనా ముందడుగేసి గళం విప్పుదామా?

సరికొత్త లెక్కలు..నిర్వచనాలు నేర్చుకోవాలి ఇహ ఇప్పుడు! ఖచ్చితంగా గుర్తుండి చస్తాయి!

1కోటి = 1 ఖోకా


500కోట్లు = 1 కోడా
మొద్దు మధు కోడా














1000కోట్ల = 1 రాడియా
వీరనాడీ నీరా రాడియా 















10000కోట్లు = 1 కల్మాడీ
కిలాడీ కల్మాడి














100000కోట్లు = 1రాజా
కూజా రాజా














100రాజాలు = 1 పవార్
పేత్రి పవార్














10000 పవార్లు =
వినుడుమోహన్, సూపు సోనియా, రబ్బరు రాహులు - అమ్మభజన బృందం! 














నాకో చాన్సు వస్తే నే కూడా 10000 పవార్లుకి సమానమవుతా అంటారా?



Curtesty: garnered from informative sources!

9 comments:

Praveen Mandangi said...

కొంత మందితో ఈ విషయాలు మాట్లాడాను. వాళ్లు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే 'మనకేమిటట, మన ఇల్లు చక్కబెట్టుకుంటే చాలు‌' అన్నట్టు. అవినీతిపై పోరాటం వాళ్ల దృష్ఠిలో పనికిరాని ఆదర్శంలా ఉంటుంది. వాళ్ల దృష్ఠిలో పనికొచ్చేవంటే సినిమాలూ, సొల్లు కబుర్లూ.

Anonymous said...

ఎవడా కొంతమంది? పనికిమాలిన సినిమాకబుర్లు లేదంటే నాస్తికకులహేటువాదం రాసే మీ మేతావి గురువును అడిగావా?

Praveen Mandangi said...

ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పరిచయమైన మనిషి. నేను రాజకీయాల గురించి మాట్లాడితే రిక్షావాళ్లు పదిరూపాయలు, ఇరవై రూపాయలు ఎక్కువడుగుతున్నారని వాళ్లని తిట్టాడు. రాజకీయ నాయకులు నీ జేబు నుంచి డబ్బులు తియ్యరు, రిక్షావాళ్లు నీ జేబు నుంచి డబ్బులు తీస్తారు అంటూ తింగర సమాధానాలు చెప్పాడు. ప్రభుత్వానికి మీరు టాక్సులు కట్టడం లేదా, ఆ డబ్బులే స్కాముల్లో భోంచేస్తారు అని చెపితే ఆ లెక్కలు ఎవరు చూస్తారు అని సమాధానం. అతని అభిప్రాయం ప్రకారం జేబు నుంచి డబ్బు తీస్తేనే దొంగతనమట, మనం కట్టే టాక్స్ డబ్బులు దేనికి ఖర్చవుతున్నాయో మనం లెక్కలు చూడక్కరలేదట!

Praveen Mandangi said...

గూగుల్ బజ్‌లో ఒంగోలు శ్రీను & బంతి (ఇది ఎవరి ఫేక్ ప్రొఫైలో) వీళ్లిద్దరి కామెంట్లు చదువు. http://www.google.com/profiles/100666785166499904897 సామాజిక చైతన్యం అంటే ఎగతాళి అన్నట్టే మాట్లాడుతారు.

anrd said...

మీరు చెప్పిన లెక్కలతో పాటు ..... ఈ దేశంలోని సంపదలు కూడా కలిపితే అంతా 1000 లక్షల కోట్ల సంపద ఖచ్చితంగా ఉంటుంది. అంటే ........ 100 కోట్ల మంది భారతీయులకు ........1000 లక్షల కోట్ల చొప్పున చూస్తే .......... ప్రతి ఒక్కరికి 10 లక్షల ఆస్తి ఉంటుంది. ఇక డబ్బు లేని వారు ఉండరు. .. లెక్క తప్పు కాదనుకుంటున్నాను.

రాజేష్ జి said...

$ప్రవీణ్ అన్యా
సాపాటు బ్లాగులోకి స్వాగతం!

మీ వాఖ్యలు యధావిధిగా వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ అనుభవం..రిక్షావాళ్లు నీ జేబు నుంచి డబ్బులు.. ఆ డబ్బులే స్కాముల్లో భోంచేస్తారు...

మనం కట్టే పన్నులో ప్రతి పైసాకి ప్రభుత్వం జవాబుదారీ కావాల్సిన పరిస్థితి ఉంది. దీనిమీద ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా పోరాడాలి.

రాజేష్ జి said...

$anrd గారు

బ్లాగులోకి స్వాగతం.

మీ లెక్క అక్షరాలా ఒప్పే :). టపాలో చెప్పిన మొత్తం కేవలం స్విస్ దేశపు బాంకుల్లో మనోళ్ళు దాచుకున్నది మాత్రమే.. ఇంకెన్ని దేశాల్లో మరెన్ని బ్యాంకుల్లో ఇంకెంత నల్లధనం ఉందో! ఏటా ఎనభైవేల(80,000) మంది భారతీయులు స్విస్కి వెళుతూఉంటారట వ్యాపారపనుల(?) మీద.. అందులో ఇరవైవేల మంది తరచూ వెళ్ళేవార౦ట!

తాజా వార్త ప్రకారం భోఫోర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇటలీ ఖత్రోచీని భారతదేశం రప్పించడానికి చేసిన వృధా ఖర్చు అక్షరాలా రెండువందలయాబై (250,000,000) కోట్ల రూపాయలు. వ్రతం చెడినా ఫలిత౦ దక్కితే పోన్లే అనుకోవచ్చు.. ఇక్కడ చివరికి ఖత్రోచీ మీద కేసు కొట్టేసి చేతులు కడుక్కున్నారు.

KumarN said...

బాగున్నాయ్ మీ కొత్త డినామినేషన్స్. నాకో పావు కోడానో, పది ఖోకాలో ఉంటే బావుండు.

మొన్న Wall Street- Money never sleeps (Michael Douglas) సినిమా చూసా, ఇక్కడా అదే పరిస్థితి. తేడా అల్లా, ఇక్కడ మనుషుల దగ్గరకి డబ్బులు రానిచ్చి, తరవాత రక రకాల ఫైనాన్షియల్ స్కీంస్తో వాళ్ళ జేబుల్లోంచి లాక్కుంటారు, మన దగ్గర డైరక్టుగా గవర్నమెంటు మింట్ దగ్గరనించే సైఫన్ ఆఫ్ చేసేస్తారు బయటకి.

ప్రవీణ్ గారూ, ఆ సామాన్యుల సర్కిల్ ఆఫ్ కంట్రోల్/సర్కిల్ ఆఫ్ ఇంఫ్లూయన్స్ లో ఉన్నది ఆ ఆటో/రిక్షా వాళ్ళని తప్పించుకోవటమో, గదమాయించటమో, అందుకనే అలా అనుంటారు. సార్, మీరు ఎవరు పడితే వాళ్ళతో ట్రైన్స్ లో వాదనలకి దిగబాకండి. మంచిది కాదు. మీకేమన్నా అయితే మేమంతా బాధ పడతాం. (నిజంగానే చెప్పా)

తెలుగు వెబ్ మీడియా said...

వాళ్లు సామాన్యులు కాదు నాయనా. నాతో వాదించినది మెషీనరీ వ్యాపారి. పక్కన ఉన్న ఇంకొకాయన అలా వాదించలేదు.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers