నిజం..నిర్భయం

Thursday, 3 March 2011

అన్యాయమైన తీర్పు!

అవును గోద్రా తీర్పు చాలా అన్యాయమైనది. పదకొండు మందికి ఉరిశిక్షటా! 

కళ్ళముందు జరిగిన మారణకాండకి కారకుడైన కసబ్ లాంటి ఒకడికే ఉరిశిక్ష అమలుజరపలేక ప్రభుత్వధనం మరీ ఉపయోగించి కింది కోర్టు, పై కోర్టు, ఆ పై కోర్టు అని తిప్పుతున్నారు సంవత్సరాలుగా. కసబ్ లాంటి తీవ్రవాదికి తిండి, రక్షణ, న్యాయ౦ పేర్లతో దాదాపు ముప్పై కోట్లు ఖర్చుపెట్టింది, ఇంకా పెడుతుందట!. సమాజభక్షణ కోసమే మేము అన్నట్లుండే అత్యధిక భారత ప్రచారమా(మి)ధ్యమాలు కసబ్ రాజావారు తుమ్మాడని, దగ్గాడనీ, రోజుకు రెండుసార్లు మాత్రమే వెళుతున్నాడనీ సంచలనవార్తలుగా ప్రచారం చేస్తూ తమ మనుగడకి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాయి. మొన్న కసబ్ రాజావారు, నిన్న వారి గురువు అఫ్జల్ పిచ్చినవ్వు నవ్వారని ఓ రగడ. ఇహ ఈ ప్రచారమిధ్యమాలు జుట్లుపీక్కుంటూ ఆ నవ్వుచుట్టూ నవర౦ద్రాన్వేషణ చేస్తూ పనిలేని ప్రేక్షకుడిని "పిచ్చి నవ్వుకి" కారణమేంటో చెప్పమని అడగడం!. ఇంగితం ఉన్న సగటు మడిసికి వాడి పిచ్చినవ్వు తనని ఇంకా శిక్షించకుండా రక్షిస్తున్న భారతదేశపు,భారతీయుల అసమర్ధత మీద అని తెలుస్తు౦ది.


మరి కసబ్,అఫ్జల్ గురు తదితర దేశహులకి, తీవ్రవాదులకి ఖర్చుపెట్టిన డబ్బెవరిది? వీరు సొంతగా పెట్టుకుంటున్నారా? పోనీ వీరిని బలపరుస్తున్న రాజకీయపు పె(గె)ద్దలు, మానవహక్కుల మేతావులు, ప్రచారమిధ్యమాలు తమ సొంత డబ్బుని ఏవైనా ఖర్చుపెడుతున్నాయా? ఇవేవీ కాదు! ఈ డబ్బు ఖచ్చితంగా భారతీయులు కట్టే పన్నుల నుంచే వస్తుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ప్రజలపై పన్నులు విధి౦చే విధానంలో చాణక్యులవారిని ఆదర్శంగా తీసుకున్న ప్రభుత్వాలు ఆ పన్నులని తిరిగి అదే ప్రజాశ్రేయస్సు కొరకు ఏవిధంగా ఖర్చుచేయాలో, వారిని రక్షించుటకూ దేశద్రోహులని ఎలా శిక్షించాలో చెప్పిన అదే చాణక్యులవారి విధానాల్ని మటుకు గాలికొదిలేసి౦ది.

సరే మరి, దేశద్రోహులకీ, తీవ్రవాదులకీ మతాన్ని అంటి౦చిన మేతావులు పన్నులకి మాత్రం మతాన్ని ఎందుకంటించకూడద౦ట? ఒకవేళ అంటిస్తే ఎలా వుంటుందో చూద్దాం!



2001లో భారతదేశప్రభుత్వ౦ మతాలవారీగా జరిపిన జనగణన ప్రకారం హిందువులు 80.46%, ముస్లిములు 13.43%, కిరస్తానీయులు 2.34%(?) మరియు హైందవ సోదరమతాలైన సిక్కులు-బుద్దులు-జైనులు 3.5% ఉన్నారు. అదే విధంగా ప్రస్తుత భారతప్రధాని భారతదేశ అభివృద్ధి ఫలాలు పేదలైన
ముస్లిములకి మొదట దక్కాలన్న మాటలని, కొంతమంది ముస్లిం మేధావులు ఉచితఫలాల్లో(reservations) తమకూ భాగం కావాలంటూ రాసిన రాతలని బట్టి, తర్వాత వేసిన సంచార సచార్ బృందం చేసిన కొన్ని జనగణలనిబట్టి 95% మంది ముస్లిములు దారిద్ర్యరేఖకి దిగువునఉన్నారని తెలుస్తింది. అంటే వీరిలో ప్రభుత్వానికి పన్నులు కట్టేది ఆ మిగలిన 5%లో ఏ 2% అన్నమాట! మరైతే అత్యధికంగా పన్నులు ఎవరుకడుతున్నారు? భారత పన్నుల విభాగం వారి లెక్కల ప్రకారం ఇది హిందువలనేది సుస్ప్రుష్టం. అంటే హిందువులు కట్టిన పన్నులను వారి బాగోగులకు ఖర్చుచేయటం దేవుడెరుగు, వారిని చంపడానికి మటుకు మాత్రం ఉపయోగిస్తున్నారన్నమాట! మరి పన్నులు కట్టేది ఎందుకోసమయా అంటే అఫ్జల్ లాంటి దేశద్రోహులనీ, కసబ్ లాంటి తీవ్రవాదులనీ పెంచిపోషించడానికని దిగంబరం అన్నాడట!
                                        
ఇక అసలు విషయంలోకి వస్తే ఇప్పటికే ఒకరిద్దరితోనే ఖర్చు తడిపిమోపెడవుంతు౦టే ఇప్పుడ పదకొండు'మంద'౦టా! ఇక వీరందరికీ ప్రచారమిధ్యమాలు వీరతాళ్ళేస్తాయి, అపరమేతావులు బయటికి వస్తారు.. ఇక ప్రభుత్వసాయం మొదలువుతుంది. ఒక్కడికే ముప్పైకోట్లుపైన పెట్టగల ధనవంతపు భారతప్రభుత్వం పదకొండుమందిని మటుకు ఎందుకు వదిలేస్తుంది? అంటే ఈ లెక్కన మూడువందలముప్పైకోట్లు పైన అదనపు భారాన్ని భారతప్రభుత్వం భరి౦చాలి  అన్నమాట! బానే ఉంది! భరించడమంటే తమ జేబులోంచి తీసి ఖర్చుపెట్టేది కాదుగా, ఈ మొత్తాన్ని మళ్ళీ భారతీయులు కట్టే పన్నులనుంచే వీటిని తీసుకు౦టారు. అంటే హిందువులు కష్టపడి సంపాదించి పన్ను రూపంలో కట్టిన సొమ్ముని హిందువులని చంపినవారిని కాపాడ్డానికి, మరింత మంది హిందువులని చంపడానికి ఉపయోగించడం అన్నమాట. ఇదే పని ఒకప్పుడు ఔరంగజేబు చేసేవాడట, ఇప్పుడు మళ్ళీ వారి అనునూయుల హవా! ఇహ చాణక్యులవారు 150 రూపాయల నాణెం మీద ఉండిపోవాల్సిన్దేనోమో!

అందుకే గోద్రా తీర్పు చాలా అన్యాయమై౦ది.

మాకొద్దీ పన్నుల భారం.. అంతకు మించిన దిక్కుమాలిన మతరాజకీయాలు.. అప్రాచ్యపు ప్రచారమిద్యమాల లొల్లి..మానవహక్కుల మాదాకవళ౦!

 కొన్నేళ్ళతర్వాత "అన్యాయమైపోయిన 'గోద్రా తీర్పు'!" అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అస్సలు వద్దు.                            

చివరగా ఒక మాట! ఒక మేతావి గోద్రా సంఘటన జరిగిన గుజరాత్లో నరేంద్రమోడీగారీ నియ౦తృత్వంలో ముస్లింలది దిగజారినపరిస్థితి అంటే దానికి మరో స్వచ్చమైన మేధావి వాస్తవాల్ని మరిచి గుడ్డిగావ౦త పాడడం బాధాకర౦. ఈ స్వచ్చమైన మేధావిగారి కోసం ఈ మాట.    

భారతదేశంలో ముస్లింల స్థితిగతులపై అధ్యయనం కోసం వేసిన సచార్ బృందం 2006లో ప్రవేశపెట్టిన రిపోర్ట్ ప్రకారం 2002 గుజరాత్లో గొడవల తర్వాత ముస్లిములు విద్య మరియు ఆర్ధిక రంగాల్లో జాతీయ సగటు కన్నా ముందంజలో ఉన్నారు. అలాగే గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలది దేశం మొత్తమ్మీద మెరుగైన శాతం(5.4%) అని అదే సచార్ బృందం చెప్పింది. అదే కమ్మ్యూనిస్టుల పశ్చిమబెంగాల్లో 2.1%, దేశరాజధాని న్యూడిల్హీలో 3.2% మాత్రమే ఉంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది శాతాలు మాత్రమే కాదు, అక్కడి ముస్లింలు గతం మరిచి హిందువులతో కలిసిమెలిసి తమకి తాముగా అభివృద్ధి చెందుతున్నారన్న వాస్తవాన్ని!. ఇలా కలిసి ఉండడాన్ని భరించలేని కొన్ని ఛా౦దస గూబలకి మీరు ఊతమివ్వడం ఎంతవరకు సమంజసం?

5 comments:

పద్మ said...

well said. మానవహక్కుల గురించి చెప్పారు చూశారు, అది బ్రహ్మాండంగా ఉంది. ఈ పోరాడేవాళ్ళందరినీ దానాలు తెచ్చుకుంటారో వాళ్ళకున్నవే ఇచ్చుకుంటారో ఆ సొమ్ముతోనే వాళ్ళు కాపాడబడాలి అనే వాళ్ళకి అయ్యే ఖర్చు భరించమనాలి. అసలు ఆ కసబ్, అఫ్జల్ కన్నా మనలొ ఒకరుగా సంఘంలో తిరిగే వీళ్ళే ప్రమాదకరం.

వందేమాతరం పాడని వాళ్ళకి, జనగణమణకి, జెండాకి విలువ ఇవ్వని వాళ్ళకి రక్షణ, రిజర్వేషన్లు. ఇదేంటని అడిగినవాళ్ళు హిందూ తీవ్రవాదులు, ఉగ్రవాదులు.

Anonymous said...

Satirical yet thought provoking article. Good. Keep it up!

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

Excellent Boss. Good info.

రాజేష్ జి said...

$పద్మ గారు
బ్లాగులోకి స్వాగతం.

మీ వాఖ్య చాలా ప్రభావశీలి గా ఉంది. మీ భావాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

పెపంచ మానవహక్కుల సంఘం కొన్ని దేశాల గుత్తయిపోయి అవసరమైనప్పుడల్లా కూరల్లో వాడుకునే కరివేపాకు చందంలా ఉంది.

నిజమే మీరన్నట్లు ఒకరకంగా తీవ్రవాదులకన్నావీరివల్లే దేశానికి ఎక్కువ ప్రమాదం.

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు
నెసర్లు!

$లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు

ధన్యవాదాలు.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers