నిజం..నిర్భయం

Tuesday, 1 March 2011

అన్నిటికన్నా గౌరవం ముఖ్య౦!

అన్నిటి కన్నా గౌరవం ముఖ్యమని ప్రముఖ దళిత వ్యాసకర్త చంద్రభాన్ ప్రసాద్ గారు అంటున్నారు!

సమసమాజంలోకి రావాడానికి మధ్యతరగతి దళితులు దారి చూపాలి.


దాదాపు ఒక సంవత్సరం క్రితం డిల్హీలో దళితులచే నిర్వహించబడిన దళిత ఆలోచనాపరుల సభకు దళిత ఇంజనీర్లు, వైద్యులు, ఇతర వృత్తి సంబంధీకులు మరియు ప్రభత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఒకరకంగా ఇది మధ్యతరగతి దళితుల సమ్మేళనమ. మాట్లాడ్డానికి నన్ను కూడా ఆహ్వానించారు.


ఈ సభాచర్చలో "వారు మనల్ని ఇంకా ఎందుకు ఇష్టంపడటం లేదు?" అన్న ముఖ్యప్రశ్న ఉదయించింది. ఇక్కడ "వారు" అనేది అగ్రకుల హిందువలనుద్దేశి౦చినది! ఎంత మంచిగా పనిచేసినా పై అధికారులు తమకు సంబంధి౦చిన నమ్మక సమాచారాన్ని(Confidential Reports) చెడగొడుతున్నారని పలువురు చెప్పారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ న.స. కనుక సగటున మాత్రమే ఉంటే పదోన్నతి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాక, ఎంత కష్టించి పనిచేసినా చాలా వరకు దళిత ఉద్యోగస్తులకి తగిన పదోన్నతి రావడంలేదనీ చెప్పారు. మొత్తమ్మీద చెప్పొచ్చేదేమిటంటే వారి పై అధికారులు తాము గొప్పగా చేసిన పనులకి ప్రోత్సాహం ఇవ్వట్లేదని చాలామంది అభిప్రాయం.                
 
"భారతదేశం ఇంకా కులరహిత సమాజం కాలేదు" అని సభాచర్చలో నా తొలివాఖ్యంగా చెప్పాను. "భారతదేశం కుల తటస్థ౦(Caste neutral) కూడా కాదు" అన్నది నా మలి వాఖ్యం. ఈ శతాబ్దిలో మనదేశం ఎన్నో రకాల మార్పులకి గురైనా కులవ్యవస్థ మటుకు అలానే ఉందనేది యధార్ధం! దీన్ని మనం  ఎదుర్కోవాలి. నిర్హేతుకమైన పక్షపాతానికి చరమగీతం పాడే రోజు త్వరలో వస్తుంది.            


ఏదై(వై)నా ఖరీదు పెడితే వచ్చేవే అని నా నమ్మకం, అదేవిధంగా ఉచితఫలాలు(reservations) కూడా. ఎవరైనా దళితుడు ఈ ఉచితఫలాల భాగం కింద ఉద్యోగం తెచ్చుకుంటే కష్టపడకుండా ఉచితంగా తెచ్చుకున్న ఉద్యోగం అనే అపవాదుతో జీవితా౦తం జీవించి ఉండాల్సిఉంటుంది.


మాజీ రాష్ట్రపతి కె.ర్.నారాయణన్ ని ఒక దళితపెద్దగా గుర్తింపబడ్డాడు. MA (English) లో బంగారు పతకాన్ని పొందిన నారాయణన్, భారతదేశంతో అమెరికా మరియు చైనా సంబంధాలు క్లిష్టపరిస్థితులలో ఉన్నప్పుడు ఆ దేశాలలో రాయబారిగా పనిచేసి సత్సంబంధాలు పెంచుటకు కృషిచేశారు.        
నారాయణన్ మంచి వ్యక్తి మరియు అమోఘమైన మేధస్సు అర్హతగా చైనా మరియు అమెరికాల్లో భారతదేశం తరపున ఉన్నతపదవులు అలంకరించారు. మనసునిండా మంచి నింపుకున్న మంచి మనిషిగా సమాజంలో గొప్పపేరు పొందాడు. కుహనా విమర్శకులు కూడా ఆయనని చెడుగా విమర్శించలేదు.      కేవలం దళితుడవబట్టే భారత రాష్ట్రపతి కాగలిగాడు అనుకునే వారు కూడా భారతరాష్ట్రపతిగా అతనికున్న శక్తిసామర్ద్యాలను ఎప్పుడు ప్రశ్నించలేదు. అయితే ప్రతి నిబంధనకి దానికి తగ్గట్టుగా ఆక్షేపణలు(exceptions) కూడా ఉంటాయని తెలిసిందే.      


మేధస్సు మాత్రమే అర్హతగా అత్యున్నత స్థానాన్ని అలంకరించిన వారిలో మరో ఉదాహరణగా వైద్య(Dr) బి.ర్.అంబేద్కర్ ని చూద్దాం. అత్యధిక భారతీయులు అతనిని దళిత బాంధవుడిగా అభివర్ణిస్తారు. కొద్దిమంది అతనిని భారత రాజ్యాంగపిత గా గుర్తిస్తారు. దళితులను సామాజిక కులదాస్యశృంఖలాలనుంచి బంధవిముక్తి చేసినవాడు వైద్య బి.ర్.అంబేద్కర్ అన్నది నిజమే, అయితే దళితుల బంధవిముక్తి ఇంకా పూర్తికాలేదు. వైద్య బి.ర్.అంబేద్కర్ ఈ సామాజిక రుగ్మతలనుంచి బంధవిముక్తులవడానికి ఒక మార్గ౦ చూపించాడు. కానీ ఈ మార్గపు తీరుతెన్నులు ఇంకా ఒకరూపు సంతరించుకోలేదు.

అసంపూర్ణంగా మిగిలిపోయిన వాటిలో భారతరాజ్యాంగం ఒకటి. భారతరాజ్యాంగం ఎన్నో మార్పుచేర్పులకి, దిద్దుబాట్లకి గురైనా దాని మూలభాగం మటుకు అలానే ఉంది. అందువల్లనే వైద్య బి.ర్.అంబేద్కర్ని భారత బుద్దిపిత(intellectual father) అవ్వాలి. అయితే దీన్ని అత్యధికశాతపు భారతీయులు అంగీకరించుటలేదు. ఇది కులపుట్టుకతో వచ్చిన దురభిమానం అని నా అభిప్రాయం.                            


వైద్య బి.ర్.అంబేద్కర్ శక్తిసామర్ద్యాలను గురించి కులాభిమానం ఉన్న ఎవరినైనా అడిగితే వారు అతనిని ఇరవయ్యో శతాభ్దపు అత్యున్నతపు మేధాశక్తిమయుడుగా వర్ణించి చెబుతారు. వైద్య బి.ర్.అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో కేవలం మేధస్సు అర్హతగా ప్రవేశం పొందాడు, ఇది ఏదో ఉచిత౦గా ఇచ్చిన/వచ్చిన వాటిలో భాగం కాదు. ఇతర సామాన్య విద్యార్దులకు మల్లే అతను లండన్ రాజకీయ పాఠశాలకు అర్హత పొందాడు.          


భారతదేశం మారుతుంది. ఈ మార్పుని మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో దళితులూ మారాలి. వైద్య బి.ర్.అంబేద్కర్ మరియు కె.ర్.నారాయణన్ చూపించిన దారిలో నడవాలి. అన్నిటికిమించి గౌరవం కోసం పోరాడటమే దళితగమనంలో మూలసూత్రం అవ్వాలి. తిండి లేదా పదవి కన్నా ఆత్మగౌరవం చాలాముఖ్యం.


ప్రతిఒక్క సమాజంలోనూ మధ్యతరగతి మాత్రమే ఇతరులకి ఆదర్శంగా ఉండి ప్రభావిత౦ చేయగలదు. ఇందులో తమ ప్రజలకి గౌరవాన్ని సంపాదించుటలో మధ్యతరగతి తమవంతు పాత్ర పోషి౦చాలి. అనగా మధ్యతరగతి దళితులు ముందుకు వచ్చి దళితుల చుట్టూ అలుముకున్న "దళితుడు ఉచితఫలాలు లేకపోతే జీవితాన్ని సాగించలేడు" అనే దురభిప్రాయాన్ని తొలగించాలి.        


నిజానికి నేటి రెండవతరం దళితులు చాలామంది అందరితో సమానంగా బాహాటతరగతితో(Open Category) పోటీ పడుతున్నారు. అయితే ఈ కోణంలోని దళితస్పృహ ప్రచారానికి నోచుకోలేదు. ప్రచారం కల్పించి నలుగురికీ తెలియడానికి దళితులు కొంత సాహసవంతమైన పనికి పూనుకోవాలి.      


ఈ సాహసం మధ్యతరగతి దళితులనుంచి ఉద్భవించాలి.ఈ మధ్యతరగతి దళితులలో ఎవరైతే రెండు తరాలుగా ఉచితఫలాలు అనుభవిస్తూ ప్రభుత్వభృత్యులుగా, వైద్యులుగా, ఇంజినీర్లుగా మరియు ఇతర వృత్తిసంబంధీకులుగా జీవనం సాగిస్తున్నారో వారు భాగస్వాములైఉండాలి. వీరు ప్రచారమాధ్యమాలను పిలిచి మరీ దేశవ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి తమకిక ఉచితఫలాల్లో(reservations) భాగం(quota) అవసరంలేదనీ, తాము ఇకనుంచి బాహాటతరగతితో(Open Category) పోటీ పడడానికి సిద్దమని గట్టిగా చెప్పాలి.    

-- చంద్రభాన్ ప్రసాద్

నా(సాపాటు) మాట: చంద్రభాన్ ప్రసాద్ గారు రాసిన "అన్నిటికన్నా గౌరవం ముఖ్య౦" అన్న వ్యాసాన్ని తెలుగులోకి అనువదించుటకు ముఖ్యకారణం వ్యాసం వాస్తవ సమకాలీన సంఘటనలతో కూడినదే కాక వ్యాసరచయిత దళితదృక్కోణం లో చెప్పినప్పటికీ అది పలు విభిన్న అత్యయికకోణాలను ఆవిష్కరించడం, అదీ అధ్బుతంగా. మరొక మాట, ఇక్కడ గౌరవం అనేది ఒళ్ళు, ఇల్లు గుల్ల చేసుకుని ఇతరుల మెప్పుకై ఆరాటపడి, కొంపకి కోరివిపెట్టుకునే "గౌరవం" కాదని నా మనవి! అలాగే గొప్ప, గౌరవం రెండూ వేర్వేరని భావించమని కూడా మనవి!

10 comments:

Rao S Lakkaraju said...

మొత్తమ్మీద చెప్పొచ్చేదేమిటంటే వారి పై అధికారులు తాము గొప్పగా చేసిన పనులకి ప్రోత్సాహం ఇవ్వట్లేదని చాలామంది అభిప్రాయం.
-------------
ఇల్లా అనుకోవటం universal. ఉదా: ఇండియన్ అనో, పోలిష్ అనో, జ్యుఇష్ అనో, బ్లాక్ అనో ప్రోత్సాహ మివ్వటల్లేదు అనుకోవటం అమెరికా లో మామూలే. నిరుత్సాహ పడటమూ మామూలే. చేసేపనిని ఆపకుండా చేసుకుంటూ ఉత్సాహంగా పోవటమే దానికి మార్గము. ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా గుర్తుంపు వస్తుంది.

రాజేష్ జి said...

$Rao S Lakkaraju గారు

#ఇల్లా అనుకోవటం universal...

అనుకోవడం సార్వజనీనమే అయినప్పటికీ అందులో చాలావరకు వాస్తవం లేకపోలేదు.

# ..నుకోవటం అమెరికా లో మామూలే..
అవును. అయితే ఒకటి, పరాయియింట్లో పక్షపాతం లేకుండా ఉండాలి అనుకోవడం అత్యాశేమోగానీ
మనింట్లో మనవాళ్ళు పక్షపాతం లేకుండా ఉండాలి అని ఆశించడం తప్పు కాదుగా.

#..చేసేపనిని ఆపకుండా..గుర్తుంపు వస్తుంది..
మంచి ఉత్సాహవంతమైన, ప్రోత్చాహకరమైన మాట చెప్పారు. కృతజ్ఞతలు.

Rao S Lakkaraju said...

@రాజేష్ జి
అనుకోవడం సార్వజనీనమే అయినప్పటికీ అందులో చాలావరకు వాస్తవం లేకపోలేదు.
------
వాస్తవమే నేను ఒప్పుకుంటాను. మన స్వంత ఫామిలీస్ లో కూడా ఉంది. అందర్నీ ఒక విధంగా చూడరని అందరి పిల్లలూ అనుకుంటూ ఉంటారు. సమస్య ఉన్నది ఒప్పుకుంటాము. సమస్య ఉన్నది అని వందసార్లు చెప్పటం మూలంగా సమస్యని సరిదిద్దలేము. దాన్ని ఏవిధంగా సరిచేయ్యవచ్చు? ఇంకొక గ్రూప్ ను తిట్టి మనము సరిచేయ్యలేము. మంచి చేద్దామనుకున్న ఆ గ్రూప్లో వాళ్ళని కూడా తిట్టటం మూలాన దూరం చేసుకుంటాము. ఏ విధంగా సరిచెయ్య గలం? ఆ దృష్టితో చూసిన వారి ఆలోచనలు ఉంటె మీ బ్లాగ్లో పెట్టండి. ఒక సమస్యను సరిదిద్దటానికి ప్రయత్నించినట్లు అవుతుంది.

Anonymous said...

వైద్య బి.ర్.అంబేద్కర్
Nice to know that B.R.Ambedkar was a physician(వైద్య)too, I thought he was a lawyer.

రాజేష్ జి said...

$Rao S Lakkaraju గారు

#..సమస్య ఉన్నది అని వందసార్లు చెప్పటం మూలంగా సమస్యని సరిదిద్దలేము...

ఖచ్చితంగా, ఇందులో ఎలాంటి సందేహం లేదు! అయితే సమస్య ఉన్నదని వందసార్లు చెప్పేది మరి నలుగురికి తెలియాలనేదే మూలకారణం అయితే చెప్పడంలో తప్పులేదు కదా! అదే సమయంలో కార్యాచరణ కూడా ముఖ్యమని మీరు చెపుతున్నారని నేను అర్థం చేసుకోగలను.

#..ఇంకొక గ్రూప్ ను తిట్టి మనము సరిచేయ్యలేము. మంచి చేద్దామనుకున్న ఆ గ్రూప్లో వాళ్ళని కూడా తిట్టటం మూలాన దూరం చేసుకుంటాము...

మీరు ఉదాహరించిన "సముదాయం(గ్రూప్)కి" విస్తృతార్థం ఉంది. కొద్దిగా నిర్దిష్టంగా(స్పెసిఫిక్) ఉండు౦టే నా అభిప్రాయం సూటిగా చెప్పడానికి వీలయ్యేది. అయితే ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి నా సామాజికవర్గాన్న్ని ఆధారం చేసుకుని నాకున్న పరిజ్ఞానంతో చెబుతా. నా సామాజికవర్గంలో(నా.సా) చాలామంది దళితులకి సాయంచేయడంలో, వారిని సామాజికంగా బలపరుచుటలో ఎప్పటినుంచో ముందున్నారు. అయితే దీనివల్ల వాళ్ళు(నా.సా) సాధించింది ఏమీ లేదు, పైగా మమ్మల్ని అప్పుడు అణగదొక్కి ఇప్పుడొచ్చి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు అనే ఇంకో అపవాదు తప్ప. ఇక్కడ "స్వయ౦ సంఘటిత" సామాజికశాస్త్రాన్ని అమలుపరచడంలో నా.సా సఫలీకృతం కాలేక అపవాదులు కొని మరీ తెచ్చుకున్నారని నా నమ్మకం.

సామాన్య సూత్రం ప్రకారం ఎప్పుడైనా, ఎక్కడైనా బలహీనుడు(అ) తనని బలవంతుడి సాయం కోరుకుంటాడు కాని మరో బలహీనుడి(ఆ) సాయం కాదు. అంటే ఇక్కడ "అ" కి మంచిచేయాలని తలంచే "ఆ" వర్గం ముందుగా తమ ఇల్లు చక్కబెట్టుకుని, తాము సంఘటితంగా(అదే బలం) ఉ౦డి సాయ౦ చేస్తే "అ" ఎప్పడూ వదులుకోడు. అట్లే ఇక్కడ "సంఘటితం" ప్రామాణిక౦గా సాయం వస్తుంది కాబట్టి కుహనావిమర్శకులు ఆ సాయాన్ని పనిపెట్టుకుని మరీ విమర్శించే/తిట్టే దుస్సాహసం చేయరని నా గట్టి భావన.

#ఏ విధంగా సరిచెయ్య గలం?

పైన చెప్పినట్లు "సంఘటితం" ఉంటే "మంచిని" తిట్టే సాహసం చేయరు.

#..ఆ దృష్టితో చూసిన వారి ఆలోచనలు ఉంటె మీ బ్లాగ్లో పెట్టండి...

ఇక్కడ "వారి ఆలోచనలు" లో "వారు" అంటే తిట్టేవారా లేక మంచి చేసి మరీ తిట్టిన్చుకునేవారా :)?

"తిట్టే వర్గం నుంచైతే" నాకు తెలిసి చంద్రభాన్ ప్రసాదు గారి ఆలోచనలు ఆ దృష్టితో చూసేవే!. పైన వ్యాసంలో దళితులు తమ సమస్య ఇది అని చెప్పుకుంటే అతను వారిని తమకి తాముగా మారమనీ, ఆ సమస్యమీద పోరాడమని చెబుతున్నాడే గానీ వేరే వారిని తిట్టమని చెప్పలేదు. పక్కనోల్లని తిడుతూ కూర్చుంటే యుగాలు కరుగుతాయేమో కానే వాస్తవ పరిస్థితులు మారవు అన్న ఆయన అమూల్యమైన అభిప్రాయం మనకు తెలుస్తుంది. అలానే తనకుల(దళిత) ప్రజలు పైకి రావాలంటే ఆంగ్ల భాష ఖచ్చితంగా నేర్చుకోవాలని అంటున్నాడే కాని మిగిలిన(చేతకాని) వారిలాగా భారతీయ భాషల్ని తిడుతూ కూర్చోలేదు. మొన్నొకరు తెలుగుని ఆంగ్ల భాష నుంచి రక్షించుకోలేని చేతకానితనానికి సిగ్గుపడక పోగా అన్ని భాషలకి మాతృభాషగా చెప్పుకునే సంస్కృతభాష యొక్క పదాలు తెలుగులో ఎక్కువయ్యాయని ఏడవడం చూస్తే నాకు బాధేసింది. అందుకే చంద్రభాన్ గారి ఆంగ్లభాషాభిమానాన్ని ఇక్కడ ఉదాహరించా. అయితే వీరిలాంటి ఆధునిక భావాలు ఉన్నవారు వారి వర్గంలో చాలాతక్కువగా ఉన్నారని నా అభిప్రాయం. ఖచ్చితంగా చంద్రభాన్ గారి లాంటి మేధావుఅల్ ఆలోచనలని పరిశోధించి బ్లాగులో పెడతా!

మీకు సరైన స.ధాలు ఇచ్చానని భావిస్తున్నా. అయితే ఎక్కడైనా తప్పటడుగులు పడి ఉ౦డి మీరు వాటిని చెబితే సరిదిద్దుకోగలను.

రాజేష్ జి said...

$Snkr గోరు
# వైద్య బి.ర్.అంబేద్కర్..was a physician(వైద్య)too..
It is very nice(?) to know that from the whole article, usage of that word(వైద్య) provked you to comment over here :). Forgive pun :))

"వైద్య" అనే పదానికి నా దగ్గర విస్తృతార్థం ఉంది. కేవల౦ మందులిచ్చో లేక ఆంగ్లేయుల ప్రకారం ఉన్నతవిద్య(Ph.D) పొంది తెచ్చుకునే మాత్రమే కాక మనిషిని మానసిక/సామాజిక రుగ్మతల నుంచి నయం చేసేవాడు కూడా వైద్యుడే! ప్రస్తుతానికి నేను ఇక్కడ ""వైద్య" అనే పదాన్ని డాక్టర్కి ప్రత్నామ్నాయంగా రాసినట్లు అనిపించినా అది మీరు దాన్ని నేను చెప్పిన మూడవ అర్థానికి కూడా అన్వయిన్చుకోమని విజ్ఞప్తి.

Rao S Lakkaraju said...

@రాజేష్ జి గారికి
మీరు చెప్పిన వన్నిటినీ నేను వప్పుకుంటాను. కాకపోతే నేను కొంచెం కలుపుతాను. మనము ఈ సమస్యకి పరిష్కార మార్గం చూడాలి. మనకి ఇంకొకళ్ళు సహాయం చేస్తే కానీ అవని పని వుంటే "వాళ్ళని" తిడుతూ ఉంటే పనులు అవ్వవు. రోజూ చూస్తూనే ఉంటారు, మన ఇంట్లోవాళ్ళ తో పనులు చేయించు కోవాలంటే తిడితే పనులు అవ్వవు.
అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా.

"సామాన్య సూత్రం ప్రకారం ఎప్పుడైనా, ఎక్కడైనా బలహీనుడు(అ) తనని బలవంతుడి సాయం కోరుకుంటాడు"
-----------
Very true. కానీ బలహీనుడు తను బలవంతుడు అనుకుంటేనే వస్తుంది సమస్య. తనే సమస్యకి పరిష్కారం చెప్పి బలవంతుని చేత చేయిన్చాలంటేనే వస్తుంది సమస్య. ఎందుకంటే ఇష్టం లేకపోతే బలవంతుడు చెయ్యాల్సిన అవుసరం లేదు. మన ఇళ్ళల్లో ఇవన్నీ చూస్తూనే ఉంటాము. దీనికి పరిష్కారం బలహీనుడు బలహీనుడని గ్రహించి సహాయం అడగటం.

#ఏ విధంగా సరిచెయ్య గలం?
నా ఉద్దేశంలో చదువు ద్వారా తెలివితేటలని పెంపొందించటం. ఆ చదువు చెప్పేవారిని ప్రోత్సాహపరచటం.
నా ఉద్దేశంలో డబ్బులిచ్చి రిజర్వేషన్లు ఇవ్వటం మూలంగా జరిగేది చాలా తక్కువ. ఒక విధంగా చూస్తే ఇది సమాజంలో చీలికలు తీసుకు రావటమే. ఇది ఒక విధంగా మిగతా వర్గాలని తిట్టటమే. అందుకనే సమస్య పరిష్కారము కావటల్లేదు. మీతోనూ, చంద్రభాన్ ప్రసాదు గారితోనూ ఏకీభ విస్తాను. మనం ఈ సమస్యని పరిష్కారం చేసే విధంగా ఆలోచించాలి. అర్దరాత్రి పూట సిస్టం క్రాష్ అయి పిలిస్తే మనము ఎవర్నీ తిట్టం, సరిచేస్తాము.

#మాతృభాషగా చెప్పుకునే సంస్కృతభాష యొక్క పదాలు తెలుగులో ఎక్కువయ్యాయని ఏడవడం చూస్తే నాకు బాధేసింది.
మొన్న ఇటువంటి వాళ్ళకే ఒక కామెంటు వ్రాసాను. వాళ్ళు పబ్లిష్ చెయ్యలేదు. క్లుప్తంగా. మన తెలుగు భాష "Phonetics based" , మనం వ్రాసేది మన ఉచ్చారణ బట్టి. మనము పలికే శబ్దాలన్నిటికీ సరియిన అక్షరాలు ఉంటాయి. అన్ని శబ్దాలకి అక్షరాలు లేకపోతే ఇంకొక చోటునుంచి తెచ్చుకుంటాము. మనము కొన్ని అక్షరాలు సంస్కృతం నుండి తెచ్చుకున్నాము. తప్పేమిటి ? మనకు దగ్గర తెలిసిన భాష అదే. జర్మన్ లోని ఉమ్లౌట్ తెచ్చుకోలేదు కారణం అది ఎక్కడో ఉంది మనకి తెలియదు. భాషలు అభివృద్ది చెందాలంటే ఇదే మార్గము. మనం కంపైలర్లు ఇంటర్ప్రేటర్లు చిన్న వొకాబులరీ తో వ్రాస్తాము. తరువాత భాషని మాటలు కలిపి అభివృద్ది చేస్తాము. కంపూటర్ తో పనిచేయించే వారందరూ మాటలు సృష్టించి కంపూటర్ కి నేర్పించిన వారే. ఎన్ని భాషల నుండో తెచ్చిన పదాలు వాడతాము. అదికూడా తప్పేనా?

Anonymous said...

/నేను చెప్పిన మూడవ అర్థానికి కూడా అన్వయిన్చుకోమని విజ్ఞప్తి. /
వద్దులేండి బాబూ, దానికన్నా కావాలంటే మొదటి రెండు అర్థాలే మేలు. కులాధారిత రిజర్వేషన్లు కల్పించి దళితులను ఆయన ఉద్ధరించాడని నేననుకోను. ఎందుకంటే, 'మా కులం వాళ్ళకన్నా వెనకబడ్డ కులం, మాకూ కోటా ఇవ్వండి' అంటూ దేబరించే స్థితికి అందరినీ తెచ్చారు. అదేదో పాత తెలుగుపాట 'చవటాయిని నేను, ఒట్టి చవటాయిని నేను, నీకంటే పెద్ద ..' అని పోటీలు పడి కొట్టుకు చచ్చేలా చేశారు. ఈ చర్యలవల్ల పోనీ దళితుల్లోఐనా కులసహనం వచ్చిందా?! ఆర్థికంగా స్థితిమంతులైన దళిత మేతావులే మరీ మరీ కోటాఫలాలు మేసేస్తున్నారు, 60ఏళ్ళైనా ఆర్థికంగా దిగువన వుండేవాళ్ళు అక్కడే వుండిపోతున్నారు. కోతాలు పెరుగుతున్నాయే కాని తగ్గే సూచనలు లేవు.

రాజేష్ జి said...

$Rao S Lakkaraju గారు

ఆలస్యంగా స్పందిస్తున్న౦దులకు క్షమించగలరు.
పైన టపా మూలం చదివినప్పుడు నాకు పలు వాస్తవకోణాలు కనిపించాయి, అది ఒక్క దళితులకే కానక్కర్లేదు. అందరూ చక్కగా చర్చించే అవకాశముందని తెలుగీకరించా. అయితే మీరు తప్ప ఎవరూ ఆసక్తి చూపించకపోవడం దురదృష్టకరం. ఏవైనా
టపా మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు పంచుకున్నందుకు శతధా ధన్యవాదాలు.

#..పరిష్కారం బలహీనుడు బలహీనుడని గ్రహించి సహాయం అడగటం...
మీరు చెప్పింది నిజం. వాస్తవంలో ఇది జరగాలని కోరుకుందాం. అదేవిధంగా సాయం చేద్దామనుకున్న బ.హీ ముందు తాను బలపడి సాయం చేస్తే దానికో విలువ వుంటుంది అన్నదీ నా అభిప్రాయం.

#ఏ విధంగా సరిచెయ్య గల౦?
మీరు చెప్పిన పరిష్కార కోణం సమస్యలని పూర్తిగా తుడిచివేస్తుంది. మంచి ఆలోచన.

#..డబ్బులిచ్చి రిజర్వేషన్లు..జరిగేది..తక్కువ. ఒక విధంగా..ఇది సమాజంలో చీలికలు తీసుకు రావటమే.

వాస్తవానికి రిజర్వేషన్లు సమాజంలో అసమానతలు తొలగిపోవడానికి మొదలు పెడితే అవి సమాజంలో చీలికలకి తనవంతు పాత్రపోషించడం నిరసించతగినదే. అంత మాత్రాన రిజర్వేషన్లు ఉండకూడదు అనుకోకూడదు అని నా అభిప్రాయం. పైన చంద్రభాన్ గారు చెప్పినట్లు ఉచితఫలాల(రిజర్వేషన్లు) మూలఉద్దేశ్యం నెరవేరినరోజు వాటిని అనుభవించినవారు వాటిని తృణీకరించి సమసమాజానికి దారి చూపాలి.

#కొన్ని అక్షరాలు సంస్కృతం నుండి తెచ్చుకున్నాము. తప్పేమిటి ?

తప్పేమీ లేదు. తమ పుత్రికాపుత్రరత్నాలను భూమ్మీద అడుగిడింది మొదలు వారిని ఆంగ్లభాషలో ఆడిస్తూ పైకి తెలుగుభాషాభిమానులుగా నటించేవారిదే తప్పు. అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్న చందాన సంస్కృత భాష మీద పడి ఏడవడం. మొన్నేవరో శుభోదయం సంస్కృత పదమని, "మేలిపోద్దులు" తెలుగని అదే వాడమని బుగ్గనొక్కి మరీ చెబుతుంటే ఇదో భాషాదురభిమానమని అనిపించింది. తమిళులూ భాషాభిమానం ఉంటుంది.. అయితే వారు ఆంగ్లానికి, ఇతరభాషలకి సమానదూరం పాటిస్తారు. మరిక్కడ ఆంగ్లం ముద్దు, సంస్కృతం వద్దు :P! పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్న చందంలాగా

#ఎన్ని భాషల నుండో తెచ్చిన పదాలు వాడతాము.

నిజానికి ఆంగ్ల భాష అభివృద్ది ఇలానే జరిగింది, జరుగుతూఉంది. ప్రతిసంవత్సరం వారు ఇతరభాషలనుంచి పదాలు తీసుకుని తమ పదాలను పొందించుకుంటూఉంటారు.మూల౦లేకుండా స్వచ్చమైన ఆంగ్లపదాలు బహుతక్కువ.

రాజేష్ జి said...

$Snkr గోరు
#వద్దులేండి బాబూ..

మీ వాఖ్యలోని వాస్తవాలను అర్థం చేసుకోగలను. :-)

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers