త్వరిత వర్గాలు
సమకాలీనం
(12)
తలంటు
(8)
బ్రాహ్మణ విద్వేషం
(5)
ఆత్మగౌరవం
(3)
ఆధిపత్య౦
(3)
కనుమరుగవుతున్న నిజాలు
(3)
భారతీయం
(3)
లండనీయం
(3)
సామ్రాజ్యవాదం
(3)
Anti-Brahmin
(2)
అణగదొక్కుట
(2)
తెలంగాణ
(2)
సత్యసాయి
(2)
సమకాలీన౦
(2)
అమ్మఒడి
(1)
ఉల్లాసం
(1)
గోద్రా
(1)
ఛా౦దసవాదం
(1)
జాతీయవాదం
(1)
దుస్వప్నం
(1)
నివేదన
(1)
పాట
(1)
ప్రచార మాధ్యమాలు
(1)
ప్రచారం
(1)
బాబా
(1)
మతరాజకీయాలు
(1)
మార్క్సిజం
(1)
వామపక్షం
(1)
వాస్తవం
(1)
శాంతి
(1)
శాంతి కపోతం
(1)
శ్రామికం
(1)
సంస్కృతి
(1)
సాయం
(1)
సాయంసంధ్య
(1)
Friday, 12 August 2011
అణగదొక్కబడినవారి కడుపుమంటతో కాలిపోతున్న హైదరాబాద్!
నాడు రవి అస్తమించని సామ్రాజ్యమని జబ్బలు జరుచుకున్న ఆంగ్లేయులు(బ్రిటిష్) దోచుకున్న ఆస్తులకి ఆలవాలమైన లండన్ మహానగరం నేడు అణగదొక్కబడినవారి కడుపుమంటతో గత మూడు రోజులుగా దహించుకుపోతుంది.
ఆజ్యం:
లండన్ ఉత్తరప్రాంతమైన టోటెన్‌హామ్ వీధిలో ఆఫ్రో-కరీబియన్ జాతికి చెందిన నల్లవారు ఎక్కువగా నివసిస్తారు. ఇదే వీధిలో మొన్న శనివారం మార్క్ డగ్గన్ అనే నల్లజాతి యువకుని పోలీసులు అనుమానాస్పదరీతిలో కాల్చిచంపడం. జరిగిన అనాగరిక సంఘటనపై ఇదే ప్రాంతంలోని వివిధ మిశ్రమజాతులు శాంతియుతంగా తలపెట్టిన నిరసన ప్రదర్శన ఆనక హింసాత్మకమై విధ్వంసానికి దారి తీసింది.
అగ్ని:(సాక్షి పత్రిక సౌజన్యంతో)
౧.అభివృద్ధి పేరు మీద సమాజంలో సాగే కార్యకలాపాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడమేకాక వారిని దూరంగా నెట్టేయడం
౨.సమాజానికి ఏం చేశామనేది పోయి ఏమి కొన్నామనే దాన్నిబట్టి మనిషిని అంచనా వేయడం, విలువనివ్వడం. అవి కొనలేని వారిలో నిరాశను ప్రేరేపిస్తున్నాయి.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
౩.ఆంగ్లేయ జాతి జాత్యహంకారపు మచ్చలు.
౪.నల్లవారిని, ఇతర అల్పసంఖ్యాక జాతులవారిని వెలి వేసినట్టు నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితం చేయడం, వారిపై నిరంతరం పోలీస్ నిఘా ఉంచడం, రోడ్డు మీద వెడుతున్నవారిని ఆపడం, సోదా చేయడం, వేధించడం జరుగుతుంటుంది. డగ్గన్ ని పోలీసులు కాల్చిచంపడం ఇటువంటి వేధింపుల పాశవికపార్శ్వమే తప్ప మరొకటి కాదు.
పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
శరణార్థి శిబిరాలను తలపించే లండన్ వెలివాడలలోని యువత ఇలా ఆగ్రహోదగ్రంగా విరుచుకుపడడానికి దుగ్గన్ కాల్చివేత ఇంధనం అందించి ఉండవచ్చుకానీ, అదొక్కటే కారణం కాదు. దాని మూలాలు బ్రిటన్‌నే కాక, మొత్తం యూరప్‌ను అట్టుడికిస్తున్న ఆర్థికసంక్షోభంలో ఉన్నాయనడం అత్యుక్తి కాదు. గత పాతికేళ్లుగా బ్రిటన్ వృద్ధి స్తంభించిపోయింది. జనాభాలో పదిశాతం ఉన్న సంపన్నులు నూరుశాతం నాణ్యమైన జీవనం సాగిస్తుంటే పేదలు మరింత అడుగంటిపోతున్నారు. సామాజిక ఊర్ధ్వచలనం బ్రిటన్‌లో ఉన్నంత దారుణంగా మరే అభివృద్ధి చెందిన దేశంలోనూ లేదని నిపుణులు అంటున్నారు.
ఉన్నత పాఠశాల విద్యతోనే చదువు మానేసిన యువత సంఖ్య మరే పాశ్చాత్యదేశంలో లేని స్థాయికి బ్రిటన్‌లో పెరిగిపోయి, ఒక తరం మొత్తాన్నే తుడిచిపెట్టింది. బ్రిటన్ యువతలో విద్య, ఉద్యోగం, ఉపాధి శిక్షణ లేనివారు ఏకంగా 17 శాతం ఉన్నారు. దీనికితోడు రుణసంక్షోభంతో యూరప్ మొత్తం గుడ్లు తేలేస్తోంది. దీనినుంచి గట్టెక్కే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ సంక్షేమవ్యయంపై భారీగాకోత పెట్టి, పొదుపుచర్యలు ప్రారంభించడం పేదవర్గాలకు, నిరుద్యోగులకు మరింత ప్రాణాం తకమైంది. విద్యార్థులు, కార్మికులు సహా అన్ని వర్గాలవారూ వీధికెక్కి నిరసన ప్రదర్శనలు జరపడం దాదాపు నిత్యకృత్యమైంది. లండన్ నగరాన్ని అతలా కుతలం చేస్తున్న తాజా అల్లర్లను కూడా ఆ కోణంనుంచే చూడవలసి ఉంటుంది.
తాము ఒళ్లు వంచకుండా, తమ చేతికి మట్టి అంటకుండా చూసుకోవడంతోపాటు, ఖర్చు తగ్గించుకోవడం లక్ష్యంగా తృతీయ ప్రపంచ దేశాల నుంచి లభించే చవక శ్రమపై ఇంతకాలం పాశ్చాత్య సమాజాలు ఆధారపడుతూ వచ్చాయి. జాతుల సహజీవనం, సామరస్యం, ప్రజాస్వామ్యం వంటి అందమైన మాటల ముసుగులో వలసలను ప్రోత్సహించాయి. ఇప్పుడు ఆర్థికసంక్షోభం తమ జీవనభద్రతనే ప్రశ్నార్థకం చేస్తూ, తమ యువతనే నిరుద్యోగ రక్కసి కరకు కోరల్లోకి నెడుతుండడంతో ఒక్కసారిగా పాశ్చాత్యేతరజాతుల ఉనికి కంటగింపుగా మారిపోయింది.
ప్రజాస్వామ్యం, జాతుల సహజీవనం వంటి ముసుగులు తొలగిపోయి స్వార్థం, క్రౌర్యం తాండవించే అసలు ముఖం బయట పడుతోంది. అది నాజీయిజాన్ని తలపించే జాతివివక్షా విషాన్ని పుక్కిలిస్తోంది. మొత్తం మీద పాశ్చాత్యముఖచిత్రంలో రంగులు మారడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రపంచాన్ని కొల్లగొట్టిన సంపద కరిమింగిన వెలగపండుగా మారి, పాశ్చాత్యపు ఓడలు బళ్లవుతున్నాయా? కాలం ఎలాంటి కఠోరసత్యాలను ఆవిష్కరించనుందో?!
శీర్షికలో హైద్రాబాదేల?:
పైన లండన్లో ఉదహరించిన పరిస్థితులు ఒక మోతాదు ఎక్కువగానే ఆంధ్రలో నెలకొనివున్నాయి. త్వరలో హైదరాబాదు నగరం ఇదేవిధంగా తగలబడకుండా చూసుకోవడమే లండన్ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం. తగలబడిన తరువాత శాంతిమంత్రాలు వల్లెవేస్తే ఉపయోగం ఉండదు. నిజానికి నేడు "శాంతి" అనేది చేవలేని, చేతగాని వాని మాట-బాట ఆయితే, దాన్ని స్వార్ధానికి వాడుకుంటూ తమపై ఈగవాలకుండా చూసుకునే నిర్లజ్జతత్వం అణగదొక్కుతూ అందలమెక్కిన పెట్టుబడిదారులనే కులపెత్తందారులది. దశాబ్దాల తరబడి శాంతి, శాంతి అంటున్న బౌద్దటిబెటన్లకు తమ స్వంతదేశంలోనే స్వేచ్ఛావాయువులు కరువైన పరిస్థితి. అదే శాంతి బౌద్ధం శ్రీలంకలో తమను అణగదొక్కాలనుకున్న పులుల పీచమణిచి నేడు శాంతిని నెలకొల్పి అభివృద్దిపధంలో ముందుకువెళుతున్నారు. సామాన్యుల తెలంగాణ పోరాటానికి ఇది స్పూర్తినివ్వాలి!
Labels:
అణగదొక్కుట,
ఆత్మగౌరవం,
ఆధిపత్య౦,
తెలంగాణ,
సమకాలీనం,
సామ్రాజ్యవాదం
Monday, 8 August 2011
అణగదొక్కడంలో అధునాతన పద్దతులు - 1
అది 2020 సంవత్సరం.
అటుపక్క తెలంగాణా రాష్ట్రం ఏర్పడి సుభిక్షంగా ఉంది. ఇటు ప్రత్యేకదేశమనే కులభుజంగాలు బుసలు కొడుతూ చీమలు కష్టపడి పెట్టిన పుట్టలని ఆక్రమించుకుని దానికి భుజంగదేశమని పేరు పెట్టి విషభావాలు చిమ్ముతున్దేవి. ఇక షరా మామూలుగానే ఆంధ్రదేశం. తాము కులగజ్జితో గోక్కుంటూ ఉండడమే కాక అన్ని కులాలకి ఆ గజ్జి ఉందని తమ మిధ్యమాలతో రుద్దుతూ పచ్చకామెర్ల సామెతని గుర్తుచేస్తున్న రోజులవి.
అలా ఒకరోజు ఆంధ్రదేశమున అనగా స్వకులనామసంవత్సర కులతిధి కులవారం..
కులాలకతీతంగా హైందవధర్మమే ఆవలంబనగా ఏర్పడిన ఒక జాతీయభావన సంఘ౦లోని(జా.స) యువసమ్మేళన సమావేశమది. కులం లేదు, హైన్దవులందరూ ఒకటేనని ఆవేశంగా ఉపన్యసిస్తున్నారు నాటి సమావేశపు ముఖ్యఅతిధి మహా'కుల'నాయకుడు(మకునా) గారు. హైందవధర్మానికి నేడు ఇతరమతాల వల్ల ముప్పు ఏర్పడిందని దానికి వ్యతిరేకంగా జా.స యువకులంతా పోరాడాలని పిలుపునిస్తున్నాడు మకునా. శ్రద్దగా వింటున్న యువతలో భావోద్వేగాలు రెచ్చిపోతున్నాయి. కొంతమంది యువతలోతమ జీవితాన్ని త్యాగం చేసయినా ఏదో ఒకటి చేసి ధర్మాన్ని రక్షించుకోవాలన్న తపనని బయటికి వ్యక్తపరుస్తున్నారు. వీటిని గమనించిన మకునా మరింత ఉత్సాహంగా అంతే మోతాదులో వాడి వేడి మాటలు వాడి తన ఉపన్యాసాన్ని దంచుతున్నాడు యువత మెదళ్ళమీద.
ఇలా వాడిగా వేడిగా ఉపన్యాసం సాగుతుండగా మకునా వ్యక్తిగత సహాయకుడు(వ్య.స) మకునా చెవిలో ఏదో చెప్పాడు. వ్య.స హావభావాలని బట్టి అదేదో అత్యంత అవసరమైన విషయం అన్నట్లు తెలుస్తుంది. మకునా గారు తన దంచుడు ప్రసంగాన్ని మధ్యలోనే హఠాత్తుగా ఆపారు. తను అత్యవసరంగా హాజరుకావాల్సిన పని ఉందని మరోసారి పిలుపునిస్తానని చెప్పి వేదికనుంచి హాడావుడిగా దిగిపోయి కారెక్కారు. వేదిక నుంచి కారెక్కేవరకూ వ్య.స ని బండబూతులు తిడుతూనేఉన్నాడని తెలుస్తుంది. ఇహ అప్పటిదాకా "రెచ్చగొట్టుడు" అనే నవనాగారికపు మత్తుపదార్ధాన్ని మెదళ్ళద్వారా సేవిస్తున్న అక్కడి యువత తమ భావోద్వేగాలని అడ్డూఅదుపూ లేకుండా స్వారీ చేస్తున్న ప్రసంగం హఠాత్తుగా ఆగిపోవడంతో కించిత్ అసహనానికి లోనైనా తమ మకునాకి ఏమైందో? అన్న తీవ్రఆందోళన వ్యక్త౦చేస్తున్నారు.
"నువ్వు అంత అత్యవసర సమావేశం ఉందని ముందు ఎందుకు గుర్తుచేయలేదు?" అని కొత్తగా తనదగ్గర చేరిన వ్య.సని ఏకుతున్నాడు మకునా కారులో. మీకీ జాతీయభావన సమావేశం ముఖ్య౦ అనుకున్నాను. కానీ అవతలి సంఘం వాళ్ళు పదేపదే ఫోన్ చేయడంతో మీకు చెప్పక తప్పలేదని వ్య.స సమాధానం ఇస్తున్నాడు. వ్య.స సమాధానాన్ని వినకుండా నీకు ఏది ముఖ్యమో ఆ మాత్రం తెలియకపొతే ఎట్లా అంటూ ఏవో బండబూతులు తిడుతున్నాడు మకునా.
కారు సరాసరి ఒక పెద్దభవనం ముందు ఆగింది. అది మకునా యొక్క స్వకులపు యువ'కుల'సంఘ (యుకుస) సమావేశం. వీరికోసం అక్కడ అప్పటికే పడిగాపులు కాస్తూ వేచివున్న యువ'కుల'నాయకుడు(యుకునా) మకునాకి ఘనస్వాగతం పలికాడు. తన ఆలస్యానికి వ్య.స కారణమని యుకునాకి చెబుతూ, పైకి చెయ్యెత్తి ఊపుతూ అక్కడి యువకులందరికి ఆశీస్సులు అందజేస్తూ వేదికని అలంకరించాడు. మకునా తమ కులానికి చేసిన గొప్పపనుల గురించి చెబుతూ యుకునా స్వాగతోపన్యాసం చేశాడు. తర్వాత మకునా చేత తమ కుల యువ'కుల'కు ధనసహాయాన్ని అందించాడు. అటుపిమ్మట అందరూ ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న మకునా గారి కులోపన్యాసం మొదలైంది. సమాజంలో వచ్చే సామాజిక పెనుమార్పులకు తట్టుకుని తమ కులాధిపత్య కూకటివ్రేళ్ళు కుళ్లకుండా భవిష్యత్తు కార్యాచరణ ఏవిధంగా ఉండాలనే దాని మీద మకునా ఏకబిగిన ఇస్తున్న కులోపన్యాసానికి తన్మయులై చెవులుకిక్కిరించి మరీ వింటున్నారు భావిభారత యువ'కులం' అని చెప్పుకునేవాళ్ళు.
ఇహ ఇప్పుడు ప్రశ్న-సమాధానం.. సమస్య-పరిష్కార సమయం. మకునా గారు తన కులానుభావన్నంతా రంగరించి భావిభారతాన్ని ఇంకో రెండువేల ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళే సమయం.
అత్యంతఉత్సాహంగా గోక్కుంటూ యుకునా లేచాడు ముఖమంతా ప్రశ్నలా పెట్టి. మిగిలిన యువ'కులంతాను' అదే రీతిలో గోక్కుంటూ చప్పట్లు కొడుతూ యుకునాకి ఉత్సాహాన్నిచ్చారు. యుకునా గొంతు సవరించుకుంటూ తన ప్రశ్న అడగటం మొదలుపెట్టాడు.
మకునా గారు... ఒకనాటి అంధకార ఆంధ్రప్రజలంతా నేడు క్రమంగా 'పచ్చ'కామెర్ల నుంచి బయటపడి సామాజిక వాస్తవాలు, స్థితిగతులు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మన కులాధిపత్యాన్ని ధిక్కరిస్తున్నారు. వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కులగజ్జిని విమర్శిస్తున్నారు. వీరిని ఎలా ఎదుర్కోవాలో మన యువకులానికి అర్ధం కావడం లేదు. మీరు తక్షణ కర్తవ్యబోధ చేయగలరు.
ఇంతలో యువకులగుంపు లోంచి ఒక యువ'కులకిశోరుడు' ఉద్రేకంతో ఊగిపోతూ " అడ్డంగా వేసేద్దాం ఆ నా లం.కొ..." అంటూ తన కులాభిమాన కథానాయకుడు పూనినట్లు హావభావాలు ప్రదర్శించి మరీ చేసిన ధనసహాయానికి కృతజ్ఞత ప్రకటించుకోవడానికి ఇదే సమయమని రాయలేని బూతులతో రెచ్చిపోతున్నాడు. ఇహ ఇట్టా కాదన్నట్టు యుకునా "ఆ మాత్రం నాకూ తెలుసన్నట్లు" సంజ్ఞ చేసి సదరు కులకిశోరుడి గోక్'ప్రవాహానికి అడ్డుకట్టవేసి తను కొనసాగాడు.
ఆనాడు మనకుల'గజ్జి వ్యతిరేకులని రాజకీయ సామాజిక(కుల) బలంతోనో లేక ధనమద రూపేణానో పైకిరాకుండా అణగతొక్కాం..అడ్డు తిరిగినవాడిని వేసేసాం..మనం అందలం ఎక్కాం. ఆ తొక్కుడు పైకి రాకుండా మిధ్యమాలని వాడుకున్నాం. కానీ ప్రపంచమే కుగ్రామమైన నేటి నెటిరోజుల్లో ఎవరు ఎక్కడ్నించి విమర్శచేస్తున్నారో తెలుసుకోవడమే చాలా కష్టం. అలాంటిది "వేసేయడం" అస్సలు కుదరడం లేదు. అదే విధంగా నాడు మనచేత అణగదొక్కబడిన వాళ్ళు నేడు వాస్తవాలు తెలుసుకుంటున్నారు... అంతేకాకుండా మన పచ్చకామెర్ల మిధ్యమాలకి నేటి ఆత్మ'సాక్షిలు సవాలు విసురుతున్నాయి. ఈ పరిస్థితులలో వీటిని ఏవిధంగా ఎదుర్కోవాలో మన యువకులానికి అర్ధం కావడంలేదు. మీరు ఈ విషయమై సందేశం ఇవ్వగలరని ఆశిస్తున్నా అని ముక్తాయించాడు యుకునా.
నేటి సందిగ్ధ పరిస్థితులని ఎలా ఎదుర్కోవాలో తన స్వకుల యువతకి సందేశం ఇవ్వడానికి సిద్దమయ్యాడు మకునా. "వేసేయడం" సమస్యకి పరిష్కారం కాదు. ఒకవేళ వేస్తూ పొతే ఎంతమందిని వేస్తారు? అన్నట్లు యువతని ప్రశ్నించాడు. మరయితే పరిష్కారం ఏంటి? అన్నట్లు యువత అంతా ఏంతో ఆసక్తిగా మకునా వైపు చూస్తూ తర్వాత ఏమి చెపుతాడోనని చెవులు కిక్కిరించి మరీ వింటున్నారు. వీరి ఆసక్తిని గమనించిన మకునా ఒక విషపునవ్వు నవ్వి గొంతు సవరించుకుంటూ దానికి పరిష్కారం ఒకటే. అది "వ్యతిరేకులను అణగదొక్కడానికి అధునాతన పద్దతులు వాడడమే! " అని ఆపాడు.
అణగదొక్కడమే అనాగరికమైతే మళ్ళీ అందులో అధునాతన పద్దతులా!.. ఎప్పుడూ వినలేదే అన్నట్లు యువకులంతా ప్రశ్నార్థకంగా మకునా వైపు చూసారు.
(సశేషం)
Saturday, 16 July 2011
దయచేసి....
గీతా..ఎమి తెమ్మంటావు చెప్పు? |
నిన్న తెల్లవారుఝామున అమ్మఒడి ఆదిలక్ష్మి గారి ఇంటినుంచి ఫోన్. లెనిన్ గారి ద్వారా వారి గారాల పట్టి గీత ఇకలేదన్న విషయాన్ని తెలుసుకుని కాసేపటివరకూ తేరుకోలేకపోయాను. భోరుమని విలపిస్తున్న ఆదిలక్ష్మిగారిని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ఇక ఈ హృదయవిదారకమైన వార్త తోటివారికి ఏ విధంగా చెప్పాలో తెలియలేదు..చివరికి ఇలా..!
తను మనసా వాచా నమ్మిన సత్యంకోసం జీవితంలో ఇప్పటికే ఎన్నోకష్టానష్టాలకు ఓర్చుకుని ఎదురీదుతున్న ఆదిలక్ష్మి గారికి ఇది తట్టుకోలేని కష్టం. తనకి ఆత్మీయులు, అయినవారు అంటే తనను ఎంతో అభిమానించే బ్లాగర్లు అని ఆమె ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ తల్లడిల్లుతున్న తల్లి మనసు తనకు తానుగా ఊరడిన్చుకునే శక్తినివ్వాలని ఆ దేవదేవుడ్ని కోరుకుందాం. ఆ తల్లికిప్పుడు ఓదార్పు కావాలి..వారికి మనమూ పిల్లలమే అన్న రీతిలో.. ఆమెపై అభిమానం ఉన్నవారు దయచేసి వారిని వ్యక్తిగతంగా @
ప్లాట్#83, Road No#4, Balaji Nagar, Nizampet , Hyderabad
లేదా ఫోన్ ద్వారా
91-9440971265 ( ఒక విన్నపం: ఆదిలక్ష్మి గారు తీవ్రమైన వేదనలో ఉన్నారు. ఫోన్ ద్వారా మనం ఇది అని తెలిస్తే వారికి బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. అందువల్ల ఫోన్ ని లెనిన్ గారి దగ్గర ఉంచుకోమని, బ్లాగర్లు ఎవరైనా ఫోన్ చేస్తే తననే మాట్లాడమని చెప్పా. మీరు ఫోన్ చేసినపుడు ఆడగొంతు వింటే లెనిన్ గారికి ఫోన్ ఇవ్వమని చెప్పండి. లెనిన్ గారి ద్వారా ఆదిలక్ష్మి గారి పరిస్థితి తెలుసుకుని, దానిని బట్టి మీ అనునయవ్యాక్యాలు తెలుపగలరు )
కృతజ్ఞతలు మీకు!
గీతా..., మామయ్యా ఏమి తెస్తావు నాకు లండన్ నుంచి అంటూ నేనొచ్చేలోపే...! నీ ఆత్మకు ఆ దేవదేవుడు శాంతి కలిగించుగాక.
ఇక చివరిగా.. గీత చాలా తెలివైన అమ్మాయి..అరిందానిలా మాట్లాడేది. ఆ పసిమనసు ఎక్కడో తీవ్రంగా గాయపడింది. అంతే.. దయచేసి గీత మరణానికి కారణాలుగా మన ఊహాగానాలు జోడించవద్దని మనవి. ఈ సమయంలో ఆ తల్లిని ఒదార్చడమే మన తక్షణ కర్తవ్య౦.
Thursday, 7 July 2011
అ అంటే అమ్మఒడి
నిజవే.. ఆ అంటే అమ్మ.. ఆ 'అమ్మఒడి'లోనే తొలిమాటలను ముద్దుముద్దుగా పలుకుతూ తడబడుఅడుగులు వేస్తూ ఎదుగుతారు పిల్లలు. ఇక మన బ్లాగ్లోకంలో అమ్మఒడి గారంటే బహుశా తెలియనివారుండరు. ఈ 'అమ్మఒడి'లో చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా సామాజిక విజ్ఞానాన్నికావలసినంత సముపార్జించుకోవచ్చు. రామాయణం నుంచి నేటి సమకాలీన రాజకీయాల వరకు సామాన్యుడికి సైతం అర్ధమయ్యే రీతిలో చెప్పడం ఒక ఎత్తయితే వాటిని నేటి సమాజ పరిస్థితులకు అనుసంధానిస్తూ వలువలూడిపోతున్న మానవవిలువలను, రీతులను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ముందుకుపోవడం ఆమె ప్రత్యేకత. వారే అమ్మఒడి ఆదిలక్ష్మి గారు.
బాల్యంలోనే పిల్లల వెన్నుని గట్టిపరచాలన్న రామకృష్ణులవారి సూక్తిని మనసా వాచా ఆచరిస్తూ ఇప్ప్దటివరకూ ఉపాధ్యాయవృత్తి ద్వారా ఎంతోమంది యువతకి తన జ్ఞానసముపార్జనని పంచి సమాజంలో ఉత్తములుగా తయారయ్యే భావాలని మనసులో అనుభవసారంతో నాటారు. నేడు సామాజిక, ఆధ్యాత్మికత కలగలిపిన తన విజ్ఞానాన్ని మరింతమందికి పంచాలనే ఉద్దేశ్యంతో భగవద్గీత స్పూర్తితో అంటూ అమ్మఒడి విద్యాక్షేత్రాన్ని ఏర్పాటుచేశారు.
ఇక వారి మాటల్లో...
భగవద్గీత స్పూర్తితో అయిదు సూత్రాల నియమావళి:
Ø నేర్చుకునే తత్వం
Ø స్థిరబుద్ధి (ఏకాగ్రత)
Ø భావ ప్రసార నైపుణ్యం
Ø క్రమశిక్షణ
Ø శ్రమించే గుణం
చిన్నారులు తమ బాల్యానందాన్నీ మాధుర్యాన్నీ కోల్పోకుండా!
Ø నేర్చుకునే తత్వం: నేర్చుకునే తత్వాన్ని నేర్చుకున్న వ్యక్తులు, అక్షరాలు అంకెలే కాదు, ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోగలరు.
Ø స్థిరబుద్ధి (ఏకాగ్రత): భగవద్గీత మనల్ని స్థిర బుద్ధిని సాధించమంటుంది. స్థిర బుద్ధి, ఏకాగ్రత సాధిస్తే, జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు.
Ø భావ ప్రసార నైపుణ్యం: భావ ప్రసార నైపుణ్యం గల వ్యక్తులు, నాయకులుగా ఎదుగుతారు. కథలు, పజిల్స్ ద్వారా చిన్నారులలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించగలం.
Ø క్రమశిక్షణ: శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు ‘బాల్యంలోనే పిల్లల వెన్నుని గట్టి పరచాలని’ చిన్నారుల మనస్సులలో క్రమశిక్షణా బీజాలు నాటితే, వారు బలమైన వ్యక్తిత్వం గలవారిగా ఎదుగుతారు.
Ø శ్రమించే గుణం: విజయానికి దగ్గరి మార్గాలు లేవు అంటారు పెద్దలు. చిన్నారులలో వారి స్థాయికి తగినట్లుగా శ్రమించే గుణాన్ని అలవర్చగలం.
· చిన్నారులు తమ బాల్యపు ఆనందాల్నీ, మాధుర్యాన్నీ కోల్పోకుండా చదువులను ఆస్వాదించాలి.
· స్కూల్ కి రావడం అంటే అది వారికి వినోద యాత్రకు వెళ్ళినట్లుగా ఉండాలి.
· అదో అద్భుత లోకంగా చిన్నారులు భావించాలి.
అందుకే మా స్కూల్ ని (విద్యాక్షేత్రాన్ని) “అమ్మఒడి” అంటున్నాము.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9440971265, 8179977915, 9177541822
************************************************************************************************************
వారి ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగి అ అంటే అమ్మఒడి అన్నరీతిలో అమ్మఒడి విద్యాక్షేత్రం పేరుతెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన వారి నిస్వార్ధ ప్రయత్నానికి తోడుగా, మద్దతుగా నా నుంచి చేయగలిగే చిన్న సహాయమే ఈ టపా. ఎందుకంటే అమ్మఒడి ఆరంభమయింది.. ఇక విస్తృత ప్రచారం కావాలి. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మెయిల్స్/ఇతర మార్గాలా ద్వారం ప్రచారం సులువైనదీ..ఖర్చులేనిది..ఆయితే కొంత మనసు ఉండాలి మంచికి మద్దతు ఇవ్వడానికి. ఆ ప్రచారంలో భాగమే ఈ టపా. మీరు కూడా ఈ విద్యాక్షేత్రాన్ని మరింతమందిలోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కలిపించాలనుకుంటే వివరాలకోసం నాకో ఉత్తరం పెట్టగలరు. rajeshgottimukkala@gmail.com
Thursday, 30 June 2011
గొర్రెలు..గొర్రెలివి.. తరతరాలుగా మోసపోతున్న గొర్రెలు..
గొర్రెదాటు ధోరణి, గురివింద నైజం నేటి లోకం పోకడ
సమాజ కుతర్కమెరుగని గొర్రె తనని మహాగొప్పగా మేపుతుంటే అదంతా తన మీద ఉండే అభిమానం అనుకుంటుంది. ఆయితే తనకిచ్చిన కండబలుపు మరొకరి శరీరబలుపుతత్వం నింపడం కొరకే అన్నది గ్రహించేలోపే బలిపశువయ్యు౦టుంది. మరి దీన్ని గమనించిన మిగిలిన గొర్రెలు ఏవైనా సామాజిక పాఠాలు నేర్చుకుంటాయా అంటే అది శూన్యం. ఎందుకంటే అలా బలిపశువవ్వడం తమకు తరతరాలనుంచి వచ్చిన గొప్పవారసత్వంగా భావించడమే. భావించడమే కాదు ప్రతిఘటించలేని తమ జడత్వానికి మంచితనమనే మందమైనబొచ్చు కప్పి మురిసిపోతూ తమ వారసులకు అదే జడత్వాన్ని అందించడానికి సిద్దమవుతుంటాయి. ఆవిధంగా గొర్రెలు తరతరాలుగా మోసపోతూ ముందుకుపోతూ ఉంటాయని మరి నేను మనవి చేసుకుంటున్నా. నిజవే.. పాపం బుర్రలేని గొర్రెలు మోసపోవడం బలిపశువులవ్వడం సహజమే. మరి బుర్ర ఉండి ఉన్నత చదువులతో ఊరేగే మడిసి మాటేమిటి?
"గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి. గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి" అని అన్నారు సమాజాన్ని క్షుణ్ణంగా చదివిన ఓ సినీరచయిత. ఇక్కడ జ్ఞానం అంటే పట్టాలు,పచ్చళ్ళు(PhD) కాదు. వాదాలు,వర్గాలు, వైరాగ్యాల మీద పట్టు అంతకన్నా కాదు. సమకాలీన సామాజిక పరిస్థితుల మీద అవగాహన పెంచుకొని ఆచరణలో తర్వాతి తరాలకు ఆదర్శమవ్వమని అర్ధం. ఆయితే ముందుగా చెప్పుకునట్లు గొర్రెగా బతకడం అలవాటు చేసుకున్న తరాలని ఎత్తిచూపుతూ "వారు గొర్రెదాటు మందే.. ఇక మీ సమాజబోధ దేనికని" అని మొహంమీద కొట్టినట్లు అడిగి కడిగి వదిలిపెట్టారా సామాజిక రచయిత. గొర్రెదాటు ధోరణి, గురివింద నైజం నేటి లోకం పోకడని చెప్పకనే చెప్పారు.
ఇంతకీ "గొర్రెదాటు" అంటే? జీవితాన్ని కొనసాగించడానికి గొర్రెలకు పెద్దగా తెలివి'తేట'లు,పట్టాలు, పచ్చళ్ళు ఉండాల్సినవసరం లేదు. ఉదాహరణకి, ఒక గొర్రెలగుంపు వ్యాహాళికి వెళుతుంటే వాటికో అడ్డు(కంప/ఏదైనా) వచ్చింది. అప్పుడు గుంపుమొదట్లో ఉన్న గొర్రె అడ్డుమీదనుంచి ముందుకు గెంతుతుంది. ఇంతలో అది గమని౦చిన గొర్రెలకాపరి అడ్డు తొలగిస్తాడు. ఆయితే అప్పటికే ముందున్నగొర్రె అడ్డును ఎలా దాటిందో గమనించిన మిగిలిన గొర్రెలు తరువాత ఒకదాని వెంట మరొకటి అదే విధంగా గెంతుతూ దాటుతాయి అక్కడ అడ్డేమీ లేకపోయినా కూడా. ఇదీ "గొర్రెదాటు వైనం". మరైతే ఏందయ్యా నీ గొర్రెగోల అంటారా? అక్కడికే వస్తున్నా... సదరు సామాజిక సినీరచయితగారు చెప్పినట్లు గొర్రెదాటుగా అనుసరించడం, గుడ్డిగా జీవితాన్ని గడపడంలో తెలివిగల మడిసికి, తెలివిలేని గొర్రెలకూ ఆట్టే పేద్ద తేడా కనిపించదు. రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి ఇక్కడ. మొదటిది "అక్కడొక అడ్డు ఉంది" అన్నమాట వాస్తవం అని తెలుసుకోవడమైతే రెండవది తాము తొలుత కొంత కష్టపడైనా ఆ "అడ్డు" తొలగిస్తే తర్వాత వచ్చే తరాలు అనవసరంగా శ్రమించాల్సిన(కష్టపడి గెంతాల్సిన) అవసరం ఉండదనీ..గొర్రెలుగా బతకాల్సిన అవసరం అసలే ఉండదనీ..గుర్తించడం. ఇహ ఒకవేళ ఎవరైనా సామాజికమంటూ సలహా ఇస్తే తమ గొర్రెదాటుకి భుజాలు తడుముకోవడమేకాక పైపెచ్చు మా ముందుతరం కూడా ఇలానే మోసపోతూ గొర్రెదాటు జీవితం బతికింది. మేం కూడా అలా బతకడంలో రెండాకులు ఎక్కువే తిన్నాం అంటారు. అలా అనడమే కాదు ఆ రెండాకులతో ఓ ముళ్ళకిరీటం తయారుచేసి తమ తర్వాతితరాల నెత్తిన పెట్టడానికి సిద్దమవుతుంది. ఇహ "ఇదేలే..తరతరాల గొర్రెదాటు చరిత్ర.. మూలిగే జీవితాల మథనం" అంటూ పాడుకోవాలి. ఇదీ సంగతి.
ఉన్నతచదువులు చదివి నవనాగరికం మాసొత్త౦టూ డొప్పాలు కొట్టుకుంటూ గొర్రెదాటు జీవితాన్ని, తాత్కాలిక లాభాల కోసం బలిపశువలయ్యేవిధానం మీద ఒక ప్రత్యక్ష్య ఉదాహరణ ఇచ్చి ఈ "గొర్రెదాటు" తనానికి స్వస్థి చెప్పే ప్రయత్నం చేస్తా :)
లండన్ మహానగరం. ఈ శతాబ్డపు ప్రపంచీరణకు(golbalization) సరికొత్త నమూనాగా భాసిల్లుతూ, యూరప్లోనే అత్యంత విలాసవంతమైన నగరంగా, రోజుకు కోట్లకొద్దీ వర్తకమారకం జరిగే పేరున్న లండన్లో ఒక సంవత్సరకాలం పైగా జరుతున్న మోసం..కాదు వ్యాపారం..బలిపశువలయ్యే విద్యావంతుల గొర్రెదాటు గొప్పతనం.
"ఆక్స్ఫర్డ్ సర్కస్" ఇది లండన్లోని ప్రముఖవీధి. అన్ని ప్రముఖ సంస్థల దుకాణాలతో నిత్యం యాత్రికులు,వ్యాపారరద్దీతో ఉంటుంది. ఇదే వీధిలో సుగంధపరిమళాలు అమ్మే అంగడి ఒకటి.. ఎప్పుడూ ఆడో/మగో ఎవరోఒకరు మైక్ పట్టుకుని పెద్దగా అరుస్తూ దారినపోయే జనాలను తమ కొట్టు(డు)కి ఆహ్వానిస్తూ ఉంటారు. నేను ఉద్యోగశాలకి పోవడం, రావడం ఇదే దారిలో కనుక నిత్యం గమనిస్తుండేవాడిని. మామూలుగా అరిస్తే ఎవరొస్తారు..అందుకని ఆకర్షణ కింద "ఐపాడ్లు,ఐఫోన్లు,కెమెరాలు ఉచితం..ఉచితం" అంటూ కేకేస్తారు. ఇక ఉచితం అనగానే చేరిపోయే గొర్రెదాటు మందకి ఓ పది ఐఫోన్లు,కెమెరాలు పడేసేవారు. ఆగండాగండి..అవి చైనావారి తయారీ మార్కు బొమ్మలు మాత్రమే ;). వీళ్ళు నిజంగానే ఏవో ఇస్తారని వచ్చిన మందకి తాము మోసపోయామని అర్ధం అవుతుంది. ఆయితే ఇది అర్ధమయ్యేలోపే ఆ అరిచేవాడు "150 పౌండ్ల విలువచేసె అయిదు సుగంధపరిమళాలు కేవలం 20 పౌండ్లు మాత్రమే, ఈ సువర్ణావకాశం ఈరోజు మాత్రమే" అంటూ మోసపోయిన మందని మరింతగా ఆకర్షించి బలిపశువులని చెయ్యడానికి ప్రయత్నిస్తాడు తన మాటల గారడీతో. ఒకవేళ తన గారడీ పనిచెయ్యటం లేదని గ్రహించగానీ కొనేవాళ్ళ గుంపులో ఉన్న తన తైనాతీలకి సైగ చేస్తాడు. ఈ తైనాతీలు అమ్మేవాడితో తమకే సంబంధలేదన్నట్లుగా నటిస్తూ వాడిచ్చిన సువర్ణావకాశం మళ్ళీ రాదనట్లు ఎగబడి కొనుక్కుంటారు. ఇహ అప్పుడు మొదలవుతుంది..గొర్రెదాటు మందలో చలనం. ఒకరి తర్వాత ఒకరు "ఆలసించిన ఆశాభంగం" అనుకుంటూ 20 పౌండ్ల సుగంధపరిమళాల సువర్ణావకాశాన్ని కొనేసుకుంటారు. ఆయితే అమ్మేవాడు అక్కడితో ఆగుతాడా.. ఇవి ఆడవారికి..అవి మగవారికి..అంటూ కొనేవాళ్ళని మరింత రెచ్చగొడుతూ ఎంతలేదన్నా ప్రతిగొర్రె నుంచి 40 పౌండ్లు రాబట్టుకుంటాడు. ఇక ఈ గొర్రెదాటుమంద పోయిన తర్వాత మరో మంద సిద్దంగా ఉంటుంది. ఈ విధంగా వ్యాపారాన్ని గొర్రెదాటు మందలున్నంతసేపూ నిరాటంకంగా సాగించే వారి వ్యాపారాన్ని కింద ఛాయాచిత్రంలో చూసి గొర్రెదాటుకి ఉన్నతచదువుకి తెలివికి సంబంధం అస్సలు ఏమీ ఉండదని తెలుసుకొనగలరు ;).
గొర్రెలవరో చేతులెత్తండి? ;) |
నాన్దాడ నల్లగొర్రె! రొంబ ఉచితమాయే ;) |
మరీ ఇన్ని చదువుకున్న గొర్రెలా ? పర్లేదు నా యాపారానికి ! ;) |
Wednesday, 8 June 2011
బ్రాహ్మణులు-దళితులు మీద చర్చ పేరుతో రచ్చ చేయడంలోని దురుద్దేశ్యం?
గతటపాలోని వ్యాఖ్యల బలం మూలాన టపా ఆలస్యంగా కనబడుతుందని బ్లాగు అభిమానులు హెచ్చరించి చర్చకి కొనసాగింపుగా కొత్తటపా వేయమని సలహా ఇచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు.
ఆ సలహా మీదకి గతటపాలోని చర్చకి కొనసాగింపుగా ఇక్కడ:
నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళలో మురుగు ఒకడు మొరుగుతూ బ్రాహ్మల మీద విషం కక్కాడు. ఇతనూ ఓ సంఘసంస్కర్తే. హిందూ దేవుళ్ళు వద్దు, ఎందుకంటే వాళ్ళని బ్రాహ్మణులు తయారుచేశారు కాబట్టి అని ఒకటో తరగతి పిల్లాడి తర్కంతో మాట్లాడుతూ నాస్తికురాలిని అని చెప్పుకుంటూనే మరోవైపు బుద్ధుడిని చూసారా అని అడిగే ఒకావిడ సమాజాన్ని ఉద్దరి౦చే సేవిక. రెండువారాల క్రితం తన బ్లాగులో చర్చ అనే ముసుగున ఇటు బ్రాహ్మణులని అటు దళితులని రచ్చ చేసినాయన ఒక మేధావి. అయితే ఇలా రచ్చచేసి తమ పబ్బం గడుకోవడం మొదలూ కాదు. తుది అంతకన్నా కాదు. వీరు తెర పైకి కనిపించే స్వయంప్రకటిత మేధావుల్లో కొందరు మాత్రమే. తెరచాటున ఉంటూ బ్రాహ్మణ-దళితుల మధ్య చిచ్చు రాజేస్తూ కుత్సిత ఆనందాన్ని పొందేవారి గురించి చెప్పబల్లేదు. సునిశితంగా గమనించండి ఈ స్వయంప్రకటిత మేధావుల్లో దళితులు లేరు.
మరి వీరు తమ స్వార్ధానికి రచ్చకి ఈడ్చినప్పుడల్లా బ్రాహ్మణులు తరతరాలుగా సంజాయిషీలు ఇస్తూ ఉండాల్సిందేనా? పోనీ ఇక్కడ ఎవరికి ఇవ్వాలి? దళితులకా లేక కులగజ్జితో కొట్టుకుంటూ రెండుకులాల మధ్య రచ్చ చిచ్చు పెట్టే ఆశుద్ద దళారీలకా? అసలు చర్చ పేరుతో రచ్చచేయడం వెనక ఈ దళారీల దురుద్దేశ్యం ఏమిటి? రేపు నా మునిమనవడు కూడా ఈ కులదళారీల దౌర్జన్యానికి, అంతులేని అవమానాలకి తలూపుతూ ఉండాల్సిందేనా?
ఈ చర్చారచ్చలు కేవలం బ్లాగుల్లోనే అనుకుంటారేమో. రాజీవ్ రెడ్డి గారు చెప్పిన్నట్లు చాపకింద నీరుగా ప్రచారమాధ్యమాల్లో ఎప్పుడో చేరిపోయాయి. ఎవడుపడితే వాడు తన స్వార్ధానికి బ్రాహ్మణులని ఏకుతూ వారి తరానికి మనఃశ్శాంతి లేకుండా చేస్తూ తాము మాత్రం అవార్డుల రివార్డులతో భుజకీర్తులు తొడిగించుకుంటూ కులమద్దతు సత్కారాలు అందుకుంటున్నారు. మరి వీరంతా నిజంగానే దళితులకోసం పోరాడుతూ బ్రాహ్మణుల మీద విరుచుకుపడుతున్నారా? నాటి త్రిపురనేని నుంచి నేటివరకూ జరిగిన, జరుగుతున్న సామాజిక సంఘటనలని అవలోకనం చేసుకుంటే బ్రాహ్మణులని ఏకడం వల్ల సత్సంబంధిత కులగజ్జిగాళ్ళకి తప్ప దళితులకి ఒరిగిందేమీ లేదన్నది సుస్ప్రుష్టం. ఈ కు.గ తిమ్మిని బమ్మిని చేసే అవాస్తవ రాతల రుద్దుళ్ళ వల్ల దళితులకి బ్రాహ్మణులు చేసిన మంచికన్నా చెడు భూతద్దమై మరీ కనిపిస్తుంది. నిజానికి దళితదశదిశోద్దారకులు అంబేద్కర్ గారు కూడా బ్రాహ్మణులపై ఆ విధంగా విరుచుకుపడిన సందర్భాలే లేవు.
ఇక
నాడు మురుగు తన మొరుగుడు ఆపింది.. తన తమిళ రాష్ట్రంలో తన కులపువాళ్ళు దళితుల మీద చేసిన అకృత్యాలు బయటపెట్టినప్పుడు.
నేడు సదరు స్వ.ప్ర మేధావి రచ్చను ఆపగలిగింది.. ఆ రచ్చ వెనుక బలిసిన కులకుత్సిత కుటిల పధకం ఉందనీ, వారు దళితుల మీద చేసిన దారుణమారణకాండకి బదులేది అని బహిరంగ౦గా అభిమానులు, బ్రాహ్మణ బంధువులు ప్రశ్ని౦చినపుడు.
అంటే వీళ్ళ చర్చ రచ్చ వెనుక దురుద్దేశ్యం కేవలం కుత్సిత కులగజ్జి అన్నది ఖచ్చితంగా స్పృష్టం అవుతుంది.
మరలాంటిది ఈ కులగజ్జిగాళ్ళని మేమెందుకు ఖాతరు చేయాలని నా తరం ప్రశ్నిస్తుంది? ఆయితే ఖాతరు చేయకపోతే ఈ కులదళారీలు చెప్పిన అవాస్తవాలనే దళిత సోదరులు నిజాలని అనుకునే ఘోరప్రమాదం కూడా మరోవైపున ఉంది. కులగజ్జిగాళ్ళతో బహిరంగపోరాటం చేస్తూ దళితులతో చెలిమిచెయ్యడమే దీనికి పరిష్కారం. రెండవది అంత సులువు కాకపోయినా కనీసం మొదటి దాని మీద విజయం సాధిస్తే రెండోది కొద్దిగా అయినా సర్దుకుంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం. దళితసోదరుల మీద నాకా నమ్మకం ఉంది. మొదటిదాని మీద పోరాడ్డానికి నా తరానికి బ్రాహ్మణ బంధువుల అండకూడా ఉంటుందని నా విశ్వాసం. ఈ పోరాటంలో నాతరం తాత్కాలిక సుఖసంతోషాలు నష్టపోయినా తర్వాతి తరాలు సుఖంగా ఉంటాయనే సదుద్దేశంతో ముందడుగు వేద్దామంటు౦ది.
అయితే ఈ తరానికి పాతతరంలోని "యువరక్తం" అండకూడా కావాలి. నేటి సమకాలీన పరిస్ధితులకి తగ్గట్లుగా ఉండే వారి అనుభవపూర్వకమైన సలహాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇతోధికంగా ఉపయోగపడతాయని నా నమ్మకం. అందుకే ఈ ఉపయోగకరమైన చర్చ. ఇది ఒక్క బ్రాహ్మణులు మాత్రమే పాల్గొనే చర్చ కాదు అని మీకు గతటపా ద్వారా తెలిసిందే.అందువల్ల బ్రాహ్మణుల క్షేమాన్ని, హితాన్ని కోరే బ్రాహ్మణ బంధువులందరికీ తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదే ఆహ్వానం.
గత టపాలో శ్రీనివాస్ గారు, జయహో గారు రాసిన వ్యాఖ్యల నుంచి ముఖ్యాంశాలని ఇక్కడ చర్చకు అనువుగా పెడుతున్నా. మిగిలిన వ్యాఖ్యాతల వ్యాఖ్యల నుంచి కూడా చర్చార్హమైనవి ఇక్కడ ఉదాహరిస్తా.
# ఎప్పుడు బ్లాగుల్లో బ్రహ్మణ, దళిత వర్గాల మీదేనా చర్చ/రచ్చ. మరి ఈ వర్గాల వారేవ్వరు వారిపై ఎందుకు చర్చ జరుపుకోరు?
#బ్రాహ్మనిజం పేరుతో బ్రాహ్మణుల మీద విమర్శలకు దిగటం. ఇదొక కళ గా అభివృద్దిచేశారు. ఆ రోజుల్లో ఈ వాదాల మీద కెరీర్ మొదలు పెట్టిన వారు సాధ్య మైనంతవరకు లాభపడ్డారు. వారిని అనుసరించినవారికి మారిన కాలం లో పెద్దగా ఉపయొగ పడలేదు. ఎంతో యనర్జిని ఇన్వేస్ట్ చేసి పుస్తకాలు చదివి మేధావిగా కేరిర్ మొదలు పెడతామనుకొంటే ఒక్క సారిగా దానికి గ్లోబలైసేషన్ దెబ్బతో డిమాండ్ లేకుండా పోయింది. ఎమీ చేయాలో దిక్కు తోచక బ్లాగులలో విషాన్ని వెదజల్లు తున్నారు.
#కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అణ్బు మణి రాందాసు గారు తనకన్నా వయసులో,అనుభవంలో సుమారు 35సం పెద్ద అయిన డాక్టర్ వేణుగోపాల్ గారిని రాచిరంపాన పెట్టాడు.
#పని పాటా లేని వారంతా యునివర్సిటిలలో ప్రమోషన్ ల కొరకో లేక తనవర్గం వారికి రాజగురువు అవుదామని రాజ్యాధికారం కొరకు రాసే థీరిలు దానిలో ఉన్న బ్రాహ్మణిజం పేరుతో బ్రహ్మణులను తిట్టిపొట్ట పోసుకొనే వారికి అణ్బుమణి రాందాసు ఒక మంచి ఉదాహరణ
#రోజుకొక కొత్త బ్లాగరు వచ్చేది బ్రహ్మణిజం అనే పెరుతో బ్రహ్మణుల మీద చర్చ పెడతారు. పోని అర్థమయ్యేట్టు చెప్పబోతే బ్రహ్మణుల చరిత్ర అంటే హిందూ చరిత్రా అని ఒక చచ్చు ప్రశ్న వేసి చర్చను తప్పు దోవ పట్టిస్తారు.
#అసలికి రోజుకొకడు బ్లాగిలో కొచ్చి తన గురించి ఎమీ చెప్పుకోకుండా రాస్తుంటే, అటువంటి వారికి అర్థమ్య్యే లా ఎక్కడ చరిత్రను చెప్పటం మొదలు పెట్టి ఎక్కడ చెప్పటం ఆపాలి.
# ఆధునిక చదువులు చదివి తామేదో అభ్యుదయవాదులమైనట్లు ఎన్నో తోడుగులు వేసుకొని,రూపు మార్చుకొని ఉన్న ఈఆధునిక మానవుడిలో భూస్వామ్య లక్షణాలు బయటపడ్డాయి.
# చర్చజరిపేవారికి నిజం గా చర్చ జరపాలంటే, నిజాయితి వుంటె మొదట అతని వర్గం మీద చర్చ మొదలు పెట్టుకోవాలి, ఆ తరువాత ఇతనిలా సంఘాన్ని ఊదరిస్తున్నాం అని గతకాలంలో ఉద్యమాలు చేసిన వర్గాల వారి లో, ఇప్పుడు ఆడవారు కూడా ఎప్పుడు లేని విధంగా కులం పేరు తగిలించు కోవటం ఫాషన్ ఐంది. మొదట ఈ రేంటి మీదా చర్చ జరిపి తరువాత ఆ తరువాత మిగతా వర్గాల వారి పైన చర్చ పెట్టుకునేది.
# చర్చజరిపేవారికి నిజాయితి ఉంటె,అభ్యుదయ వాదిని అనుకొంటే, ఈ వారాంతం లో ఆయన తన వర్గం వారి గురించి మొదట ఒక వ్యాసం రాసి, వారిలో ఉన్న పాసిటివ్, నెగటివ్ పాయింట్స్ మీద చర్చ జరపాలి.
#ఇంతటి కులగజ్జిని ఖండించకుండా ఒకవైపు ఆ కులగజ్జి దరిద్రులకి మద్దతుగా ఉంటూ మరోవైపు పుంఖాను పుంఖానులుగా ఎన్ని రాసినా బ్రాహ్మణులకి ఒరిగేదేమీ లేదు. దళితులకి, బ్రాహ్మణులకి మధ్య మరింత స్పర్థ పెరగడం తప్ప. విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం. సదరు కులగజ్జి గాళ్ళతో తమ స్వార్థపూరిత స౦బంధ బాంధవ్యాలు పక్కనబెట్టి పోరాడాతారో లేక భావితరాల బ్రాహ్మణ యువతని తమ రాతలతో కబోదులని చేస్తారో పునరాలోచించుకోవాల్సిన సమయం.
చివరిగా ఒక హృదయపూర్వక మనవి: మనకు సమస్యలు చాలా ఉన్నవి. ముఖ్యంగా హిందూధర్మానికి సంభ౦దించినవి పెక్కు. మన చర్చ వీటి మీదకి వెళ్ళకుండా కేవలం టపాలో చర్చించిన దాని మీద భావితరానికి ఉపయోగపడేవిధంగా, మార్గదర్శకం అయ్యేవిధంగా వ్యాఖ్యాని౦చమని మనవి. మీరు నా మనవిని మన్నిస్తారని భావిస్తాను.

Anti-Brahmin,
ఆత్మగౌరవం,
కనుమరుగవుతున్న నిజాలు,
తలంటు,
బ్రాహ్మణ విద్వేషం,
సమకాలీనం
Friday, 27 May 2011
ఈ వారాంతపు వల్లకాడు లొల్లి ఏందిరో! శవాల్ని మేల్కొలపండిరో.. అల్గేలే..;)
ఈ వారాంతంపు వల్లకాడు లొల్లి ఏందిరో! బలిసిన కుల ముష్కరమూకల శవాల మూలశంక గోలే౦దిరో!
ఒక బ్లాగరు రాసిన సొంత అభిప్రాయాన్ని వారికి సంబంధించిన సమూహానికంతటికీ ఆపాదించి వల్లకాడులొ వారాంతపు చితిమంట పెట్టి బలిసిన కుల ముష్కరమూకల శవాల్ని లేపుతూ లొల్లి మొదలెట్టాడు. తను వారాంతమంతా చుట్ట వెలిగించుకోవడానికి బ్రాహ్మణులు, దళితుల మధ్య కాష్టం రగిలించడంలో తెగకష్టపడుతూ మూతి కాల్చుకుంటున్నాడు. ఇక ఆ రెండు కులాల మధ్య తమ తాతలు,ముత్తాతలు చేర్చిన చితిమంట ఆరనీకుండా ఓ బలిసిన కుల ముష్కర శవమూక కరాళనృత్యం చేయడానికి సిగ్గు, లజ్జ వదిలేసి అనామకుల రూపంలో ఎగబడుతున్నారు. ఈ కుల ముష్కర మూకలకి ఇంత అశుద్ద మాదాకవళం వేస్తూ వారాంతపు లోల్లిని వెల్లదీస్తున్న ఓ అగ్నాని. ఇవే కుల ముష్కర మూకలు ఇదే అగ్నాని అధమవల్లకాడత్వంలో నాకు, భాస్కరరామి రెడ్డి గారి మధ్య అగ్గిరాజేసి, ఆంధ్రాలో మీరు మాకు బంధువులు, మేము మీకు శ్రేయోభిలాషులు అని చెప్పుకునే రెండు కులాల మధ్య ఉన్న పచ్చగడ్డిమీద చిచ్చుపెట్టే ప్రయత్నం ఇక్కడ కూడా చేసారు.
ఇక ఇప్పుడు ఆ వారాంతపు వల్లకాడులో లొల్లిచేసేది దళితులు ఆపైన బ్రాహ్మణులు అని అనుకుంటే కుత్సితకుల చితిలో కాలేసినట్లే!
తమ ముందు తరాలు బ్రాహ్మణ, దళితుల మధ్య పేర్చిన చితిని అనాగరిక అశుద్ద వారసత్వంగా స్వీకరించి, పీనుగు ఎప్పుడు దొరుకుద్దా! ఎప్పుడు పీకుతిందామా! అని గోతికాడనక్కలా ఎదురుచూస్తూ ఉన్న ఈ బలిసిన కులముష్కర మూక దళితవాదం పాడుతుంది. ఎందుకు? దళితుల మీద ప్రేమా? కానేకాదు.. కేవలం బ్రాహ్మణులని మట్టుపెట్టే తమ అశుద్దవారసత్వాన్ని కొనసాగించడానికి. దళితులారా గుర్తుపెట్టుకోండి alienation is far-better than elimination అన్న కఠిన వాస్తవాన్ని. alienation ఖచ్చితంగా తప్పే..అందులో ఎలాంటి సందేహం లేదు..ఒప్పుకుంటా.. కానీ అదిప్పుడు వాస్తవంలో లేదు. వాస్తవ౦లో ఉన్నది కేవలం elimination. ఇది ఏ బలిసిన కులం చేసిందో, చేస్తుందో చూసుకోండి. దళితులపై జరిగిన ఖేర్లాన్జీ సామూహిక వధలో, కారంచేడు కార్పణ్య౦లొ, చుండూరు అమానుష సంహారంలో ఏ బలిసిన కులముందో తెలుసుకో౦డి. చితిమీద పీనుగుమాసం ముక్కలు ఏరుకుతినే ఈ బలిసిన కుల ముష్కర మూకలు మీకేదో మాట సాయం చేస్తున్నాయని నమ్మితే ఆనక అవసరం తీరాక అదే చితిమీద తొ౦గోపెట్టగలవు. తస్మాత్ జాగర్త! వర్తమానవాస్తవాలని గుర్తించి మీ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు ఇస్తారో లేక ఇలాంటి కుల కుత్సితి పీనుగుల తాత్కాలిక మద్దతుతో/మద్దతు కోసం గతాలకు గాయాలు చేసుకుంటూ విషవారసత్వాన్ని ఇస్తారో ఆలోచి౦చుకోవాల్సిన సమయం. తనమీద ఎంతో అభిమానం చూపించిన బ్రాహ్మణ ఉపాధ్యాయుడు "మహాదేవ అంబేద్కర్" గారి ఇంటిపేరుని తనఇంటిపేరుగా మార్చుకున్న భారతరాజ్యా౦గపిత, దళితదశదిశోద్దారకుడు అంబేద్కర్ గారి అభిమానాన్ని మరువగలామా?
ఇక ఈ కులముష్కర మూకలకి అగ్నా(నా)యకత్వం వహించే వల్లకాడు వారాంతానికి ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరుగుతు౦టే తగుదునమ్మా అంటూ వారి మధ్య చితిపేర్చడానికి సిద్దం అయిపోతాడు. పీనుగులు వేదాలు వల్లించినట్లు నీతిసూత్రాలు చెబుతాడు. మరిప్పుడా పీనుగు సూత్రాలు ఏమయ్యాయి..కుత్సితాలయ్యాయా? ఏ.పి.మీడియా రాము గారు పేద్ద తరహాగా వచ్చి చర్చ పట్టు తప్పి రచ్చగా మారుతుంది జాగర్తగా మసలుకోండి అని మర్యాదగా చెబితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని తనదాకా వస్తే గానీ అన్నట్లు కుత్సితనీతిని ప్రదర్శించాడు. చెత్తకామెంట్ల రచ్చ తప్ప ఏమీ లేదని శ్రీనివాస్ గారు చెబితే తన చెత్త మిగిలిన బ్లాగుల చెత్తకంటే ఎక్కువ కాదని చెప్పుకొచ్చి తన అగ్నానాన్ని రుజువుచేసుకున్నాడు. నిస్సిగ్గుగా చెత్త ఉందని ఒప్పుకుంటూనే, తాను అనుమతిస్తేనే ఆ చెత్తవచ్చిందన్న విషయాన్ని తనకనుగుణంగా అలవోకగా నిర్లజ్జతో వదిలేసాడు. చూసేవారు కబోదులు కదా మరి ఈయన దృష్టిలో! పోనీ టపాలో ఏవైనా అర్థవంతమైన చర్చ పెట్టాడా? అదీలేదు. కేవల౦ కులాన్ని దూషించే వ్యాఖ్యలను ప్రేరేపిస్తూ, ఆ కులగజ్జిగాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తూ తన వాతప్రకోపాల్ని చూపించే వారాతం ఎంచక్కా దినాంతం చేసుకుంటున్నాడు.
చివరిగా, అయ్యా పెద్దలూ..
తప్పు తప్పే..దాన్ని ఒప్పు చేయాల్సిన అవసరం లేదు..సమర్థి౦చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ తప్పుని మరో మంచి ఒప్పుతో తుడిచేయడ౦ లేదా చేసిన మంచిని ఎలుగెత్తడం సరైన పరిష్కారం. ఈ పరిష్కారమార్గాన్ని అమలుకానీకుండా అడ్డుపడుతున్న ఆ బలిసిన కుల కుత్సిత౦ గురించి చెప్పండి..ఎండగట్టండి. అలాగే నేడు కులగజ్జిని వాస్తవానికి ఎవరుపెంచి పోషిస్తున్నారో చెప్పండి. అంతేకానీ ఇప్పటికే ఎపుడో కొంతమంది చేసినవాటికీ, చేయనివాటికీ తమకు తెలీకుండానే బాధ్యత వహిస్తూ స్వయంకృతాపరాధంగా తమకూ, దళితులకూ మధ్య సృష్టించుకున్న అగాధాల్ని మరింత పేద్దవి చేయద్దు.ఒక్కసారి వర్తమాన వాస్తవాల్ని చూస్తూ మీ భవిష్యత్తుతరాలకి "ఈ" రాతలతో ఏమి ఇద్దామనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి! తరగని తలంటులూ, తొలగని అపవాదులు మరియు అంతులేని అవమానాల తోడు క్షమాపణలా?

Thursday, 26 May 2011
ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను!
ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను
దీని రమ్యమైన అందాలతో పాటు - మూర్ఖత్వాన్నీ
దీని సమానత్వ సిద్ధాంతాలతో పాటు - చేతకానితనాన్నీ
అన్నింటినీ కలిపి ఈ దేశాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను
ఇది
గోల్డు మెడళ్ళను మెరిట్ సర్టిఫికేట్లను పక్కకు నెట్టీ
కుల ధ్రువీకరణ పత్రాలకు ప్రాముఖ్యం ఇచ్చినా సరే
దీన్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను
ఉద్యోగాల మీద కులాల పేర్లు చెక్కి
ఇది నా ప్రతిభను పాతాళానికి తొక్కి ఉండొచ్చుగాక
నా తొంభై శాతం మార్కులు పనికి రావని తేల్చి
క్వాలిఫై కొసనందుకోలేని మోడు మొదళ్ళకు
నౌకరీలు పంచేందుకు ఉత్తర్వులు జారీ చేసి ఉండొచ్చుగాక
STILL I LOVE MY COUNTRY
ఇది ప్రమాదపువలను పసిగట్టలేని అంధ కపోవతం
రిజెర్వేషన్ కాల పరిమితిని రెట్టింపు చేసుకుంటూ
నా జీవితాన్ని చింపిన విస్తరి చేసిన గ్రామసి౦హం
బతుకును వెలుగుగా మార్చుకోడానికి
ఫలానా కులం లోనే పుట్టాలని నిర్దేశించి
ఇది నా గొంతులో కపట ప్రేమను వడ్లగింజగా వేసింది
చదువులకీ ఉద్యోగాలకీ నాపై నిషేదం విధించి
కడుపులో ఆరని చిచ్చురేపింది
శాంతి మంత్రోచ్చారకుణ్ణి కదా !
నా బ్రతుకు అవమానాల అగ్నిగుండం చేసినా
దీన్ని సహనంతో తల్లిలా ప్రేమిస్తూనే ఉన్నాను
ఇది పతివ్రత వేషం వేసుకున్న పూతన
నాకు పలకా బలపం కొనివ్వలేని బీద పలుకులు పల్కి
కొందరికి ఉచిత భోజన వసతులతో హాస్టళ్ళు కట్టిస్తుంది
నా చదువుకు కాలేజీల్లొ సీట్లు లేవనిచెప్పి
కొందరికి కోటాలుగా వాటాలేసి పంచుతుంది
జీవితంలో పావు భాగం దాటగానే
నా వయస్సును ఉద్యోగానికి అనర్హతను చేసి
కొందరికి మాత్రం
వయోపరిమితికి సడలింపుమీద సడలింపులిస్తుంది
ఫిర్ భీ దిల్ హే హిందుస్తానీ
ఏ ప్రాంతమేగినా ఎందుకాలిడినా
తల్లి భారతిని పొగడటం మర్చిపోనివాణ్ణీ
నిండా మునిగినా నిండు గుండెతో
వందేమాతర గీతాన్నై ధ్వనించిన వాడ్ని
ఈ మట్టి పై మమకారం పెంచుకొని
తుపాకి ముందు గుండెను నిల్పిన వీరుడ్ని
ఇన్నీ అయినందుకు నా మొఖానికి ఏ రాయితీ ప్రకటించగ పోగా
నా మెడలో దారిద్రాన్ని మూర్చబిళ్ళగా వేలాడదీసింది
అయినా దీన్ని నేను ప్రేమిస్తూనే ఉన్నాను
కానీ
దీన్నిలా మరుగుదొడ్డిలా మార్చిన నాయకుల్ని ద్వేషిస్తున్నాను
మనుగడను ధ్వంసం చేసి పదవి నిలుపుకుంటున్న
నీతిమాలిన చర్యను నిరసిస్తున్నాను
ఇక - రాజ్యాంగం వొంకర నుదిటిపై సవరణ చట్టం తిలకమైన రోజున
జాతీయ గీతం పాడినంత ఉద్వేగంతో
మా నాయకులు నపుంసకులు కాదని
కొత్త ప్రకటన చేస్తాను!!!
-ఒక "సత్యం" చెప్పిన గుండెకోత సత్యం.

Friday, 13 May 2011
పశ్చిమాన అరుణవర్ణం పదవీ కాంక్షతో భంగపడి అస్తమించింది.
ముప్పైనాలుగేళ్ల(34) అప్రతిహతమైన వామపక్షపాలనకు తార్కాణంగా నిలిచిన పశ్చిమబెంగాల్ ఎర్రకోట నేడు బీటలు వారింది.
సూచన: టపా పొడవు అయినందువల్ల చదువరుల సౌకర్యార్ధం పేరాలుగా విడగొట్టి ప్రతి పేరాని గొలుసులుగా ఇవ్వడమైనది. గొలుసుని పేరా చూడ్డానికి, మూయడానికి ఉపయోగించగలరు. అన్ని పేరాలు ఒకేసారి చూడ్డానికి "Show All" అన్న గొలుసు నొక్కండి. మీకు ఏదేనీ పనిచేయకపొతే rajeshgottimukkala@gmail.com కు ఉత్తరం పంపగలరు.
నాకున్న రాజకీయపరిజ్ఞాన౦, శోధించి తెలుసుకు౦టున్న చరిత్ర ఆధారంగా పశ్చిమబెంగాల్లోని వామపక్షపార్టీ ఉత్తాన-పతనాలపై సింహావలోకనం.
పశ్చిమబెంగాల్(ప.బె) గురించి టూకీగా:
భారతదేశం ఆంగ్లేయుల పరిపానలో ఉన్నప్పుడు తూర్పుతీర ప్రాంతాల్లో అనగా ప.బె, అస్సామ్, బీహార్ మరియు ఒరిస్సాల్లో తమ పరిపాలనా సౌలభ్య౦లో భాగంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి పరిచింది. కలకత్తా ఓడరేవు పట్టణంగా వాణిజ్యరంగానికి ప్రసిద్దిచెందింది. 1950 చివరిదశకం వరకూ భారతదేశ ఆర్ధికరాజధానిగా కలకత్తా భాసిల్ల్లింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ౦ ప.బె లో ఎన్నోరకాల పరిశ్రమలు ఏర్పరిచి మరింతగా అభివృద్ధి పరిచింది.
పేద,బలహీనవర్గాల వారి హక్కులను పెత్త౦దారీ భూస్వాముల నుంచి కాపాడ్డానికి సమసమాజనిర్మాణమే లక్ష్యంగా, తుపాకీ ఆయుధంగా ఏర్పడిన నక్సలిజం తదననతరం, అన్నివర్గాల ప్రజలతో మమేకం అవ్వడానికి తుపాకీ పొత్తు కుదరదని గ్రహించి౦ది. పేద, శ్రామిక వర్గాల హక్కులకోసం ధనిక, పెట్టుబడి వర్గాలతో పోరాడ్డమే ముఖ్యసిద్ధాంతంగా ఏర్పడిన మార్క్సిజం మూలాలతో వామపక్షభావజాలంగా శ్రీ జ్యోతిబసు, శ్రీ ప్రమోద్దాస్ గుప్తా వంటి నీతి,నిజాయతీ గల నేతల సారధ్యంలో క్రియాశీలక రాజకీయాల్లోకి CPI అనే పేరుతో పార్టీగా ఆవిర్భవించింది.
ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజాశ్రేయస్సు కొరకై ఏర్పరచిన సిద్దాంత౦ మూలాలు ఎంత మంచివే అయినా వాటిని ఆచరిస్తున్నామంటూ కొందరు ఆ సిద్దాంతాలని తమ స్వార్థానికి వినియోగించడం వల్ల ఆ మూలాల ఉనికికే ముప్పు వస్తుంది. ఇక్కడా అదే జరిగింది.
ఇక వామపక్షభావాలను సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, వారిని పార్టీ వైపుకి ఆకర్షి౦చాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఈరోజుల్లో అయితే ధన౦బలం ఇత్యాది వక్రమార్గాలు చాలాఉన్నాయి. అప్పట్లో ప్రజలవైపు, వారి సమస్యలని పరిష్కరించే వైపు నిజాయితీగా పోరాడ్డమే ఆకర్షణ. ఆదే పోరాటతత్వంతో ఏర్పడిన వామపక్షం తొలుత ప్రజల్లోకి తమ భావాలను నెమ్మదిగా చొప్పించే ప్రయత్నం చేసింది. అయితే పోనుపోను సమస్యల వైపు పోరాడ్డం కాకుండా కేవలం తమ భావాలను ప్రజలమీద బలవంతంగా రుద్దడానికి, పార్టీని ఏవిధంగానైనా అధికారంలో రావడానికి దృష్టి పెట్టి కొన్ని చెడుమార్గాలు తొక్కింది. వాటిలో ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్తలను తప్ప మిగిలినవారిని పెట్టుబడి దారులుగా, అమెరికా సానుభూతి పరులుగా, CIA గూఢచారులుగా, ప్రజావ్యతిరేకులుగా, పేద/శ్రామిక వ్యతిరేకులుగా ముద్ర వేస్తూ తాము మాత్రమే పేదవారి తరపున పోరాడేవారమని చెప్పే ప్రయత్నం చేసింది.
అయితే ఎన్నుకున్న మార్గం వక్రమైనదైనా అసలు ఉద్దేశ్యం మంచిగా ఉండడంతో పేదప్రజల మీద అధ్బుతంగా పనిచేసింది. అదే ఊపుతో 1962 లో ప.బె అసెంబ్లీలో మూడొ౦తుల బలాన్ని తెచ్చుకుంది. అయితే ఇక్కడ కోతికి కొబ్బరికాయ దొరికిన చందం అయింది. వారు తమకి మద్దతునిచ్చిన ప్రజలను, వారి సమస్యలని గాలికొదిలేసి పూర్తి బలాన్ని తెచ్చుకుని అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళురారు. తమ మూలాల్ని మరిచారు.. తంపుల పుంతలు తొక్కారు.
అందులో భాగంగానే కిందపేర్కొన్న వాటిని తమ నినాదాలుగా పేర్కొంటూ, కార్యకర్తలను యుద్ద సైనికులుగా తయారుచేస్తూ వామపక్షవాద మూలాల్ని కొద్దికొద్దిగా వదిలేస్తూ మార్క్సిజాన్ని ఫండమెంటలిజం దిశగా తీసుకువెళ్లడం మొదలుపెట్టారు.
౧.అధికారం అనేది బలప్రయోగం లేదా తుపాకీ ద్వారానే వస్తుంది
౨.అవసరమైతే చట్టాన్ని అతిక్రమి౦చాలి
౩.ప్రజాస్వామ్యం కేవలం పెట్టుబడిదారులది
అదంతా ఒక ఎత్తయితే 1962 లో చైనా భారతదేశం మీదకి దండెత్తివచ్చి హిమాలయాల భూభాగాన్ని పెద్దమొత్తంలో ఆక్రమించినపుడు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయపౌరుడు ఆ దాడిని తిప్పకోట్టలేని భారతదేశ ప్రభుత్వం మరియు సైన్య౦ అసమర్థతను ఎండగడుతుంటే ఒక్క వామపక్షవాదులు, వారి అనునూయులు మాత్రం దాన్ని చైనా విజయంగా చెబుతూ చైనా మాత్రమే శ్రామికవర్గాలకు మద్దతుగా ప్రపంచదేశాలతో పెట్టుబడిదారుల మీద పోరాడగలదనే కబోది అభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భ౦గానే "చైనాలో వర్షం పడితే ఇక్కడ వామపక్షవాదులు గొడుగు పడతారు" అనే జాతీయానికి అంకురార్పణ జరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ వి౦తకబోది నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూ మొన్న సిక్కి౦, అరుణాచల్ మీద చైనా కాలుదువ్వినా ఏమీ మాట్లాడకుండా గుడ్డికి తోడుగా మూగతనాన్ని ఆభరణంగా తెచ్చుకుంది.
ఇక 1963లో రష్యా, చైనా మధ్య బేధాలు పొడసూపినప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న చందాన విచిత్రంగా పేద/శ్రామిక వర్గాల కొరకై పోరాడాలన్న మూలసిద్దాంతాలను వదిలి తాము కొత్తగా ఏర్పరుచుకున్న సిద్దాంతాలకి విలువనిస్తూ భారత వామపక్షవాద పార్టీ(CPI) 1964 లో నిట్టనిలువుగా రెండు పార్టీలుగా చీలిపోయింది. ఒకటి CPI-రష్యాకి మద్దతు మరొకటి CPM-చైనాకి మద్దతుగా. ప్రపంచ౦లో ఏ దేశంలోని పార్టీ కూడా బహుశా ఇలా పక్కదేశాలకోసం అదీ వారి గొడవలకి మద్దతునిస్తూ విడిపోయిఉండదు :(. అది మొదలు అనగా 1967 నుంచి నేటివరకు ఎన్నికల్లో రెండుపార్టీలు విడిగానే పోటీ చేస్తూఉన్నాయి.
1967 లో జరిగిన ఎన్నికల యుద్దంలో ప.బె లో ఏ పార్టీకి ఒక్కరే ప్రభుత్వాన్ని స్థాపించే౦త బలం రాలేదు. అప్పుడు గాంధేయవాది అయిన శ్రీ అజోయ్ ముఖర్జీ గారు ముఖ్యమంత్రిగా, శ్రీ జ్యోతిబసు గారు ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్-వామపక్ష సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ప్రభుత్వం ఆట్టే సజావుగా సాగలేదు. వామపక్షవాదులు తమ వాదాన్ని ప్రజల్లోకి మరింతగా చొప్పించేందుకు చేతికి అందివచ్చిన అధికారాన్ని వాడుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పైకి శ్రామికులని రెచ్చగొట్టి నిరంతరం హర్తాళ్ళు, బందులతో ప.బె హడలి పోయేలా చేసింది. అభివృద్ధి కుంటుపడింది. చివరకి 1969 లో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుపరిచి రాష్ట్రపతి పాలన విధించారు.
అంతే! దీనితో వామపక్షవాదులు మరింతగా రెచ్చిపోయారు. తమ పార్టీ కార్యకర్తలను పెంచుకుని మిగిలిన ప్రజలని ప్రభావితం చేసే ఉద్దేశంతో ఇతర వా.ప.వాదులతో గొడవలకి దిగారు. సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పదవీకా౦క్ష పోరాటాల్లో ఏంతోమంది ప్రాణాలు బలిపశువులుగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదేసమయంలో ఫార్వార్డ్ బ్లాక్ ముఖ్యఅధ్యక్షుడిని నడివీధిలో కత్తులతో పొడిచి చంపారు. అప్పటినుంచి ఏదోఒక చావు వార్త ప.బె పేరు మీదుగా పత్రికల్లో రావడం నిత్యమైపోయింది.
ఇక 1969లో జరిగిన ఎన్నికల్లో CPM కి పూర్తి బలం సాధించి మిగలిన ఇతర వామపక్షపార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సొంత ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పట్టి నుంచి గొడవలు, లూటీలు మొదలయ్యాయి. అధికార సిద్దాంతం తప్ప పేదవాడు కనిపించడం లేదు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ గొడవ ప్రముఖంగా పైకి వచ్చింది. పెట్టుబడిదారుల మీద దాడులని ముమ్మరం చేసింది. అదే తమ సిద్ధాంతంగా చెప్పుకొచ్చింది చివరికి. కొన్ని సంవత్సరాలవరకు ప్రజలు ఈ గొడవలవల్ల నరకం అనుభవించారు..స్వేచ్చను కోల్పోయారు. చివరికి కేంద్రం 1971లో మళ్ళీ రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో కేంద్రం మీద అక్కసుతో వామపక్షవాదులు తమ విభాగాలతో కలిసి కుట్రలు పన్నాయి. అవి పలువురు కాంగ్రెస్స్ నాయకుల హత్యలకు దారితీసాయి. కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సమయంలో ధైర్యంగా బయటికి వచ్చి తమ పార్టీ తరపున నిలబడేవాళ్ళు కూడా లేకపోయారు. అయితే 1973లో జరిగిన ఎన్నికల్లో బొటాబొటీ బలంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఓటమి వా.ప వాదులకి మింగుడుపడలేదు. వారి అధినాయకులకి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అప్పటికి అవగతమయింది. ప్రజలకి శాంతిభద్రతలు, స్వేచ్చాయుత జీవితం కోరుకుంటున్నారని అర్థం అయింది. ఇకనుంచి వామపక్షభావ జాలాన్ని హింసతో కాక శాంతిమార్గ౦లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఇది నచ్చని ఈ పార్టీలోని కొందరు పిడివాదులు "నక్సలిటాస్" పేరున చారుమంజుదారు అధ్యక్షతన మరో కొత్తపార్టీ పెట్టి CPM కి బద్దశత్రువులుగా తయారయ్యారు.
అది 1977.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1975-అత్యయిక పాలన(ఎమర్జెన్సీ) దెబ్బతో ఉత్తరభారతదేశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, అలానే పశ్చిమ బెంగాల్లో కూడా. మళ్ళీ రాష్ట్రపగ్గాలు వామపక్షవాదుల చేతికి వచ్చాయి. శ్రీ జ్యోతిబసు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు ప.బె లో వామపక్షపాలన గత ముప్పైనాలుగేళ్ళుగా(34) నిరాటంకంగా నిన్నటివరకు కోనసాగుతూనే ఉంది.
ఇప్పుడు కాలంతో పాటు వా.ప ప్రభుత్వమూ మారి ప్రజలకు కావలసిన మౌలికఅవసరాలు, అభివృద్ధి గురించి మళ్ళీ ఆలోచించడ౦ మొదలుపెట్టింది. అయితే ఆ ఆలోచన హింసగా మారి హంసపాదుగా మిగిలింది. నందిగ్రామ్, సింగూర్లో నెలకొన్న హింసాత్మక సంఘటనలే దీనికి ప్రత్యక్షఉదాహరణలు.
వెరసి భారతవామపక్షపార్టీ తన చేష్టల వల్ల సగటు భారతీయులకి మార్క్సిజమంటే పేదల వ్యతిరేకి మరియు అభివృద్ధి నిరోధకులు అనే కొత్త అర్దాన్ని ఇచ్చి మార్క్సిజ౦ ఏర్పాటుకు మూలమైన హేతువు యొక్క పరమార్ధాన్ని తుంగలో తొక్కింది.
పారిశ్రామికిభివృద్ధి మందగించి నిరుద్యోగంతో అల్లాడుతున్న ప.బెకి 2000 సంవత్సరం నూతనఅధ్యాయం మొదలైంది. వామపక్షప్రభుత్వ ఉదారవాది బుద్దదేవ్ భట్టాచార్య గారు ప.బెల్లో పెట్టుబడులకు దారులు తెరిచారు. భారీస్థాయిలో పారిశ్రామికీకరణ ప్రణాళికలకి నాందీ పలికారు. అయితే ఈ ప్రయాత్నాలు ఒక పద్దతిగా కాకుండా ఇబ్బడిముబ్బడిగా, గందరగోళం మధ్య మొదలవ్వడంతో విఫలమయ్యాయి. దీని ఫలితంగా పైన ఉదాహరించిన సింగూరు, నందిగ్రాంలో వేలాదిమంది రైతులు భూములు కోల్పోవడమే కాకుండా నిరాశ్రయులయ్యి వీధినపడ్డారు. బాధితులంతా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామికీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకదశలో పేదల జీవితాలతో ఆడుకుంటుందని పేరుతెచ్చుకున్న వామపక్ష ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడి సామాన్య ప్రజలు పెట్టుబడి భూతంగా చూస్తున్నారు.
ఇదిలా వుండగానే సామాన్య ప్రజలందరి చేతా దీదీగా పిలువబడుతూ వారి హృదయాలకి చేరువైన మమతాబెనర్జీ గారి అధ్యక్షతన 1998లో ఏర్పాటైన తృణమూల్ కాంగ్రెస్ వామపక్షపార్టీకి బలమైన ప్రత్నామ్నాయంగా ఎదిగింది. అసలైన వామపక్షవాదానికి తాను ప్రతినిధిగా చెప్పుకుంటూ ప్రజలను౦చి మాత్రమే కాకుండా నక్సల్స్ వర్గాల నుండి కూడా మద్దతు సంపాదించుకోగలిగారు. అట్లే వామపక్షంపార్టీ తన అసలు మూలసిద్దాంతాలకి నిర్మూలం పలుకుతుండడం చూసి తట్టుకోలేని వామపక్ష సానుభూతిపరులు గణనీయమైన సంఖ్యలో దీదీ వైపు ఆకర్షితులయ్యారు. దీదీ వామపక్షపార్టీని వామపక్షవాదంతోనే ఎదుర్కొంటూ 2008 పంచాయతీ, 2009 సాధారణ ఎన్నికలు మరియు 2010లో కోల్‌కతా మునిసిపల్ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి వామపక్షపార్టీకి ముచ్చెమటలు పోయించి అయోమయానికి గురిచేసింది. దీదీకి అడ్డుకట్ట వేసేందుకు వామపక్షపార్టీ చేసిన ప్రయత్నాలు వికటించి రెండు పార్టీల మధ్య రాజకీయ హత్యలతో రక్తపాతానికి దారితీసింది. ఇటు నక్సల్స్ వర్గాల నుంచే కాకుండా అటు మావోయిస్టుల మద్దతు కూడా దీదీ పొందగలిగారు. పలుసందర్భాల్లో మావోయిస్టులకు అనుకూలంగా దీదీ ప్రవర్తించడం దీనికి ముఖ్యకారణం. సింగూర్, నందిగ్రామ్ ల్లో ప్రజల తరపున గట్టిగా పోరాడిన దీదీకి మావోయిస్టులు అండగా నిలిచారు.
అదే స్పూర్తితో, అన్ని వర్గాల మద్దతుతో దీదీ నేడు అఖండఘనవిజయ౦ సాధించారు. వామపక్షపార్టీ ప్రజాగ్రహానికి గురయ్యి గల్లంతయింది. ఆఖరికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా ఓడిపోయారు!
మరి శ్రామిక అరుణవర్ణం అస్తమించినట్లేనా? అంటే కానే కాదు. ఈ అరుణవర్ణం అనేది శ్రామికులకి సంబంధించినది, ఒక పార్టీకి కాదు. కేవలం తాము మాత్రమే అరుణవర్ణ అధిపతులం అని పదవీ వ్యామోహంతో కొట్టుకున్న అరుణవర్ణపు వామపక్షపార్టీకి మాత్రమే అస్తమయం, అదీ ప్రస్తుతానికి!.
పశ్చిమాన అస్తమించిన అరుణుడు ఏవిధంగా ఆయితే శ్రామికవర్గానికి ఆనందాన్ని పంచడానికి మరుసటిరోజు ఉదయాన్నే ఉషస్సులతో ఉదయిస్తాడో అదే విధంగా నేడు అస్తమించిన వామపక్ష-అరుణవర్ణం రేపు దీదీ నుదుట అరుణవర్ణంగా ఉదయించి అసలైన వామపక్ష సిద్దాంతాలను పాటిస్తూ కర్షక, శ్రామిక లోకానికి చేయూతనిస్తుందని ఆశిద్దాం.
అదేవిధంగా మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి రోజున తమదైన విజ్ఞతను ప్రదర్శి౦చి ప్రపంచానికి తెలిపిన పశ్చిమబెంగాల్ ఓటర్లకి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

Show All |
వామపక్షపార్టీ రాజకీయ ప్రస్థాన౦ |

మారిన సిద్దాంతం-మార్క్సిజ౦ నుంచి అతివాద౦(ఫండమెంటలిజం) వైపు: |

అర్రులుచాచిన పదవీకాంక్ష: |

నవీన వామపక్షవాది - మమతాబెనర్జి గారు (దీదీ): |

Wednesday, 4 May 2011
ఆ పాదాలకు వందనాలు!
మనసుని కాసేపు ఉల్లాసపరుద్దామని!
గంగమ్మ ఉప్పొంగెనే! |
ఉత్తమ సంగీత సాహిత్యాల మేళవింపుగా గుభాళింపులు వెదజల్లే పాటల సౌరభాలు ఎన్నదగినవి ఎన్నింటినో తెలుగు చలనచిత్ర రంగానికి ఎందరో మహానుభావులు వన్నెతగ్గని వారసత్వంగా మనకు అందించారు. అయితే ఉత్తమ సంగీత సాహిత్యాలతో పాటు సాహిత్యానికి అనుగుణంగా నర్తించే నృత్య ప్రధానమైన పాటలు బహుకొద్దిగా ఉంటాయి. అలాంటి పాటల్లోనూ నర్తకీమణి యొక్క అందమైన ముఖవర్చస్సు, లయలు, హొయలు, విరుపులు అగ్రతాంబూలాన్ని అందుకుంటాయి.
అయితే శాస్త్రీయ నృత్యానికి ఆయువుపట్టు లాంటి “పాదం” యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ కేవలం పాదాల్ని మాత్రమే చూపిస్తూ సాగే పాటలు చాలా తక్కువ అని నా అభిప్రాయం. బహుశా ఇలాంటి పాటలు ప్రేక్షకులని అంతగా అలరించవని సదరు దర్శక నిర్మాతల అభిప్రాయం కాబోలు!.

సరే ఉపోద్ఘాత౦ పక్కన బెట్టి అసలు విషయంలోకి వస్తా. ఉత్తమ సంగీత సాహిత్యాలతో పాటు అర్థవంతమైన నృత్య౦ ప్రధానంగా సాగి ముందు చెప్పినట్లు ఆయువుపట్టు లాంటి ఆ "పాదానికి" అగ్రతాంబూలాన్ని అందించిన ఒక పాటను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం.
“ఈ పాదం ఇలలోన నాట్య వేదం” అంటూ పాదానికి వందనాలు చెబుతూ సాగే ఈ పాట 1985లో విడుదలయ్యి తెలుగునాట స్ఫూర్తి నింపడంలో అఖండ ఘనవిజయాన్ని సాధించిన వాస్తవకధానిర్మిత “మయూరి” చిత్రంలోనిది. ఇందులో కధానాయికగా నటించడమే కాక, తన వాస్తవ జీవితాన్ని ఆవిష్కరించి ఎందరికో స్పూర్తి ప్రధాత అయిన సుధాచంద్రన్ గారు “మయూరి” సుధాచంద్రన్ గా తెలుగువారికి చిరపరిచితమైన దివ్య సంవత్సరం. మరో విశేషం ఏమిటంటే, ఈ పాట చిత్రంలో భాగంగా కాకుండా చిత్ర ప్రారభంలో కనిపిస్తూ చిత్రం యొక్క పరమార్ధాన్ని వివరిస్తూ తీసుకున్న నిర్ణయం కళాత్మక హృదయానికి తార్కాణంగా నిలవడం.
ఉత్తమ సాహిత్యం, దానికి అనుగుణంగా నృత్యం, అందులోనే ఒదిగిన సంగీతపు సృష్టి వివరాలు:
చిత్రం - మయూరి
రాసిన వారు - శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు
పాడిన వారు - శ్రీపతి పండితారాధ్యుల (SP) శైలజ గారు
సంగీతం - శ్రీపతి పండితారాధ్యుల (SP) బాలసుబ్రహ్మణ్యం గారు
నర్తించిన వారు - "మయూరి" సుధాచంద్రన్ గారు
లేలేత పదాల సాహిత్యం:
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం ||ఈ పాదం
ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం ||ఈ పాదం
ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆనాటి బలికి అంతం
తనలోనే గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనే ఆ గౌతమే పొంగగా
పాత పాటలో తను చరణమైన వేళా
కావ్యగీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసిన ||ఈ పాదం
తనలోనే గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనే ఆ గౌతమే పొంగగా
పాత పాటలో తను చరణమైన వేళా
కావ్యగీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసిన ||ఈ పాదం
ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ భక్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీ గంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర స్వర నారదా మునులు జనులు కొలిచిన ||ఈ పాదం
ఈ పాదమే శ్రీ భక్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీ గంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర స్వర నారదా మునులు జనులు కొలిచిన ||ఈ పాదం
తెలుగు దృశ్యసంగీత గొలుసు:(www.youtube.com/watch?v=_L8ScMJqm5s)
నృత్యంలో గమినించదగినవి, నన్ను మంత్రముగ్దుణ్ని చేసిన పాదముద్రలు :
౧) చిత్ర నిడివి 00:05 వద్ద “ఇల”ను చూపించే వైవిధ్యం
౨) చిత్ర నిడివి 00:44 నుండి 00:58 వరకు మిన్నాగుని, బలిని మరియు గంగా ప్రవాహాన్ని ఆవిష్కరించే ఆద్భుతం.
౩) చిత్ర నిడివి 01:18 వద్ద లయలను, హోయలని చూపించడం
౪) చిత్ర నిడివి 01:57 వద్ద సప్తగిరి శిఖరాల అలవోక
౫) ఇక పాట ఆద్యంతమూ అద్భుతమనిపించే మయూర ఉల్లాసపు నడకలు, నటరాజ పాదపద్మాలు
ఇదే చిత్రాన్ని హిందీలో తీసారు “నాఛే మయూరి” అనే పేరుతో. అయితే ఇక్కడ పాటని S.జానకమ్మ గారు పాడారు. పోలిక అని కాదు గానీ తెలుగులో ఈ పాటకి కావాల్సిన (మయూర) ఉల్లాసాన్ని పంచుతూ, పెంచుతూ శైలజ గారి గళపు జీర/మార్థవం మకరంద మత్తుని అందిస్తే జానకమ్మ గారి తియ్యదనపు గళం ఆ(పాట) ఉల్లాసాన్ని తగ్గించనట్లుంది :). ఒకరకంగా శైలజగారి గళం వల్ల కూడా ఈ పాట అధ్బుతంగా వచ్చిందని నా భావన.
ఇంతటి అద్భుతమైన పాటని అందించిన ఆ మహానుభావులని పేరుపేరునా తలుచుకుంటూ వారి ::పాదాలకు వందనాలు::
ఇంతటి అద్భుతమైన పాటని అందించిన ఆ మహానుభావులని పేరుపేరునా తలుచుకుంటూ వారి ::పాదాలకు వందనాలు::
హిందీ దృశ్యసంగీత గొలుసు:(http://www.youtube.com/watch?v=o6L-e_LvcWs)
మయూరి తెలుగు చలనచిత్రపు తొలిభాగపు గొలుసు:(http://www.youtube.com/watch?v=k-RBBR9wLYY)
Sunday, 24 April 2011
ఓ బాబా! నీవు నడిచి చూపిన దారిలో.. ఓ భక్తురాలి నివేదన
@సాక్షి |
ఓ సనాతనసారధి, సామాజికసేవకుని నిర్యాణం..మహాభినిష్ర్కమణ.
ఓ బాబా! నీవు నడిచి చూపిన దారిలో...
ప్రేమ, సేవా,కరుణా మార్గాలు పంచిన పూజ్యనీయమైన వ్యక్తిగా పపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హృదయాలలో కొలువై, తటస్తుల అభిమానాన్ని సైతం చూరగొన్న ఓ సత్యసాయి బాబా, నీ నిర్యాణం మానవలోకానికి తీరనిలోటు. బాబా, ఇక నీవు లేవు అన్న చేదు నిజాన్ని మా ఇంటిల్లిపాది జీర్ణించుకోలేకపోతున్నా౦. అయితే అదేసమయంలో నీ బోధనలు ఆచరించడమే నీకు సరైన నివాళిగా భావించే మేము నీవు భౌతికంగా మమ్ము వదిలివెళ్లినప్పటికీ నీవు పంచిచూపిన ప్రేమ, కరుణ, సేవా మార్గాలను మేము వదలకుండా ఆచరించినంతవరకు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావన్నది వర్తమాన వాస్తవం. నీతివంత౦, అర్ధవంత౦, ప్రేమమయమైన జీవితాన్ని ఎలాగడపాలో మా కళ్ళముందు ఆచరించిచూపిన చూపిన మార్గదర్శకుడివి, మానవత్వం మూర్తీభవించిన మహానుభావుడివి. మమ్మల్నదరినీ ప్రేమ స్వరూపులుగా మీరు భావించడం, మేము తోటిమానవులని ఏవిధంగా ప్రేమించాలో చెప్పటానికి దార్శనికం. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అని నీ ఆప్యాయతా ప్రవచనాలతో మాకు ఈ జీవిత పరమార్థాన్ని బోధించిన ప్రత్యక్ష దైవం నీవు. ఈ సందర్భంగా నీవు చెప్పిన సూర్తిమంతంపు ప్రేమైక ప్రవచనాలు..ఉద్బోదనలు కొన్ని..
౧. మానవపశుపక్ష్యాదులకి ప్రేమను పంచి, అవసరమైనవారికి సేవచేయడమే నీ జీవితపరమార్థం.
౨. ప్రేమే దైవం- దైవమే ప్రేమ. ప్రేమలోనే జీవించు.
౩. నేను దేవుడిని, నువ్వు దేవుడివే. నాలో దైవత్వాన్ని గుర్తించాను నీలో దేవుణ్ని నీవు మేలుకోల్పలేకపోతున్నావు.
౪. భగవంతుడు సుఖాలే అందిస్తుంటాడని, కష్టాలు మనం కొనితెచ్చుకున్నవి.
౫. కష్టమనేది అనేది లేకుండా సుఖం రాదు.
౬. దేహంలో సంచరించే జీవత్వమే దైవత్వం
౭ .హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించడమే నిజమైన తపస్సు
ఆ విధమైన మృదుమధుర ఆధ్మాతిక బోధనలు, ప్రేమ సందేశాలు, శాంతి వచనాలతో ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన నీవు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటావు. కేవలం ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాక, ఆర్త, దీనజనోద్దరణకు శ్రీకారం చుట్టి సమత, మమత, మానవత పంచి అవే సమత-మమత-మానవతా భావనలను మాలో పెంచిన మహానీయుడవు.
ఓ బాబా... నీవు చూపిన దారిలో మేమూ నడుస్తున్నాం. ఈ నడక నీవులేవని ఆపము. నీవు మాకు పంచిన ప్రేమను, జీవితపు ప్రశాంతతని తోటిమానవులకి పంచడానికి మరింత కృతనిశ్చయంతో ఉద్యుక్తులమవుతున్నాము. మమ్ము నీ ప్రేమ,శాంతి వచనాలతో ఆశీర్వదించు.
శ్రీమతి లక్ష్మి లాభాని పతివాడ గారు, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, అమెరికా.
-----------------------------------------------------------------
ఓ బాబా, నేను నీ భక్తుడిని కాకపోయినా నీవు చూపిన ప్రేమమార్గంలో నడిచేవారిలో ఒకడిని. అసంఖ్యాక విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా సత్యం, ప్రేమ, కరుణలను సుమారు ఐదు దశాబ్దలపాటు మీరు ప్రజల సేవకు అంకితమైన మీ నిర్యాణం కడు బాధాకరం. మంచిచేసిన వారినీ తప్పుపడుతూ జీవించే మాలాంటి తుచ్చమైన మానవుల కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తివి నీవు. ప్రేమే దైవం-దైవమే ప్రేమ అంటూ నీవు చూపిన మార్గ౦ నభూతో నభవిష్యతి. గుక్కెడు నీటికోసం అలమటించే మా కరవుసీమ దాహార్తిని తీర్చి అపరభగీరధుడవయ్యావు. మానవసేవే మాధవసేవ అన్న దైవసూత్రాన్ని ఇలలో మా కళ్ళముందు త్రికరణసూత్రంగా ఆచరించి చూపిన మహానుభావుడివి నీవు. నీవు చూపించిన సామాజికసేవలోనే ఇకనూ నడుస్తానని చెపుతూ.....!
శ్రీ రాజీవ్ రెడ్డి గారు, హైదరాబాదు.
సాయి మాట! |
Thursday, 21 April 2011
సాయంసంధ్యా సమయమిది..సాయం చేయగ కదలండీ! - 1
సాయంసంధ్యా సమయం! ఎంత అధ్బుతమైన పదం. తనవారికి, పరులకి సాయంచేసే సంతోషాన్ని పంచుకునే సంధ్యాసమయమని అనిపించట్లేదూ?దాని అర్థం ఇది కాదయ్యా అంటారా? అయితే చదవండి మరి:)
ఉదయసంధ్య హడావుడితో, ఉరుకులపరుగులతో మానవపశుపక్ష్యాదులుకి తీరిక ఉండదు, ఎవరి వృత్తులకి వారు వెళ్ళే సమయమది.
అదే సాయంసంధ్యా సమయమో:
పగలంతా కష్టపడి పొలంపనుల నుండి సాయంకాలానికి ఇల్లు జేరిన రైతన్నలు తమ పొలంలో తొలిగా పండి౦చిన లేలేత సజ్జ/రాగి/జొన్న కంకులను ఇతరులకి పంచే సమయం. గొర్రెలు/మేకలు కాయడానికి కొండకేసివెళ్ళిన గొల్లలు ఆ కొండలలో ఆ ఋతువులలో దొరికే ప౦డ్లు(రేగి/కలే/జువ్వి) తమ పిల్లలికి, వారి దోస్తులకి పంచే సమయం.ఉదయమనంగా వెళ్ళిన పక్షులు కిలకిలారావాలతో తమతమ గూళ్ళకి చేరి తాము తెచ్చిన ఆహారాన్ని, ఆశగా ఎదురుచూస్తున్న పిల్లలకి ముద్దుగా తినిపించే సమయం. ఆవులు ఆబగా ఇంటికి చేరి, అంబా అంటూ ఆవురావురుమని ఎదురుచూస్తున్న లేగదూడని ముద్దుగానిమిరి పాలిచ్చేసమయం. బడి ఎగ్గొట్టి మరీ కొండలకేసిబోయిన పిల్లలు రేగిపండ్లు/చింతపువ్వు/చింతకాయలు తీసుకువచ్చి ఒక్కరే తినకుండా తమ దోస్తులని పిలిచి పంచుకుని మరీ తినే సమయం. వీధికి ఆ కొనాకు ఉన్న లచ్చుమమ్మ ఏం ఎల్లమ్మా పిల్లాడు ఎందుకేడుస్తాన్నాడు అంటే ఈ కొనాకు ఉన్న ఎల్లమ్మ ఇప్పుడే పొలంనుంచి వచ్చానక్కా...చిన్నోడేమో ముక్కలేనిదే ముద్ద దిగదని ఏడుస్తున్నాడని చెబితే, ఉందా/పెట్టమని ఎల్లమ్మ అడక్కుండానే .. ఓ అదా విషయం ఈరోజు మా ఇంట్లో ముక్కలేలే, ఇదిగో మా పిల్లోడికిచ్చి ఇప్పుడే పంపిస్తున్నా అని లచ్చుమమ్మ తనకున్నదాన్ని ఇతరులకి పంచుకునే సమయం. ఆ రెండు కొనాకుల మధ్య ఇంట్లో ఉన్న నేను అమరికలు లేని ఆ ఆప్యాయతపు మాటలను వింటూ ఆనందించే సమయం. ప్రేమ, ఆప్యాయతలు ఎలా పంచిపుచ్చుకోవాలి అన్నది పెద్దలనుంచి గమనించి పిల్లలు నేర్చుకునే సమయం.
ఇక మా ఇంటికి వస్తే ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు పనిచేసి కాసేపలా నడుమువాల్చి, పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేచి గృహలక్ష్మిలా తయారయ్యి తన కుటుంబం కోసం మా మాతృమూర్తి మళ్ళీ శ్రమించే సమయం. ఊరికి దూరాభారంగా ఆరేడు మైళ్ళ దూరంలో ఉన్న బడికి నడుచుకుంటూ/సైకిల్ తొక్కుంటూ వెళ్లి, చదువు చెప్పి తిరిగి వస్తూ పిల్లలికి తన బడలిక తెలీకుండా ఆనందాన్ని మొహ౦మీద, తాయిలాలను చేతిలోనూ పెట్టుకు వచ్చిన నాన్నగారు వాటిని పిల్లలకిచ్చి వారితో ఆనందాన్ని, ఆప్యాయతని పంచుకుని పెంచుకునే సమయం. అప్పుడే బడి నుంచి వచ్చిన అక్కలు/అన్నలు తాము కొనుక్కున్నదానిలో కొద్దిగా దాచిఉంచి చిన్నతమ్ముడినైన నన్ను గారంగా ఆటపట్టిస్తూ తినిపించే సమయం.
మొత్తమ్మీద ఇదో శ్రామిక సౌందర్యం.అయితే ఈ శ్రామిక సౌందర్యం కేవలం కష్టపడ్డంతోనే ఆగిపోలేదు. తాము కష్టపడి సంపాందించినది లేదా ఉన్నది తనవారికి/తోటివారికి పంచుకోవడంలోనూ ఈ శ్రామికసౌందర్యం అంతర్లీనంగా వ్యాపించిఉన్నది. వెరసి శ్రామిక సౌందర్యపు పుట్టింటి నుంచి సారెగా వచ్చిన "సాయ" చీరను కట్టుకుని సంధ్యాదేవి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ తన ఆనందాన్ని సప్తవర్ణాల అంచుతో ప్రపంచానికి ప్రకటించే సమయమది.
ఇవన్నీ ఒక ఎత్తయితే తన సొంతలాభ౦ ఎంతమాత్రం లేకు౦డా పగలంతా వెలుగునిస్తూ వారి కష్టసుఖాలను కళ్లారాచూస్తూ బాధను పంచుకుంటున్న సూరి మామ ఇక తానూ విశ్రమించే వేళయిందని పున్నమి వెలుగుల చల్లదనాన్ని పంచమని చందమామని రారమ్మని పిలిచే సమయం.
సాయంసంధ్యలో అంత సాయపు మహత్తు ఉంది మరి!. ఆ విధంగా తనవారికీ, ఇతరులకీ సాయం చేసి ఆనందం పొందడం అనేది భారతీయ జీవనవ్యవస్థలో తనదైన రూపులో మిళితమై ఉందని కొత్తగా తనకి సాయసూత్రాలు ప్రత్యేకించి చెప్పనవసరంలేదని గట్టిగా చెబుతుంది.
ఆయితే పైన చెప్పిందంతా గతించినకాలపు గుర్తులు అని అందరూ ఒప్పుకుంటారు. నిజమే.. ఆ అభిమానాలు, ఆప్యాయతలు(అ.ఆ) చాలావరకు గతించాయి. సాయం సన్నగిల్లింది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కేవలం వ్యాపారధోరణిగా, అవసరమయినప్పుడు మాత్రమే పుట్టుకువచ్చే అభిమానాలు..ప్రేమలో కొత్తపుంతలు.
మరిప్పుడు ఏవిట్టా అని అడుగుతారా? చెబుతా..ఈ టపాకి అనుబంధ టపాలో వివరిస్తా .. "అలాంటి" సాయంసంధ్యాసమయాన్ని ఇతరులకి మనం పంచడానికి ఆసన్నమైన అవసరాన్ని గురించి :).
మరి సాయం చేయగ కదులుతారా?
Subscribe to:
Posts (Atom)
బ్లాగు ఉద్దేశ్యం!
కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.