నిజం..నిర్భయం

Thursday, 7 July 2011

అ అంటే అమ్మఒడి


నిజవే.. ఆ అంటే అమ్మ.. ఆ 'అమ్మఒడి'లోనే  తొలిమాటలను ముద్దుముద్దుగా పలుకుతూ తడబడుఅడుగులు వేస్తూ ఎదుగుతారు పిల్లలు.  ఇక మన బ్లాగ్లోకంలో అమ్మఒడి గారంటే బహుశా తెలియనివారుండరు. ఈ 'అమ్మఒడి'లో చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా సామాజిక విజ్ఞానాన్నికావలసినంత సముపార్జించుకోవచ్చు.  రామాయణం నుంచి నేటి సమకాలీన రాజకీయాల వరకు సామాన్యుడికి సైతం అర్ధమయ్యే  రీతిలో చెప్పడం ఒక ఎత్తయితే వాటిని నేటి సమాజ పరిస్థితులకు అనుసంధానిస్తూ వలువలూడిపోతున్న మానవవిలువలను, రీతులను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ముందుకుపోవడం ఆమె ప్రత్యేకత.  వారే  అమ్మఒడి  ఆదిలక్ష్మి గారు.

బాల్యంలోనే పిల్లల వెన్నుని గట్టిపరచాలన్న రామకృష్ణులవారి సూక్తిని మనసా వాచా ఆచరిస్తూ ఇప్ప్దటివరకూ ఉపాధ్యాయవృత్తి ద్వారా  ఎంతోమంది యువతకి తన జ్ఞానసముపార్జనని పంచి సమాజంలో ఉత్తములుగా తయారయ్యే భావాలని మనసులో అనుభవసారంతో నాటారు. నేడు  సామాజిక, ఆధ్యాత్మికత కలగలిపిన తన  విజ్ఞానాన్ని మరింతమందికి పంచాలనే ఉద్దేశ్యంతో భగవద్గీత స్పూర్తితో అంటూ అమ్మఒడి విద్యాక్షేత్రాన్ని ఏర్పాటుచేశారు.    

ఇక వారి మాటల్లో...    
  



భగవద్గీత స్పూర్తితో అయిదు సూత్రాల నియమావళి:

Ø  నేర్చుకునే తత్వం
Ø  స్థిరబుద్ధి (ఏకాగ్రత)
Ø  భావ ప్రసార నైపుణ్యం
Ø  క్రమశిక్షణ
Ø  శ్రమించే గుణం
                          చిన్నారులు తమ బాల్యానందాన్నీ మాధుర్యాన్నీ కోల్పోకుండా!
Ø  నేర్చుకునే తత్వం: నేర్చుకునే తత్వాన్ని నేర్చుకున్న వ్యక్తులు, అక్షరాలు అంకెలే కాదు, ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోగలరు.
Ø  స్థిరబుద్ధి (ఏకాగ్రత): భగవద్గీత మనల్ని స్థిర బుద్ధిని సాధించమంటుంది. స్థిర బుద్ధి, ఏకాగ్రత సాధిస్తే, జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు.
Ø  భావ ప్రసార నైపుణ్యం: భావ ప్రసార నైపుణ్యం గల వ్యక్తులు, నాయకులుగా ఎదుగుతారు. కథలు, పజిల్స్ ద్వారా చిన్నారులలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించగలం.
Ø  క్రమశిక్షణ: శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు బాల్యంలోనే పిల్లల వెన్నుని గట్టి పరచాలనిచిన్నారుల మనస్సులలో క్రమశిక్షణా బీజాలు నాటితే, వారు బలమైన వ్యక్తిత్వం గలవారిగా ఎదుగుతారు.
Ø  శ్రమించే గుణం: విజయానికి దగ్గరి మార్గాలు లేవు అంటారు పెద్దలు. చిన్నారులలో వారి స్థాయికి తగినట్లుగా శ్రమించే గుణాన్ని అలవర్చగలం.
·         చిన్నారులు తమ బాల్యపు ఆనందాల్నీ, మాధుర్యాన్నీ కోల్పోకుండా చదువులను ఆస్వాదించాలి.
·         స్కూల్ కి రావడం అంటే అది వారికి వినోద యాత్రకు వెళ్ళినట్లుగా ఉండాలి.
·         అదో అద్భుత లోకంగా చిన్నారులు భావించాలి.
      అందుకే మా స్కూల్ ని (విద్యాక్షేత్రాన్ని) అమ్మఒడి అంటున్నాము.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:  9440971265, 8179977915, 9177541822
************************************************************************************************************
వారి ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగి అ అంటే అమ్మఒడి అన్నరీతిలో అమ్మఒడి విద్యాక్షేత్రం పేరుతెచ్చుకోవాలని  మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన వారి నిస్వార్ధ ప్రయత్నానికి తోడుగా, మద్దతుగా నా నుంచి చేయగలిగే చిన్న సహాయమే ఈ టపా.  ఎందుకంటే అమ్మఒడి ఆరంభమయింది.. ఇక విస్తృత ప్రచారం కావాలి.   ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మెయిల్స్/ఇతర మార్గాలా ద్వారం ప్రచారం సులువైనదీ..ఖర్చులేనిది..ఆయితే కొంత మనసు ఉండాలి మంచికి మద్దతు ఇవ్వడానికి.  ఆ ప్రచారంలో భాగమే ఈ టపా. మీరు కూడా ఈ విద్యాక్షేత్రాన్ని మరింతమందిలోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కలిపించాలనుకుంటే వివరాలకోసం నాకో ఉత్తరం పెట్టగలరు. rajeshgottimukkala@gmail.com   

3 comments:

Rao S Lakkaraju said...

విద్యాక్షేత్రానికి పంచ సూత్ర నియమావళి చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది మొదటి సూత్రం "నేర్చుకునే తత్వాన్ని నేర్చుకున్న వ్యక్తులు, అక్షరాలు అంకెలే కాదు, ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోగలరు".

Good Luck to the school.

Unknown said...

రాజేష్ చక్కటి పోస్ట్ ఇది
క్రమశిక్షణ: శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు ‘బాల్యంలోనే పిల్లల వెన్నుని గట్టి పరచాలని’ చిన్నారుల మనస్సులలో క్రమశిక్షణా బీజాలు నాటితే, వారు బలమైన వ్యక్తిత్వం గలవారిగా ఎదుగుతారు. ఇది నిజం .

చిన్నపటినుంచి పిల్లలు శాఖకి వెళ్ళడం నేర్చుకుంటే వారిలో చాల మార్పు వస్తుంది ....
స్కూల్ ఆశయాలు చాల బావున్నాయి

Jagadish Reddy said...

Rajesh G

Convey my best regards to Smt. Aadi lakshmi gaaru.

Definitely I will get details from you and make sure to forward them to my Hyd buddies.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers