నిజం..నిర్భయం

Saturday, 16 July 2011

దయచేసి....

గీతా..ఎమి తెమ్మంటావు చెప్పు?


















నిన్న తెల్లవారుఝామున అమ్మఒడి ఆదిలక్ష్మి గారి ఇంటినుంచి ఫోన్. లెనిన్ గారి ద్వారా వారి గారాల పట్టి గీత ఇకలేదన్న  విషయాన్ని తెలుసుకుని కాసేపటివరకూ తేరుకోలేకపోయాను. భోరుమని విలపిస్తున్న ఆదిలక్ష్మిగారిని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ఇక ఈ హృదయవిదారకమైన వార్త తోటివారికి ఏ విధంగా చెప్పాలో తెలియలేదు..చివరికి ఇలా..!

తను మనసా వాచా  నమ్మిన సత్యంకోసం జీవితంలో ఇప్పటికే ఎన్నోకష్టానష్టాలకు ఓర్చుకుని ఎదురీదుతున్న ఆదిలక్ష్మి గారికి ఇది తట్టుకోలేని కష్టం.  తనకి ఆత్మీయులు, అయినవారు అంటే తనను ఎంతో అభిమానించే బ్లాగర్లు  అని ఆమె ఎప్పుడూ చెబుతుండేవారు.  ఆ తల్లడిల్లుతున్న తల్లి మనసు తనకు తానుగా ఊరడిన్చుకునే  శక్తినివ్వాలని ఆ దేవదేవుడ్ని కోరుకుందాం.  ఆ తల్లికిప్పుడు ఓదార్పు కావాలి..వారికి మనమూ పిల్లలమే అన్న రీతిలో.. ఆమెపై అభిమానం ఉన్నవారు దయచేసి  వారిని వ్యక్తిగతంగా  @

ప్లాట్#83,  Road No#4, Balaji Nagar, Nizampet , Hyderabad 

లేదా ఫోన్ ద్వారా
91-9440971265 ( ఒక విన్నపం: ఆదిలక్ష్మి గారు తీవ్రమైన వేదనలో ఉన్నారు. ఫోన్ ద్వారా మనం ఇది అని తెలిస్తే వారికి బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. అందువల్ల ఫోన్ ని లెనిన్ గారి దగ్గర ఉంచుకోమని, బ్లాగర్లు ఎవరైనా ఫోన్ చేస్తే తననే మాట్లాడమని చెప్పా.  మీరు ఫోన్ చేసినపుడు ఆడగొంతు వింటే లెనిన్ గారికి ఫోన్ ఇవ్వమని చెప్పండి. లెనిన్ గారి ద్వారా ఆదిలక్ష్మి గారి పరిస్థితి తెలుసుకుని, దానిని బట్టి మీ అనునయవ్యాక్యాలు తెలుపగలరు )

కృతజ్ఞతలు మీకు!

గీతా..., మామయ్యా ఏమి తెస్తావు నాకు లండన్ నుంచి అంటూ నేనొచ్చేలోపే...!  నీ ఆత్మకు ఆ దేవదేవుడు శాంతి కలిగించుగాక.

ఇక చివరిగా.. గీత చాలా తెలివైన అమ్మాయి..అరిందానిలా మాట్లాడేది. ఆ పసిమనసు ఎక్కడో తీవ్రంగా గాయపడింది. అంతే.. దయచేసి గీత మరణానికి కారణాలుగా మన ఊహాగానాలు జోడించవద్దని మనవి. ఈ సమయంలో ఆ తల్లిని ఒదార్చడమే మన తక్షణ కర్తవ్య౦.

Thursday, 7 July 2011

అ అంటే అమ్మఒడి


నిజవే.. ఆ అంటే అమ్మ.. ఆ 'అమ్మఒడి'లోనే  తొలిమాటలను ముద్దుముద్దుగా పలుకుతూ తడబడుఅడుగులు వేస్తూ ఎదుగుతారు పిల్లలు.  ఇక మన బ్లాగ్లోకంలో అమ్మఒడి గారంటే బహుశా తెలియనివారుండరు. ఈ 'అమ్మఒడి'లో చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా సామాజిక విజ్ఞానాన్నికావలసినంత సముపార్జించుకోవచ్చు.  రామాయణం నుంచి నేటి సమకాలీన రాజకీయాల వరకు సామాన్యుడికి సైతం అర్ధమయ్యే  రీతిలో చెప్పడం ఒక ఎత్తయితే వాటిని నేటి సమాజ పరిస్థితులకు అనుసంధానిస్తూ వలువలూడిపోతున్న మానవవిలువలను, రీతులను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ముందుకుపోవడం ఆమె ప్రత్యేకత.  వారే  అమ్మఒడి  ఆదిలక్ష్మి గారు.

బాల్యంలోనే పిల్లల వెన్నుని గట్టిపరచాలన్న రామకృష్ణులవారి సూక్తిని మనసా వాచా ఆచరిస్తూ ఇప్ప్దటివరకూ ఉపాధ్యాయవృత్తి ద్వారా  ఎంతోమంది యువతకి తన జ్ఞానసముపార్జనని పంచి సమాజంలో ఉత్తములుగా తయారయ్యే భావాలని మనసులో అనుభవసారంతో నాటారు. నేడు  సామాజిక, ఆధ్యాత్మికత కలగలిపిన తన  విజ్ఞానాన్ని మరింతమందికి పంచాలనే ఉద్దేశ్యంతో భగవద్గీత స్పూర్తితో అంటూ అమ్మఒడి విద్యాక్షేత్రాన్ని ఏర్పాటుచేశారు.    

ఇక వారి మాటల్లో...    
  



భగవద్గీత స్పూర్తితో అయిదు సూత్రాల నియమావళి:

Ø  నేర్చుకునే తత్వం
Ø  స్థిరబుద్ధి (ఏకాగ్రత)
Ø  భావ ప్రసార నైపుణ్యం
Ø  క్రమశిక్షణ
Ø  శ్రమించే గుణం
                          చిన్నారులు తమ బాల్యానందాన్నీ మాధుర్యాన్నీ కోల్పోకుండా!
Ø  నేర్చుకునే తత్వం: నేర్చుకునే తత్వాన్ని నేర్చుకున్న వ్యక్తులు, అక్షరాలు అంకెలే కాదు, ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోగలరు.
Ø  స్థిరబుద్ధి (ఏకాగ్రత): భగవద్గీత మనల్ని స్థిర బుద్ధిని సాధించమంటుంది. స్థిర బుద్ధి, ఏకాగ్రత సాధిస్తే, జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు.
Ø  భావ ప్రసార నైపుణ్యం: భావ ప్రసార నైపుణ్యం గల వ్యక్తులు, నాయకులుగా ఎదుగుతారు. కథలు, పజిల్స్ ద్వారా చిన్నారులలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించగలం.
Ø  క్రమశిక్షణ: శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు బాల్యంలోనే పిల్లల వెన్నుని గట్టి పరచాలనిచిన్నారుల మనస్సులలో క్రమశిక్షణా బీజాలు నాటితే, వారు బలమైన వ్యక్తిత్వం గలవారిగా ఎదుగుతారు.
Ø  శ్రమించే గుణం: విజయానికి దగ్గరి మార్గాలు లేవు అంటారు పెద్దలు. చిన్నారులలో వారి స్థాయికి తగినట్లుగా శ్రమించే గుణాన్ని అలవర్చగలం.
·         చిన్నారులు తమ బాల్యపు ఆనందాల్నీ, మాధుర్యాన్నీ కోల్పోకుండా చదువులను ఆస్వాదించాలి.
·         స్కూల్ కి రావడం అంటే అది వారికి వినోద యాత్రకు వెళ్ళినట్లుగా ఉండాలి.
·         అదో అద్భుత లోకంగా చిన్నారులు భావించాలి.
      అందుకే మా స్కూల్ ని (విద్యాక్షేత్రాన్ని) అమ్మఒడి అంటున్నాము.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:  9440971265, 8179977915, 9177541822
************************************************************************************************************
వారి ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగి అ అంటే అమ్మఒడి అన్నరీతిలో అమ్మఒడి విద్యాక్షేత్రం పేరుతెచ్చుకోవాలని  మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన వారి నిస్వార్ధ ప్రయత్నానికి తోడుగా, మద్దతుగా నా నుంచి చేయగలిగే చిన్న సహాయమే ఈ టపా.  ఎందుకంటే అమ్మఒడి ఆరంభమయింది.. ఇక విస్తృత ప్రచారం కావాలి.   ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మెయిల్స్/ఇతర మార్గాలా ద్వారం ప్రచారం సులువైనదీ..ఖర్చులేనిది..ఆయితే కొంత మనసు ఉండాలి మంచికి మద్దతు ఇవ్వడానికి.  ఆ ప్రచారంలో భాగమే ఈ టపా. మీరు కూడా ఈ విద్యాక్షేత్రాన్ని మరింతమందిలోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కలిపించాలనుకుంటే వివరాలకోసం నాకో ఉత్తరం పెట్టగలరు. rajeshgottimukkala@gmail.com   

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers