నిజం..నిర్భయం

Friday, 13 May 2011

పశ్చిమాన అరుణవర్ణం పదవీ కాంక్షతో భంగపడి అస్తమించింది.

ముప్పైనాలుగేళ్ల(34) అప్రతిహతమైన వామపక్షపాలనకు తార్కాణంగా నిలిచిన పశ్చిమబెంగాల్ ఎర్రకోట నేడు బీటలు వారింది. 


సూచన: టపా పొడవు అయినందువల్ల చదువరుల సౌకర్యార్ధం పేరాలుగా విడగొట్టి ప్రతి పేరాని గొలుసులుగా ఇవ్వడమైనది. గొలుసుని పేరా చూడ్డానికి, మూయడానికి ఉపయోగించగలరు. అన్ని పేరాలు ఒకేసారి చూడ్డానికి "Show All" అన్న గొలుసు నొక్కండి. మీకు ఏదేనీ పనిచేయకపొతే rajeshgottimukkala@gmail.com కు ఉత్తరం పంపగలరు. 

నాకున్న రాజకీయపరిజ్ఞాన౦, శోధించి తెలుసుకు౦టున్న చరిత్ర ఆధారంగా పశ్చిమబెంగాల్లోని వామపక్షపార్టీ ఉత్తాన-పతనాలపై సింహావలోకనం.

పశ్చిమబెంగాల్(ప.బె) గురించి టూకీగా:

భారతదేశం ఆంగ్లేయుల పరిపానలో ఉన్నప్పుడు తూర్పుతీర ప్రాంతాల్లో అనగా ప.బె, అస్సామ్, బీహార్ మరియు ఒరిస్సాల్లో తమ పరిపాలనా సౌలభ్య౦లో భాగంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి పరిచింది. కలకత్తా ఓడరేవు పట్టణంగా వాణిజ్యరంగానికి ప్రసిద్దిచెందింది. 1950 చివరిదశకం వరకూ భారతదేశ ఆర్ధికరాజధానిగా కలకత్తా భాసిల్ల్లింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ౦ ప.బె లో ఎన్నోరకాల పరిశ్రమలు ఏర్పరిచి మరింతగా అభివృద్ధి పరిచింది.

       Show All

వామపక్షపార్టీ రాజకీయ ప్రస్థాన౦

పేద,బలహీనవర్గాల వారి హక్కులను పెత్త౦దారీ భూస్వాముల నుంచి కాపాడ్డానికి సమసమాజనిర్మాణమే లక్ష్యంగా, తుపాకీ ఆయుధంగా ఏర్పడిన నక్సలిజం తదననతరం, అన్నివర్గాల ప్రజలతో మమేకం అవ్వడానికి తుపాకీ పొత్తు కుదరదని గ్రహించి౦ది. పేద, శ్రామిక వర్గాల హక్కులకోసం ధనిక, పెట్టుబడి వర్గాలతో పోరాడ్డమే ముఖ్యసిద్ధాంతంగా ఏర్పడిన మార్క్సిజం మూలాలతో వామపక్షభావజాలంగా శ్రీ జ్యోతిబసు, శ్రీ ప్రమోద్దాస్ గుప్తా వంటి నీతి,నిజాయతీ గల నేతల సారధ్యంలో క్రియాశీలక రాజకీయాల్లోకి CPI అనే పేరుతో పార్టీగా ఆవిర్భవించింది.


ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజాశ్రేయస్సు కొరకై ఏర్పరచిన సిద్దాంత౦ మూలాలు ఎంత మంచివే అయినా వాటిని ఆచరిస్తున్నామంటూ కొందరు ఆ సిద్దాంతాలని తమ స్వార్థానికి వినియోగించడం వల్ల ఆ మూలాల ఉనికికే ముప్పు వస్తుంది. ఇక్కడా అదే జరిగింది.                  

ఇక వామపక్షభావాలను సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, వారిని పార్టీ వైపుకి ఆకర్షి౦చాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఈరోజుల్లో అయితే ధన౦బలం ఇత్యాది వక్రమార్గాలు చాలాఉన్నాయి. అప్పట్లో ప్రజలవైపు, వారి సమస్యలని పరిష్కరించే వైపు నిజాయితీగా పోరాడ్డమే ఆకర్షణ. ఆదే పోరాటతత్వంతో ఏర్పడిన వామపక్షం తొలుత ప్రజల్లోకి తమ భావాలను నెమ్మదిగా చొప్పించే ప్రయత్నం చేసింది. అయితే పోనుపోను సమస్యల వైపు పోరాడ్డం కాకుండా కేవలం తమ భావాలను ప్రజలమీద బలవంతంగా రుద్దడానికి, పార్టీని ఏవిధంగానైనా అధికారంలో రావడానికి దృష్టి పెట్టి కొన్ని చెడుమార్గాలు తొక్కింది. వాటిలో ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్తలను తప్ప మిగిలినవారిని పెట్టుబడి దారులుగా, అమెరికా సానుభూతి పరులుగా, CIA గూఢచారులుగా, ప్రజావ్యతిరేకులుగా, పేద/శ్రామిక వ్యతిరేకులుగా ముద్ర వేస్తూ తాము మాత్రమే పేదవారి తరపున పోరాడేవారమని చెప్పే ప్రయత్నం చేసింది.

అయితే ఎన్నుకున్న మార్గం వక్రమైనదైనా అసలు ఉద్దేశ్యం మంచిగా ఉండడంతో పేదప్రజల మీద అధ్బుతంగా పనిచేసింది. అదే ఊపుతో 1962 లో ప.బె అసెంబ్లీలో మూడొ౦తుల బలాన్ని తెచ్చుకుంది. అయితే ఇక్కడ కోతికి కొబ్బరికాయ దొరికిన చందం అయింది. వారు తమకి మద్దతునిచ్చిన ప్రజలను, వారి సమస్యలని గాలికొదిలేసి పూర్తి బలాన్ని తెచ్చుకుని అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళురారు. తమ మూలాల్ని మరిచారు.. తంపుల పుంతలు తొక్కారు.

మారిన సిద్దాంతం-మార్క్సిజ౦ నుంచి  అతివాద౦(ఫండమెంటలిజం) వైపు:

అందులో భాగంగానే కిందపేర్కొన్న వాటిని తమ నినాదాలుగా పేర్కొంటూ, కార్యకర్తలను యుద్ద సైనికులుగా తయారుచేస్తూ వామపక్షవాద మూలాల్ని కొద్దికొద్దిగా వదిలేస్తూ మార్క్సిజాన్ని ఫండమెంటలిజం దిశగా తీసుకువెళ్లడం మొదలుపెట్టారు.

౧.అధికారం అనేది బలప్రయోగం లేదా తుపాకీ ద్వారానే వస్తుంది
౨.అవసరమైతే చట్టాన్ని అతిక్రమి౦చాలి
౩.ప్రజాస్వామ్యం కేవలం పెట్టుబడిదారులది

అదంతా ఒక ఎత్తయితే 1962 లో చైనా భారతదేశం మీదకి దండెత్తివచ్చి హిమాలయాల భూభాగాన్ని పెద్దమొత్తంలో ఆక్రమించినపుడు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయపౌరుడు ఆ దాడిని తిప్పకోట్టలేని భారతదేశ ప్రభుత్వం మరియు సైన్య౦ అసమర్థతను ఎండగడుతుంటే ఒక్క వామపక్షవాదులు, వారి అనునూయులు మాత్రం దాన్ని చైనా విజయంగా చెబుతూ చైనా మాత్రమే శ్రామికవర్గాలకు మద్దతుగా ప్రపంచదేశాలతో పెట్టుబడిదారుల మీద పోరాడగలదనే కబోది అభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భ౦గానే "చైనాలో వర్షం పడితే ఇక్కడ వామపక్షవాదులు గొడుగు పడతారు" అనే జాతీయానికి అంకురార్పణ జరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ వి౦తకబోది నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూ మొన్న సిక్కి౦, అరుణాచల్ మీద చైనా కాలుదువ్వినా ఏమీ మాట్లాడకుండా గుడ్డికి తోడుగా మూగతనాన్ని ఆభరణంగా తెచ్చుకుంది.

ఇక 1963లో రష్యా, చైనా మధ్య బేధాలు పొడసూపినప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న చందాన విచిత్రంగా పేద/శ్రామిక వర్గాల కొరకై పోరాడాలన్న మూలసిద్దాంతాలను వదిలి తాము కొత్తగా ఏర్పరుచుకున్న సిద్దాంతాలకి విలువనిస్తూ భారత వామపక్షవాద పార్టీ(CPI) 1964 లో నిట్టనిలువుగా రెండు పార్టీలుగా చీలిపోయింది. ఒకటి CPI-రష్యాకి మద్దతు మరొకటి CPM-చైనాకి మద్దతుగా. ప్రపంచ౦లో ఏ దేశంలోని పార్టీ కూడా బహుశా ఇలా పక్కదేశాలకోసం అదీ వారి గొడవలకి మద్దతునిస్తూ విడిపోయిఉండదు :(. అది మొదలు అనగా 1967 నుంచి నేటివరకు ఎన్నికల్లో రెండుపార్టీలు విడిగానే పోటీ చేస్తూఉన్నాయి.

1967 లో జరిగిన ఎన్నికల యుద్దంలో ప.బె లో ఏ పార్టీకి ఒక్కరే ప్రభుత్వాన్ని స్థాపించే౦త బలం రాలేదు. అప్పుడు గాంధేయవాది అయిన శ్రీ అజోయ్ ముఖర్జీ గారు ముఖ్యమంత్రిగా, శ్రీ జ్యోతిబసు గారు ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్-వామపక్ష సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ప్రభుత్వం ఆట్టే సజావుగా సాగలేదు. వామపక్షవాదులు తమ వాదాన్ని ప్రజల్లోకి మరింతగా చొప్పించేందుకు చేతికి అందివచ్చిన అధికారాన్ని వాడుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పైకి శ్రామికులని రెచ్చగొట్టి నిరంతరం హర్తాళ్ళు, బందులతో ప.బె హడలి పోయేలా చేసింది. అభివృద్ధి కుంటుపడింది. చివరకి 1969 లో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుపరిచి రాష్ట్రపతి పాలన విధించారు.


అర్రులుచాచిన పదవీకాంక్ష:

అంతే! దీనితో వామపక్షవాదులు మరింతగా రెచ్చిపోయారు. తమ పార్టీ కార్యకర్తలను పెంచుకుని మిగిలిన ప్రజలని ప్రభావితం చేసే ఉద్దేశంతో ఇతర వా.ప.వాదులతో గొడవలకి దిగారు. సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పదవీకా౦క్ష పోరాటాల్లో ఏంతోమంది ప్రాణాలు బలిపశువులుగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదేసమయంలో ఫార్వార్డ్ బ్లాక్ ముఖ్యఅధ్యక్షుడిని నడివీధిలో కత్తులతో పొడిచి చంపారు. అప్పటినుంచి ఏదోఒక చావు వార్త ప.బె పేరు మీదుగా పత్రికల్లో రావడం నిత్యమైపోయింది.

ఇక 1969లో జరిగిన ఎన్నికల్లో CPM కి పూర్తి బలం సాధించి మిగలిన ఇతర వామపక్షపార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సొంత ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పట్టి నుంచి గొడవలు, లూటీలు మొదలయ్యాయి. అధికార సిద్దాంతం తప్ప పేదవాడు కనిపించడం లేదు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ గొడవ ప్రముఖంగా పైకి వచ్చింది. పెట్టుబడిదారుల మీద దాడులని ముమ్మరం చేసింది. అదే తమ సిద్ధాంతంగా చెప్పుకొచ్చింది చివరికి. కొన్ని సంవత్సరాలవరకు ప్రజలు ఈ గొడవలవల్ల నరకం అనుభవించారు..స్వేచ్చను కోల్పోయారు. చివరికి కేంద్రం 1971లో మళ్ళీ రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో కేంద్రం మీద అక్కసుతో వామపక్షవాదులు తమ విభాగాలతో కలిసి కుట్రలు పన్నాయి. అవి పలువురు కాంగ్రెస్స్ నాయకుల హత్యలకు దారితీసాయి. కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సమయంలో ధైర్యంగా బయటికి వచ్చి తమ పార్టీ తరపున నిలబడేవాళ్ళు కూడా లేకపోయారు. అయితే 1973లో జరిగిన ఎన్నికల్లో బొటాబొటీ బలంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఓటమి వా.ప వాదులకి మింగుడుపడలేదు. వారి అధినాయకులకి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అప్పటికి అవగతమయింది. ప్రజలకి శాంతిభద్రతలు, స్వేచ్చాయుత జీవితం కోరుకుంటున్నారని అర్థం అయింది. ఇకనుంచి వామపక్షభావ జాలాన్ని హింసతో కాక శాంతిమార్గ౦లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఇది నచ్చని ఈ పార్టీలోని కొందరు పిడివాదులు "నక్సలిటాస్" పేరున చారుమంజుదారు అధ్యక్షతన మరో కొత్తపార్టీ పెట్టి CPM కి బద్దశత్రువులుగా తయారయ్యారు.

అది 1977.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1975-అత్యయిక పాలన(ఎమర్జెన్సీ) దెబ్బతో ఉత్తరభారతదేశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, అలానే పశ్చిమ బెంగాల్లో కూడా. మళ్ళీ రాష్ట్రపగ్గాలు వామపక్షవాదుల చేతికి వచ్చాయి. శ్రీ జ్యోతిబసు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు ప.బె లో వామపక్షపాలన గత ముప్పైనాలుగేళ్ళుగా(34) నిరాటంకంగా నిన్నటివరకు కోనసాగుతూనే ఉంది.

ఇప్పుడు కాలంతో పాటు వా.ప ప్రభుత్వమూ మారి ప్రజలకు కావలసిన మౌలికఅవసరాలు, అభివృద్ధి గురించి మళ్ళీ ఆలోచించడ౦ మొదలుపెట్టింది. అయితే ఆ ఆలోచన హింసగా మారి హంసపాదుగా మిగిలింది. నందిగ్రామ్, సింగూర్లో నెలకొన్న హింసాత్మక సంఘటనలే దీనికి ప్రత్యక్షఉదాహరణలు.

వెరసి భారతవామపక్షపార్టీ తన చేష్టల వల్ల సగటు భారతీయులకి మార్క్సిజమంటే పేదల వ్యతిరేకి మరియు అభివృద్ధి నిరోధకులు అనే కొత్త అర్దాన్ని ఇచ్చి మార్క్సిజ౦ ఏర్పాటుకు మూలమైన హేతువు యొక్క పరమార్ధాన్ని తుంగలో తొక్కింది.

పారిశ్రామికిభివృద్ధి మందగించి నిరుద్యోగంతో అల్లాడుతున్న ప.బెకి 2000 సంవత్సరం నూతనఅధ్యాయం మొదలైంది. వామపక్షప్రభుత్వ ఉదారవాది బుద్దదేవ్ భట్టాచార్య గారు ప.బెల్లో పెట్టుబడులకు దారులు తెరిచారు. భారీస్థాయిలో పారిశ్రామికీకరణ ప్రణాళికలకి నాందీ పలికారు. అయితే ఈ ప్రయాత్నాలు ఒక పద్దతిగా కాకుండా ఇబ్బడిముబ్బడిగా, గందరగోళం మధ్య మొదలవ్వడంతో విఫలమయ్యాయి. దీని ఫలితంగా పైన ఉదాహరించిన సింగూరు, నందిగ్రాంలో వేలాదిమంది రైతులు భూములు కోల్పోవడమే కాకుండా నిరాశ్రయులయ్యి వీధినపడ్డారు. బాధితులంతా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామికీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకదశలో పేదల జీవితాలతో ఆడుకుంటుందని పేరుతెచ్చుకున్న వామపక్ష ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడి సామాన్య ప్రజలు పెట్టుబడి భూతంగా చూస్తున్నారు.        


నవీన వామపక్షవాది - మమతాబెనర్జి గారు (దీదీ):

ఇదిలా వుండగానే సామాన్య ప్రజలందరి చేతా దీదీగా పిలువబడుతూ వారి హృదయాలకి చేరువైన మమతాబెనర్జీ గారి అధ్యక్షతన 1998లో ఏర్పాటైన తృణమూల్‌ కాంగ్రెస్‌ వామపక్షపార్టీకి బలమైన ప్రత్నామ్నాయంగా ఎదిగింది. అసలైన వామపక్షవాదానికి తాను ప్రతినిధిగా చెప్పుకుంటూ ప్రజలను౦చి మాత్రమే కాకుండా నక్సల్స్ వర్గాల నుండి కూడా మద్దతు సంపాదించుకోగలిగారు. అట్లే వామపక్షంపార్టీ తన అసలు మూలసిద్దాంతాలకి నిర్మూలం పలుకుతుండడం చూసి తట్టుకోలేని వామపక్ష సానుభూతిపరులు గణనీయమైన సంఖ్యలో దీదీ వైపు ఆకర్షితులయ్యారు. దీదీ వామపక్షపార్టీని వామపక్షవాదంతోనే ఎదుర్కొంటూ 2008 పంచాయతీ, 2009 సాధారణ ఎన్నికలు మరియు 2010లో కోల్‌కతా మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి వామపక్షపార్టీకి ముచ్చెమటలు పోయించి అయోమయానికి గురిచేసింది.  దీదీకి అడ్డుకట్ట వేసేందుకు వామపక్షపార్టీ చేసిన ప్రయత్నాలు వికటించి రెండు పార్టీల మధ్య రాజకీయ హత్యలతో రక్తపాతానికి దారితీసింది. ఇటు నక్సల్స్ వర్గాల నుంచే కాకుండా అటు మావోయిస్టుల మద్దతు కూడా దీదీ పొందగలిగారు. పలుసందర్భాల్లో మావోయిస్టులకు అనుకూలంగా దీదీ ప్రవర్తించడం దీనికి ముఖ్యకారణం. సింగూర్, నందిగ్రామ్ ల్లో ప్రజల తరపున గట్టిగా పోరాడిన దీదీకి మావోయిస్టులు అండగా నిలిచారు.

అదే స్పూర్తితో, అన్ని వర్గాల మద్దతుతో దీదీ నేడు అఖండఘనవిజయ౦ సాధించారు. వామపక్షపార్టీ ప్రజాగ్రహానికి గురయ్యి గల్లంతయింది. ఆఖరికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా ఓడిపోయారు!

మరి శ్రామిక అరుణవర్ణం అస్తమించినట్లేనా? అంటే కానే కాదు. ఈ అరుణవర్ణం అనేది శ్రామికులకి సంబంధించినది, ఒక పార్టీకి కాదు. కేవలం  తాము మాత్రమే అరుణవర్ణ అధిపతులం అని పదవీ వ్యామోహంతో కొట్టుకున్న అరుణవర్ణపు వామపక్షపార్టీకి మాత్రమే అస్తమయం, అదీ ప్రస్తుతానికి!.

పశ్చిమాన అస్తమించిన అరుణుడు ఏవిధంగా ఆయితే శ్రామికవర్గానికి ఆనందాన్ని పంచడానికి మరుసటిరోజు ఉదయాన్నే ఉషస్సులతో ఉదయిస్తాడో అదే విధంగా నేడు అస్తమించిన వామపక్ష-అరుణవర్ణం రేపు దీదీ నుదుట అరుణవర్ణంగా ఉదయించి అసలైన వామపక్ష సిద్దాంతాలను పాటిస్తూ కర్షక, శ్రామిక లోకానికి చేయూతనిస్తుందని ఆశిద్దాం.


అదేవిధంగా మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి రోజున తమదైన విజ్ఞతను ప్రదర్శి౦చి ప్రపంచానికి తెలిపిన పశ్చిమబెంగాల్ ఓటర్లకి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.





19 comments:

Apparao said...

రాజేసా
ఇదంతా నువ్వే రాసేవా ?
చాలా బాగా రాశావ్
ఒక రోజు కూకోని నీ బ్లాగ్ మొత్తం చదవాలి

KumarN said...

Excellent!!!..మీరు దినదినాభివృద్ధి చెందుతున్నారు రాజేష్. మీ శీర్షిక బ్రిలియంట్. ముఖ్యంగా మీరు రాయాలనుకున్నదాన్ని విభిన్న అంశాలుగా విభజించడమే కాకుండా, దాన్ని చదవడానికి సులువుగా, సౌకర్యంగా ఉండేట్లు అమర్చిన విధానం ప్రశంసనీయం. నా భాషలో చెప్పాలంటే అదిరింది బాసూ.

ఇహ ఇజాలంటారా...ఏ ఇజం కూడా ఫూల్-ప్రూఫ్ కాదు. కాపిటలిజం లో ఉండే లొసుగులు కుప్పలు కుప్పలు, ఎర్రగడ్డిజం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీదీజం ప్రజలకి మంచి చేసి, కార్పోరెట్స్ ని, కార్మికసంఘాలనీ అకౌంటబుల్ చేయగలిగితే అంతకన్నా కావలిసిందేముంది?

Indrasena Gangasani said...

@రాజేష్ గారు.
మీ బ్లాగు బహు చక్కగా ఉంది.ఈ టపా అదిరింది.కమ్యునిస్టు రాజ్యం కూలడం indeed అండి.అది ఒక చారిత్రాత్మక అవసరం.
ప్రపంచీకరణ,privatization అనేవి ఆపలేనివి. మన భారతదేశ నాయకులు capitalism ఫాలో అవుతూ,అందరికి సమ న్యాయం చేస్తూ,తాడిత పీడిత వర్గాలని మెయిన్ stream సమాజాలం లో కి తీసుక వచ్చి అందరి అభివృద్ధి కి పాటు పడటం అతి ముఖ్యం.
ఈ కమ్యునిస్టులు రొడ్డ కొట్టుడు సిద్దాంతాలతో ప్రజల్ని మధ్య యుగాలకి తీసుక వెళ్తారు.

Anonymous said...

Watch it. You might like it.

http://www.youtube.com/watch?v=IHgYPDvQFU8


Jayaho

Anonymous said...

కొద్దిగా చదివాను, రాజేష్ గారు, బాగా రాశారు. ఇంకా పూర్తిగా చదవాలి.

తెర గారికి ఇంత ఉలుకెందుకో. ఆఖరుకు అన్నా హజారే మీద కూడా ఎర్రజెండా ఎత్తి విమర్శలు చేసినోళ్ళకు మరో ఎర్రగురివింద బర్దన్ చావుకబురు చల్లాగా చెప్పారు " తల పొగరు( అంటే మూర్ఖత్వం అనుకోవచ్చు), అవినీతి ఓడీపోవడానికి కారణాలు". 34ఏళ్ళుగా కళ్ళుమూసుకుని పాలు/రక్తం తాగారు అని అనుకోవాలా?

కమ్యూనిస్టులు పాలక పక్షం కన్నా రెండో/మూడో ప్రతిపక్షంగానే రాణిస్తారు. :)

Anonymous said...

రాజేష్

Just finished off reading the post entirely. Very well written. Amazing job. Keep it up. My blessings are with you always!.

బాగా పరిశోధించి రాసినట్లున్నావు. ఉన్న విషయాన్ని ఉన్నట్లు వివరణాత్మక౦గా విశదీకరించిన నీ విశ్లేషణ అద్భుతం.

మమత కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికి౦ది. మరి దాన్ని ఎన్నాళ్ళు నిలబెట్టుకుంటుందో చూద్దాం. ఆమెకి ముందున్నది కష్టాలే అయినా వాటిని తట్టుకుని ప్రజలకి సేవ చేసే గుండె ధైర్యం, తెగువ ఆమెకి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

కమ్యూనిస్ట్లు ఇకనైనా కళ్ళు తెరిస్తే మంచింది. టి.వి లో వారు మాట్లాడే విధానం చూస్తుంటే నాకు వారు ఇప్పట్లో కళ్ళు తెరుస్తారనే నమ్మకం లేదు. వీళ్ళు తెరిచినా పెద్దఉపయోగం ఏమీ ఉండదని నా నమ్మకం. ఎందుకంటే వీరు ప్రజాసమస్యల కన్నా హిందువలను మెజారిటీ నెపంతో వారి నమ్మకాలను అవమానించడం - మైనారిటీ ఏమి చేసినా వారికి కొమ్ముకాయడం తప్ప ఉపయోగ౦ లేదు. నేటి కమ్మ్యూనిస్ట్లు టి.విల్లో పేపర్లలో కేతిగాళ్ళ వలే అండర్ ప్లే చేస్తున్నారంటే నువ్వు నమ్మాలి.

ఇక మన రాష్ట్రానికి వస్తే తొలినాటి కమ్మ్యూనిజం నేడు లేదు. తొలిరోజుల్లో బానే ఉన్నా తర్వాతర్వాత ఒక కులానికి ఊడిగం చేయడానికి, వారిని పైకి తీసుకు రావడానికి మాత్రమే ఉపయోగపడింది. ఆ కులమేమిటో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది అత్యంత హేయనీయం హీనమైనది. అవును నువ్వసలు ఆంధ్రా కమ్మ్యూనిజం గురించి రాయలేదేంటి?

వ్యాఖ్య పెద్దది అయ్యేట్లుంది. చివరిగా నీవు చెప్పి, నాకు నచ్చిన ఒక మంచిమాట ఇక్కడ చెప్పి స్వస్థి పలుకుతా.

"
పశ్చిమాన అస్తమించిన అరుణుడు ఏవిధంగా ఆయితే శ్రామికవర్గానికి ఆనందాన్ని పంచడానికి మరుసటిరోజు ఉదయాన్నే ఉషస్సులతో ఉదయిస్తాడో అదే విధంగా నేడు అస్తమించిన వామపక్ష-అరుణవర్ణం రేపు దీదీ నుదుట అరుణవర్ణంగా ఉదయించి అసలైన వామపక్ష సిద్దాంతాలను పాటిస్తూ కర్షక, శ్రామిక లోకానికి చేయూతనిస్తుందని ఆశిద్దాం.
"

మంచి ఆశ నీది. అదే నా ఆశ కూడా అయినప్పటికీ నీ కోరిక తీరాలని కోరుకుటున్నా.

Rajeev Reddy

Anonymous said...

ఫలితాలొచ్చాయి ఇంకా మన చ వు ద రి గారి రెస్పాన్స్‌ కనపడదే. మొహం చెల్లట్లేదా?

Anonymous said...

రాజీవ్ గారు

మీ అభిప్రాయం బాగుంది.

మీ కింది వ్యాఖ్యకి, ఆ ఊడిగం చేయించుకున్న కులం గురించి మన చ వు ద రి గారు రెస్పాన్స్‌ ఇస్తే బావుంటు౦దని నా గట్టి పిడివాద కుల గజ్జినమ్మకం :P.

"
ఇక మన రాష్ట్రానికి వస్తే తొలినాటి కమ్మ్యూనిజం నేడు లేదు. తొలిరోజుల్లో బానే ఉన్నా తర్వాతర్వాత ఒక కులానికి ఊడిగం చేయడానికి, వారిని పైకి తీసుకు రావడానికి మాత్రమే ఉపయోగపడింది. ఆ కులమేమిటో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది అత్యంత హేయనీయం హీనమైనది.
"

Anonymous said...

Excellent post.

I am the one who stayed in WestBengal for more than 10 years and endured with CPM barbaric attacks extremely.
I am wanting to write about them here but time is not permitting now. Added your blog to my favourites to respond back at later time.

రాజేష్ జి said...

$అప్పయ గారు

నువ్వే రాసావా అంటే రాసా అంటా కానీ పరిశోధించి, నాకు వాస్తవాలు, తర్కసహితం అనుకున్నవి రాసా. సొంతంగా రాయడానికి నేనేమీ అప్పుడు పుట్టి అన్నీ చూసినవాడిని కాదు గదా :).

ధన్యవాదాలు మీ అభిమానానికి!

#..నీ బ్లాగ్ మొత్తం చదవాలి..
ఇంకో సమత్సరం పడుద్దేమోకదా? సూద్దాం మరి. :)
అన్నట్లు నా బ్లాగుని మీ సంకలినికి కలిపారా?

రాజేష్ జి said...

$కుమార్ న్ గారు

హ్మ్.. బహుధా ధన్యవాదాలు కుమార్ గారు మీ అభిమానానికి. మీ ప్రోత్సాహం ఇలానే ఉండాలని కోరుకుంటున్నా మరి.

#..చదవడానికి సులువుగా,
సౌకర్యంగా....

నాదేమీ లేదు. మీరు ఎప్పటికప్పుడు ఇచ్చిన సలహాలని పాటించాను అంతే. అందుకు మీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి :)

#ఏ ఇజం కూడా ఫూల్-ప్రూఫ్ కాదు.

నిజమే!

#దీదీజం ప్రజలకి మంచి చేసి, కార్పోరెట్స్ ని, కార్మికసంఘాలనీ అకౌంటబుల్ చేయగలిగితే అంతకన్నా కావలిసిందేముంది?

అవును, నేనూ అదే కోరుకుంటున్నా.. చూద్దాం.

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

రాజేష్ జి said...

$ఇంద్రసేనా గంగసాని గారు

బ్లాగుకి స్వాగతం :)


#ప్రపంచీకరణ,privatization అనేవి ఆపలేనివి.

నిజమే కానీ దేశప్రజలందరూ దానివల్ల వచ్చే ఫలాలను అనుభవించే వరకు లేనివాడు, వాడిని బలపరిచేవాడు ఆపడానికి ప్రయత్నిస్తూనేఉంటాడు.

#..capitalism ఫాలో అవుతూ,అందరికి సమ న్యాయం చేస్తూ,తాడిత పీడిత వర్గాలని..

వినడానికి బానేఉంది కానీ ఇది వాస్తవప్రపంచంలో కుదురుతుందా అని నాకో పేద్ద ధర్మ సందేహం!

#కమ్యునిస్టులు రొడ్డ కొట్టుడు సిద్దాంతాలతో ప్రజల్ని మధ్య యుగాలకి తీసుక వెళ్తారు.

ఇప్ప్దటి భారతీయ కమ్మ్యూనిస్టులు అసలు శ్రామిక సిద్దంతాలకి నీళ్ళు వదిలేసి తాము కనిపెట్టి రుద్దుతున్న సిద్దాంతాలను మీరు రోడ్డుకొట్టుడు సిద్దాంతాలు అంటే ఒప్పుకుంటా. నిజమే.. అవి మనల్ని మధ్య ఏంటి.. రాతి యుగాలకి సైతం తీసుకువెళతాయి

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

రాజేష్ జి said...

$జయహో గారు

మీరిచ్చిన దృశ్యచిత్రం చూసాను. నచ్చిందా అంటే ఇదమిద్దంగా చెప్పలేను కానీ వాస్తవప్రపంచంలో మనిషి తాను నమ్మిన సిద్దాంతాలను అలానే రుద్దడానికి రుద్దడానికి ప్రయత్నిస్తూఉంటాడు. అయితే ఇందులో ఎక్కువ తక్కువ తేడాలు రుద్దేదాంట్లో అంతే. ఇది నా అభిప్రాయం :)

మీరు దృశ్యచిత్రంతో సరిపెట్టేసారే? మంచి ఆలోచనాత్మక వ్యాఖ్య వస్తు౦దని భావించా :(

రాజేష్ జి said...

$Snkr గారు


#తెర గారికి ఇంత ఉలుకెందుకో.

మొదట్లో టి.వీలో చూసి ఏవో అనుకున్నాకానీ వీరి తెరలో చిత్రాలు బాలకృష్ణ చిత్రాలేక్కన అస్సలు తర్కానికి తావివ్వకుండా ఉన్నాయి. అదీ ఒకందుకు మంచిదేలెండి. ఇప్పుడు బా.క బకరా అవ్వాలా పాపం!

#ఆఖరుకు అన్నా హజారే మీద కూడా ఎర్రజెండా ఎత్తి విమర్శలు

అది బాధాకరం!

#..ఎర్రగురివింద బర్దన్ చావుకబురు చల్లాగా చెప్పారు " తల పొగరు( అంటే మూర్ఖత్వం అనుకోవచ్చు), అవినీతి ఓడీపోవడానికి కారణాలు".

:) పోన్లెండి అక్కడ ఉండి కళ్ళారాచూసినాయన నిజం ఒప్పుకున్నాడు. లేకపోతే ఇక్కడ కూర్చుని పుంఖాలు పుంఖాలు బరికేవారికి మనం బలయ్యేవాళ్ళం.

#కమ్యూనిస్టులు పాలక పక్షం కన్నా రెండో/మూడో ప్రతిపక్షంగానే రాణిస్తారు. :)

ఏదో ఒక పక్షం కావాల్సిందేనా? అసలు పార్టీ తీసేసి చక్కగా మళ్ళీ శ్రామిక పక్షాన నిలిబడి పోరాటాలు మొదలెట్టచ్చు కదా?

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

రాజేష్ జి said...

$రాజీవ్ రెడ్డి గారు

మొదట మీ అభిమానానికి మరియు ఆశీస్సులకి ధన్యవాదాలు.

#మమత కష్టానికి తగ్గ ప్రతిఫలం..నిలబెట్టుకుంటుందో చూద్దాం. ..గుండె ధైర్యం, తెగువ..

నిజమండి. పోరాడారు..గెలిచారు..ఇప్పుడు మరో పోరాటం మొదలవబోతోంది. మరి అందులో కూడా గెలవాలని కోరుకుందా౦.

#ఎందుకంటే వీరు ప్రజాసమస్యల కన్నా హిందువలను ..నమ్మకాలను అవమానించడం..మైనారిటీ.. ..కొమ్ముకాయడం..

మీరు చెప్పింది అక్షరాలా వాస్తవం. ఏమో వీరు మతత్వతం పేరుమీద పోరాడ్డానికి అమెరికా డబ్బులు ఇస్తుందేమో మరి ;)

#..కమ్మ్యూనిస్ట్లు టి.విల్లో పేపర్లలో కేతిగాళ్ళ వలే అండర్ ప్లే చేస్తున్నారంటే..

:)) అందులో సందేహమా నమ్మకపోవడానికి. మన ఇడ్లీ-చికెన్ నారాయణ గారిని వంటావార్పులు, మా ఊరి వంట లాంటి కార్యక్రమాలకు సరిజోడు అని నా అభిప్రాయ౦. ఇక భోగావులు "పట్టుకుంటే పట్టుచీర" లాంటివి చేస్తే వారి నవ్వుతో అందరినీ పడేస్తారు :)

#..మన రాష్ట్రానికి వస్తే తొలినాటి కమ్మ్యూనిజం నేడు లేదు. ..

నిజమే :(

#తొలిరోజుల్లో బానే ఉన్నా..ఒక కులానికి ఊడిగం చేయడానికి, వారిని పైకి తీసుకు రావడానికి మాత్రమే ఉపయోగపడింది...అత్యంత హేయనీయం హీనమైనది.

వాస్తవమండీ. ఒక మంచి సిద్దాంతం అలా స్వార్థప్రయోజనాలకి బలవ్వడం చాలా బాధగా ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే మొన్నోకాయన దీన్నేదో గొప్పగా రాస్తూ చరిత్రని కప్పెట్టడానికి ప్రయత్ని౦చాడు. ఎంతటి కుతర్క౦! చూస్తూకూర్చుంటే ఈ కులగజ్జి ఆదిమమానవులనుంచే వుంది..అయితే అది గజ్జికాదు..తామర అని చెప్పేట్లుఉన్నారు ఆయన. హతవిధి. అంతేకాక చారిత్రిక పురుషులకు కులాన్ని అంటగట్టడం ఆయనచేసిన మరో విశేషం.. హ్మ్.


#.. ఆంధ్రా కమ్మ్యూనిజం గురించి రాయలేదేంటి?

హ్మ్.. టపా కేవలం పశ్చిమారుణం ఉత్తానపతనాలను వివరించడం కోసమే అందువల్ల రాయలేదు. నేను రాయాలంటే శోధించాలి. ఆంధ్రాలో తెల్సిందే కదా..వాస్తవాలన్నీ తొక్కబడ్డాయి...ఇంటర్నెట్లో ఏమీ లేదు.. ఏదైనా చెప్తే/రాస్తే మీలాంటి వాళ్ళీ రాయాలి. మీరు ఓ టపా రాస్తా అన్నారు కదా.. దీని మీద రాయండి :)

#మంచి ఆశ నీది. అదే నా ఆశ..

చూద్దామండి ఆశ ఉండాలి కదా :)

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

:))

#ఫలితాలొచ్చాయి ఇంకా మన చ వు ద రి గారి రెస్పాన్స్‌ కనపడదే. మొహం చెల్లట్లేదా?

ఎవరు బాబు సదరు "చ వు ద రి గారు". చాలాచోట్ల చూసా ఈ వ్యాఖ్య. కొద్దిగా చెప్పు?

తర్వాత వ్యాఖ్య కూడా మీదే అనుకుంటా! రెండిటికీ ధన్యవాదాలు.

రాజేష్ జి said...

$ అజ్ఞాత గారు

#I am..stayed..WestBengal..10 years ..endured..CPM barbaric attacks

It is really awful.. I can feel your pain. Present election results
must be soothing you. :)

Looking forward to hear your painful experiences.

Thank you MUCH for commenting!

Anonymous said...

/Snkr గోరు బ్లాగుల్లో ఉన్న అతికొద్ది మంచి సద్విమర్శకుల్లో ఒకరు/
రాజేష్ :) అదేం కాదు, దేశంలో గుర్తింపు పొందిన అవినీతిపరులకు బాకాలూదే బ్లాగుల విషయాల్లో, ఏడుపుగొట్టు బ్లాగులకు, హేటువాదులకు, 'భూప్రపంచానికి మూలం దాస్‌కేపిటల్ మాత్రమే అది తప్ప వేరే స్వర్గం నాస్థి! 'అని మూర్ఖంగా నమ్మి వాదించే కామ్రేడిపండ్ల గోబెల్స్ ప్రచారానికి, హేటువాద నాస్థికుల పట్ల కొన్ని మినహాయింపులు, కోటాలూ వుంటాయి, వుండాలి కూడా :)) ;)

Anonymous said...

Why communists failed in India?

1) The "Caste System" prevented communism to reach a critical level in India, as it happened in USSR and China.

2) The total rejection of communists in WB (2011 elections), proves that the roots of Communists is shallow, even though they brain washed 3 generations of WB people and imported millions of illegals from BD to win elections.

3) WB people were one of India's Intellectual elites along with Maharastrians, Madarasis and brave Sikhs during the freedom struggle. But the evil ideology of communists destroyed once the great patriotic people of WB in less than 40 years.

4) The mass illegal immigrations from BD and mass illegal funds for conversions from west, allowed by commies into WB (and into Kerala and India) destroyed the character of our nation.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers