నిజం..నిర్భయం

Wednesday, 16 February 2011

లండనీయం - సంస్కృతి - అవసరం-ఆధిపత్య౦!

రాజు చేసిన తప్పులకి బ్రిటన్ ఇప్పుడు ఇస్లామిక్ చాందసవాద రూపంలో పీడింపబడుతున్నది. 


బలహీనదేశాలను ఆక్రమించి వారి సంస్కృతిని నాశనం చేయడమే కాక వారి వనరులను నిలువుదోపిడీ చేసి మరీ తమ దేశాన్ని అభివృద్ధి చేసుకునే పశ్చిమదేశాల తల్లిగా భావిస్తున్న అఖండ బ్రిటన్ ఇప్పడు సరికొత్త ఆలోచనలకి నాంది పలుకుంతు౦ది.

సోదర(ఇతర) మతస్తులు తమ మతాన్ని పాటిస్తూ ఆంగ్లేయు క్రైస్తవ సంస్కృతి ఆధిపత్యాన్ని అంగీకరించినప్పుడే  తాము ఆ మతాలకి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని బ్రిటన్ నిర్ద్వందంగా తేల్చిచెప్పింది. మరో రకంగా చెప్పాలంటే తమ జాతి గుర్తింపు కేవలం ఇప్పటికీ పట్టులో ఉన్న ఆంగ్లేయు క్రైస్తవ సంస్కృతి నిర్దేశించిన ప్రాధమిక విలువలు మరియు రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడిఉంటుందని గట్టిగా చెప్పింది. ఇస్లామిక్ ప్రపంచం నుంచి వస్తున్నవారు తమ క్రైస్తవ సంస్కృతిని  సవాలు చేయడం లేదా వ్యతిరేకించడాన్ని ఎట్టి పరిస్థితులలోను ఒప్పుకోమని తేల్చిచెప్పింది.


బ్రిటన్ ప్రధానమంత్రి విభిన్నసంస్కృతీ(multiculturalism) సమ్మేళనం ఇస్లాం చాందస భావాలను రూపుమాపడంలో విఫలమయిందని ఒప్పుకోవడం "భారతదేశ౦లొ పుట్టి  పురాతనసంస్కృతిగా పేరొంది సజీవమైన సమాజ౦గా నేడు పిలువబడుతున్న హైందవ సంస్కృతి దానికి మూలమైన హిందూత్వమే భారతదేశజాతి గుర్తింపు" అవసరం అన్న భావనని సూచిస్తుంది. భారతదేశం చాలాకాలం ఇస్లామిక్ మరియు ఆంగ్లేయ క్రైస్తవ దోపీడీదారుల వల్ల బాధలు పడింది. నేడు నాస్తిక-కమ్మూనిస్ట్, తీవ్రవాదభావజాలం ఉన్న  మైనారిటీలు మరియు ఇతరదేశ యాత్రికులు ఆ బాధలని కొనసాగిస్తున్నారు.

ఏంతోకాలంగా ఉన్న ఇతరజాతులకి వ్యతిరేకంగా పోరాడడానికి భిన్నజాతులను ఆహ్వానించి వాడుకునే ప్రయత్నంలో బ్రిటన్ అత్యంత తీవ్రభావజాలం ఉన్న ఇస్లామిక్ మేధావులకి తమ దేశపు మసీదులలో ఆతిధ్యమిచ్చింది. అదిప్పుడు వికటిస్తుంది. ఇతర పశ్చిమదేశాలైన జెర్మనీ, నెదర్లాండ్స్ మరియు ఫ్రాన్సులు కూడా తమదేశాల్లో పెరుగుతున్న ముస్లిం జనాభాని చూసి ఆందోళన చెందుతున్నారు. 

మొదటి రెండు ప్రపంచ యుద్దాల ముందు, తర్వాత కొనసాగిన ఈ పశ్చిమదేశాల ఆర్థికఉన్నతి మరియు రాజకీయ ఆధిపత్య౦ ఇతరదేశాల భూమి మరియు వనరులని ఆక్రమించుకోవడం ద్వారా వచ్చింది. అందులోనూ వీరు ఇస్లామిక్ ప్రపంచాన్ని ఆయిల్ మరియు గాస్ కొరకు చాలావరకు ఆక్రమించారు. ఆ దొంగదోచుళ్ళు కప్పిపెట్టి మాయచేయడానికి మరో జిత్తులమారి పథకాన్ని ఉపయోగించారు. ఆ పథకంలో భాగంగా తెలివిగా తీవ్రచాందస భావాలని కలిగినవారిని ఇదే పశ్చిమదేశాల్లో పురుడుపోసుకున్న నియంతలను ఎదిరించడానికి ప్రోత్సహిస్తున్నట్లు నటించారు. మరో పక్క అదే నియంతలు తమ నియంత్రత్వాన్ని నిలుపుకోవడానికి మరియు తమ శత్రువులని చంపడానికి ఇవే పశ్చిమదేశాలు సహకారం అందించేవి లోపాయకారిగా!  

అవమానాలు, బాధలు పడుతున్న ముస్లిములని, హిందూ నాస్తికులని పైకి చెప్పి వారిని రెచ్చగొట్టి భారత విభజన అనే సిద్దాంతాన్ని ఎగదోయడంలో కూడా ఇదే కుటిలత్వం. అలా విభాజానంతరం ఏర్పడిన పాకిస్తాను తన కాళ్ళ మీద తను నిలబడే సత్తా ఎప్పటికీ సాధించుకోలేకపోయింది సరికదా నేటికీ అమెరికా దయదాక్షిణ్యాల మీద ఆధారపడిఉంది. నిజానికి గడచిన రెండు శతాబ్దాల్లో దేశాన్ని లేదా రాజకీయ ఆధిపత్యాన్ని కానీ "తిరిగికోలుకున్న ఇస్లాం" గెలవలేదు. బహుశా అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించి, పశ్చిమదేశాలకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి షియా విప్లవపు ఇరాన్ మాత్రమే ఇస్లామిక్ విజయపు నమూనా! 

ఒక పక్క రాజకీయ విభాగంలో పెరుగుతున్న ఇస్లాం పాత్ర మాత్రమే కాకుండా, పెరిగిపోతున్న ఇస్లాం జనాభా మరియి పశ్చిమసంస్కృతిని ధిక్కరించడం లాంటివి పశ్చిమదేశాలకి కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నవి. వీటిని ఒకదారిలో పెట్టి పశ్చిమరాజకీయంలో అందరూ, అన్ని సంస్కృతులూ కలిసిపోయి, ప్రశాంత జీవనం సాగించేందుకు చేసిన ప్రయత్నమే ఈ "విభిన్నసంస్కృతి సమ్మేళనం". కానీ ఈ ప్రయత్నం విఫలమవడానికి కారణం "ముస్లింలు వారికున్న జాతి హక్కులని విభిన్నసంస్కృతులని మరియు రాజకీయ విభాగాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించడమే". ఈ "ఇస్లాం ప్రభావితాన్ని" అటు క్రైస్తవ మతం కానీ వారి రాజకీయం యంత్రాంగం గానీ ఒప్పుకోవడంలేదు. ఈ పరిస్థితులు ఇస్లా౦, క్రైస్తవుల మద్య అనుమానాలు పెంపో౦దడానికి, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి దోహదపడుతున్నాయి.       

సర్వకోటి(మానవాళి మరియు పశుపక్ష్యాదులు) అభ్యున్నతి కోరుకునే పురాతన సమాజం నమూనాగా పేరొంది౦ది భారతీయ సనాతన ధర్మ౦. ఈ ధర్మ౦ ఒకరు చెప్పినది లేక ఒక కాలానికి సంభందించిన కాదు, ఎప్పటికప్పుడు కాలానికి తగ్గట్టుగా మారుతూ నిత్యయవ్వనంతో తులతూగుతున్నది. ఈ ధర్మం ఎల్లపుడూ సమకాలీనమైనది.  ఈ ధర్మ౦ అన్ని జాతులని, మతాలని గౌరవిస్తుంది. ఎవరో ఒకరు మానవాళికి దేవుడికి మద్యలో ఉండి "దేవుడు చెప్పిన నిజం" అని ప్రచారం చేసే హక్కు ఇవ్వలేదు. వేదఋషుల(శ్రుతి) చేత చెప్పబడి, ప్రపంచ మానవాళి శ్రేయస్సు కొరకు అందజేయబడిన అమూల్యాలు "వేదాలు" అని హిందువులు నమ్ముతారు. అందుకనే వీటిని ప్రపంచ౦మీద బలవంతంగా రుద్డలేదు. పరబ్రహ్మ ఒక్కడే దేవుడు అని నమ్మిన ఈ ధర్మ౦  దేవుడిని నమ్మనీ నాస్తికులకీ తన సంప్రదాయాల్లో ఏంతో ప్రాముఖ్యతనిచ్చింది. మన రాజకీయవ్యవస్థ మరియు స్వతహాగా ఉండే అందరి(విభిన్న జాతుల) బాగు కోరుకునే మనస్తత్వం(secularism) వీటిని అర్థంచేసుకోవడం నుంచే వచ్చింది. కొన్ని దశాబ్దాల కిందట హిందువులు ఒక్కరే తమ జీవినవిధానాన్ని ఆధారం చేసుకుని ధర్మాన్ని నిర్మించుకుని సఫలమయ్యారు అని అరిస్టాటిల్ చెప్పాడు.

అతిధిదేవోభవ అన్న సాంప్రదాయం తనలో ఇముడ్చుకున్న భారతదేశం ఏంతోమంది నిరాశ్రయులకి ఆశ్రయమిచ్చింది. పర్షియా నుంచి పారిపోయి వచ్చిన పార్సీలు, దలైలామా అతని వారసులు, కర్మపా, బహాయ్ జాతి, క్రైస్తవులు మరియు ముస్లిమ్స్ ఇక్కడ వందలాది సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఇంకా  యూదులు తాము భారతదేశానికి AD 70 లో రెండవ సోలోమన్ గుడి పడగొట్టిన తర్వాత వచ్చినట్లు చెప్పుకుంటారు, నమ్ముతారు. మన రాజకీయ సంస్కృతి అందరిని సమభావంతో చూస్తుంది అనే దానికి ఉదాహరణ - స్వంతంత్ర భారతదేశపు మొట్టమొదటి మంత్రి వర్గంలో ఉన్న మౌలాన ఆజాద్ మరియు   బి.ర్. అంబేద్కర్.     

మాతృభరతభూమి అల్పసంఖ్యాక వర్గాలని మిగలిన వర్గంతో సమానంగా  విభిన్నసంస్కృతుల నిలయంగా ఆదరించింది, తనకు నచ్చినవిధంగా ఉండే భరోసా ఇచ్చింది. వాస్తవానికి, వారు తగిన స్థానం పొందే౦దుకు ఆధారపడతగిన సంస్కృతిని తన పురాతన సంప్రాదాయాల ద్వారా ఇచ్చింది. వీరు అల్పసంఖ్యాకుల౦ అన్నదాన్ని మనసులోంచి వదిలేయలేదు, అలానే వారు దేశంయొక్క గుర్తింపుని, సంస్కృతిని దాని విలువలని కొత్తగా నిర్దేశి౦చలేదు.          

అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత  మిగిలిన దేశాల ఇస్లాం మరియు క్రైస్తవ బలవంతపు పునరీకరణ మొదలయింది. క్రైస్థవపు అంతులేని నిధులు, సేవ మాటున చేసే మతమార్పిడులు, హిందూ సంస్కృతీ ధ్వంసరచనలు మరియు తమకంటూ ప్రత్యేక గుర్తిపుకోసం చేసే రాజకీయ అరాచకాలు. మరీ ముఖ్యంగా ఇదే క్రైస్థవులు భారతదేశపు సంస్కృతిని, నమ్మకాన్ని నిలబెట్టడానికి చేసే ప్రతీ ప్రయత్నాన్ని తమ కుటిలతత్వంతో నియంత్రిస్తున్నారు, అందులో గిరిజనులని మతస్వేఛ్చ పేరుతొ మోసం చేయడం. భారత ప్రధానన్యాయస్టాన౦ ఎన్నోసార్లు "ఈ పద్దతి" ని బహిరంగంగా తప్పు పట్టినా, వీరు మటుకు మత స్వేఛ్చ అంటె "ఇతరులని క్రైస్తవంలోకి మార్చడమే" అన్న వితండవాదాన్ని వల్లె వేస్తున్నారు.        

ఈ మద్య జరిగిన "నర్మదాతల్లి కుంభ్ మేళా" మీద క్రైస్తవ ప్రతినిధులు పెద్దఎత్తున చెలరేగి ఈ మేళా ఉద్దేశ్యం మతమార్పిడుల ద్వారా హిందూధర్మ౦లోనికి తీసుకురావడానికి అని గగ్గోలెట్టారు. బిషప్ గెరాల్డ్ అల్మీడియా దీని మీద ప్రధానన్యాయస్తానానికి వెళ్లగా, ఫాధర్ ఆనంద్ ముత్తు౦గల్ ముఖ్యమంత్రి శివరాజసింగ్చౌహాన్ ను రక్షణ అడిగాడు.  ఫలితం అక్కడ గిరిజనులకి సేవ చేస్తున్న హిందూ సాధువుల మీద తూటాలు, ఆయుధాలు చూపించబడ్డాయి, రాష్ట౦లో కూడా అంత రక్షణ లేదు. ఇది అత్యంత హాస్యాస్పదం!.      

ఇప్పుడిక పశ్చిమ దేశాల వంతు. ముస్లింలు తమ(పశ్చిమ) సంస్కృతిని, దాని విలువలను వ్యతిరేకించటమే కాక సహృదయంతో మిగిలిన సంస్కృతులతో కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలకి గండికొట్టడం పశ్చిమదేశాలకి మింగుడు పడటంలేదు. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ రెండు విషయాలని(ఇవి భారతదేశ సమాజాన్ని, రాజకీయ వ్యవస్తని కూడా ఎప్పటినుంచో పీడిస్తున్నవి) గట్టిగా ఉద్ఘాటించాడు. 1) ఒకే న్యాయం మీద ఒకటే జాతి (ఇది భారత ప్రధానన్యాయస్థాన౦లో ప్రస్తుతం ఉత్సుకత రేపుతుంది!) 2) మతాధిపతుల అత్యున్నత అధికారాలను కత్తిరించడం. 

బ్రిటన్ మీద తీవ్రవాద దాడులు జరగొచ్చన్న గూడచారవర్గపు నివేదికల నేపధ్య౦లొ (బయట జరిగిన దాడులను లండన్ ఎప్పుడు పట్టిచ్చుకోలేదు!), కామెరూన్ తమ దేశం ఇకనుంచి  తీవ్రవాద భావజాలాలు ఉన్నవారిని కటినంగా శిక్షిస్తూ అలానే అలాంటి భావాలున్న సంస్థలకి నిధులు అందిస్తూ బ్రిటీష్ విలువలని కాలరాసే వాళ్ళని వదిలేదిలేదనీ తెగేసి మరీ చెప్పాడు. అలాగే విభిన్నమతాలూ తమతమ మతపద్దతులు మరియు సాంప్రదాయాల ప్రకారం ఉంటామంటే ఒప్పుకునేదిలేదని ఇకనుంచి వలసవచ్చినవారు/వచ్చేవారు ఇక్కడ ఉన్దేవారందరితో కలిసిపోవడం, ఇంగ్లీష్ మాట్లాడ్డం మరియు సమ సంస్కృతిని, దానికి తగ్గ విద్య పాటశాలల్లో నేర్చుకోవాలని కూడా చెప్పాడు.         

తమ రాజులు పెంచిపోషించిన పావురాలే ఇప్పడు బ్రిటన్ కి తిరిగివస్తున్నాయని కామెరూన్ ఇప్పటికైనా గుర్తించాలి. అతను మానవహక్కుల, మతమార్పిడుల సంఘాలకి వెళ్ళే నిధులని ఆపాలి లేకపోతే వారి తీవ్రవాదానికి బలయ్యే బ్రిటన్ని చూడాల్సివస్తుంది.

ఆంగ్ల మూలం: తర్వాత 

6 comments:

Anonymous said...

గురువు గారు, మంచి విషయము మీద చర్చ వ్రాశారు.

Did you have any details/information to share on the following subject?

ఇండియన్ సినిమాలలొ పూజారి/పండిట్ లను ఒక నీతిలేని/చౌకబారు వారిగా చిత్రికరిస్తున్నారు. మీరు గమనించె వుంటారు. కాని ఒక కిరస్తానీ పాదర్ ను లేక ఒక తురక ముల్లాను ఎంతొ నీతి కల వారిగా చిత్రీకరించడం జరుగుతుంది.

1) దీనికి గల కారణాలను ఎప్పుడు అయినా research చేచారా?

2) How to educate those movie Producers and Directors to remedy the situation?

3) Did you ever research on the subject of "కిరస్తానీ పాదర్ - వారి లైంగిగ exploitation of Children in India"?

4) How to educate Indian public?

5) Publish, if you have any information about (3).
Such as a) number of such cases, b) counseling for those children c) court cases
d) media coverage
e) public awareness
f) any NGO's working to save children from "కిరస్తానీ చర్చ్ పెడొపైల్స్"

I did not come across any serious research is going on this subject in India. Looks like most of Indian NGO's are sleeping because, they receive massive funds from those "కిరస్తానీ చర్చ్ పెడొపైల్స్" from West.

Anonymous said...

Teesta Setalvad Exposed by former colleague Rais Khan

http://www.youtube.com/watch?v=92thZReqqf4&feature=player_embedded

Anonymous said...

@Rajesh
తీవ్రమైన పని వత్తిడిలో ఉండి ఈ రోజే కొద్దిగా తీరిక దొరికింది. Good Post. Keep it up!

@Anonymous
మంచి ఆలోచనలకు, అసరమైన చర్చలకు దారి తీసే ప్రశ్నలు అడిగారు. నాకు తెలిసిన౦తలో కొన్నిటికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా!

1) దీనికి గల కారణాలను ఎప్పుడు అయినా research చేచారా?

ఇక్కడ మీరు గమనించాల్సి౦ది కిరస్తానీ పాదర్ కానీ తురక ముల్లా కానీ ఒక మతానికి ప్రతినిధులుగా గుర్తింపబడుతున్నారు. అందువల్ల వారిని చెడుగా చిత్రీకరిస్తే అది మతానికి సంబంధించినది అవుతుది. ఇక ఈ మతాల ఐక్యత తెలిసిందే, దానికి భయపడిఎవరూ చెడుగా చిత్రీకరించరు, ఒకవేళ చిత్రీకరించినా వాటిని వెళ్ళమీద లెక్క పెట్టొచ్చు.
అదే పూజారి/పండిట్ లను ఒక కులానికి చెందినవాళ్ళుగా మాత్రమే ప్రస్తుతం గుర్తిస్తున్నారు.
వారి ఆచారాలను అవహేళన చేస్తే అది వారికి మాత్రమే సంబంధం, హిందూ ధర్మాన్ని అవహేళన చేసినట్టు కాదనే పిచ్చినమ్మక౦లో ఉన్నారు. "పిచ్చినమ్మక౦" అని ఎందుకు అన్నానంటే ఈ రోజు ఆ "ఆచారాలన్నీ" అన్నికులాల వారు పాటిస్తున్నారు. ఇదే సినిమావాళ్ళు సినిమా ప్రారంభం నుంచి అయిపోయేవరుకు అదే పూజారితో పూజలు మంచి జరగాలని!
మరి అవహేలన ఆ ఒక్క కులానికి మాత్రమే అన్న నమ్మకం పిచ్చిది కాదా?
ఒకవేళ ఏదైనా విచిత్రం జరిగి " నీతిలేని/చౌకబారు చిత్రీకరణ" హిందువులను అవమానించడమే అని అనుకున్నా కూడా కులాన్నంటే వచ్చే ఆత్మగౌరవఉద్రేకం ఆ కులాల్కి అమ్మైన హిందూధర్మాన్ని చెడుగా అంటే రావట్లేదు. మరి పరిష్కారం? ఎవరైతే అవమానాలు పడుతున్నామని బాధపడుతున్నారో వారు(ప్రస్తుతం ఆ కులం) కలిసికట్టుగా పోరాడి సాధించుకోవడమే! చిన్నగీతల పక్కన పెద్దగీత గీసి తీరిగ్గా ముచ్చట్లు కూర్చుంటే సమస్య సమసిపోదు!

2) How to educate those movie Producers and Directors to remedy the situation?

educate అంటే ఎలా? బాబ్బాబు మామీద ఇలా తీయొద్దు అని గడ్డం పట్టుకుని బతిమిలాడాలా? వాడి ఉద్దేశ్యం హీనంగా చిత్రీకరించడమే అయితే వాడ్ని అడుక్కోవాల్సిన అవసరమేమిటి? ఇలానే అడుగుతూ కూర్చొని ఉంటే అంబేద్కర్ దళితులకి కావాల్సిన హక్కులని సాధించేవాడు కాదు. పోరాటం కావాలి, అరమరికలు లేని కలిసికట్టుతనం కావలి. అప్పుడు చూడండి ఏ Producers లేదా Directors కైనా దమ్మువస్తుందా అలా చిత్రికరి౦చడానికి?

3) Did you ever research on the subject of "కిరస్తానీ పాదర్ - వారి లైంగిగ exploitation of Children in India"?

నేనూ విన్నా కానీ పంచుకునే సమాచారం లేదు. కానీ ఈ ఆరోపణలు పోప్ మీద కదా వచ్చింది?

ఈ NGO's గురించి ఎంతతక్కువ మాట్లాడితే అంతమంచిది. స్వదేశంలో సేవ ముసుగున నీచమైన పనులకి పాల్పడుతున్నారు!

Rajeev Reddy.

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

రాజీవ్ గారు అన్నట్లు మంచి పెసినలు లేవదేశారు. మొదటి రెండు పెసినలకి రాజీవ్ గారు సరైనా సమాధానాలు ఇచ్చారు అనుకుంటున్నా!

ఇక మీ 3,4,5లకి నాకున్న పరిమిత అవగాహనతో సమాధానం ఇస్తా. మీరు అన్నట్లు శోధన చేస్తే ఇంకా సమాచారం తెలియవచ్చు.

3) ఇండియాలో ఉన్న క్రైస్తవఇష్టమైన మీడియా మాఫియా చర్చి మీద వచ్చిన చైల్డ్ సెక్సువల్ అబ్యూస్(చై.సె.అ) కేసులని వెలుగులోకి తీసుకురాలేదు. ఇక మిగిలిన్ అరా కొరా మీడియా ధైర్యం చేయలేదు. అయితే పశ్చిమదేశాల్లో(యూరప్) ఇవి జ్వాలను రగిలించాయి. ఆస్తికులు, నాస్తికులు మరియు చిన్నపిల్లల హక్కుల సంఘాలు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున తమ నిరాసన్ తెలిపాయి. ఈ దేశాల్లో తన ఉనికిని, పట్టును కోల్పోతున్న క్రైస్తవానికి నిజానికి ఇది పెద్ద దెబ్బ, అయితే ఒక్క బ్రిటన్ దేశం దీనికి మినహా. రాజు, రాణీలను దైవాంశసంభూతులుగా భావించే బ్రిటన్ దేశం, మీడియా ఇప్పటికీ వారి అనునూయులకి రాచరికపు పెద్దపీట వేసి మరీ గౌరవం ఇస్తుంది. ఇక్కడ ప్రభుత్వం క్రైస్తవ మతాధిపతుల కనుసన్నల్లో నడుస్తుంది. ఈ క్రై.మ లు స్వయంగా దేశాన్ని పాలించాకపోయినప్పటికీ అవసరమైనప్పుడు తమ అధికారాల్ని ఉపయోగిస్తూ ఉంటారు. వీరికి రాచరిక౦ అండ ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి బ్రిటన్ దేశంలో చై.సె.అ మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న కాథలిక్ క్రైస్తవ ఉన్నతమతాధిపాతి అయిన పోప్ బెనడిక్ట్ పర్యటించడానికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట ఈ దేశంలో పర్యటించడానికి అనుమతి కూడా దొరకలేదని, తర్వాత బ్రిటన్ రాణీ ఎలిజిబిత్ సహకారంతో అనుమతి దొరికిందని విన్నా!.
మొత్తమ్మీద మొన్న సెప్టెంబరులో నిరసనల మద్య బ్రిటన్ పర్యటన ముగించుకుని వెళ్లాడు. విచిత్రమేమిటంటే అత్యధికశాతపు బ్రిటన్ మీడియా ఈ పొప్ పర్యటన విజయవంతం చేయడానికి తమ రాతల ద్వారా దోహదం చేసాయి. ఇదో చావని రాచరికపు నమూనా ఏమో! అంతేకాక పొప్ పర్యటనలో భాగంగా స్వాగతం పలకడానికి అనే నెపంతో పెద్దమొత్తంలో చిన్నారులని ఒక చోటచేర్చి అర్థరాత్రి నుంచి తెల్లవారుఝూము వరకు చలిలో వేచిఉండేట్లు చేసారు. ఆ తర్వాత యధాలాపంగా వారి మీడియా "చిన్నారులు పొప్ని చూడడానికై పడిగాపులు, చిన్నారులతో పొప్ కరచాలనం ముచ్చట్లు" లాంటి కథనాలతో వాయించి వదిలిపెట్టారు. ఇదే మీడియా ఇంకా ముందుకు వెళ్లి పొప్ దేవుడని కొంతమంది చిన్నారులు అనుకుంటున్నట్లు, పొప్ని కలిస్తే తమ జన్మధన్యం అంటున్నట్లు కూడా రాసాయి. ఒక్కసారి ఈ మొత్తంసంఘటలన్నీ చూస్తే ఇది కేవలం పొప్ మీద ఉన్న చై.సె.అ ఆరోపణలని కొంతైనా తగ్గించడానికి అనేది సదా అరదం అవుతుంది. చై.సె.అ మీద వచ్చిన ఆరోపణలకి పొప్ సరైన సమాధానం ఇప్పటివరకు ఇవ్వలేదు, సరి కదా కొన్నిసార్లు తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు, ఇంకా అంటే ఇకటి రెండు సార్లు క్షమాపణ చెప్పాడు.

ఇక ఇండియాలో చర్చి మీద చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఆరోపణలు వచ్చాయని ప్రముఖంగా వినలేదు. కానీ ఆ మద్య ఒక కేరళ నన్ రాసిన ఆత్మకథ తీవ్రచర్చకు దారితీస్తున్డగానే వీరి మీడియా దాని గొయ్యిలో కప్పెట్టేసింది. అందులో ఆమె కన్యత్వం పేరుతొ చర్చిలో ఫాదర్ నుంచి మొదలు అందరికీ దేవుడు పేరుతొ గుడ్డిగా తననితను అర్పించుకునే తెలీని అత్యాచారాలకి ఎలా లోనయింది అనేది చక్కగా వివరించింది.

4)నాకు ఈ ప్రశ్న నవ్వుని కలిగించేది మాత్రమే(క్షంతవ్యుడను)! ఈ సామాజిక, రాజకీయ విషయాల మీద ఎడ్యుకేట్ అయితే కోట్లు వస్తాయని ఎవరైనా హామీ ఇవ్వమని చెప్పండి, ఎందుకు ఎడ్యుకేట్ అవ్వరో చూద్దాం :)

5) మీ ఈ పెసినకి నా దగ్గర ప్రస్తుతానికి ఏ విధమైన సమాధానం లేదు, ఇండియా వరకు అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ పైకి రాకుండా తొక్కిపెడతారు. నేనుకూడా మొన్ననే సమాజం లో పుట్టి నిన్నటినుంచి సామాజిక విషయాల మీద అవగాహన నేర్చుకు౦టున్నవాణ్ని. అయితే ఖచ్చితంగా శోధించి పంచుకుంటా!

NGO's విషయంలో రాజీవ్ గారు చెప్పింది అక్షరాలా నిజం. వీటిలో చాలావరకు నిధులకోసం కొట్టుకుంటూ ఉంటారు.

రాజేష్ జి said...

$Rajeev Reddy gaaru

Thank you being here though at a hectic pace. ధన్యవాదాలు రాజీవ్ గారు. మీరిచ్చిన స.ధా లు చాలా సూటిగా, నిజనిక్కచ్చిగా ఉన్నవి. మరొక్కసారి కృతజ్ఞతలు.

#కిరస్తానీ పాదర్ కానీ తురక ముల్లా కానీ ఒక మతానికి ప్రతినిధులుగా గుర్తింపబడుతున్నారు...పూజారి/పండిట్ లను ఒక కులానికి చెందినవాళ్ళుగా మాత్రమే ప్రస్తుతం గుర్తిస్తున్నారు.
Thatz abosultely correct!

#ఇదే సినిమావాళ్ళు సినిమా ప్రారంభం నుంచి అయిపోయేవరుకు అదే పూజారితో పూజలు మంచి జరగాలని!
Big farce!

#మరి అవహేలన ఆ ఒక్క కులానికి మాత్రమే అన్న నమ్మకం పిచ్చిది కాదా?..
So unfortunate and again big farce :(!

#మరి పరిష్కారం? ఎవరైతే అవమానాలు పడుతున్నామని బాధపడుతున్నారో వారు(ప్రస్తుతం ఆ కులం) కలిసికట్టుగా పోరాడి సాధించుకోవడమే! చిన్నగీతల పక్కన పెద్దగీత గీసి తీరిగ్గా ముచ్చట్లు కూర్చుంటే సమస్య సమసిపోదు!
You nailed the root cause very hard! You are fabulous! మీరు ఇంతకు ముందు టపా చదివే ఉంటారు. ఆ టపాలో బాధలు, అవమానాలు మరియు ద్వేషం ఎలా మొదలయింది అని చెబితే కొందరు అది స్వకుచమని మరికొందరు బాధలు అందరికీ అని తేల్చేసి చేతులు కడిగేసుకున్నారు.
ఇంకో పెద్దాయన మరింత ముందుకు వెళ్లి మీరన్నట్లు ఇది హిందూ ధర్మద్వేషమని ఒక పెద్దగీత గీసి అసలు సమస్యకి(చిన్నగీత) తిలోదకాలిచ్చారు. బాబూ, దీని వల్ల ఉపయోగం ఉండదు అంటే వింటేనా! ఈ ముక్కలు విన్న మరికొంతమందికి ఏది నిజమో తెలియని తికమక!. మీకు శ్రీకాంత్ గారు పెసిన గుర్తుండేఉంటుంది, మీరు నమ్మరేమో కానీ ఆపెసిన నాకది పెద్ద షాక్!. ఇక నేను "ఎవరో రావాలి.. ఏదో చేయాలి.." అన్నపాట పాడుకోవాలేమో :(! I trust Srikanth would get sufficed answer to his question from your comment! Lemme mail him for heads up. Thank you again.

#..బాబ్బాబు మామీద ఇలా తీయొద్దు అని గడ్డం పట్టుకుని బతిమిలాడాలా?
Never! ONLY being radical would work here and that radicalism should be resulted from a mob rather than individual!

Sreekanth Chowdary said...

@సాపాటు గారు
జరుగుతున్న వాస్తవాల్ని, మేలుకోవాల్సిన ఆవశ్యకతను చక్కగా ఈ టపా ద్వారా అందించారు. నేనూ రెండేళ్లు లండన్లో ఉన్నాగానీ ఇంతగా పరిశీలించలేదు. ధన్యవాదాలు.

@రాజేష్

ఉదయమే మెయిల్ చూసా. దీని ముందు టపాలో చాలా చర్చ జరిగినట్లుంది, మిస్సయ్యా :(. ఇప్పుడు చదువుతున్నాలే :).

"
మీరు నమ్మరేమో కానీ ఆపెసిన నాకది పెద్ద షాక్!.
"
LOL :) అలాంటి సామాజిక చైతన్య టపా రాసిన తర్వాత దానికొచ్చే ప్రశ్నలకీ ఆన్సర్ ఇవ్వాల్సుంటుంది. తప్పదు మరి :)

"
Srikanth would get sufficed answer to his question
"
బ్రాహ్మణ ద్వేష౦, హిందూ ద్వేషం రెండూ వేర్వేరని నాకు ఎప్పుడో సమజయ్యిందిలే :). ఆ టపాలో దీనిమీద కామెంటేస్తా.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers