నిజం..నిర్భయం

Friday, 21 January 2011

దుస్వప్నం


ఇప్పుడు మే౦ కలలు కంటున్నది 
రేపంటే తెలీని రేపటి ప్రపంచం కోసం.
అక్కడంతా భయంకర ప్రశాంతం
ఇవాల్టిలా జనం ఉండరు, ఆవాజాలం ఉండదు.
అంతా నిశ్శబ్దం
ఒకరికొకరు పట్టనంత విశాల౦. 




రాజులను, తరాజులను, సామ్రాజ్యాలను 
ఏలికలను, పాలకులను, సంస్కృతిని, సంప్రదాయాన్ని 
చెరిపేసి మరీ మే౦ చరిత్రను తిరగారాసుకుంటున్నా౦. 

ఇకపై రేపటి తరానికి అర్థంకాని ఈ భాషల్లో
శాసనాలు, వగైరాలు౦డవ్.
అడుగడుగునా అన్నీ స్థూపాలే నిర్మిస్తున్నా౦
వాటిపై ఉద్యమవీరులు పేర్లు చెక్కుతున్నా౦.
నిన్నటిని ఆవిష్కరించే కావ్యాలు, కలాలు తొలగించి
సరిక్రొత్తగా కత్తులకు సానబెడుతున్నా౦.

మే౦ కోరుకుంటున్న రేపటిలో
మీరు లిఖించుకున్న మానవ సంబంధాలు, సభ్యతా సభ్యతలు,
స్త్రీపురుష భేదాలు, అన్నదమ్ముల అనుబంధాలు,
పెద్దలు, కుటు౦బం, సంఘం, సమాజం... ఇలా 
స్వేచ్చను హరించివేసే సెంటిమెంట్లు౦డవ్.

నిండు ప్రపంచం మా స్వంతం
విచ్చలవిడిగా జీవితాన్ని జీవించాలని స్కెచ్ వేస్తున్నాం
గతబంధాలను పటాపంచలుగా త్రెంచే౦దుకు
పక్కాగా సెట్టిల్మెంట్స్ చేస్తున్నాం.
ప్రేమనీ, సంఘాన్ని కలిపే 
జారుముడిని ఊడదీసి 
మా జాతి సమైక్యతకు 
మా చేతుల్తోనే చెల్లు రాస్తున్నాం.

ఎన్ని సంఘర్షణలు
ఎన్ని వ్రణాలు
ఎన్ని కరువులు, ఎన్ని భీభత్సాలు 
ఎన్ని కుటుంబాల క్షుద్బాధలు
ఎంత మంది బీదల ఆక్ర౦దనలు

ఎన్ని అక్రమాలు
ఎన్ని అసమానతలు 
ఎన్ని మోసాలు
ఎన్ని విచ్చిన్నాలు, వ్యధలు
ఎంతటి భీకర దృశ్యాలు
ఈ లోకం ఎప్పటికీ ఇంతే.
మే వ్రాయబోయే నవ్య చరిత్రలో
ఇవన్నీ ప్రత్యేక అధ్యాయాలు

అక్కడ అందరం ఉండి కూడా
ఎవరికీ వారుగానే గడిపేస్తాం
పంక్తిగ్రీవుల మాయాజాలంలో
మమ్మల్ని మేమే పరచేస్తాం

అరుణ చేతనను సైతం అణచివేస్తూ
ఇంకా మేము మగతనిద్రలో ఉన్నాం
నిజానికి నిలువెత్తులో స్వారీ చేస్తూ
పగటికలలు కంటున్నా౦.

ఈ స్వప్నం శమించుగాక
    మా ఐక్యత జయించు గాక...




(ఈ వచన కవితని ఇక్కడ ప్రచురించడానికి అనుమతినిచ్చిన కప్పగంతుల మధుసూదన్ గారికి ధన్యవాదాలు.)

1 comment:

సుమలత said...

hello rajesh gari ki muduga happy pongal . mee blog yenka more lables use cheyalani maa vinapam
blog loni vishalani baga panchukunaru. yenka yelage rastu vundamdi

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers