అసలు దేశాభిమానమంటే?
ఉదయం పదకొండుగంటల ప్రాంతం
వేర్వేరు దేశాల ఉద్యోగులతో పాటు వివిధ భారతీయ సంస్థల నుంచి వచ్చిన ఉద్యోగులు మా ఉద్యోగశాల(ఆఫీస్)లో పనిచేస్తూ ఉ౦టారు. వివిధ భారతీయ సంస్థల ఉద్యోగులు పోటీ తత్వం కారణంగా ఎప్పుడూ సంస్థలు లేదా భాషల వారిగా గుంపులు గుంపులుగా ఉంటూ మిగలిన భారతీయ సహోద్యోగులతో అంటీఅంటనట్టు౦డేవారు కానీ ఈ రోజు అందరూ కలిసి గుంపుగా ఉత్సాహంగా కనిపించారు. ఎందుకో మీకిప్పటికే అరదం అయ్యుంటుంది :). అదే క్రికెట్ సమ్మోహానాస్త్రం. అందరిదీ ఓకే మాట.. భారత్ గెలవాలి. బావుంది, ఒక ఆట ఇక్కడి భారతీయ సహోద్యోగులందరినీ కట్టిపడేసి అందరిచేత ఒకే మాట అనిపిస్తింది. ఇదే కదా దేశాభిమానం అంటే! ఎంతైనా క్రికెట్ ఆట గొప్పదే అనుకున్నా!
సాయంకాలం ఆరుగంటల ప్రాంతం
నా లీడ్ శ్రీలంకేయుడు. నిన్నటి రోజంతా సెలవు పెట్టి మరీ వారి దేశాన్ని ఆటలో చివరి అంక౦కి తీసుకువెళ్ళిన మాంచి ఉత్సాహం లో ఉన్నాడు. రేపు శనివార౦ జరిగబోయే భారత్ మరియు శ్రీలంకల మధ్య చివరి అంకపు ఆట ఫలిత౦ బాగాలేక(శ్రీలంక ఓడిపోతే) మనస్థాపం చెందితే ఒదార్చుకోవడానికి ఆదివారమంతా ఉంది. అలా కాకుండా ఆదివారం ఆట జరిగి శ్రీలంక ఓడిపోతే సోమవారం పనిచేయడం తనవల్ల కాదని తన పి.యమ్ కి చెప్పాడు. ఈ పి.యమ్ అమెరికోడు. లీడ్ సోమవారం చేయాల్సిన అత్యవసరపని ఉంది. అది గుర్తుకు వచ్చిన పి.యమ్ తన కింది భారత ఉద్యోగి సోమవారం చేయాల్సిన పని ఎంత అవసరమా అని మనసులో కంప్యూటర్కన్నా వేగంగా మననం చేసుకుని, పైకి భా.ఉ కన్నా తనకి శ్రీలంకేయుడితోనే పని ఎక్కువుందని తను కూడా శ్రీల౦కే గెలవాలని కోరుకుంటున్నట్లు పి.యమ్ అమెరికోడు చెప్పాడు. నేను కొద్దిగా గుర్రుగా చూసేసరికి పరిస్థితి అర్ధమయ్యి కొద్దిగా సకిలించి ఇకిలించాడు. ఇక్కడ శ్రీల౦క గెలవాలని బలపరిచిన మరి ఈ అమెరికోడిది కూడా దేశాభిమానమే! అని అనుకున్నా.
సాయంకాలం ఏడుగంటల ప్రాంతం
ఇంటికి వచ్చేప్పుడు కొద్దిగా ఫలహారం తీసుకుందామని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారు నడిపే శాఖాహారశాలలో కి దూరా. ఇక్కడా ఇస్కాన్ భక్తుల కోలాహలం, భారత్ గెలిచినందుకు. నాతో ఆనందాన్ని పంచుకున్నభక్తులలో ఆంగ్లేయులు, ఫ్రెంచీయులు, ఇంకా ఇతర దేశభక్తులు.. అందులో బంగ్లాదేశీ హిందువులు కూడా ఉన్నారు. అందరి కళ్ళలో భారతదేశం గెలిచిందనే ఆనందం, అయితే అందులో డెబ్బై శాతం మందిది భారతదేశం కాదు. మరిక్కడ వీరిని అంతలా కట్టిపడేసిన దేశాభిమానం ఏమిటి? కేవలం క్రికెట్ ఆట అనుకుంటే అది ఒక దేశానికి చెందినా వారితోనే ఆగిపోయేది కదా! అందువల్ల ఇక్కడి బహుళజాతీయులనో ఏదో జాతీయవాదం కట్టిపడేసి తమదేశం భారతదేశం అని అనుకునేట్టు చేసింది. అంత మహత్తు ఉందా జాతీయవాదంలో?
స్వస్థి:
పైన చెప్పిన మూడు వేర్వేరు సంఘటనలు తీసుకుని వాటిలోని దేశాభిమానం ఎంతవరకు ఒక దేశప్రజలను సంఘటితం చేయగలదనేది భేరీజువేద్దాం.
మొదటిది క్రికెట్, దాని ఉద్రేకం మీన వచ్చిన తాత్కాలిక దేశాభిమానం. ఇది ఆట ముగిసేవరకు, లేదా ఆరోజుటివరకు మాత్రమే. ఆ తర్వాతా అంతా మామూలే, రేపటికి రెండో రోజు అన్న చందాన.
రెండవది కేవలం తన పని పబ్బం గడుపుకోవడానికి వచ్చిన పనికిరాని దేశాభిమానం. ఇది పని ముగిసేవరకు ఉంటుంది.
మూడవది స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా ఒకదేశం కోసం అందరినీ ఒకటిగా కట్టేసిన శాశ్వత దేశాభిమానం. ఇది అసలు సిసలు జాతీయవాదమనిపించింది. ఈ జాతీయవాదం మతం, ప్రాంత౦, దేశమనే ఎల్లలు ఎరుగదు. ఈ జాతీయవాద దేశాభిమానం కేవలం ఒక ఆటకు మాత్రమే పరిమితమవ్వదు, దేశకాలమాన౦లో ఆపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అవసరమైన ఆలంబనని కలుగజేస్తుంది. అలానే ప్రచారమిధ్యామాల సృష్టిత ఉద్రేకపూరిత వాతావరణానికి అసలు ఆస్కారం ఇవ్వదు. మరి ఇది కదా కావలిసింది!
చివరగా
సాయంత్రం ఏడున్నర ప్రాంత౦లో ట్యూబ్ నుంచి బయటకు వస్తుంటే మా పెద్దవీధిలో(హై స్ట్రీట్) ఒకటే కోలాహలం.. రచ్చరచ్చ. అన్నట్లు చెప్పలేదు కదూ.. మా ప్రాంతమంతా భారతీయులు, పాకిస్తానీయలు మరియు బంగ్లాదేశీయులతో నిండిఉంటుంది. భారత, పాకిస్తాన్ ఆట మరి! రోడ్డుకి అటు వైపు పాకీస్తానీయులు, ఇటు వైపు భారతీయులు.. నినాదాలతో దద్దరిల్లుతుంది. భారత్ గెలిచిన ఆనందంతో మనవారు, అందునా మా ప్రాంత౦లో ఎక్కువగా ఉండే తెలుగువారి అరుపులతో పెద్దవీధి హోరెత్తింది. ఓడినా కూడా పోటీగా పాకీలు కూడా అరుస్తున్నారు. భారత జెండా, భారత్ మాతాకి జై అన్న నినాదాలు వింటూ, అంటున్న వారిని చూడగానే ఇహ నాకూ ఉద్వేగం, ఉద్రేకం మరియు ఉత్తేజం ఒక్కసారిగా గుండెలోతుల్లోంచి పొంగిపొర్లి మనవారితో శృతికలిపి ఆ హోరులో జోరందుకున్నా! ఆ ఉద్వేగ౦ పూరిత వాతావరణాన్ని కొద్దిసేపు నా ఐఫోన్లో బంధించా.. ఒక్కసారి చూడండి..
దారినపోయే నల్లనయ్య ఒకరు ఈ ఆనందోత్సాహాలగోలంతా చూసి బ్లడీ షిట్ ఎషియన్స్ అని తిట్టుకుంటూపోయాడు. మరి నల్లనయ్యకి కాలాట(ఫూట్బాల్) ఇష్టమాయే ;).

అరుగో పాకీస్తానీయులు వారి జెండా పట్టుకుని |
భారతీయులు |
అదిగో మువ్వన్నెల జెండా |
ఆంగ్లేయుల పురవీధుల్లో షికారు చేస్తున్న త్రివర్ణపతాకం. |